ఆత్మహత్యలను అడ్డుకోవాలి!

రైతుబంధు అవార్డుల ప్రధానోత్సవంలో వక్తలు

ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాలి
ఆప్కాబ్ ప్రెసిడెంట్ కె.వీరారెడ్డి అభ్యర్థన
రైతులు సంఘటితం కావాలి: యం.వేదకుమార్
నెస్ట్ ఫౌండేషన్‌రైతుబంధు అవార్డుల ప్రదానం
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆప్కాబ్ ప్రెసిడెంట్ కె.వీరారెడ్డి అన్నారు. నెస్ట్ ఫౌండేషన్, రైతుబంధు వ్యవసాయ మాసపత్రికల ఆధ్వర్యంలో నవంబర్ 27న హైదరాబాద్ బాగ్‌లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.వీరారెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేపట్టా లన్నారు. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం నిజమేన న్నారు. లాభసాటి ధరలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నా రు. యంత్రాల రాకతో పశువులకు మేత కూడా కరువైపోయిందని అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని అధికం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సహకార వ్యవస్థ 100 ఏళ్ళ క్రితమే ప్రారంభ మైందని, జాతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు రావడంతో ఇప్పుడు కొంత మేరకు తగ్గినా, వాటికి దీటుగా సహకార బ్యాంకు లు సైతం వృద్ధి చెందుతున్నాయన్నారు. రుణమాఫీల ప్రకటనల నేపథ్యంలో ఒక సంవత్సర కాలంగా సహకార బ్యాంకింగ్‌లో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అధునాతన సాంకేతికతను అను సరించడంలో ఆప్కాబ్ ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ రంగా నికి రైతుబంధు మాసపత్రిక అందిస్తున్న కృషిని అభినందించారు.
వేదకుమార్
నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే..వ్యవసాయం కూడా చేసినా…జమీందార్ల కుటుంబమే అయినా..వ్యవసాయంతో, పశుపోషణతో సంబంధం ఉంది. పర్యావరణంపై ఎక్కువగా కృషి చేశాను. వేల సంవత్సరాల నుంచి కూడా మనది వ్యవసాయ సంస్కృతి. మనం పర్యావరణంలో ఇమిడిపోయి, మనకు ఎంత కావాలో అంతనే తీసు కున్నాం. అదే రైతు సంస్కృతి. అలా వేల ఏళ్లుగా జీవించాం. మరి ఇప్పటి పరిస్థితి ఎలా దాపురించిందో అర్థం చేసుకోవాలి. పోటీ ప్రపంచంలో పడ్డాం. మనిషి పుట్టిన నాటి నుంచి జీవితంలో ఏం కావాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇంత అత్యాశ మనకు రాదు. మరి రైతు ఎలా ఈ పరిస్థితిలోకి నెట్టబడ్డాడంటే… ఒకప్పుడు రైతు తనకు తానుగా విత్తనాలు తయారు చేసుకున్నాడు. పశువులు ఉండేవి. కులవృత్తులు ఉండేవి. చెరువులు ఉండేవి. ఒక నిబద్ధతతో కొనసాగేవారం. గ్రామీణ జీవితంలో ఒక పద్ధతి ఉండేది. చెరువును కాపాడింది ఎవరు..రైతులు, గ్రామీణులు. పర్యావరణం ముఖ్యం. పక్షులు, పశువులు అన్నీ దానిపైనే ఆధారపడ్డాయి. తెలంగాణ ప్రాం తాన్ని తీసుకుంటే, కాకతీయుల కాలం నుంచి కూడా చెరువుల పైనే ఆధారపడింది. వందల కి.మీ. మేర కృష్ణ, గోదావరి ప్రవహిస్తున్న ప్పటికీ నదుల నీరు రాదు. కారణం ఎగువ ప్రాంతం కావడం. మరి మనమేం చేసుకున్నాం…వాగులు, వంకలు, చిన్న నదులతో చెరువులు నిర్మించుకున్నాం. గొలుసుకట్టుగా వాటిని రూపొందించు కున్నాం. ఎంత వాడుకోవాలో అంతనే వాడుకున్నాం. ఎండాకాలంలో చెరువు మట్టి తీసుకున్నాం. ఇక్కడ వరి ప్రధాన పంట కాదు. సాగర్ కాల్వల కింద పండించాల్సిన పంటను తెలంగాణలో పండించడమెం దుకు? ఎక్కడ ఏ పంట పండించాలనే విషయంలో ప్రభుత్వ నియం త్రణ ఉండాలి. ఎక్కడి పత్తి..ఎవరి పత్తి…ఇక్కడికెందుకు వచ్చింది. తాతల కాలంలో పత్తి లేదు. మాకు వరి వద్దు.. నీళ్ళు లేవు. నాగార్జున సాగర్ కింద పండే వరిని చెరువుల కింద పండించడమెందుకు? మూడు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ లేని చోట బోర్ల కింద వరి పండిస్తే అండగా నిలిచేదెవరు? కాబట్టి వరి మనకు అవసరం లేదు. అరవై ఏళ్ళ పాలనలో ఇక్కడి వ్యవసాయం వివక్షకు గురైంది. ఓట్ల రాజకీయాలే నడిచాయి. ప్రభుత్వాలు రైతుబంధుగా లేవు. రైతులు కూడా భయంకరంగా నీవా, నేనా అన్నట్లు పోటీ పడ్డారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు…ఈ వలయంలోకి రైతు నెట్టబడ్డాడు. విధి లేక రైతు ఆ విషవలయంలో చిక్కుకున్నాడు. మక్కజొన్నలు, శనగలు, ఉలవలు… పెసర్లు, కందులు, అనుములు…ఇవన్నీ ఎవరు పండించాలి. పశుగ్రాసాలు పండించేవారం. ఊరివారందరు కూడా మా భూములు ఉన్నాయి కదాని పశువులు పెంచుకున్నారు. బావులు, మోట, చెరువు…అంతా ఖుష్కీ వ్యవసాయమే. రబీలో వరి వేయవద్దని సీఎం కూడా చెబుతున్నారు. వరి వేస్తే కరెంటు లేక ఇబ్బంది అని అంటున్నారు. అయినా విపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. రాజకీ యాల ఉచ్చులో మనం పడవద్దు. పెట్టుబడి లేక రైతులు అరువుపై పనికిరాని విత్తనాలు, నాణ్యం లేని ఎరువులు తీసుకుంటున్నాడు. ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పశువులను వదు లుకోవాల్సి వస్తోంది. ఇది ప్రజల వైఫల్యం కావు. పాలకుల వైఫల్యం. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు పెద్దపీట వేస్తున్నా మనే వారు రాజధాని కోసం లక్ష ఎకరాలు కావాంటున్నారు. ఇది అన్యాయం. అవి బీడు భూములు కావు. పచ్చని పంట పొలాలు. దీంతో అక్కడ భయంకర మార్పులు రాబోతున్నాయి.ఇక్కడి సీఎం కూడా అలాంటి ధోరణి అవలంబిస్తున్నారు. హుసేన్ సాగర్ చుట్టూ హుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని అంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. సుప్రీం కోర్టు తీర్పులకు అది వ్యతిరేకం. ఇక్కడ కట్టవద్దని అంటున్నాం. రైతులను కాపాడే ప్రభుత్వం చేయాలి. రైతులు సంఘటితం కావడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం భూములు లాగేసుకుం టున్నది. జాతీయ స్థాయి సంస్థలు రైతు సంక్షేమానికి కృషి చేయాలి. సంప్రదాయ, సుస్థిర వ్యవసాయం చేద్దాం. సేంద్రియ వ్యవసాయం చేద్దాం. వెటర్నరీ, అగ్రికల్చర్ విభాగాలు చక్కగా కృషి చేయాలి. పిల్లలకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలి. పిల్లలకు చెట్ల తేడా తెలియడం లేదు. ఆవు అంటే జెర్సీ ఆవు అనే అనుకుంటారు. ఊరితో అనుబంధం కొనసాగించాలి. భూమి, ఇల్లు ఉంచుకోవాలి. సెలవుల్లో పిల్లలను పల్లెలకు తీసుకుపోవాలి. ఇప్పుడలా పోలేకపోతున్నాం. కాన్వెంట్ చదువులు ఉన్నా పల్లెలకు తీసుకుపోవాలి. ప్రకృతి గురించి వివరించాలి. తులసి మొక్కకు, మర్రి చెట్టుకు తేడా తెలియదు.
ఈ సందర్భంగా నాబార్డ్ పూర్వ సీజీఎం పి.మోహనయ్య మాట్లాడుతూ, కొన్నాళ్లుగా రైతుల ఆత్మహత్యలు పెరగడం సభ్య సమాజానికి సిగ్గుచేటని అన్నారు. కర్ణుడి చావుకు పలు కారణాలున్నట్లు గానే రైతుల ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు అధికం కావడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువులు, పురుగుమందులు లేని కాలంలో కూడా వ్యవ సాయం ఉందని, ఆ విషయాన్ని గుర్తించి తిరిగి సేంద్రియ వ్యవసా యం దిశగా మారాలని కోరారు. సోలార్ ఎనర్జీని వినియోగించుకోవ డాన్ని రైతులు అల వర్చుకోవాలని సూచించారు.
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డి. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ, భూమాత, గోమాతను, గంగమ్మతల్లిని కాపాడుకోవాలన్నారు. దేవర కద్ర ఎమ్మెల్యే ఎ.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సౌరశక్తిని అధికంగా వినియోగిం చుకోవాలని, ప్రభుత్వం అందించే సబ్సిడీలను సౌరశక్తి పంపులను కొనుగోలు చేయాలని సూచించారు.
డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి.రవీంద్ర బాబు, డైరెక్టరేట్ ఆఫ్ సొరగవ్‌ు రీసెర్చ్ ప్రతినిధి విశారద, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ప్రతినిధి ఎల్‌విఐఎన్ మూర్తి, ఫిషరీస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ ఎం.వి.సాయిబాబా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సంస్థలు, విభాగాలు చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వారు ఈ సందర్భంగా వివరించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మంది రైతులు, శాస్త్రవేత్తలు, పశు, జీవాల పెంపకందారులు, వ్యవసాయాధారిత చేతి వృత్తి కళాకారులకు, రైతు ఉద్యమకారులకు, మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా అవార్డులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మువ్వా చిన్న కృష్ణమూర్తి గడ్డితో చేసిన చీర, జాకెట్, చర్నకోల లాంటి పలు ఉత్పత్తులు సమావేశానికి హాజరైన వారిని అమితంగా ఆకట్టుకున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు ఉద్యమకారులు భూదేవి తది తరులను ఈ సందర్భంగా సన్మానించారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రైతులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దక్కన్ న్యూస్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *