ఐ.టి.ఐ. లకు మళ్ళీ ప్రాణం

గత 20 సంవత్సరాలుగా మరుగున పడ్డ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు మళ్ళీ ప్రాణం వచ్చింది. చాలా కాలంగా ఐ.టి.ఐ. అంటే యువతకు నిర్లక్ష్యం ఉండేది. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ ఉద్యోగ నియామక సంస్థలలో ఐ.టి.ఐ. పాసైన వారికి ఉద్యోగాలు రావడంతో ప్రతియేటా ఐ.టి.ఐ. చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఐ.టి.ఐ. లో రెండేళ్ల వ్యవధిలో ఉండే కోర్సులు, ఒక యేడాది వ్యవధిగల కోర్సులున్నాయి. ఎలక్ట్రీషియన్, టర్నర్, మేషనిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్, సివిల్ మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ ఐ.టి. ఇ.ఎస్.ఎం., రేడియో టిలివిజన్‌లు రెండేళ్ళ వ్యవధిగల కోర్సులు. అలాగే డీజిల్ మెకానిక్, వెల్డర్, కోపా, స్టెనోగ్రఫీ, వైర్‌మెన్, న్యాసన్, కటింగ్ సివింగ్, షీట్‌మెటల్ ప్లంబర్, హెల్త్ శానిటరీ ఇన్స్‌పెక్టర్, నీడిల్ వర్క్ మొదలైన కోర్సులు ఒక ఏడాదిలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ నైపుణ్యాలను ప్రత్యక్షంగా కల్పించి వారి జీవితంలో చక్కని ఉపాధి కల్పించడానికి పారిశ్రామిక శిక్షణ సంస్థలు ముందడుగు వేయడంతో నిరుద్యోగులు గంపెడు ఆశలతో ఐ.టి.ఐ. ల ముందు బారులు తీరుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యుత్ ప్లాంట్లు, ఉక్కు పరిశ్రమలు, సింగరేణి, ఆర్.టి.సి., ఇతర డిపార్ట్‌మెంట్‌లలో ప్రతి యేటా 20 వేల మందికి ఉద్యోగాలు లభించడంతో అన్ని కోర్సుల కన్నా ఈ కోర్సుల ద్వారానే జీవితంలో తొందరగా స్థిరపడవచ్చునని నిరుద్యోగ యువతీ యువకులు ఐ.టి.ఐ. ల వైపు మరలుతున్నారు. స్కిల్డ్ లేబర్‌కు, సింగరేణి కాలరీస్, ఇతర పరిశ్రమలలో భారీ ఎత్తున జీతాలు లభించడంతో ఐ.టి.ఐ. చదవడానికి పురుషులతో పాటు మహిళలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో భారీ ఎత్తున ఉద్యో గాలను భర్తీ చేయడంతో ఐ.టి.ఐ. చేసిన వారికి ఎక్కడ లేని డిమాండ్ వచ్చినది.
వివిధ సంస్థలలో కూడా ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేయడంతో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ఐ.టి.ఐ. రంగం పుంజుకుంది. ఐ.టి.ఐ. కోర్సు పూర్తి చేసి అప్రెంటిస్‌షిప్ చేసిన వారికి తొందరగానే ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు ఐ.టి.ఐ. లలో సీట్లకోసం పోటీపడుతున్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐ.లలో తెలం గాణలోని 5వ జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలా బాద్, ఖమ్మం జిల్లాలో 22 ప్రభుత్వ ఐ.టి.ఐ.లు, ప్రైవేటు ఐ.టి.ఐ. లున్నాయి. ఇందులో ప్రభుత్వ ఐ.టి.ఐ. లలో 2966 ప్రైవేటు ఐ.టి.ఐ. 13 వేల సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లు 16 వేలు ఉంటే ఎన్నడూ లేని విధంగా 32 వేల మంది విద్యార్థులు సీట్ల కోసం దర ఖాస్తు చేసుకున్నారు.
ప్రైవేటు ఐ.టి.ఐ.లు అడ్మిషన్లలో అవకతవకలకు పాల్పడుతు న్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తగిన ఫ్యాకల్టీకాని, తగిన ఇన్‌స్ట్రు మెంట్స్‌కాని, తగిన షెడ్స్‌కాని లేకున్నా అనుమతిని అడ్డదారిన పొందు తున్నారని ఆరోపణలున్నాయి. క్లాసులను రెగ్యులర్‌గా నిర్వహించ కుండా పరీక్షల సమయంలో మాస్‌కాపీయింగ్‌కు వీలు కల్పిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎలాంటి షెడ్ వర్క్ అనుభవం లేకపోయినా పరీక్ష లు రాసి పట్టాలు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. క్లాస్‌కు రాకపోయినా హాజరువేసి యాజమాన్యాలు ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. నిపుణులైన శ్రామిక శక్తిని తయారు చేసుకోవాలంటే ఈ విధమైన ఆరోపణలకు తావు లేని విధంగా ఐటీఐ విద్యావ్యవస్థలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
-రావుల రాజేశం,
సెల్: 9411424


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *