అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!

స్వరాష్ర్ట పునర్ నిర్మాణంలో పుస్తకాల పాత్రపై టీఆర్‌సీ చర్చ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకొని ఒక ఏడాది గడిచిపోయిం ది. ఆరు నెలల పాటు ఇంట్లో ఉండక, ఆ తరువాత తిరిగి వస్తే, ఇల్లు శుభ్రం చేసుకునేందుకే కనీసం వారం రోజులు పడుతుంది. అలానే, అరవై ఏళ్ళ పోరాటంతో సాధించుకున్న స్వరాష్ర్టంలో ఎక్కడివక్కడ సర్దు కోవడంలోనే ఈ ఏడాది కాలం గడిచిపోయింది. ఇక మనకు నచ్చిన ట్లుగా మన ఇంటిని తీర్చిదిద్దుకునే పని మొదలెట్టాల్సి ఉంది. ఇలా తీ ర్చిదిద్దుకోవడంలో పుస్తకం పాత్ర కీలకం. గతంలో తెలంగాణ ఉద్య మం సమయంలోనూ పుస్తకం వహించిన పాత్ర ఎంతో కీలకం. తెలం గాణ పాటకు, ఆటకు, పోరాటానికి అక్షర రూపం ఇచ్చి తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో అక్షరం పోషించిన పాత్ర అనిర్వచనీయం. కవులు కవిత్వంతో, ఉద్యమకారులు తమ రచనలతో అక్షరాలను ఆయుధాలుగా తీర్చిదిద్దారు. ఆ ఆయుధాలను ప్రజలకు అందించారు. నేడు తెలంగాణ పునర్ నిర్మాణంలోనూ ఇలాంటి మహ త్తర పాత్రను అక్షరం పోషించాల్సి ఉంది. అందుకు కవులు, కళాకారు లు, సామాజిక ఉద్యమకారులు తమ వంతు పాత్రను నిర్వర్తించాలి.
సమాజ వికాసానికి అవకాశం కల్పించేది అక్షరం. ప్రజల్ని చైతన్య వంతం చేసేది అక్షరం. తెలంగాణ ఉద్యమానికి ప్రజల్ని జాగృతం చే సింది అక్షరమే. చదువు పేరిట అక్షరాల్లోని సామాజిక చైతన్యాన్ని దూ రం చేసుకున్నాం. బ్రిటిష్ వారు తమ కోసం రూపొందించిన విద్యా వి ధానమే నేటికీ కొనసాగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కూ డా విద్యారంగాన్ని గాలికి వదిలేశాం. ఇలా జరిగితే యువతను ఎలా తీర్చిదిద్దగలుగుతామో ఆలోచించుకోవాలి. అధికారపక్షం, విపక్షం పర స్పరం దుమ్మెత్తిపోసుకోవడమే తప్ప ఎవరు అధికారంలో ఉన్నా విద్యా రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ బాధ్యత ఇప్పుడు సమాజ మే స్వీకరించాలి. విద్యావిధానంలో మార్పు రానంత వరకూ అక్షరం తో ఎలాంటి ఉపయోగం ఉండదు. డాక్టర్, ఇంజినీర్ చేయడమే విద్యా వ్యవస్థ లక్ష్యంగా మారింది. రెక్కాడితే డొక్కాడని వారు కూడా పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల ఆసక్తుల ను పట్టించుకోవడం లేదు. సమాజం అంటే డాక్టర్లు…ఇంజినీర్లు మా త్రమే కాదు…వివిధ రంగాల్లో మనకు మార్గదర్శకులు కావాలి. మరి వారంతా ఎక్కడి నుంచి వస్తారు? ఈ విద్యావిధానంలో మార్పు రావా లి. బిజినెస్ హౌస్‌లు, కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు విద్యా రంగాన్ని ని యంత్రిస్తున్నాయి. పౌల్ట్రీఫావ్‌ులుగా విద్యాసంస్థల్ని నిర్వహిస్తున్నాయి. పిల్లల ఆలోచనలను పెంచడం లేదు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడం లే దు. సమాజం, పర్యావరణం లాంటి అంశాలను పట్టించుకోవడం లే దు. మెమరీతో ముడిపడిన విద్యావ్యవస్థ కొనసాగుతూ ఉంది. అక్షర క్రమంలోనే కాదు….తప్పుడు అడుగులు వేయడం లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటోంది. వివిధ రంగాల్లో ఆధిపత్య వర్గాల ఆధిపత్యం కొనసాగుతోంది. విద్యారంగంలోనూ అదే జరిగింది. మన తెలంగాణ లో దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థి బాల్యా న్ని, దాని మధురానుభూతులను కోల్పోకూడదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బాల్యం తిరిగిరాదు. దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేసిన నాడే వారు అసలైన మనుషులుగా ఎదుగుతారు. తల్లి కడుపులో ఉన్నప్పుడే అడ్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమ్మీ, డాడీ చదువు చెప్పించాల్సి వస్తోంది. గుర్రానికి గంతలు కట్టి నడిపినట్లు పిల్లలను చిన్నప్పటి నుంచే ఎంట్రన్స్‌ల బాటలో నడిపిస్తు న్నారు. రోజూ పరీక్ష… వారాంతంలో పరీక్ష.. నెల చివర్లో పరీక్ష… చ దువంతా పరీక్షల చుట్టే తిరుగుతోంది. పదిమందికి వచ్చే ర్యాంకులను చూపిస్తూ. వేలాది మందిని మోసం చేస్తున్నాయి. విద్యాసంస్థలను ఫ్యా క్టరీలుగా మారుస్తున్నారు. విషయం అర్థం చేయించకుండా బట్టీ పట్టి స్తున్నారు. బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. పల్లీలు ఎక్కడ కాస్తాయో తెలియదు. బురద అంటే తెలియదు. చెట్టు ఎక్కడం రాదు. వాన తెలియదు. పల్లె తెలియదు. మట్టి వాసన తెలియదు. ఈ పరిస్థితి మారాలి.
పుస్తకం అంటే పాఠ్యపుస్తకం కావచ్చు. కథల పుస్తకం కావచ్చు. కవిత్వం కావచ్చు. మన సమాజానికి ఎలాంటి పుస్తకాలు కావాలి, ఎవ రిని చేరాలి, ఎలా చేరాలి, చేరిన తరువాత వారు ఎలా వాడుకోవాలి … లాంటి అంశాలన్నింటినీ ఈ సందర్భంగా పరిశీలించాలి. విద్యార్థు ల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారి శక్తియుక్తులను వెలుగులోకి తేవాలి. బట్టీ చదువులను వదిలించుకుందాం. ఇన్ని దశాబ్దాలుగా ఈ రంగంలో కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని బద్దలు గొడుదాం. విద్యారంగం ఎలా ఉండాలో ఆలోచిద్దాం. ఎవరి బాధ్యత ఎంతనో ప్రశ్నించుకుం దాం. ఈ వ్యవస్థను సరిచేసుకొని యావత్ దేశంలోనూ తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టుకుందాం. మనిషిని మనిషి గౌరవించుకునే విధం గా విద్యార్థులను తీర్చిదిద్దుకుందాం. బట్టీ పట్టి పరీక్షలు పాస్ అయిన వారు సమాజాన్ని మార్చలేరు. సమాజాన్ని మార్చే శక్తి గలవారిని అం దించేందుకు మనం కృషి చేద్దాం. తెలంగాణ సాయుధ పోరాటం, ఆం ధ్ర మహాసభలు, గోలకొండ పత్రిక… ఇలా ఎన్నెన్నో మైలురాళ్ళు. అం తిమంగా స్వరాష్ర్టం… దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
ప్రభుత్వానిదే కాదు… మనందరి బాధ్యత!
తెలంగాణ పునర్ నిర్మాణం ఏ ఒక్కరి బాధ్యతనో కాదు. ప్రభుత్వం ఒక్కటి మాత్రమే ఈ పని చేయలేదు. యావత్ తెలంగాణ సమాజం త మ భావజాలాలకు, ఇజాలకు, అభీష్టాలకు అతీతంగా కేవలం తెలం గాణ ప్రజల అజెండానే తమ అజెండాగా చేసుకుంటూ కనీసం కొన్నే ళ్ళ పాటు ఈ కృషిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగింది. తెలంగాణ పునర్‌నిర్మా ణంలోనూ జరగాల్సింది ఇదే. ఇందులో కొన్ని వ్యవహారాలు ప్రభుత్వం మాత్రమే చేయగలదు. అది చేయలేని మరెన్నో పనులను తెలంగాణ స మాజం చేయగలదు. ప్రభుత్వం మీద మాత్రమే ఆధారపడితే లేదా ప్ర భుత్వం మాత్రమే అన్ని పనులూ చేయాలనుకుంటే తెలంగాణ పునర్ నిర్మాణం సాధ్యపడదు. ప్రభుత్వం తాను చేయగలిగిన పనులు తాను చేస్తుంటే మరో వైపున తెలంగాణ సమాజం తాను చేయగలిగిన పను లు తాను చేయాలి. ఈ విధంగా ప్రభుత్వం, సమాజం రెండూ కాడెడ్ల మాదిరిగా తెలంగాణ పునర్‌నిర్మాణ దిశలో పయనించాలి. ఈ పయ నంలో తెలంగాణ సమాజమే ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలి. ఆ దిశలో పౌరసంఘాలు, సామాజిక సంఘాలు, కవులు, కళాకారులు, ఇతర జాక్‌లు ప్రజలు కోరుకునే మార్పులను అవి స్వయంగా తీసుకు వస్తూ, తమ పరిధిలో లేనివాటిని ప్రభుత్వం ద్వారా చేయించేలా ప్రయ త్నించాలి. తెలంగాణ పోరాట సమయంలో సొంత జెండాలను, అజెం డాలను పక్కనబెట్టినట్లుగానే తెలంగాణ పునర్ నిర్మాణంలోనూ కనీసం ఓ పదేళ్ళపాటు ఈ విధమైన ప్రయత్నాలు జరగాలి. సీమాంధ్ర ఆధిప త్య వర్గాల ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకూ ఇది కొనసాగాలి. తెలంగాణ భావజాలం మరింత బలోపేతమై రాజకీయరంగంతో సహా అన్ని రంగాల్లోనూ వేళ్ళూనుకున్నప్పుడు ఇక సమాజంలోని భిన్న వర్గా లు తిరిగి తమ సొంత జెండాలతో, సొంత ఎజెండాలతో తమ తమ మార్గాల్లో పయనించవచ్చు. అప్పటి వరకు మాత్రం తెలంగాణ భావ జాలం రాష్ర్టంలో వేళ్ళూనుకునేందుకు తోడ్పడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని శాసించే శక్తి సమాజానికి ఉంది. అలా ప్రశ్నిస్తూ మన ఆ కాంక్షలు నెరవేర్చుకుందాం. తెలంగాణ సాధన కంటే పునర్ నిర్మాణ బాధ్యత మరింత పెద్దది. దాన్ని సక్రమంగా నెరవేర్చుకోవాలి. అమరు లకు నివాళి అంటే ప్రజలు కోరుకున్న తెలంగాణ సాధించడమే. అం దుకు పునాది అక్షరంతోనే సాధ్యం.
తెలంగాణ భావజాలం మనందరి సొత్తు!
ఈ సందర్భంగా గమనించాల్సిన అంశం ఒకటుంది. తెలంగాణ భావజాలం ఏ ఒక్కరి సొత్తు కాదు. తెలంగాణ భావజాలం యావత్ తెలంగాణ ప్రజానీకం సొత్తు. ఈ నేలపై నుంచి పుట్టిన ప్రతీ ఒక్క పా ర్టీ, ప్రతీ ఒక్క ప్రజాసంఘం, ప్రతీ ఒక్క సామాజిక సంఘం తెలంగాణ భావజాలాన్ని ఉపయోగించుకునే వీలుంది. దాన్ని అలా ముందుకు తీ సుకుపోయే హక్కు కూడా వాటికి ఉంది. ఇలా తీసుకువెళ్ళే క్రమంలో వాటికి తోడుండేది అక్షరమే. ఆ అక్షరాలను తెలంగాణ నుడి కారంతో, మమకారంతో మేళవించడమే మనమిప్పుడు చేయాల్సిన పని.
కంటికి కన్పించేదే పునర్ నిర్మాణం కాదు!
తెలంగాణ పునర్ నిర్మాణం అంటే వివిధ రంగాల్లో కంటికి కని పించే అభివృద్ధి మాత్రమే కాదు. అంతకు మించిన స్థాయిలో కంటికి కన్పించకుండా ఉండే భావజాల వ్యాప్తి కూడా. తెలంగాణ జరిగే ప్రతి పనిలోనూ ఇది అణువణువునా కానరావాలి. పుస్తకాల విషయానికి వస్తే పాఠ్యపుస్తకాలు, పాఠ్యేతర పుస్తకాల విషయంలోనూ తెలంగాణ ఆ త్మ దర్శనమివ్వాలి. పుస్తకం తెరిస్తే తెలంగాణ ఆత్మ సంభాషిస్తున్నట్లు గా ఉండాలి. అక్షరాలను తెలంగాణ భావజాలం ఆవహించాలి. ఇలా చెప్పడం అంటే మితిమీరిన జాతీయవాదం ప్రచారం తరహా కాదు. ఇ ప్పటి వరకూ పరాయీకరణ చెందిన వివిధ అంశాలను తెలంగాణ మ యం చేయడం మాత్రమే.
పరాయీకరణను వదిలించుకుందాం
అరవైఏళ్ళ పరాయి పాలనలో మన భాష పరాయీకరణ చెందిం ది. మన రాజకీయం పరాయీకరణ చెందింది. మన సంస్కృతి పరా యీకరణ చెందింది. రాజకీయంతో సహా వివిధ రంగాల్లో ఈ పరా యీకరణ ఇప్పటికీ తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు కృషి చేస్తూనే ఉంది. ఆ ఆధిపత్యాన్ని ఎదిరించాలంటే బహుముఖ దాడి తప్పదు. అ ది అక్షరాలతోనే సాధ్యం. ఆ అక్షరాలు అందించే ఆయుధాతోనే సా ధ్యం. అక్షరాలతో సాయుధమయ్యే తెలంగాణ ప్రజానీకం తనను తాను కాపాడుకోగలదు. తన కోసం తాను పోరాటం చేయగలదు. పాఠ్యపుస్త కాల విషయానికి వస్తే కేజీ నుంచి పీజీ దాకా ఈ అరవై ఏళ్ళ పరాయి పాలనలో కొనసాగిందంతా రెండున్నర జిల్లాల భాషనే. దాన్ని పది జి ల్లాల తెలంగాణ భాషగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప రాయి పాలకులు మన చరిత్రను వెలుగులోకి రానీయకుండా చేశారు. దాన్ని ఇప్పుడు మనం వెలుగులోకి తెచ్చుకోవాలి. మనం మాట్లాడుకు నే భాషను యాసగా మాత్రమే పరిమితం చేశారు. దాన్ని ఇప్పుడు ఒక సంపూర్ణ సర్వసతంత్ర భాషగా తీర్చిదిద్దుకోవాలి.
మూడు తరాల కథ
ఏడు తరాల కథ అందరికీ తెలిసిందే. మూడు తరాల కథ ఏంటో చూద్దాం. ఒక కుటుంబంలో మూడు తరాల చరిత్రను పరిశీలిస్తే ఆనా డు తాత… తెలంగాణ భాష మాట్లాడేవాడు. ఇతరులు తెలంగాణ భాష లో మాట్లాడితే అర్థం చేసుకోగలిగాడు. తండ్రి కాలానికి వస్తే… తండ్రి తాను స్వయంగా తెలంగాణ భాష మాట్లాడలేనప్పటికీ, ఇతరులు మా ట్లాడితే అర్థం చేసుకోగలి గాడు. మనవడి కాలానికి వస్తే, మనువడు తెలంగాణ భాష మాట్లాడ లేడు… అర్థం చేసుకోలేడు. ఇదీ తెలంగాణ లో మూడు తరాల చరిత్ర. ఇలాంటి కుటుంబాలు తెలంగాణలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. పురిటిగడ్డతో పేగు బంధం తెగిపోతోంది. అలా తె గిపోతే చోటు చేసుకునే సాంస్కృతిక విపరిణామాలు తీవ్రస్థాయిలో ఉం టాయి. సొంత తల్లిపై మమకారం లేని వారు అన్నింటా విలువలకు తి లోదకాలు ఇస్తుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకూడదనుకుంటే, మన బిడ్డలను ఈ నేలతల్లి బిడ్డలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అం దుకు పాఠ్యపుస్తకాలు వేదికలు కావాలి. భాష, సామాన్య శాస్త్రం, సాం ఘిక శాస్త్రం, గణితం…ఇలా బోధించే అంశం ఏదైనా సరే…అందులో తెలంగాణతనం ఉట్టిపడాలి. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగే పాఠ శాలల్లోనూ తెలుగు భాష పుస్తకాల్లో తెలంగాణ భావజాలం వ్యక్తమ య్యేలా చూడాలి. వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఆంగ్ల భాష మాధ్యమంలోనే తెలంగాణ చరిత్ర, సంస్కృతి లాంటి వాటి గురించి వి వరించాలి. ఇదంతా కూడా తెలంగాణ ఆత్మ తనను తాను పునర్ ఆవి ష్కరించుకోవడమే. ఇది జరిగిన నాడే తెలంగాణ పునర్ నిర్మాణం సా ధ్యమవుతుంది.
పునర్ నిర్మాణం అంటే…
ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం మాత్రమే తెలంగాణ పునర్ నిర్మాణం కాదు. తెలంగాణ భాష, సంస్కృ తి, చరిత్రకు సంబంధించిన పుస్తకాలను అందులో ఉంచుతూ వాటిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకెళ్ళాలి. అదీ అసలైన తెలంగాణ పునర్ నిర్మాణం. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం మాత్రమే చేయ లేదు. ప్రభుత్వం ఒక లైబ్రరీ గదిని కట్టించవచ్చు. మహా అంటే వందల సంఖ్యలో పుస్తకాలు సమకూర్చవచ్చు. మిగిలిన పని అంటే… ఇతరత్రా కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, పుస్తకాలను అధికంగా చేర్చడం, పిల్లలు అవి చదివేలా చేయడం లాంటి వన్నీ మనం చేయా ల్సిన పనులు. ఆ పనులు మనం చేద్దాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతీ రంగంలోనూ ఇలాంటివెన్నో ఉంటాయి.
పుస్తకం ఎందుకు చదవాలి?
పుస్తకం ప్రపంచానికి కిటికీలాంటిది. ఆ కిటికీ నుంచి ప్రపంచాన్ని చూడవచ్చు. ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. మానవ సంబంధాలను అది పటిష్ఠం చేస్తుంది. మనిషిగా తీర్చిదిద్దుతుంది. పరిణిత వ్యక్తిత్వాన్ని అం దిస్తుంది. పుస్తకం అనేది మనిషి జ్ఞానాన్ని, ఊహాశక్తిని, ఆలోచన లను పెంచుతుంది. ఎలాంటి జ్ఞానాన్ని పెంచుకోవాలో, ఎలాంటి ఊహల్లోకి వెళ్లాలో, ఎలాంటి ఆలోచనలు చేయాలో అనే విషయంలో మాత్రం పి ల్లలకు మన మార్గదర్శకత్వం అవసరమవుతుంది.
ఎలాంటి పుస్తకాలు చదవాలి?
చిన్నతనంలో నాకు తెలిసిన వారెందరో డిటెక్టివ్ పుస్తకాలు చదివే వారు. నిజం చెప్పాలంటే అలాంటి వారెందరో నేడు సమాజంలో వి విధ రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. అప్పట్లో డిటెక్టివ్ పుస్తకా లు వారిలో పఠనాభిలాషను పెంచాయి. ఆ తరువాత వారు తాము ఎ లాంటి పుస్తకాలు చదవాలో తెలుసుకోగలిగారు. అలాంటి పుస్తకాలు చ దవడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పుస్తకం చదవడం ఓ వ్యసనం లాంటిది. అలాంటి వ్యసనం ఉన్న వారికి మంచి పుస్తకాలను అందించగలిగితే వారు మార్గదర్శకులుగా మారుతారు. ఆ దిశలో మ నం కృషి చేయాల్సి ఉంది. పుస్తకాలు జీవితాన్ని మార్చివేస్తాయి అనేది చాలావరకు వాస్తవం.
ఇవాళ ఉపాధికోసం మాత్రమే పుస్తక పఠనం జరుగుతోంది. మానవ సంబంధాలు, సంస్కృతి లాంటి అనేక అంశాల పై పుస్తకాలు చదవడం లేదు. కవిత్వం చదివే వారి సంఖ్య తగ్గింది. ఎంతో చిన్నగా ప్రారంభించిన తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఓ చిరునామాగా మారింది. ఈ అంశంపై పరిశోధన చేస్తున్న వారు, ఆసక్తి ఉన్న ఎందరో టీఆర్‌సికి వస్తున్నారు.
పుస్తకపఠనంపై ఆసక్తి పెంచాలి
పుస్తకాలు చదివే ఆకాంక్షను కల్పించాల్సిన అధ్యాపకులకే చదివే అలవాటు తగ్గిపోతున్న ఈ రోజుల్లో పుస్తకాలు చదివే అలవాటు ఇక ఏ విధంగా వస్తుంది? విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే జిజ్ఞాస తగ్గిపోతోంది. పుస్తక పఠనంపై అవగాహన విద్యార్థులకు లేక పోవటానికి అధ్యాపకులే కారణం. చదివె జిజ్ఞాస ఎలా రగిలించాలి అ నేది మనందరం ఆలోచించాలి. పాఠ్యపుస్తకాల్లోనూ ఇందుకు బాట వే యాలి. ఉదాహరణకు ఒక పాఠం కింద దానికి సంబంధించి ఇతరత్రా చదవతగ్గ పుస్తకాలు అని కొన్ని పుస్తకాల జాబితా ఇచ్చి, అలాంటి పుస్త కాలు పాఠశాలల లైబ్రరీల్లో ఉంచితే ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులైనా వాటిని చదువుతారు. రేపటి తెలంగాణ సమాజానికి వారే మార్గ దర్శ కులవుతారు. పిల్లలు ఎన్ని పుస్తకాలు చదివారు అనేది పరీక్షించాలి. ప రీక్షల్లో వాటిపైన ప్రశ్నలు వేయాలి. అప్పుడే పిల్లలు పుస్తకాలు చదవ గలరు. స్కూల్‌లో పుస్తకం చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి కా రణం ప్రాక్టీస్ లేకపోవడం. పుస్తకాలు అంటే రాయడం, అమ్మడం కా దు. వారు చదివేలా చేయటం. ఇది అందరి బాధ్యత. లైబ్రరీలు ఉప యోగించుకోవటం లేదు. ఇలాంటి పరిస్థితి మారేందుకు విద్యాసంస్థలు కృషి చేయాలి. ఈ సంస్థలని ఆ దిశలో నడిపించాలి.
పుస్తక ప్రదర్శనలను ప్రోత్సహిద్దాం!
హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాలతో పాటుగా జాతీయ, అం తర్జాతీయ మేళాల్లో మన తెలంగాణ పుస్తకాలు చాలా తక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అరవై ఏళ్ళ పరాయి పాల న. ఇప్పుడు మన స్వరాష్ర్టం వచ్చింది కాబట్టి మనకు సంబంధించిన ప్రతి అంశంలోనూ విరివిగా రచనలు వచ్చేలా చూడాలి. తెలంగాణ వి శ్వవిద్యాలయాలు, తెలంగాణ భాష, సాంస్కృతిక సంస్థలు ఇందుకు చొ రవ తీసుకోవాలి. కవిత్వం, సామాజిక అంశాలు, చరిత్ర, సంస్కృతి … ఎంచుకునే అంశం ఏదైనా సరే.. అది తెలంగాణ ఉట్టిపడేలా ఉండా లి. నేషనల్ బుక్ ట్రస్ట్ తరఫున పుస్తక ప్రదర్శనలను మన గ్రామంలో లేదా స్కూల్‌లో ఏర్పాటు చేసేందుకు వీలుంది. ఇలాంటి అవకాశాల ను వినియోగించుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు, పబ్లిషర్స్ ముందుకు వ స్తే అలా ఏర్పాటు చేసే బుక్ ఫెయిర్‌కి ఆర్థిక సహాయాన్ని చేసేందుకు కూడా ఎన్‌బీటీ లాంటి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. పుస్తకం సామా న్యుని దగ్గరకు చేరేలా ఉండాలి. ఎంచుకునే అంశం, చెప్పే విధానం, దాని ధర.. అలా గనుక ఉంటే దాన్ని తప్పకుండా ఆదరిస్తారు. నేను కూడా హైదరాబాద్‌తో సహా దేశవిదేశాల్లో ఎన్నో బుక్ ఫెయిర్‌లలో పుస్తకాలు చూసి కొన్నవాడినే.
బుక్‌ఫెయిర్ అనేది అందరికీ ఒక గొప్ప అవకాశం. పఠనాసక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో పుస్తకం మన చేతిలో ఉందంటే ఒక శక్తి మ నకు తోడుగా ఉన్నట్లుగా ఉంటుంది. ఒక రచయిత తన జీవిత కాలం అంతా కష్టపడి ఎంతో శాస్త్రీయ, సామాజిక విజ్ఞానాన్ని సాధించి దాన్ని ఒక గ్రంథ రూపంలో మనకు అందిస్తున్నప్పుడు అందులోని అంశాల్ని కొన్ని గంటల్లోనే మనం సంపాదించగలం.అంతటి అద్భుత అవకాశా న్ని పుస్తకం మనకు అందిస్తోంది. మనం ఏ రంగానికి చెందిన వారం అయినా కావచ్చు… అందరికి ఒకచోటకి వెళ్ళి పుస్తకాలు కొనే అవకా శం రాదు. అలాంటి అవకాశాన్ని పుస్తక ప్రదర్శనలు అందిస్తాయి. అం దుకే పుస్తక ప్రదర్శనల నిర్వహణను ప్రోత్సహించాలి. వాటిని సంద ర్శించి పుస్తకాలు కొనడాన్ని ప్రజలకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు అలవాటు చేయాలి.
మనపుస్తకాలకు పట్టం కట్టాలి
పుస్తకం తెలంగాణ సంస్కృతిని పునరుజ్జీవింపజేసింది. తెలంగాణ సమాజ సంస్కృతి గమనాన్ని నిర్దేశించింది. ఇక పుస్తకాల ప్రచురణ వి షయానికి వస్తే ఇందులోనూ ఎన్నో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వపరంగా ముద్రితమయ్యే పుస్తకాల కాంట్రాక్టులను స్థా నిక తెలంగాణ సంస్థలకే అందించాలి. తెలంగాణ మూలాలు, తెలం గాణవాసుల ఆధిక్యం ఉన్న సంస్థలకే వాటిని ఇవ్వాలి. ప్రచురణల విష యంలో గమనించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. రచయితలే పు స్తకాలను పబ్లిష్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. రచయిత రాయడం పైనే దృష్టి పెట్టేలా ఉండాలి తప్పితే ప్రింటింగ్, పంపిణి లాంటి అం శాలను కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. అది రచయి తల సృజనాత్మకతను దెబ్బ తీస్తుంది. వారి శక్తి సామర్థ్యాలకు పరిధులు ఏర్పరుస్తుంది. పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసే సంప్రదాయానికి క్రమంగా స్వస్తి పలకాలి. ప్రజలు సైతం పుస్తకాలు కొనడాన్ని తమ నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలి. ఇంట్లోకి కిరాణ కొంటున్నట్లు గా, వేసుకోవడానికి దుస్తులు కొంటున్నట్లుగా ఎంతలో వీలైతే అంతలో పుస్తకాలు కొనేందుకు సిద్ధపడాలి. ఇది తెలంగాణ వాదాన్ని పటిష్ఠం చేసేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. పరాయి పాలనలో మన భాష, సంస్కృతి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఆందోళన నుంచే తెలంగాణ ఏర్పడింది. స్వరాష్ర్ట సాధన నేపథ్యంలో మన భాష, సంస్కృతి అభివృద్ది చేసుకోవటానికి పుస్తక పఠనం చేయాలి. అందరం ఆ దిశలో కలిసి ముందుకు సాగాలి.
మన భాషలో రచనలు రావాలి
ప్రజలు ఎలాంటి పుస్తకాలు ఎక్కువగా కొంటున్నారు అనే సర్వే చే యాల్సిన అవసరం ఉంది. పిల్లల పుస్తకాల్లో ఎక్కువగా ఇంగ్లీష్ పుస్త కాలే అమ్ముడుపోతున్నాయి. మన రాష్ర్టంలో ఎందుకు మన భాషలో పుస్తకాలు ప్రచురించటంలేదు.. చదవటం లేదు.. కొనటం లేదు…అనే విషయాన్ని ఆలోచించాలి. తెలంగాణలో వందల ఏళ్ళుగా ఉర్దూ ద్వా రా తెలంగాణ భాషను చంపారు అంటున్నారు. కానీ అది నిజం కాదు. కుతుబ్‌షాహీల కాలం నుంచి అసఫ్‌జాహీ చివరి నిజాంకు ముందు కా లందాకా తెలంగాణ భాష వెలుగొందింది. ఉర్దూ సోపతితో అది మ రింత బలోపేతం కూడా అయింది. చివరి నిజాం కాలంలో ఉర్దూకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఆ అంశాన్ని పాలకవర్గాల స్వభావం గానే చూడాలి. ఇప్పుడు మన స్వరాష్ర్టం ఏర్పడింది. మన భాషను మ నం ప్రోత్సహించుకుందాం. పిల్లలు తెలంగాణ భాషలో చదవాలంటే ముందుగా తెలంగాణ భాషలో ఎక్కువ పుస్తకాలను రచించాలి. అది కూడా ఇప్పుడు చదువుతున్న తరం వాళ్లు రచించాలి. ఉద్యమ కాలం లో చాలామంచి సాహిత్యం మన తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు మ నం స్వరాష్ర్టం సాధించాం. ఇక స్వరాష్ర్ట పునర్ నిర్మాణంపై దృష్టి పె ట్టాలి. పునర్ నిర్మాణ అంశాలపైన కూడా కవిత్వం, ఇతరత్రా రచనలు రావాల్సిన అవసరం ఉంది. నేడు మన భాషనే మనకు కాకుండా పో తున్న పరిస్థితి ఉంది. భాషనే నేర్వకుంటా ఉంటున్నాం. అలాంటప్పుడు చదవడం, రచనలు చేయడం ఎలా సాధ్యం? ఇవన్నీ ఆలోచించాలి.
ఎలాంటి రచనను ప్రోత్సహిద్దాం?
నేడు పాపులర్ సాహిత్యం బాగా ప్రజాదరణ పొందుతోందని పుస్త క విక్రేతలు అంటున్నారు. పాపులర్ సాహిత్యానికి నిర్వచనం రెండు మూడేళ్ళకోసారి మారిపోతూ ఉంటోంది. ఒకప్పుడు నవలలు బాగా జ నాదరణ పొందాయి. ఆ తరువాత కెరీర్ గైడెన్స్ పుస్తకాలు బాగా వి క్రయమయ్యాయి. అనంతర కాలంలో ప్రముఖుల జీవిత చరిత్రలు పా పులర్ సాహిత్యంగా వచ్చాయి. మరి మన తెలంగాణ చరిత్ర, సంస్కృ తి, పర్యాటకం లాంటి అంశాలను కూడా అలా ‘పాపులర్’ చేయ వచ్చే మో ఆలోచించాలి. తెలంగాణ మట్టిమనుషులను, తెలంగాణ వీరులను వెలుగులోకి తేవాలి. తెలంగాణ ప్రముఖుల జీవిత చరిత్రలపై పుస్తకా లు రావాలి. తెలంగాణ ఉద్యమం కోసం కవులు ఏ విధంగా ఏకైక లక్ష్యంతో తమ రచనలు చేశారో, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఇ ప్పుడు మళ్ళీ అలా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. వేర్వేరు పాయ లన్నీ ఒక్కటైనట్లుగా కవులు, రచయితలు ఒక్కటై తెలంగాణ పునర్ ని ర్మాణ ఆవశ్యకతను, విధి విధానాలను ఎలుగెత్తి చాటాలి. కనీస ఐక్య కార్యాచరణను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలి. సమాజం దశ, దిశను మార్చేది పుస్తకమే.
ఎవరి కోసం మన రచనలు?
ఒకనాడు స్వాతంత్య్ర ఉద్యమం ప్రజల్లో అక్షరాస్యతను, సామాజిక అవగాహనను పెంచింది. ప్రత్యేక తెలంగాణ స్వరాష్ర్ట ఉద్యమం కూడా అదేపని చేసింది. ఎన్నెన్నో జాక్‌లు…మరెన్నో ప్రజాసంఘాలు…ఇవన్నీ ప్రజల్లో కల్పించిన చైతన్యం అంతా ఇంతా కాదు. అణగారిన వర్గాలకు చెందిన కవులు, రచయితలు పెన్నులను వడిసెలుగా చేసుకొని అక్షరా లను రాళ్ళుగా విసురుతుంటే ఆ దెబ్బకు వలసపాలకులు దూరంగా వె ళ్ళిపోయారు. ఈ నేలతల్లి బిడ్డల రచనల్లో మట్టి వాసన పరిమళిం చింది. మట్టి మనుషులు చేసిన రచనలు మట్టిలో దాగిన మూలాల్లోకి మనల్ని తీసుకెళ్ళాయి. ఆ వర్గాల నుంచి కొత్త రచయితలు వచ్చారు. ఆ వర్గాల నుంచే కొత్త పాఠకులూ పుట్టు కొచ్చారు. ఆ పాఠకుల అవ సరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. తెలంగాణ పునర్ నిర్మాణం లక్ష్యం గా ఒక మెజ్వల రచన,పఠన ఉద్యమాన్ని నిర్మించాలి.
ఎలా చేరుకుందాం?
సమాజంలోని కింది వర్గాల కోసం పుస్తకాలు రాయాలి. అవి వారి కి చేరేలా చూడాలి. బుక్ ఫెయిర్‌లు ఉన్నాయి. పుస్తకాల దుకాణాలు న్నాయి. అన్నింటికీ మించి ఇంటర్నెట్ కూడా మనకు అండగా ఉం టుంది. ఆన్‌లైన్ షాపింగ్ సదుపాయాన్నీ ఇందుకు ఉపయోగించుకో వచ్చు. పుస్తకాన్ని పాఠకుల దగ్గరికి ఎలా తీసుకుపోగలం అనేది ఆలో చించే సమయం వచ్చింది. అదే సమయంలో ఎలాంటి పుస్తకాలను అందించగలం అనే అంశాన్ని కూడా ఆలోచించాలి. చిన్ననాటి నుంచే ఎలాంటి పుస్తకాలు చదవాలి అనే అంశంపై తగు శిక్షణ ఇవ్వాలి.
ఎలాంటి కృషి జరగాలి?
ఒక్కో తరం గడుస్తున్న కొద్దీ పుస్తకం చదివే ఆకాంక్ష తగ్గిపోతు న్నది. పుస్తకాలు చదివే అలవాటుకు బాల్యంలోనే బీజం వేయాలి. పాఠ శాలస్థాయిలోని టీచర్లు పుస్తకంపై అవగాహనకు కృషి చేయాలి. లేకుం టే మనం ఎన్ని రకాలుగా కృషి చేసిన ఫలితం రాదు. ప్రభుత్వ పరంగా కూడా కృషి జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ర్ట సాధన కో సం వచ్చిన వాళ్లందరు పుస్తకాలు చదివిన వాళ్ళే. ఉద్యమానికి ఇంతటి పటుత్వం రావటానికి కారణం పుస్తకమే. ఇదే స్ఫూర్తిని తెలంగాణ పునర్ నిర్మాణంలోనూ వినియోగించుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న ట్లుగా భావి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే, విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పించాలి. పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కృషి చేయాలి. విద్యార్థికి కేవలం టెక్ట్స్‌బుక్స్ కాకుండా అనేక పుస్తకాలు చదివే అవగా హన కల్పించాల్సిన అవసరం చాలా వరకు ఉంది. తెలంగాణ తెచ్చుకు న్నాం, ఇక వచ్చిన తెలంగాణ ఎలా ముందుకు తీసుకుపోవాలో ముం దుతరం వాళ్ళకు ఈ పుస్తక పఠనం ద్వారానే తెలియజేయగలం. దీనిని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. దక్కన్ న్యూస్
(తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ యం.వేదకుమార్ ‘చర్చ’ కార్యక్రమంలో చేసిన ప్రసంగం సారాంశం)


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *