ఇక సాగనివ్వం

వక్రీకరణలు, వంచనలు

కుట్రపూరిత పునాదులపై ఆవిర్భవంచిన సమైక్యాంధ్రలో గత 6 దశాబ్దాల నుండి తెలంగాణ అన్ని రంగాలలో నిలువుదోపిడికి గురైంది. ఈ దోపిడికి వ్యతిరేకంగా కొనసాగించిన విద్యార్థుల ఉద్య మాలు, 1000మందికి పైగ జరిగిన నఅమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతున్న తరుణంలో సీమాంధ్ర పెట్టుబడి దారుల కుట్రలు మళ్ళీ మొదలైనాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని, అధికారాన్ని వదలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అడ్గఓలుగా వంచన పూరిత కుట్రలకు పాల్పడుతుండ్రు. సీమాంధ్రుల నక్కజిత్తుల ఎత్తులు సురువుచేసిండ్రు.
మొదట్లో హైదరాబాద్‌ను యూటి చేయాలంటు సీమాంధ్రులు మోసపూరిత కుట్రలకు సిద్ధపడగా హైదరాబాద్‌ను యూటిచేస్తే యుద్ధ మే అంటు ఉస్మానియా విద్యార్థి గర్జన సప్పుళ్ళకు దిమ్మదిరిగింది. రాయలతెలంగాణ అంటు రాక్షసానందం పొందుతున్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాచలం తెలంగాణా సొత్తయినప్పటికీ, చరిత్ర వక్రీకరణలకు సీమాంధ్ర నేతలు కుట్రపూరితంగా సిద్ధం అవుతున్నారు. 450 ఏండ్ల క్రితమే 1674లో నేలకొండపల్లికి చెందిన మా కంచెర్ల గోపన్న పాల్వంచ తహశీల్దార్‌గా పనిచేస్తు పన్ను రూపంలో వసూలు చేసిన డబ్బుతో గోదావరి నది ఒడ్డున మధురమనోహరమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ‘భద్రాద్రి’ రాముడు తెలంగాణ దేవుడుగా కీర్తి శిఖరాలను అదిరోహించారు. అలాంటి మా భద్రాద్రి దేవాలయాన్ని సీమాంధ్రలో చేర్చేందుకు చేస్తున్న కుట్రల్ని చిత్తుచేయడానికి సిద్ధం కాండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల ఖిల్లా మా నల్లగొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమ నగార మోగించిన మా మునగాల మట్టి బిడ్డల పోరాట స్మృతుల్ని వక్రీకరించడానికి ఆంధ్ర పెట్టుబడిదారులు చేయని ప్రయత్నం లేదు. నోరు ఉన్నోడిదే ఊరు.. రాసుకున్నోదే రాజ్యం.. అధికారం ఉంటే అంత దగా చెయ్యొచ్చు.. అన్న చందంగా సీమాంధ్ర నేతల వ్యవహారం మారింది. గతంలో కూడా తెలంగాణ చరిత్రను వక్రీకరించడం, బ్రిటిషోళ్లమాదిరిగా కనుమరుగుచేయడం, అపురూప శిల్పకలా సంపదను దొంగిలించుక పోవడం పరిపాటిగా మారింది. సహజ పండితుడు, మహాకవి మా బమ్మెర పోతన జన్మ స్థానాన్ని వక్రీకరించి కడపకు తరలించే ప్రయత్నం చేసి కంగు తిన్నారు. ప్రపంచ పోరాటాల తెలుగు జాతి చరిత్రలో దళిత బహుజన విప్లవ వీరుడు,మొఘల్ పాలకులకు సింహస్వప్నంగా నిలిచి గోల్కొండ రాజ్యాన్ని పాలించి దళిత బహుజనుల రాజ్యాధికార సిద్ధాంతకర్తగా కీర్తిపొందిన మా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను దారిదోపిడిదొంగగా చిత్రీకరించి కించపరిచారు. మౌర్య సామ్రాజ్య పతనాంతరం దక్షిణ భారతదేశాన్ని 450 సంవత్సరాలు సమర్థవంతంగా పరిపాలించిన శాతవాహన వంశానికి ‘ఆంధ్ర’ శాతవాహన వంశం అని చరిత్ర పుస్తకాల్లో కుట్రపూరితంగా రాసుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్య దోపిడికి వ్యతిరేకంగా జరిగిన 157 తిరుగుబాటు సమయంలో దక్షిణ భారత దేశం నుండి తిరుగుబాటు శంఖారావం పూరించి బ్రిటిష్ సైన్యాలను గడగడలాడించిన హైదరాబాద్ పోరాట యోధుడు తుర్రేబాజ్‌ఖాన్ పోరాటాలను వంచనపూరితంగా చరిత్రలో లేకుండా చేసింది ఆంధ్ర ఆధితపత్య భావజాల చరిత్రకారులు కాదా?
దక్షిణ భారతదేశచరిత్రలో ఒక స్త్రీని మహారాణి (చక్రవర్తిగా) నియమించుకున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రజలకె దక్కిందని సగర్వంగా చెప్పొచ్చు. ఆమెనే ఏకశిలనగరవాసుల ముద్దుబిడ్డ రాణి రుద్రమదేవి. అలాంటి కాకతీయ సామ్రాజ్య ఉత్సవాలను అంతంత మాత్రంగా నిర్వహిస్తూ, సీమాంధ్రకుచెందిన విజయనగర సామ్రాజ్య ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ సీమాంధ్ర పాలకులు తమ వారసత్వకుట్ర బుద్ధిని చాటుకున్నారు.
ఒక దేవదాసి ఆటకోసం పాటకోసం ఆమె ప్రేమకోసం పడిన ఆరాటమే అందమైన హైదరాబాద్ నగర్ ఆవిర్భావానికి కారణమైందని అంటారు. ప్రపంచ నాగరికతల భిన్న సమ్మేళనానికి హైదరాబాద్ మహానగరం కేంద్రంగా మారింది. విభిన్న జాతుల వారికి కేంద్ర బిందువై ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకుంది. అయిన వారికి కాని వారికి అందరికి అమ్మగా, అన్నపూర్ణగా హైదరాబాద్ ఆదరిం చింది. సల్లంగ బతుకండి బిడ్డా అంటు మనస్ఫూర్తిగా దీవెనలిచ్చి దీవించింది. అలా బతకనీకె వచ్చినోన్ని భాయిభాయిగా చూసుకుంది. కాని దోచుకోవడమే లక్ష్యంగా ఉన్న ఆంధ్రోని కపటబుద్దిని 60ఏండ్ల నుండి ఓపికతో భరించింది. వంచనపూరిత విధానాలకు మారుపేరుగా నిలి చిన సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను ‘‘ఆంధ్రాబాద్’’గా మార్చడానికి పన్నుతున్న కుట్రల్ని చిత్తుచేస్తు ‘‘పొమ్మంటె పోవేందిరా పోరా ఓరి ఆంధ్రోడా’’ అంటూ తెలంగాణ సమాజం హెచ్చరిస్తుంది. ‘‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’’ అంటు గర్జిస్తోంది. ఇప్పుడు ఆంక్షలులేని తెలంగాణ కోసం హైదరాబాద్‌కోసం, భద్రాచలం, మునగాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లతోకూడిన సంపూర్ణ తెలంగాణ లక్ష్యంగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలి. తేడావస్తే భారీఆందోళనకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ఉద్యమకారులను జాగృతం చెయ్యాలి. అయిల సదానందం గౌడ్


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *