ఆదాయ కోణం ద్వారానే

బి.సి.లు సుసంపన్నులు కారు!
ఈమధ్య కాలంలో బి.సి.లకు సంబంధించి రూ.6 లక్షల ఆదాయ పరిమితి దాటితే క్రిమిలేయర్‌గా గుర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, (వ్యవసాయ ఆదాయం, ప్రభుత్వ ఉద్యో గుల ఆదాయంలను మినహాయించి) రూ.6 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి బి.సి. సర్టిఫికెట్ ద్వారా లాభించే ఏ అవకాశాలు వర్తిం చవు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆరు లక్షల ఆదాయ పరి మితి అనేది ప్రతి సగటు కుటుంబంలో సామాన్యమైన విషయం. ఈ రోజున కార్పొరేట్ సమాజంలో ప్రతీది ఖరీదైన వస్తువుగానే మారింది. విద్య, వైద్యం ఖరీదైన వస్తువులుగా మారినవి. మనుషుల జీవన ప్రమా ణాలు ఖరీదైనాయి. మునుపటిలా కరెన్సీ విలువ లేదు, తగ్గింది. వై ద్యం చేయించుకోవాలన్నా, వైద్య విద్య చదవాలన్నా, ఉన్నత చదువు లు చదవాలన్నా రూ.లక్షల నుండి కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఒక పే రు మోసిన వైద్య కళాశాలలో డాక్టర్ చదవడమంటే దాదాపు రూ. 2 కోట్లు కావాలి. ఒక మామూలు సగటు వ్యక్తికి కార్పొరేట్ వైద్యం ఇప్ప టికీ అందుబాటులో లేదు. రూ.6 లక్షల క్రిమిలేయర్ పరిమితి వల్ల బి. సి.లోని ఎగువ మధ్యతరగతి ప్రజల ఉన్నతికి అడ్డుకట్ట వేయడమే అవుతుంది. ఇటు బి.సి.లు పొందుతున్న రిజర్వేషన్ పొందకుండా, అ టు అప్పటికి ఎదిగిఉన్న సంపన్న వర్గ ప్రజలతో పోటీ పడలేక వీరు త్రిశంకుస్వర్గంలో ఉండిపోయే ప్రమాదం ఉంది. బి.సి.లు మొదటి నుండి స్వాతంత్య్ర ఉద్యమ ఫలితాలు అందుకోవడంలో తీవ్ర వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు. ఒకవైపు ఓటు ద్వారా ఎన్నుకునే చట్ట సభ లకు ఎన్నో కులాలు ఇప్పటికీ పొలిమేర అవతల ఆమడ దూరంలో ఉ న్నాయి.
చట్ట సభల్లో కనీసం 27% రిజర్వేషన్స్ ఇప్పటికీ అమలు కా వడం లేదు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఇం కా వెనుకబాటుతనం ఉంది. విద్య, కూడు, గూడు, కనీస ఆరోగ్య సౌక ర్యాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. నమ్ముకున్న వృత్తులు కూనారి ల్లినవి. బి.సి. ఉప కులాలు, సంచార బి.సి. కులాలు పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నది. ఇప్పటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోని వారు ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాల్లో వెలుగు నిం పడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు వేయాలి. క్రిమిలేయర్ అంశంపైన నిపుణులతో కమిటి వేయాలి. శాస్త్రీయపరంగా ఇబ్బందిగా ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వాలు సున్నితంగా పరిష్కరించాలి.
అంబాల నారాయణ గౌడ్
రాష్ట్ర కన్వీనర్
గౌడ ఐక్యసాధన సమితి
9949652024« (Previous News)Leave a Reply

Your email address will not be published. Required fields are marked *