ఎం.ఎస్. సుబ్బులక్ష్మి | భారతీయ సంగీత హిమశిఖరం

 పదేళ్ల ఆ అమ్మాయి పాఠశాల ఆవరణలో ఇసుకలో తోటి పిల్లతో ఆడుకుంటోంది. ఇంతలో ఎవరో వచ్చి బట్టలకు చేతులకు అంటుకున్న దుమ్ముదులిపి ఎత్తుకుని తీసుకెళ్ళి వేదిక మీద వీణ వాదన చేస్తున్న తల్లి ప్రక్కన కూర్చోబెట్టారు. ఆ పాపను దగ్గరగా తీసుకున్న తల్లి పాడమని చెప్పింది. ఏవో రెండు పాటలు రాగరంజి తంగా పాడిందాచిన్నారి. పసి వయసులోనే పాప గాన ప్రావీణ్యతకు అక్కడున్న వారంతా సంభ్రమాశ్చర్యాలతో కరతాళధ్వనులు చేసి అభినందించారు.
అయిదు దశాబ్దాల తర్వాత…
అది ఓ అంతర్జాతీయ సంగీతోత్సవాల వేదిక. ఎందరో విశ్వఖ్యాతిగాంచిన సంగీతజ్ఞుల తో నిండి వుంది. ఆ వేదికపై అప్పుడే ‘‘ఆమె’’ గాత్రకచేరీ ముగిసింది. తన్మయభావనతో అం దరి కళ్ళలోనూ ఓ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వెలుగు కనబడుతోంది. ‘‘ఆమె’’ తదనంతరం మరో సు ప్రసిద్ధ సంగీత సమ్మేళనంగా చెప్పుకొనబడే ‘జు బిన్ మెహతా’ కచేరీ చేయాలి. ఆయన కనీసం 150 వాయిద్యాలతో వేదికను అలంకరించి క చేరీ చేస్తారు. వాస్తవానికి ఆయన ప్రపంచంలోని గొప్ప సంగీతకారుల్లో ప్రసిద్ధులు. కానీ ఆ రోజు వేదిక నెక్కడానికి సంకోచిస్తున్నారు. కారణం తన ఒకేఒక్క స్వరంతో వేల మంది సంగీతాభిమాను లను పారవశ్యంలో తేలియాడించిన ‘ఆమె’ ప్రతిభావ్యుత్పత్తుల ముందు తన వందలాది వాద్య సమ్మేళనం ఏ పాటిదిగా నిలుస్తుందని. ఏమైతేనేం అనే భావనతో భక్తి వినయాలతో జుబిన్‌మెహతా వేదిక దిగి ‘‘ఆమె’’ ముందు నిలిచి చేతులు జోడించి ఆశీర్వచనాలందుకుని వేదిక నె క్కారు.
పై రెండు సందర్భాల నడుమ చాలా సమయాంతరం కనిపి స్తుంది. మనకు కానీ అనితరసాధ్యమైన గాత్ర సంగీత సామ్రాజ్జిగా పేరుగాంచిన ‘‘ఎం.ఎస్. సుబ్బులక్ష్మి’’ల నాటి ‘‘అమ్మాయి’’ ఆ తరు వాత ‘‘ఆమె’’.
ఏడు దశాబ్దాలపాటు తన అద్భుత గానకౌశలంతో కర్ణాటక సంగీతాన్ని చకచ్ఛకితం చేసిన ఎం.ఎస్.సుబ్బులక్షి్ష్మ సంగీత స్వర యాత్ర భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఓ సువర్ణాధ్యా యం. ఈ సెప్టెంబర్ 16న ఎం.ఎస్. 99వ జయంతి అంటే శత జయంతి సంవత్సరం మొదలు కానున్నది.
1916 సెప్టెంబర్ 16న మధురైలోని సంగీత కుటుంబంలో జన్మించిన ‘‘సుబ్బులక్ష్మి’’ అసలు పేరు ‘కుంజమ్మ’. అమ్మమ్మ అక్క మ్మాళ్ వయోలిన్ వాదకురాలు. తల్లి ‘వీణాషణ్ముక వడివు’ వీణా వాదన, తరచూ ఇంట్లో జరిగే సంగీతచర్చలు ఆమెను కళా ప్రపం చం లోకి తీసుకువచ్చాయి. ‘‘కుంజమ్మ’’ ఆరో తరగతిలో ఏదో తప్పు చేసిందని ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో బడి కెళ్ళడం మానుకొని సంగీతాన్ని సర్వసంగా ఎం చుకున్నారామె. ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యార్ వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొందిన ఎమ్మెస్ తన 12వ ఏట తల్లితో కలిసి వేదికనెక్కి పాడినపుడు కర్ణాటక సంగీతాకాశంలో ఓ కొత్త తారక వెలసినట్ల యింది.
1932. ‘‘మద్రాస్ మ్యూజిక్ అకాడమి’’ వేదికపై ప్రఖ్యాత అరియక్కుడి రామానుజ అయ్యర్ కచేరీ చేయవలసి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల హాజరు కాలేని ఆయన సభా ని ర్వాహకులకు ఓ లేఖ రాస్తూ నా స్థానంలో ఈ ఎమ్మెస్ పాడుతుందని పంపారు. అప్పటికి పదహారేళ్ళ వయస్సున్న ఎమ్మెస్‌ను చూసి సభ లోని వారంతా నిరుత్సాహపడ్డారు. ఈ అమ్మా యి ఏం పాడుతుందని’’ పరస్పరం గుసగుస లాడుకున్నారు. కానీ ఎమ్మెస్ వేదికనెక్కి కచేరీకి సిద్ధమైంది. తన స్వరంతో కోమల గంధర్వగాన సౌరభాన్ని రవళించేలా పాడింది. ఎదురుగా సంగీత ప్రపంచాన శివయ్యర్ చెంబైవేద్యనాథ భాగవతారు వంటి వారు ఆసీనులై ఉన్నారు. ఎమ్మెస్ నిర్భయంగా తన కచేరీని ముగించింది. అందరి ముఖాల్లోనూ రసానందడోలిక ఊగిసలాడింది. అంత చిన్న వయ స్సులో మ్యూజిక్ అకాడమీ వేదికపై పాడే అవకాశం రావడం, పాడి అందరి ప్రశంసలు అందుకున్న వారు అరుదు. అందరి నో టా పొగడ్తలే. ‘‘అమ్మడూ నీకంఠంలో వీణాతంత్రులు మ్రోగుతున్నా యి’’ అని హాజరైన వారు ఆశీర్వదించారు.
ఎమ్మెస్ జీవితంలో సాధించిన విజయాల వెనుక ఒక పురు షుడున్నాడు. అతనే ‘‘త్యాగరాజన్ సదాశివం’’. 1930ల్లో స్వాతం త్య్రోద్యమంలో పాల్గొంటూ కాంగ్రెస్ వాలంటీర్‌గా సుబ్రహ్మణ్య భారతి గేయాలు పాడుతూ ప్రజలను చైతన్యం చేసిన ఆయన జర్నలిస్ట్‌గా పని చేస్తూ ఎం.ఎస్. జీవితంలోకి ప్రవేశించి ఆమె బంగారు భవిష్యత్‌ను నిర్వహించిన పాత్ర గణనీయమైనది. 1940 లో వీరి వివాహం జరిగింది. గాంధీ, నెహ్రూ, శాస్త్రీ, రాజాజీ ఇందిర వంటి వారితో ఈయనకున్న పరిచయాలు ఎమ్మెస్ గానం జాతీయం కావడానికి దోహదపడినవే. ఎమ్మెస్ కచేరీల నిర్వహణలో సదాశివం మార్గ దర్శకత్వం కీలకమైంది. ఎక్కడ, ఎప్పుడు కచేరీ చేయాలో, ఏ కీర్తన ఏ క్రమంలో పాడాలో నిర్ణయించేది సదాశివమే.
సుబ్బులక్ష్మి పాడుతుంటే ఆమె వదనంలో ప్రశాంతత, ప్రస న్నత లాస్యం చేస్తుంటాయి. రాగాలాపన, కీర్తన, నెరవు, స్వరకల్పన, ఏదైనా సరే అవి నాద సౌందర్యంతో నిండి ఉంటాయి. కర్ణాటక సంగీతంలో తలమానికమైన ‘పల్లవి’ని పాడటంతో తల్లి ఆమెకు ప్రత్యేక శిక్షణనిప్పించారు. అందుకు ఆమె మృదంగ సంబంధమైన లెక్కలన్నీ తెలుసు. ‘పల్లవి’ పాడటమంటే పాండిత్య ప్రకర్షతో కూడిన పని. నిర్ధిష్టమైన లయజ్ఞానం, ధారణశక్తి, గణితశా సూక్ష్మాలు ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ ఆమెలో పుష్కలంగా ఉండటం వల్లనే సాధ్యమైనది.
వెండితెరపై
ఎం.ఎస్. గాన ప్రతిభ సినిమాల్లోనూ భాసించింది. ‘సేవా సదన్’ (193), ‘శకుంతల’(1940), ‘సావిత్రి’(1941), ‘మీరా’ తమిళ (1944), హిందీ (1947) చిత్రాల్లో నటించారామె. శకుం తలలో ముగ్ధమనోహర మునికన్యగా ఆమె నటన అసామాన్యం. ‘సేవాసదన్’లో ఆధునిక యువతిగా నటించారు. ‘శకుంతల’లో ఆమె పాడిన పాటలన్నీ జనాదరణ పొందినవే. దక్షిణ భారతంలో ఆమె పాటలు వినపడని ఇల్లులేదు. ఆ రోజుల్లో ‘సావిత్రి’లో ఎం. ఎస్. నారదునిగా నటించిన పాడిన సంగతి చెప్పనవసరం లేదు. ‘మీరా’ చిత్రంలో సాక్షాత్తూ మీరాబాయినే ఆమె ఆవిష్కరించారు. ఆమె సరసన నటించిన వారు మన చిత్తూరు నాగయ్య.
ఏడు దశాబ్దాల కాలంలో తమిళ, కన్నడ, తెలుగు, మల యాళ, హిందీ, మరాఠీ వంటి పది భాషల్లో కలిసి సుబ్బులక్ష్మి చేసిన కచేరీల సంఖ్య రెండు వేలపై చిలుకే ఉంటుంది. వాటిలో స్వలాభం కోసం చేసినవి పాతికశాతం కూడా ఉండవు. మిగతా కచేరీలన్నీ ప్రజా సంక్షేమం కోసం సేకరించే నిధుల కోసం చేసినవే. ఇలా సేకరించిన సొమ్ము రెండు కోట్లపైనే ఉంటుంది. స్వంతంగా సంపాదించినది కూడా దాన ధర్మాలకు, విరాళాలకు వినియోగించా రామె. ఇంకా భర్త వెలువరించే ‘కల్కి’ పత్రిక నిర్వహణ కూడా దాన ధర్మాలకు, విరాళాలకు వినియోగించారామె. ఇంకా భర్త వెలువరించే ‘‘కల్కి’’ పత్రిక నిర్వహణ కూడా ఈమె సొమ్ముతోనే. జాతిపిత మహాత్మగాంధీకి ఎమ్మెస్ గానం ప్రీతిపాత్రమైంది. ‘‘భక్తిభావం ఆమె కంఠంలో ద్యోతకమైనట్లు మరే గాత్రంలోనూ ఉండదని’’ ఆయనే ఓ సందర్భంలో ప్రస్తావించారు.
‘‘అసలు తను పాడగలనని ఏనాడూ అనుకోలేదనే’’ సుబ్బలక్ష్మి కి సంగీతం తరువాత భర్తే దైవం. ఆయనను భర్తగా పొందే విష యంలో తానెంతో అదృష్టవంతురాలునని ఆమె చెప్పే వారు. తన భర్తను ఎంపిక చేసుకొనే విషయంలో తప్పటడుగు వేసి ఉంటే తన జీవితం దుర్భరమయ్యేదని’’ ఆమె భావించారు. ఆయన తన తోడు నీడగా ఉండటం వల్ల తనకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమైందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 56 ఏళ్ళపాటు తోడు, నీడగా గురువుగా ముందుండి నడిపించిన సదాశివం 1997లో మరణిం చారు. భర్త మృతి ఆమెను ఒంటరిగా మిగిల్చింది. వారికి సంతానం లేదు. సదాశివం తొలిభార్యగారి సంతానాన్ని ఆమె పెంచారు. సదాశివం మృతి తరువాత ఆమె మళ్ళీ పాడేందుకు తంబూరా నైనా తాకలేదు. ఆమె పాడాలని, పాడితే వినాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆమె సంగీతాభిమానులు ఆశించారు. కానీ ఆమె పాడకుండానే 2004 డిసెంబర్ 11న తన జీవనయానాన్ని చాలించారు. భౌతికంగా ఎమ్మెస్ మన మధ్య లేరు. కానీ ఆమె గాత్రం నిరంతరం నేపద్యగీతంలా సంగీత భారతరత్నంగా నిరంతరం మన తోడై సాగుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి శతజయంతి ఉత్సవాలను భారతీయ సంగీత సమాజం ఘనంగా జరుపుకోనుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
నాటి ప్రధాని నెహ్రు ఎం.ఎస్. పాట విన్న తరువాత ‘‘ఈ సంగీత సామ్రాజ్ఞం ముందు నేనెంత. నేనొక మామూలు ప్రధాన మంత్రిని మాత్రమే’’ అన్నారు. ఆమె నటించిన ‘మీరా’ చిత్రం చూసిన సరోజినీనాయుడు నా నైటింగేల్ బిరుదును ఈమెకు ఇచ్చే శానన్నారు. ‘‘తప్పిపోయిన నా ఆత్మను తిరిగి కనుగొన్నాను.’’ అని పండిత గోవిందవల్లబ్ పంత్ ప్రశంసించారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ ఎం.ఎస్.గానం విని ‘‘బేటీ ఖూబ్ ఖావో ఖూబ్ గావో’’ అని అభినందించారు. ఆమెకే గురువైన సెమ్మంగుడి వారైతే ఓ సందర్భంలో ‘‘ఈమెను పొగిడేందుకు నా వద్ద మాటలు లేవ’’ న్నారు. తన కర్ణాటక సంగీతమే గొప్పదనుకోకుండా ఆమె నారా యణరావు వ్యాస్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని, సిద్దేశ్వరీదేవి వద్ద ‘టప్పా టుమ్రీ’, దిలీప్‌రాయ్ వద్ద రబీంద్ర సంగీతాన్ని భక్తి సంగీ తాన్ని నేర్చుకున్నారు. వైవిధ్యాలున్న ఎన్నో సంగీత బాణీలను అవగతం చేసుకోవడం వల్ల పండిత పామరులను సమాంతరంగా అలరిస్తూ ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేసారామె.
సదాశివంకు ఎమ్మెస్‌తో పరిచయం 1936 జూన్ 10న జరిగింది. అప్పటికే ఆయన ‘ఆనంద వికటన్’’ విలేకరిగా పేరొంది ఉన్నారు. 1934లో మ్యూజిక్ అకాడమి వేదికపై కచేరీ చేసి ఎమ్మెస్ సృష్టించిన సంచలనం ఆయనను ప్రభావితం చేసింది. ఆ తరువాత ఎమ్మెస్ తల్లి వద్దకు వెళ్లి తాను మంచి కచేరీలు ఏర్పాటు చేసి ప్రచారంలోకి తీసుకు వస్తానని మాట ఇచ్చారు. ఆ ప్రకారంగా 1940 నాటికి ఎమ్మెస్‌కు దక్షిణ భారతంలో గొప్ప శాస్త్రీయ గాయని గా మార్చారు. తాను జర్నలిస్టు కావడంతో తనకున్న పెద్ద పెద్ద పరిచయాలతో గాంధీ, నెహ్రూ, రాజాజీలకు పరిచయం చేశారు. ఇవన్నీ ఎమ్మెస్ కెరియర్‌కు దోహద పడినవి. ఈ క్రమంలో వీరి సాన్నిహిత్యం 1940 జూలై 10 నాటికి వివాహంగా పరిణమించిం ది. అయితే, సదాశివం అప్పటికే వివాహితుడు. ఇవేమీ వారి పెళ్ళికి నాటి పరిస్థితులలో అవరోధం కాలేదు. వివాహానంతరం సదాశివం పూర్తిగా ఎమ్మెస్ సంగీత కార్యక్రమాల ఏర్పాటుకు పరిమితమైనారు. ఇక్కడి నుండి ఆమె పాడిన ఒక్కొక్క కచేరీ కీర్తి శిఖరాలను చేరే ఒక్కో సోపానంగా ఆయన తీర్చిదిద్దారు. ప్రచారానికి సంబంధించిన కిటుకులన్నీ ఆయనకు తెలుసు. వాస్తవానికి ఎం.ఎస్. పుట్టింది కళావంతుల కుటుంబంలోనే. అయినా, సదాశివంతో ప్ళ్లైన తర్వాత ఆమె ఆ ముద్రను పూర్తిగా చెరిపేసుకున్నారు. ఎ మ్మెస్ సుబ్బులక్ష్మి సదాశివంల జంటను నాడు ప్రముఖులెందరో ‘సావిత్రి సత్యవంతుల’తో పోల్చారు. రాజాజీ గారైతే ‘మీ ఇద్దరిని చూస్తే.. ఎవరు సావిత్రో, ఎవరు సత్యవంతులో తెలియడం లేదు.. మీరిద్దరి మధ్య ఉన్న అనురాగం అలాంటిది’ అన్నారొక సందర్భం లో. మంగళంపల్లి వారైతే ‘మాలాంటి వారము ఏకంగా ప్రజల్లోకి వెళ్లలేము. ఎవరో ఒకరు మీడియేటర్ కావాలి. కానీ సుబ్బులక్ష్మి గారికి ఆ ఇబ్బంది లేదు. అందుకు సదాశివం గారున్నారు’ అ న్నారు.
త్యాగరాజన్ సదాశివం తిరుచ్చి జిల్లా మనక్కాలిలో 1902, సెప్టెంబర్ 4న జన్మించారు. చిన్నతనంలోనే బడి వదిలి స్వాతంత్య్ర పోరాటంలో చేరారు. యువ కాంగ్రెస్ వాలంటీర్‌గా రాజాజీకి అ త్యంత సన్నిహితులైనారు. సుబ్రహ్మణ్య భారతి, నామాక్కల్, రామ లింగం పిళ్లై రచించిన దేశభక్తి గీతాలను రాగయుక్తంగా పాడుతూ ప్రజలను ఉత్తేజితులను చేసేవారు.
ఖాదీ ప్రచారోద్యమానికి రాజాజీ సదాశివాన్ని నియమిం చారు. ఎం.ఎస్.తో వివాహం తర్వాత ‘కల్కి’ పత్రికను ప్రారంభిం చారు. కళారంగం కోసం ‘శృతి’ అనే పత్రికను కూడా నిర్వహిం చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జైలుకెళ్లారు.
ఎం.ఎస్. కోసం సదాశివం స్వయంగా ‘శకుంతల’, ‘మీరా’ చిత్రాలు నిర్మించారు. గాంధేయవాదిగా నిరాండబరత, నిజాయితీ గల వ్యక్తిత్వంతో జీవించిన ఆయన 1997, నవంబర్ 21న 95వ ఏట మృతి చెందారు.
66 ఏళ్ళ అన్యోన్య దాంపత్య జీవితంలో సదాశివం మృతి ఎం.ఎస్‌లో నిర్లిప్తతను నింపింది. ఆనాటి నుండి ఆమె చివరి శ్వాస వరకు కచేరీలకు దూరంగా ఉండిపోయారు.
(రచయిత 2016లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి శతజయంతి సంచికను తీసుకురానున్నారు.)
– హెచ్.రమేష్‌బాబు,
మొబైల్: 94409 2514
మెయిల్ : ష్ట్రతీఎవరష్ట్రపప5ఏఎఱశ్రీ.శీఎ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *