అసలు నిజాలు

1. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనం స్వచ్ఛందంగా జరిగింది
ఇది చరిత్రను వక్రీకరించడమే. కుట్రపూరితంగా రెండు ప్రాం తాలను కలిపి అది స్వచ్ఛందం అని ప్రచారం చేయడం సరికాదు. ఈ వాదన సీమాంధ్ర నేతల అజ్ఞానానికి నిదర్శనం.
1953లో మద్రాస్ రాష్ర్టం నుంచి వేరుపడి ఆంధ్రరాష్ట్రం ఏర్ప డింది. ఏర్పడిన నాటి నుంచి ఆంధ్రరాష్ట్రం రాజధాని సమస్యతో, నిధుల కొరతతో సతమతమైంది. గుంటూరులో హైకోర్టుతో, కర్నూ లు రాజధానిగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం గందరగోళంగా ఉండేది. తమ సమస్యలన్నింటికి పరిష్కారం విశాలాంధ్ర ఏర్పాటులోనే ఉందని ఆంధ్రరాష్ట్ర నాయకులు భావించారు. తెలంగాణను కలుపుకోవటానికి ఉబలాడపడ్డారు. వారి ఆరాటం ఎట్లా ఉండేదో ఆనాటి పత్రికలు చూసి తెలుసుకోవచ్చు.
ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకుని విశాలాంధ్ర ఉద్యమం లేవదీశారు.
1. రాజధాని సమస్యఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తగిన రాజధాని లేక ఇబ్బందులు పడ్డది. అప్పటికే సకల వసతులతో అలరారుతున్న హైదరాబాదు పొందితే రాధాని సమస్య పరి ష్కారమవుతుంది.
2. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ నుంచే ప్రవహిస్తాయి. ధవళేశ్వరం, ప్రకాశం ఆనకట్ట బ్యారేజీలకు నీళ్లు తెలంగాణ నుంచే వస్తాయి. తెలంగాణ రాష్ర్టం అలాగే కొనసాగితే నేడు కాకున్నా ఏదో ఒకరోజు ఈ నదులపై ఆనకట్టులు నిర్మిస్తారు. కృష్ణా, గోదావరి జలాలను ఆపుతారు. కనుక ఎగువన ఇంకో రాష్ట్రం ఉండకూడదు!
3. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన బొగ్గు ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడా లేదు. సింగరేణిలో పుష్కలంగా ఉంది. అది తెలంగాణలో ఉంది. ఆ ప్రాంతాన్ని కలుపుకుంటే విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేసి కరెంటును విరివిగా ఉత్పత్తి చేయ వచ్చు. పరిశ్రమలు నెలకొల్పవచ్చు.
4. తెలంగాణలో అక్షరాస్యత తక్కువ. (194 లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత 4 శాతం అయితే ఆంధ్రాలో 36 శాతం) విద్యావంతులైన ఆంధ్రులకు తెలంగాణలోనూ ఉద్యో గావకాశాలు కల్పించవచ్చు.
5. హైదరాబాదు రాష్ర్టం మిగులు నిధులతో ఉంది. ఆంధ్రరాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఏర్పడింది. తెలంగాణలో ఉన్న మిగులు నిధు లను మళ్ళించి సర్దుబాటు చేసుకోవచ్చు. (అంటే నిధుల దోపిడీ అన్నమాట).
వీటిని మనసులో పెట్టుకుని విశాలాంధ్ర ఉద్యమం మొదలు పెట్టారు. తెలుగోళ్లమందరం కలిసి అభివృద్ధి చెందవచ్చన్నారు. మనవాళ్లు కొందరు వారి మాయమాటలను నిజమేనని నమ్మారు. వరంగల్‌లో ఒక సమావేశం పెట్టారు. దాశరథిని సైతం తమవైపు తిప్పుకుని ‘మహాంధ్రోదయం’ రాసేలా భ్రమల్లో ముంచారు. అక్కడా ఇక్కడా కాంగ్రెస్‌పార్టీయే అధికారంలో ఉండటం వల్ల వారి పని సు లువు అయిపోయింది. ప్రజలు వద్దని మొత్తుకున్నా ఆనాటి తెలం గాణ నాయకులు వినలేదు. వ్యతిరేకించిన నేతలను మచ్చిక చేసుకు న్నారు. ఫజల్‌అలీ కమీషన్ వద్దన్నా పట్టించుకోలేదు. హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతనేతలు తమతమ ప్రాంతాలతో కలిసిపోవాలన్న తొందరపాటు ఆంధ్రానేతలకు కలిసి వచ్చింది. ప్రధాని నెహ్రూను ప్రభావితం చేశారు. ‘పెద్దమనుషుల ఒప్పందం’ పేరుతో తెలంగాణ వారి అభ్యంతరాలను నెరవేర్చు తామని హామీ ఇచ్చారు. తెలంగాణను ఉద్ధరించడమే తమ మొదటి ప్రాధాన్యత అని బాసచేశారు. మాయోపాయంతో ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటుచేశారు. ఇదీ అసలు చరిత్ర. సీమాంధ్రపెట్టుబడిదారులు అబద్ధాలు ఎన్ని వల్లించినా, మారని అసలు సిసలు వాస్తవం! ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు స్వచ్ఛందం ఎట్లా అవుతుంది!
2. ఫజల్ అలీ కమీషన్ విశాలాంధ్రను సమర్థించింది
ఇది పూర్తిగా తప్పు. చాలా విషయాల్లో చరిత్రను వక్రీకరించి నట్లు గానే జస్టిస్ ఫజల్ అలీ కమీషన్ నివేదికనూ వక్రీకరించారు.
స్వాతంత్య్రానంతరం చిన్న, పెద్ద రాష్ట్రాలుగా, సంస్థానాలుగా ఉన్న ప్రాంతాలను రాష్ట్రాలుగా పునర్‌వ్యవస్థీకరించడం కోసం భారతప్రభుత్వం జస్టిస్ స్.ఫజల్ అలీ నేతృత్వంలో ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసింది. అందులో హెచ్.ఎన్.కుంజ్రూ, కె.ఎం.ఫణిక్కర్ సభ్యులు. ఈ కమీషన్ దేశంలో అన్ని ప్రాంతాలు పర్యటించి ప్రజలు, నాయకులు, పార్టీల అభిప్రాయాలను సేకరించింది. అలాగే 1954 లో హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించింది. వివిధ సంఘాలు, ప్రజ లతో మాట్లాడింది. ఆంధ్రా ప్రాంత ప్రజలు, నాయకులతో గతంలోని చేదు అనుభవాలు పొందిఉన్న హైదరాబాదు రాష్ర్ట ప్రజలు, నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఉండాలని అభ్యర్థించారు. సొంత రాష్ట్రంగా ఉంటేనే ఈ ప్రాంత భవిష్యత్తు సుభిక్షంగా, సురక్షి తంగా ఉంటుందని ఆ కమిటీకి విన్నవించారు. ఆ విజ్ఞాపనలన్నిం టిని పరిశీలించిన ఫజల్ అలీ కమీషన్ ఈ సిఫారసులు చేసింది.
1). తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలిపితే ఉమ్మడి లాభాలను ఆంధ్రా ప్రాంతం వారే హస్తగతం చేసుకుంటారు. తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుని దీన్ని తమ వలస ప్రాంతంగా మార్చే ప్రమాదమున్నది. (ఎస్సార్సీ రిపోర్టు పేరా 37)
2). తెలంగాణలో భూమిశిస్తు, ఎక్సైజు సుంకం అధికంగా ఉం డటం వల్ల, వచ్చే అధికాదాయాన్ని విశాలాంధ్రలో తెలంగాణే తర ప్రాంతాలకు తరలించే ప్రమాదమున్నది. (ఎస్సార్సీ రిపోర్టు పేరా 376)
3). భవిష్యత్తులో గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు కడితే ఉమ్మడి రా్రష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తన న్యాయమైన వాటా కోల్పోయే ప్రమాదముంది. (ఎస్సార్సీ రిపోర్టు పేరా 37)
తెలంగాణ ఆంధ్రా ప్రాంతాల వాదనలు విన్న కమీషన్ ఇలా స్పష్టమైన సిఫార్సు చేసింది. ‘‘ఉభయ ప్రాంతాల ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పరచడమే మం చిది. అంతగా అనుకుంటే 1961 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరా బాదు రాష్ట్రం (తెలంగాణ) శాసనసభ్యులు మూడింట రెండువంతుల మంది అంగీకరిస్తే ఆంధ్రతో విలీనం గురించి ఆలోచించవచ్చు. అలా జరగకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగాలి’’ (ఎస్సా ర్సీ పేరాలు 36, 3)
వాస్తవాలు ఇట్లా ఉంటే హైదరాబాదు నగరం, సింగరేణి బొగ్గు, కృష్ణా గోదావరి జలాలపై కన్నేసిన ఆనాటి ఆంధ్రరాష్ట్ర నేతలు విశా లాంధ్ర కోసం ఫజల్ అలీ కమీషన్‌కు తాము చేసి విజ్ఞప్తులనే కమిటీ సిఫారసులుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చరిత్రను వక్రీకరించటమే!
3. హైదరాబాదును సీమాంధ్రులే అభివృద్ధి చేశారు.
ఇది పూర్తిగా అబద్ధం. ఈ వాదన కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా చేస్తుంటారు. చరిత్రమీద ఏ మాత్రం అవగాహన లేకపోవడం వల్ల మిడిమిడి జ్ఞానంతో అది నిజమేనని కొందరు నమ్ముతుంటారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆస్తులు, వ్యాపారాలు చూసి అదే హైదరా బాదు అభివృద్ధి అనుకుంటారు. వాళ్ల మీడియా కూడా ఈ అభిప్రా యాన్ని వితంగా ప్రచారం చేస్తున్నది. కానీ అది నిజం కాదు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికే, అంటే సీమాంధ్రులు ఇక్కడకు రాక ముందే హైదరాబాదు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నది. అసెంబ్లీ, సెక్రెటేరియట్, హైకోర్టు, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రసూతి, పిల్లల దవాఖానాలతో సహా ప్రత్యేక ఆస్పత్రులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర మౌలిక సౌకర్యాలతో అలరారుతుండేది. బ్యాంకింగ్ వ్యవస్థ, రోడ్డు రవాణా సంస్థ, రైల్వేవ్యవస్థ ఉండేది. హుస్సే న్‌సాగర్ ఒడ్డున గల ‘హైదరాబాదు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం’ జంట నగరాలకు నిరంతరంగా వెలుగులు పంచేది.
అదే సమయంలో మద్రాస్ రాష్ట్రం నుంచి 1953లో వేరుపడిన ఆంధ్రరాష్ట్రం రాజధాని సమస్యతో సతమతమైంది. కర్నూలులో టెంట్ల కింద సెక్రటేరియట్ కార్యాలయాలు నిర్వహించుకున్నారు. వర్షా కాలం వస్తే పరిస్థితి దారుణంగా ఉండేది. కార్యాలయంలోని ఫైళ్లను పందులు పాడుచేస్తే, పందుల నివారణ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటా యింపులు చేసుకున్నారు. కొన్ని ఆఫీసులను మద్రాసులోని అద్దెభవ నాల్లో నడిపించారు. రాజధాని విషయంలో అటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్న ఆంధ్రా నాయకుల కన్ను అప్పటికే సకల సౌకర్యా లతో అలరారుతున్న హైదరాబాదుపై పడింది. దానికోసం విశాలాం ధ్ర రాగం అందుకున్నారు. ఆనాటి ఆంధ్రానేతల ప్రకటనలు చూస్తే హైదరాబాదుపై వారికున్న ‘అగడు’ తెలుస్తుంది.
‘‘మనం హైదరాబాదును పొందితే మన అన్ని సమస్యలు పరి ష్కారమౌతాయి. కానీ ఎలా పొందగలం? మనం ఆ దిశలో ఆలో చించి పనిచేయాలి.’’ టంగుటూరు ప్రకాశం పంతులు (ఆంధ్ర పత్రిక 2.6.1953)
‘‘ఎప్పుడెప్పుడు హైదరాబాదు వెళదామా అని ప్రజలు ఆతృతగా ఉన్నారు. రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాదు తరలించడంలో ఎవరూ ఇబ్బంది పటడం లేదు.’’ నీలం సంజీవరెడ్డి (ఆంధ్రపత్రిక 1.9.1954)
ఇదీ చరిత్ర అయితే, వాస్తవాలు మరిచి ఒకరు ‘కర్నూలును తెలంగాణ కోసం త్యాగం చేశా’మంటాడు. మరొకడు ‘తొండలు గుడ్లు పెట్టని హైదరాబాదును మేమే అభివృద్ధి చేసినా’మంటాడు. మద్రాసు వదలగానే రాజధాని సమస్యతో తల్లడిల్లిన ఆంధ్రులు హైద రాబాదుపై ఆశతో, భాష పేరుతో విశాలాంధ్ర నాటకం మొదలు పెట్టారు. తెలంగాణను ఆంధ్రరాష్ట్రంలో కలిపేసుకున్నారు. అది మొ దలు మిడతల దండులా హైదరాబాదులో వాలిపోయారు. సెక్రటేరి యట్‌లో అధికారులుగా తిష్టవేశారు. అన్ని శాఖలను తమ వారితో నింపుకున్నారు. మొత్తం తెలంగాణను తమ వలస ప్రాంతంగా మా ర్చుకున్నారు. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేశారు. దాంతో అసలు నగరాన్ని మరిచి వాళ్లు నిర్మించుకున్న వాణిజ్య సముదాయాలు వినోద కేంద్రాలు, భవనాలే హైదరాబాదు అభివృద్ధి అనుకునే దుస్థితి లో మనం పడిపోయాం. నిజాం కాలంలో హైదరాబాదు దేశంలో ఐదో పెద్దపట్టణం. ఇప్పుడు కూడా ఐదోస్థానమే. బెంగళూర్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది అని ఒక అంచనా. అది నిజమైతే హైదరా బాదుది ఆరోస్థానం. మరి ఆంధ్రుల పాలనలో హైదరాబాదు బాగు పడ్డట్లా? వెనుకబడ్డట్లా? దేశంలో అన్ని నగరాలవలెనే వృద్ధి చెందిం దా? లేక సీమాంధ్రులు రావడం వల్లనే వెలిగిపోయిందా?
కనుక హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని విఱ్ఱవీగే వాళ్లను మనం ప్రశ్నించవలసింది ‘మీరు వచ్చిన తర్వాత హైదరా బాదు అభివృద్ధి చెందిందా? లేక హైదరాబాదు అభివృద్ధి చెంది వున్న దని మీరు ఇక్కడికి వచ్చారా? దీనికి సమాధానం చెప్పనివారికి హైదరాబాదు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదు!
(డాక్టర్ వి.శంకర్ రచించిన ‘అసలు నిజాలు’ పుస్తకంలోని
వ్యాసంలో కొంతభాగం)


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *