ఎన్నికల బరిలోకి ఆవ్‌ు ఆద్మీ

ఆవ్‌ు ఆద్మీ పార్టీ …పేరుకు తగ్గట్టుగా సగటు మనిషి రాజకీయ పక్షం. 2012 నవంబర్ 26న ప్రారంభమైంది. దీని పుట్టుక వెనుక కూడా పెద్ద కథనే ఉంది.
ఇదీనేపథ్యం….
సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే జనల్ లోక్ పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించాలని కోరుతూ 2011 నుంచి కూడా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పేరిట పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమం పట్ల ఆక ర్షితమైంది. సాధారణ ప్రజానీకం కూడా దీనికి భారీస్థాయిలో మద్దతు తెలిపారు. ఇదే సందర్భంగా ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మలిచే ప్రయత్నాలు జరిగాయి. అన్నా హజారే దీన్ని వ్యతిరేకించారు. ఉద్యమ వైఫల్యం నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాల్సిన అవసరం ఉందని ఆయన సహచరులు కొందరు భావించారు. ఇండియా అగైనెస్ట్ కరప్షన్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా రాజకీయ పక్షంగా ఏర్పడేం దుకు అనుకూలత వ్యక్తమైంది. దీంతో ఆ ఉద్యమంలోని ప్రముఖులు కొందరు కలసి ఆవ్‌ు ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన ప్రశాంత్ భూషణ్, శాంతిభూషణ్ లాంటి వారు కేజ్రీవాల్ కు మద్దతు పలికారు. కిరణ్ బేడి, సంతోష్ హెగ్డే తదితరులు పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యం లోనే తాను రాజకీయపార్టీని ఏర్పరస్తున్నట్లుగా అక్టోబర్ 2న కేజ్రీవాల్ ప్రకటించారు. అధికారికంగా దీన్ని నవంబర్ 26న ప్రకటించారు. 1949లో అదే రోజున భారత దేశం తన రాజ్యాంగాన్ని అనువర్తింప జేసుకోవడం విశేషం. నవంబర్ 24న పార్టీ రాజ్యాంగాన్ని ఆమోదిం చారు. 320 మందితో నేషనల్ కౌన్సిల్‌ను, 23 మందితో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 2013 మార్చి నెలలో దీన్ని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేశారు.
ఇవీ సిద్ధాంతాలు
భారత రాజ్యాంగంలో భాగమైన సమానత్వం, న్యాయం అందించే వాగ్దానం, రాజ్యాంగ పీఠిక నేటికీ అమలు కావడం లేదని ఆవ్‌ుఆద్మీ పార్టీ పేర్కొంటోంది. దేశస్వాతంత్య్రం విదేశీ శక్తుల గుప్పిట్లో చిక్కుకుంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. సగటు మనిషి ఆవేదనను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. తమ అవసరాల కోసమే నాయకులు ప్రజలను వినియోగించుకుంటున్నారని విమర్శించింది. ప్రభుత్వంలో బాధ్యతాయుత ధోరణిని అధికం చేయాలని ఈ పార్టీ సంకల్పించింది. గాంధీ సిద్ధాంతమైన స్వరాజ్‌ను నిజం చేసేందుకు పిలుపునిచ్చింది. ‘స్వరాజ్’ ద్వారా ప్రభుత్వం నేరుగా ప్రజలకు బాధ్యత వహించగలదని ఈ పార్టీ భావిస్తోంది. స్వయంపాలన, స్థానిక కమ్యూనిటీల ఏర్పాటు, వికేంద్రీకరణ ఈ ‘స్వరాజ్’ భావనకు మూల స్తంభాలు. ప్రజలకు మంచి జరిగే భావన కమ్యూనిజంలో ఉన్నా, క్యాపిటలిజంలో ఉన్నా తాము దాన్ని స్వీకరిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఇదీ అజెండా
ఆవ్‌ు ఆద్మీ పార్టీ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారిం చింది. జన్ లోక్‌పాల్ చట్టం, (ప్రజా ప్రతినిధులను) తిరస్కరించే హక్కు, వెనక్కు పిలిచే హక్కు, రాజకీయ వికేంద్రీకరణ వీటిలో ఉన్నాయి.
అవగాహన క్యాంపెయిన్‌లు
ఎన్నికల్లో ఆయా పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు తమకు నచ్చకపోతే, వారిని తిరస్కరించే లేదా వారి పట్ల తమ విముఖతను వ్యక్తం చేసేం దుకు ఓటర్లకు ‘రైట్ టు రిజెక్ట్’ హక్కు ఉండాలని ఈ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. అందుకు ఎన్నికల సంఘం కూడా అంగీకరిం చింది. ప్రయోగా త్మకంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఈ అవకాశాన్ని ఓటర్లకు అందించేందుకు నిర్ణయించింది.
దేశవిదేశాల్లో మద్దతు
ఆప్ ఆవిర్భవించిన రోజే న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. 2013 మే 1న అమె రికాలో 20 నగరాలకు చెందిన అమెరికన్ భారతీయులు షికాగోలో ఓ సదస్సు నిర్వహించి తమ మద్దతు ప్రకటించారు. ఆప్ నాయకులు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్‌లు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. విద్యుత్ బిల్లులకు నిరసనగా ఢిల్లీలో కేజ్రీవాల్ చేపట్టిన 15 రోజుల నిరాహార దీక్ష అనంతరం, నిర్దిష్ట అంశాల్లో విబేధాలు ఉన్నప్పటికీ, అరుణా రాయ్, మేధాపాట్కర్ తదితరులు కేజ్రీవాల్‌కు తమ మద్దతు ప్రకటించారు.
ఎన్నో ఆందోళనలు…
ఆవ్‌ు ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఢిల్లీలో విద్యుత్, నీటి రేటు ్ల పెంచడంలో ప్రభుత్వం, ప్రైవేటు కార్పోరేషన్ల మధ్య అక్రమ అనుబంధం చోటు చేసుకుందని ఆరోపిస్తూ ఈ పార్టీ తీవ్రస్థాయిన ఆందోళన నిర్వహిం చింది. లైంగిక వేధింపులకు, అత్యాచారానికి గురైన బాధితులకు పరిహారం చెల్లించాలని, వారికి న్యాయం చేకూర్చాలని, అత్యాచార సంబంధిత చట్టాలను మరింత కఠినం చేయాలని కూడా ఈ పార్టీ ఉద్యమించింది. ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.
ఎన్నో నిరసనలు…
ఈశాన్య ఢిల్లీలో సుందర్ నాగ్రి అనేది దిగువ ఆదాయ వర్గాలు నివసించే కాలనీ. అక్కడ ఓ ఇంట్లో వారికి కళ్ళుతిరిగేలా విద్యుత్ బిల్లు వచ్చింది. ఇలాంటి ఉదంతాలు మరెన్నో చోటు చేసుకున్నాయి. వీటిని నిరసిస్తూ విద్యుత్, నీటి అధిక రేట్ల బిల్లులను చెల్లించ వద్దంటూ ఆప్ పిలుపునిచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండి యాచే ఢిల్లీలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులపై ఆడిట్ చేయించాలని కూడా ఆప్ డిమాండ్ చేసింది. నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ఎన్‌ఏపీఎం) లాంటి సంస్థలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. అన్నా హజారే సూచన మేరకు ఏప్రిల్ 6న కేజ్రీవాల్ తన దీక్షను విరమించా రు. జూన్ 10న ఆయన, ఢిల్లీలో ఆటోవాలాలు చేపట్టిన ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆటోరిక్షాలపై వాణిజ్య ప్రకటనలను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆటోవాలాలు ఉద్యమించారు. ఆటో డ్రైవర్లు తమపార్టీకి మద్దతు పలికి, ఆప్ ప్రకటనలను ఆటోలపై ప్రచారం చేశారని, అందుకే ఢిల్లీ పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
తొలిసారిగా ఎన్నికల బరిలోకి…
ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఆప్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఆవ్‌ు ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ ‘చీపురుకట్ట’ గుర్తును కేటాయించింది. చీపురుతో కుళ్ళు రాజకీయాలను కడిగి పారేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. నవంబర్ 20న ఆప్ తన మేని ఫెస్టో ప్రకటించింది. నేరచరిత లేని అభ్యర్థులను నిలబెడుతున్నట్లు తెలిపింది. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోగా జన్ లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడుతామని హామీ ఇచ్చింది. ఆవ్‌ు ఆద్మీ అభ్యర్థుల్లో ఒకరైన షాజియా ఇల్మి రాజకీయ ప్రయోజనాలను అందిస్తామంటూ భారీ విరాళాలు వసూలు చేస్తున్నారంటూ అప్పట్లో వార్తలు వెలు వడ్డాయి. బరిలోనుంచి వైదొలిగేందుకు ఆమె సిద్ధపడ్డా పార్టీ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆ ఆరోపణలు కుట్ర ప్రరేపితాలని పేర్కొంది. కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టింది.
ఎవరీ కేజ్రీవాల్?
హర్యానాలోని సివాని గ్రామంలో 196 ఆగస్టు 16న జన్మించిన కేజ్రీవాల్ ఐఐటీ (ఖరగ్‌పూర్) గ్రాడ్యుయేట్. గోవింద్ రావ్‌ు కేజ్రీవాల్, గీతా దేవి ఆయన తల్లిదండ్రులు. ఉన్నతస్థాయి కటుంబం. ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజినీర్. కేజ్రీవాల్ బాల్యమంతా కూడా ఉత్తర భారతదేశంలోనే గడిచింది. హిసార్‌లోని క్యాంపస్ స్కూల్‌లో చదివారు. ఆ తరువాత మెకానికల్ ఇంజినీరింగ్ విద్య అభ్యసించారు. మొదట టాటా స్టీల్‌లో పని చేశారు. ఆ తరువాత కొంతకాలం కోల్‌కతా లోని రామకృష్ణ మిషన్‌లో, నెహ్రూ యువ కేంద్రలో తన సేవలు అందించారు. ఆ తరువాత సివిల్స్‌లో ఉత్తీర్ణుల య్యారు. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారిగా ఆయన ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా పని చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసే విషయంలోనూ వివాదం నెలకొంది. సెలవు కాలంలో చెల్లించిన జీతభత్యాలు తిరిగి ఇవ్వా లంటూ ప్రభు త్వం ఆదేశించింది. మొదట్లో అందుకు నిరాకరించినప్పటికీ, ఎట్టకేలకు ఆయన ఆ మొత్తం తిరిగి చెల్లించివేశారు. ఆయన భార్య సునీత కూడా ఐఆర్‌ఎస్ అధికారి. ఒక కుమార్తె, కుమారుడు సంతానం. ఆయన శాకాహారి. ఏళ్ళుగా విపాసనను ఆయన ఆచరిస్తున్నారు.
ప్రతిపాదిత జన్ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో విశేషంగా కృషి చేశారు. సమాచారహక్కు అట్టడుగు స్థాయిలోనూ సమర్థంగా పని చేయడంలోనూ ఆయన కీలకపాత్ర వహించారు. ఇందుకు గాను 2006లో ఆయనకు రామన్ మెగససె అవార్డు కూడా లభించింది. అదే సంవత్సరం ఆయన ఐఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అవార్డు కింద తనకు అందిన మొత్తాన్ని తాను ఏర్పరిచిన పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు కార్పస్ ఫండ్‌గా సమకూర్చారు.
పరివర్తన్
చిన్న చిన్న అంశాలతోనే మార్పు తీసుకురావడం సాధ్యమని కేజ్రివాల్ విశ్వసిస్తారు. 1999లో, ఆదాయపన్ను విభాగంలో పని చేస్తున్నప్పుడే ‘పరివర్తన్’ ఉద్యమానికి ఆయన తన సహాయాన్ని అందిం చారు. 200లో ఇది నకిలీ రేషన్ కార్డుల బాగోతాన్ని వెలికితీసింది. మొత్తం మీద ఇది అంతగా విజయం సాధించలేకపోయింది.
సమాచార హక్కు సాధనలో…
మనీష్ సిసోడియా, అభినందన్ షేక్రిలతో కలసి కేజ్రీవాల్ 2006 డిసెంబర్‌లో పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సమాచార హక్కును ఆయుధంగా చేసుకొని ఆదాయ పన్ను విభాగం, మునిసిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ, ప్రజా పంపిణి వ్యవస్థ, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లలో పలు అవినీతి బాగోతాలను వెలికి తీసింది.
కేజ్రీవాల్ 2012లో తన ‘స్వరాజ్’ పుస్తకాన్ని ప్రచురించారు.
ఎన్నెన్నో అవార్డులు
పలు అవార్డులను కేజ్రీవాల్ పొందారు. పౌరసమాజ సేవలకు గాను అశోక ఫెలో (2004),
్జ ప్రభుత్వంలో పారదర్శకత ప్రచారానికి గాను ఐఐటీ (కాన్పూర్) నుంచి ‘సత్యేంద్ర కె. దూబె’ స్మారక అవార్డు (2005),
్జ రామన్ మెగసెసే అవార్డు (2006), సీఎన్‌ఎన్ ఐబీఎన్ నుంచి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ (2206),
్జ ఎమినెంట్ లీడర్‌షిప్‌కు గాను ఐఐటీ (ఖరగ్‌పూర్) నుంచి డిస్టింగిష్డ్ అలువ్‌ునస్ అవార్డు (2009),
్జ అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్ మెంట్ నుంచి గ్రాంట్, ఫెలోషిప్ (2009),
్జ ఎకనామిక్ టైవ్‌‌సు నుంచి పాలసీ ఛేంజ్ ఏజెంట్ ఆఫ్ ది ఇయర్ (2010),
్జ ఎన్‌డీ టీవీ నుంచి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ (2011)
్జ సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ (2013)
దక్కన్ న్యూస్


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *