కరీంనగర్ జిల్లా బాలసాహిత్యం

తెలంగాణ రాష్ర్టంలో కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉం ది. దీనికి ఎనగందుల, సబ్బీనాడు అను పేర్లు ఉన్నాయి. ఇక్కడి చరిత్ర, సంస్కృతి ప్రాధాన్యత సంతరించుకున్నది.
ప్రాచీన సాహిత్యాన్ని జానపద సాహిత్యం, లిఖిత సాహిత్యంగా వర్గీ కరించారు. జనపదులు లేదా జన సమూహం సృష్టించిన సాహిత్యమే జానపద సాహిత్యం. ఇది మౌఖికం సాహిత్యంలో పిల్లల పాటలు అం తర్భాగం. కరీరనగర్ జిల్లాలో ప్రాచీనం నుండే బాలసాహిత్యం కనబ డుతుంది. జానపద సాహిత్యంలో బిరుదు రామరాజుగారు ‘తెలంగాణ పిల్లల పాటలు’ ‘త్రివేణి’ పిల్లల పాటల పేర్లతో పుస్తకాలు వెలువరిం చారు. ఈ పుస్తకాలలో కరీంనగర్ నుంచి సేకరించిన పాటలున్నాయి. ఈ జిల్లాలో జన్మించినవారు, వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఈ జిల్లాలో స్థిరపడినవారు, కవులు, రచయితలు బాలసాహిత్యం రచించారు. ఇది లిఖిత సాహిత్యం. ‘హితేన సహితం సాహిత్యం’ హితాన్ని చేకూర్చేది సా హిత్యం.
నిర్వచనం :
బాలల కోసం చేసిన రచనలను బాల సాహిత్యమంటారు. ప్రపంచము న ఏ వస్తువైన మొలక రూపమునే పుట్టి పెరిగి పెద్దదగును. ఆ మొల కనే శిశువులు, ఈ మొలకదశనే శిశుదశయని చెప్పవచ్చు. అదే బాల వాజ్ఞ్మయం.
బాల సాహిత్యమంటే పిల్లల ప్రయోజనం కోసం వారి విద్య, విజ్ఞా నాల అభివృద్ధి కోసం, వినోదం కోసం అనుభవజ్ఞులైన కవులు, రచయి తలు రాసిన పుస్తకాలు, పిల్లలు తమ కోసం వ్రాసుకొన్న తేనె చినుకుల వంటి చిలుకపలుకులు కూడా బాల సాహిత్యమే.
డా॥మలయశ్రీ, వేమనకుర్తి, కరీంనగర్ జిల్లా
నవమాసములు మోసి మరణవేదననుభవించి పునర్జన్మనుపొంది కన్న సంతానమును కన్నుల పండుగగా చూసిన పిదప ఆమెలో ఆనం దాతిరేఖను మాటగా, పాటగా వచ్చుట సహజం. ఇదియే లాలిపాటల కును మూలమైనదని చెప్తారు. బాల సాహిత్యమంటే ఎండకాలంలో నిప్పులు చెరిగే ఎండకాదు, రోడ్డుమీద రేచుకుక్కల కొట్లాట కాదు. బా ల సాహిత్యం వరిపిండి ఆరబోసినట్లు హాయిగా కనిపించే వెన్నెల బాల సాహిత్యం.
డా॥ జనపాల శంకరయ్య, ఆవునూరు, కరీంనగర్ జిల్లా
పిల్లలు తమ కోసం రాసినవి పిల్లలు కోసం పెద్దలు రాసినవి అట లు, పాటలు, పని, పాట్లు, నవ్వులు, పువ్వులు, మంకు, గొంకు, లాలీ, జోల, ఉపకారం, ఉత్సాహం, హాయి, రేయి, అందం, అనుభూతులతో కలబోసుకున్నవి. ముఖ్యంగా బాలల ప్రయోజనం కోసం, బాలల సం పూర్ణ మానసిక వికాసం కోసం ఆనందపరిచే విధంగా రాసే సాహిత్య మే బాల సాహిత్యం. వాసరవేణి పరశురాం, సింగారం, కరీంనగర్
బాల సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలున్నాయి. వీటిని విభా గాలుగా చెప్పవచ్చు. కవితలు, పద్యాలు, కథలు, నవలలు, సైన్స్ వి జ్ఞాన విషయాలు, నాటికలు, నాటకాలు, చరిత్రలు, వ్యాసాలు, సం కలనాలు మొదలగునవి.
1.పద్యాలుకవితలు :
పూర్వకాలం నుండి పద్యాలు, కవిత్వం పిల్లలను అలరిస్తూ నీతిని బో ధిస్తున్నాయి. పద్యప్రక్రియల్లో కరీంనగర్ జిల్లాలో ప్రాచీనం నుండే శత కాలు సృజించబడినట్లు ఆధారాలున్నాయి. పిల్లల కొరకు నీతి శతకా లు రచించారు. మడికి సింగన రాసిన ‘సకలనీతి సమ్మతం’, వెలిగం దల కందనామాత్యుడు ‘నీతితారావళి’, వెలిగందుల నారాయణ‘మహా భాగవత ఏకాదశ ద్వాదశ స్కంధాలు’ చరికొండ ధర్మన‘చిత్ర భార తం’, వేములవాడ భీమకవిచాటు పద్యాలు, శరబాంక కవిశరబాం క లింగశతకం, శేషప్పనరసింహ శతకాలు మొదలగు చారిత్రక విషయాలు, నీతులను బోధిస్తున్నాయి.
సబ్బని లక్ష్మినారాయణబతుకుపదాలు, జూకంటి జగన్నాథం తారం గం, ఆచార్య రావికంటి వసునందన్‌బాల బ్రహ్మం, మెరుపు పెరిస్తే’ లు, కందేపి రాణిప్రసాద్‌హరివిల్లు, పూలతోటలు, వెంగల లక్ష్మణ్ లచ్చుమన్న పదాలు, ఆంకాలపు వీరేశంపాడవే కోయిల, గర్షకుర్తి శ్యామల ‘పాపనవ్వింది’, కనిపించే దైవాలు’, నాగుల చిన్నయ్య ‘స త్యవాణి’, హృదయతరంగిణి కవితలు, నమిలికొండ జగన్నాథ రావు కవితా గీతాంజలి, కవితా దర్పణం కవితలు, గరిపెల్లి నవీన్ ‘మొలక’ మొదలగు సాహిత్యం పిల్లలకు సుబోధకరంగా ఉన్నాయి.
2.పాటలు లేదా గేయాలు :
తెలంగాణలో పాటలన్నా, గేయాలన్నా ఒకే విధంగా భావిస్తారు. క రీంనగర్ జిల్లాలో పిల్లల కోసం రాసిన గేయాలు లేదా పాటలు అత్య ధికంగా కనిపిస్తున్నాయి.
1. మలయశ్రీ: 1974లో రాసిన రంగుల పిట్టలు, ఆధునిక కాలంలో జిల్లాలోని మొదటి బాసాహిత్య పాటల పుస్తకం. వీరు ‘బంగారు బొ మ్మలు’, ‘తేనె చినుకులు’, ‘చుక్కల లోకం’, ‘పల్లె సీమ’ మొదలగు 26 పైన బాలసాహిత్య గ్రంథాలు రాశారు.
2. రేగులపాటి కిషన్‌రావు: ‘ప్రగతి పాటలు’, ‘కొత్తపాటలు’, ‘మల్లె మొ గ్గలు’ రాశారు. వీటిలో పిల్లలకు సంబంధించిన రచనలే అధికం.
3. రేగులపాటి విజయలక్ష్మి: ఈ రచయిత్రి కిషన్‌రావు సతీమణి. ‘పరి ష్కారం’, ‘అంతరించిన ఆదర్శాలు’ రచించగా వీరి బాలగేయాలు, పిల్ల ల కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. చిన్నచిన్న తోట బాల గేయం గులాజీ పుస్తకంలో ప్రచురించబడింది.
4. గర్షకుర్తి రాజేంద్ర: విలాసాగరానికి చెందినవారు. ‘హృదయాన్వేష ణ’, ‘కవితాలత’ కవితా సంపుటాలు. ‘బాలసాహిత్య గేయమాల’ భక్తి నీతి గ్రంథాలు రచించారు.
5. వడ్డేపల్లి కృష్ణ: సినీగేయాలెన్నో రచించారు. పిల్లల కోసం ‘‘చిఱు గజ్జెలు’’ పుస్తకం రాయగా 1993లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు పొందింది.
6. వేదాంత సూరి: పిల్లల కోసం 16 పుస్తకాల వరకు రాశారు. బాల సాహిత్యంకు చెందినవే ఎక్కువ. వార్త పత్రికలో ‘మొగ్గ’ శీర్షిక ద్వారా ఎంతో మంది బాలసాహిత్యకారులను ప్రోత్సహిస్తూ ప్రపంచానికి పరి చయం చేశారు.
7. ఎర్రోజు సత్యం: పిల్లల కోసం ‘పిల్లల పాటలు2 విభాగాలు’, ‘బా లలోకం’ గేయాలు 196లో సాహితి కిరణాలు, కవితలు, కథలు, సూక్తులు రచించారు.
. డా॥ ఎర్రోజు ఆదినారాయణ: వైద్యవృత్తిలో ఉన్నప్పటికీ పిల్లల కోసం ‘పసివాడి పలుకులు’ 1994లో రాశారు. తెలుగు సామెతలు ర చించారు.
9. ఎస్. వెంకట్రాది: ఉపాధ్యాయులుగా పనిచేసి 192లో ‘బాలవిజ్ఞాన వినోదిని’ పుస్తకం రాశారు. ఇది పెద్ద బాలశిక్షను పోలి ఉంటుంది.
10. ఖుర్షీద్‌లీ బేతాబ్: పెద్దపల్లికి చెందినవారు. ఉర్దూలో రచనలు చే శారు. నాటక రచయిత. ‘పువ్వులు’బాలాకవితా సంకలనం, బాలల గే యాలు రచించారు.
11. డా॥ సి.నారాయణరెడ్డి: హనుమాజిపేటకు చెందినవారు. సినీ గేయాలెన్నో రచించారు. ‘లాలి’పాటను, తోటపల్లి గేయం మొ॥ పిల్లల పాటలెన్నో రచించారు. వీరి ‘ప్రపంచపదులు’ పిల్లలకు విజ్ఞానదాయ కంగా ఉపయోగపడుతుంది.
12. కె.శ్రీహరి: అధ్యాపకులుగా పనిచేశారు. వీరిది ఇందుర్తి. ‘బాలల పాటలు’ అను పేరుతో 1996లో పుస్తకం రాశారు.
13. జె.బాపురెడ్డి: వీరు కలెక్టర్‌గా పనిచేశారు. వీరు పిల్లల కోసం ‘బా పురెడ్డి గేయాలు’, 2000 సంవత్సరంలో ‘ఆటలు పాటలు’ వెలువరిం చారు. ప్రగతి పాటతోట, ‘బాలహేల’ మొదలగు అనేక గ్రంథాలు పిల్ల లకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి.
14. మంగలంపల్లి సత్తయ్య: ‘గాంధీ జీవితకథ’ గేయం రాశారు. 19 95లో ‘స్వేచ్ఛా స్మృతి’, బాలగేయాల సంపుటి రాశారు. ‘సాయి శత కం’, ‘ముద్దుచెల్లె’ శతకాలు రాశారు.
15. మేడిశెట్టి రామచంద్రం: వీరు 19లో ‘అభినయ గేయాలు’ ప్ర చురించారు.
16. వాసాల నర్సయ్య: వీరు బాలసాహిత్యంలో అమితమైన కృషి చే శారు. తపాల ప్రపంచం, వాసాల బాలగేయ సుమాలు మొ॥ రాశారు.
17. డా॥నలిమెల భాస్కర్:‘ఈతరం పాటలు’ పుస్తకాన్ని డా॥నలిమెల భాస్కర్, ఎర్రోజు సత్యం, వేముల సత్యనారాయణలు కలిసి వెలువరిం చారు. నలిమెల భాస్కర్ 14 భాషల కోవిదులు. ‘తెలంగాణ పదకోశం’ ఇది ఆధునిక తెలంగాణ మొదటి నిఘంటువు. కథలు, నవలలు ఎన్నో రచించారు. వీరి రచనల్లో బాలల మనస్తత్వం కనబడుతుంది.
1. పత్తిపాక మోహన్: వీరు పిల్లల కోసం ‘చందమామ రావే’ బాలల గేయాల పుస్తకం రాశారు.
19. వాసరవేణి పరశురాం: వీరు సింగారం గ్రామానికి చెందినవారు. 12 సంవత్సరాల బాల్యం నుండే రాసిన పాటలను 2001లో ‘చుక్ చుక్ రైలు’ పాటల సంపుటిగా వెలువరించారు. 2006లో చల్ చల్ గుఱ్ఱం పాటల సంపుటిరాగా ఇంకా చిఱ్ఱగోనె, చెట్టెరిక పిల్లల పాటల సంపుటాలు అముద్రితంగా ఉన్నాయి. వీరు ఉస్మానియా విశ్వవిద్యాల యంలో ‘ఈ దశాబ్ది బాలసాహిత్యం (20012010)ఒక పరిశీలన’ అను అంశంపై పరిశోధన చేస్తున్నారు.
20. కందేపి రాణిప్రసాద్: వీరు బాలలకోసం రాసిన పూలతోట, హరి విల్లు, నెలవంక పుస్తకాల్లో కవితలతోపాటు బాలల గేయాలున్నాయి.
21. కోండ్ల రామచంద్రం: బెజ్జంకికి చెందినవారు 2005లో ‘బాల చంద్రిక’ పిల్లల గేయ సంపుటి రాశారు. బాల సాహిత్యంలో పరిశోధన చేస్తున్నారని తెలిపారు.
22. దూడం నాంపల్లి: ‘పాటల పల్లకి’ పుస్తకంలో బాలలకు చెందిన అనేక పాటలున్నాయి.
23. ఎవ్‌ు. జోత్స్నారాణి: వీరు ‘ఆకాశదీపాలు’ బాలల గేయాల పుస్తకం రాశారు. ‘పూలు’ ‘అయితే’ లాంటి మున్నగు బాలల గేయాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
24. ఆడువాల సుజాత: ‘వినురా’ ‘ఓ చిట్టినాన్న’ పిల్లల పాటలు, కవి తలు, వ్యాసాలు, పాటలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
25. ఎనుగంటి మల్లేశం: వీరు ఉపాధ్యాయులు. 2006లో ‘పాఠశాల సందర్భోచిత బాలల గేయాలు’ వెలువరించారు. 2009లో ‘బాల మువ్వలు’ గ్రంథం పిల్లల కోసం రాశారు.
26. రామంచ కుమార్: వీరు హుస్నాబాద్‌కు చెందినవారు. ‘బాల గీతా లు’ రాశారు. ‘సెలయేరు’,‘వెలుగు రేఖలు’ పుస్తకాలు వెలువరించారు.
27. మాడిశెట్టి గోపాల్: వీరు బాలలకోసం రాసిన ‘శతవసంతాల గీ తం’, ‘సిపాయిల తిరుగుబాటు’ గీతాలు విద్యార్థులచే అభినయం చే యించారు.
2. దుంపెన రమేష్: వీరు 2014 సం॥లో ‘చిగురు’ వుస్తకం రచిం చారు. ఇది తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్క రించబడినది. ఇందులో పిల్లలకు ఉపయోగపడే పాటలు, కవితలు, వ్యాసాలు, సూక్తులున్నాయి.
29. నమిలికొండ జగన్నాథవ రావు: ‘పిల్లలం పిడుగులం’ ‘అమ్మంటే’, పిల్లల గేయాలు గోగుపూలలో ప్రచురించబడ్డాయి.
30. వొటొరి చిన్నరాజన్న: వీరు ‘అమృతగీతాలు’ ‘వొటొరి శతకం’ పిల్లలకు నీతిని బోధిస్తాయి. ‘బాలకేళి’ గేయం గోగుపూల పుస్తకంలో ప్రచురించబడింది.
31. పిన్నంశెట్టి వసుంధర: వీరు తండ్రి గేయాలతోపాటు రాసిన గే యాలను ‘బాలగేయ సుమాలు’ ప్రచురించారు. కవితలు, గేయాలు, వ్యాసాలు రాశారు.
32. ఎర్రోజు ప్రవీణ్‌కుమార్ : ‘విద్యాజ్ఞానం’ ‘దేవుడు’ బాల గేయాలు రాయగా గోగుపూలు, గులాబీల పుస్తకంలో ప్రచురించబడ్డాయి.
33. ఎర్రమరాజు భూపతిరాజు : ‘పర్యాటక బస్సు’ గేయం గులాబీలు పుస్తకంలో, ‘దోమ’ గేయం గోగుపూల పుస్తకంలో ప్రచురించబడ్డాయి.
34. వడ్నాల వెంకటేశ్: వీరు రాసిన ‘మానేరు గేయాలు’ పుస్తకంలో కొన్ని పిల్లల గేయాలున్నాయి.
35. ఎర్రోజు పవన్‌కుమార్: ‘అక్షరాలు యాభైయారు’ గేయం గులాబీ పుస్తకంలో, ‘నిస్వార్థసేవ’ గేయం గోగుపూల పుస్తకంలో ప్రచురించబ డ్డాయి.
36. వెంగళి నాగరాజు: వీరు సామాజిక చైతన్య గేయాలు రాయగా అవి పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. పిల్లల కోసం ‘పిల్లలం పిల్లలం’ లాంటి పదివరకు పాటలు రాశారు. అముద్రితంగా ఉన్నాయి.
37. కట్టా వేణు: వీరు అధ్యాపకులు. వీరు రాసిన ‘తీరొక్క పువ్వు’ పిల్ల లకు ఉపయోగపడే విధంగా ఉంది. సుమారు 15 పిల్లల పాటలు అముద్రితంగా ఉన్నాయి. వీరు లొత్తునూరు గ్రామానికి చెందిన వారు.
3. పెరుమాండ్ల రాజయ్య: పిల్లల కోసం కవితలు, పాటలు రాశారు. వీరు ఇంగ్లీష్ అధ్యాపకులు. పిల్లలకు వివిధ రచయితలు రాసిన పా టలు, కథలు ప్రత్యేకంగా తరగతి గదిలో పిల్లలకు బోధిస్తున్నారు. ‘బా లలం మేమందరం’ ‘స్నేహం’ మొదలగునవి పిల్లల పాటలను రాశారు. వీరు దుమాల గ్రామానికి చెందినవారు.
3. కథలు నవలలు :
1. డా॥పి.యశోదరెడ్డి: పల్లె జీవితాలను, సంస్కృతిని పిల్లల మనస్సుల ను చక్కగా కథల్లో చిత్రించారు. 1960లో ‘నక్కబావ’, ‘బడిపెద్ద’, ‘బూ చిగాడు’ పిల్లల కథలు రాశారు. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసింది. వీరి ‘ఎచ్చమ్మ కథలు’ చాలా ప్రసిద్ధి పొందాయి. పిల్లలను ఆలోచింపజేస్తాయి.
2. డా॥ సి.నారాయణరెడ్డి: పిల్లల బొమ్మల పురాణ పుస్తకాలు మూడు రాశారు. డా॥దాశరథి సహరచయితగా ఉన్నారు. 1. పిల్లల బొమ్మల భారతం, 2. పిల్లల బొమ్మల రామాయణం, 3. పిల్లల బొమ్మల భాగ వతం వ్యాప్తిలో ఉన్నాయి. ఇవి సరళంగా సుభోధకరంగా ఉన్నాయి.
3. మలయశ్రీ: వీరు పిల్లల కథలు, జీవిత చరిత్రలు, సైన్సు పుస్తకాలు, లోక విజ్ఞానం, పుస్తకాలు పిల్లల కోసం ఎక్కువగా రచించారు. 192 లో సరదా కథలు రాశారు. వీరు రాసిన కథలు రఘువీర్‌సింగ్ బాల సాహిత్య పత్రిక ‘బాలలమందిరం’లో ప్రచురించబడ్డాయి.
4. ఎర్రోజు సత్యం: వీరు ‘బాలసాహితీకిరణాలు’ గ్రంథంలో బాలనీతి కథలు రాశారు. ‘పాపం సుబ్బారావు’, ‘బుద్ధిచెప్పిన పాలేరు’, ‘మూర్ఖు లు’, తాతగారు చెప్పిన మంచి మాటలు మొదలగు కథలున్నాయి.
5. వాసాల నర్సయ్య: బాలల బొమ్మల కథలు, చిట్టిపొట్టి కథలు, కథల కదంబం, స్ఫూర్తి కథలు, పొడుపు కథలు, విజ్ఞాన పొడుపుకథలు మొదలగునవి రాశారు.
6. ఆడెపు లక్ష్మీపతి: ‘జీవన్మృతుడు’, ‘తిర్యగ్రేఖ’ మొదలగు కథలు రాశా రు. నేషనల్ బుక్ ట్రస్టు బాలల పుస్తకాలు వివిధ భాషల్లో నుండి తెలు గు లోనికి అనువాదం చేశారు.
7. చాడా లక్ష్మినారాయణ: వీరు 1991లో ‘కాశీయాత్ర’ బాలనీతి కథల సంపుటి రాశారు.
. గర్షకుర్తి శ్యామల: పిల్లల కోసం అనేక కథలు రాశారు. ‘పాప కోరి క’, ‘పరోపకారం’ మొదలగునవి. ‘పొడుపు కథలు’, రంగురంగు పిట్ట లు గేయం, ‘బడుల జాతర’ గేయాలు వెలువరించారు.
9. డా॥బి.దామోదర్‌రావు: వీరి ‘కథలు కథలుగా’ ప్రచురణ పొందిం ది. జానపద విజ్ఞానం పుస్తకాలు వెలువరించారు.
10. డా॥పత్తిపాక మోహన్: వివిధ భాషల్లోని కథలు తెలుగులోకి అను వాదం చేశారు. వీరు నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సంపాదకులుగా వ్య వహరిస్తున్నారు. వీరు ‘ముత్తుకలలు’ తోకలు, మంచి విత్తులు, టిప్పు సుల్తాన్, ప్రాణ స్నేహితులు మొ॥వి తెలుగులోనికి అనువదించారు.
11. ఎనుగంటి గోపాల్: పిల్లల కోసం ‘పసిడి పలుకులం’ లాంటి గే యాలు, పిల్లల కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వీరి ‘అమ్మ నాన్న’ పిల్లలకు సుబోధ గ్రంథం.
12. ఆచార్య రావికంటి వసునందన: వీరు అంబేద్కర్ విశ్వవిద్యాల యంలో ప్రొఫెసర్. కమలాపూర్‌కు చెందినవారు. ‘బాలజ్యోతులు’, ‘నా రీమణులు’ బాలల కథా గ్రంథాలు రాశారు.
13. పుల్లూరి జగదీశ్వరరావు: 30కి పైగా పిల్లల కథలు రాశారు. ఇవి ఆంధ్రజ్యోతి, వార్త మొగ్గలలో ప్రచురించబడ్డాయి.
14. పి.స్వాతి: చెట్ల బూత్కుర్‌కు చెందిన విద్యార్థిని. ఆంధ్రజ్యోతి ఎ మ్మెస్కో పిల్లల కోసం రాసిన కథల పోటీలలో తెలంగాణ సీనియర్ వి భాగంలో ‘గుడ్డి భిక్షగాడు’ కథ బహుమతి పొందింది.
15. బి.పద్మ, జి.సౌమ్య: గుండారంకు చెందిన పద్మ విద్యార్థిని రాసిన ‘నాలుగుతోకల ఎలుక’, కోరుట్లపేటకు చెందిన సౌమ్య విద్యార్థిని రాసి న ‘ముందుచూపు’ కథలు, కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ సంపాదకత్వం వహించిన బండలింగంపల్లిలోని ‘గుండ్ల చెఱువు’ పిల్లల పత్రికలో ప్రచురించబడ్డాయి.
16. వాసరవేణి పరశురాం: వీరు ప్రత్యేకంగా పిల్లల కోసం ‘గొర్రెపిల్ల’, ‘ముసలవ్వ బతికింది’ , ‘తుకమలుకుడు’, ‘కర్రెద్దు’, ‘పరికిపండ్లు’ మొ దలగు కథలు రాయగా వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
17. బారధన్‌రాజ్: ‘సంటిపిల్లగాడు’ కథలో పిల్లల మనస్తత్వాన్ని, జీవి తాన్ని ఆవిష్కరించారు.
4. చరిత్రలు, జీవిత చరిత్రలు సైన్స్ విజ్ఞాన పుస్తకాలు :
1. మలయశ్రీ: పిల్లల కోసం అనేక సంక్షిప్త జీవిత చరిత్రలు రచించా రు. ఇవి 1990లో బొమ్మలతో ప్రచురించబడ్డాయి. 1.భగత్ సింగ్ 2. చంద్రశేఖర్ ఆజాద్ 3.యశ్పాల్ 4.అల్లూరి సీతారామారాజు, 5. డా॥ బి. ఆర్. అంబేద్కర్, 6.సుభాష్ చంద్రబోస్, 7. యోగి వేమన, . జయప్రకాష్ నారాయణ, 9. రాజారావ్‌ు మోహన్ రాయ్, 10. భగవతీ చరణ్ మొదలగు పుస్తకాలు నవరత్న బుక్ సెంటర్ విజయవాడ వారు ప్రచురించారు. అలాగే సైన్స్ పుస్తకాలు రచించగా 1990లో ప్రచురిం చబడ్డాయి. 1.మన శరీరం పరిరక్షణ, 2. మన ఆహారంఆరోగ్యం, 3. విశ్వంభర జన్మరహస్యం అలాగే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు 1.విజ్ఞాన దర్శిని, 2.లోకజ్ఞానం మొదటి భాగం, లోకజ్ఞానం రెండవ భాగం, అదే విధంగా మలయశ్రీ కరీంనగర్ జిల్లా తెలుగుసాహిత్య చరిత్ర (19 901995) పిల్లలకు కవుల గురించి చరిత్ర తెలుపుతుంది.
2. వావిలాల భూపతిరెడ్డి: వీరు ‘కరీంనగర్ శతవసంతాల చరిత్ర సంస్కృతి’ (19052005) పుస్తకం వెలువరించారు. పిల్లలకు విషయ పరంగాను, జనరల్ నాలెడ్జ్ పరంగాను ఉపయోగపడుతుంది.
3. కాలువ మల్లయ్య: కాలువ మల్లయ్య సంపాదకులుగా పార్థసారథి ఐఎఎస్ ప్రధాన సంపాదకులుగా, మాడిశెట్టి గోపాల్, అన్నవరం దే వేందర్ సహ సంపాదకులుగా 2005లో ‘మానేటి’ కరీంనగర్ శత వసంతాల సంచిక (19052005) పుస్తకం వెలువడింది. ఇది విద్యా ర్థులకు ఉపయోకరంగా ఉంది.
4. వేదాంత సూరి: ‘మధురమైన మా బాల్యంప్రముఖుల జ్ఞాపకాలు’ పుస్తకం 2013లో వెలువరించారు. పిల్లలకు విజ్ఞానదాయకంగా ప్రేర ణగా ఉపయోగపడుతుంది.
5. కందేపి రాణిప్రసాద్: 2004లో శాస్త్రవేత్తల సంక్షిప్త జీవితాలను ‘సైన్స్‌పాంట్’ పుస్తకంలో పరిచయం చేసి వెలువరించారు.
6. వారాల ఆనంద్: బాలల చిత్రాలు 1999లో ప్రచురించారు. చిల్డ్రన్ సినిమా, సినీ సుమాలు, 24 ఫ్రేం పుస్తకాలు, ‘వారానందం’ పేరున వ్యాసాలు రచించారు.
7. ఎస్.వెంకట్రాది: 1990లో ‘మహాభయంకర మరణాస్త్రాలు’ రాశా రు.
. ఎస్.హర్షనర్థన్: 1990లో ‘ఆకాశయానం’ రాశారు.
9. జైన శ్రీనివాస్: 1990లో విజ్ఞానజ్యోతి పేరున సంగ్రహ విజ్ఞాన పుస్తకాన్ని ప్రచురించారు.
10. వాసాల వంశీధర్: వీరు ‘కార్డులుకబుర్లు’ రాశారు. ఇది విజ్ఞాన వ్యాస సంపుటి గ్రంథం. వీరి బాలగేయాలు, ‘గోగుపూలు’ వివిధ పత్రి కల్లో ప్రచురించబడ్డాయి.
11. వాసాల నర్సయ్య: ‘తెలంగాణ బాలసాహిత్య రచయితలు రచ యిత్రులు’ సంక్షిప్త జీవిత పరిచయం
5. వ్యాసాలు :
జిల్లాలోని రచయితలు పిల్లల కోసం రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
1.రేగులపాటి కిషన్‌రావు 199లో ‘వ్యాసమంజరి’ ప్రచురించారు. 2.మలయశ్రీ రాసిన మంత్రాలు! మాయలు?, మత విశ్వాసాలు, సైన్స్ సత్యాలు, సామెతలుహేతువాదం మొదలగునవి విజ్ఞానానికి సంబం ధించిన వ్యాసగ్రంథాలు. 3.వేదాంతసూరి రాసిన ‘మిమ్మల్ని మీరు జ యించడమెలా?’ పిల్లలు మంచి విద్యార్థులు కావాలంటే ‘పిల్లలు మీరె లా ఉండాలి’ ‘అమ్మలోకం’ మొదలగు వ్యాస పుస్తకాలు. 4.వాసాల న ర్సయ్య రాసిన ‘సంకెళ్లు’ ‘అనాచారాలుఅనర్థాలు’ మొ॥వి.5. పత్తిపాక మోహన్ రాసిన ‘పిల్లల కోసం మన కవులు’.6.కందేపి రాణి ప్రసాద్ రాసిన ‘బ్యామా ఎక్కడ నీ చిరునామా’, 7.కందేపి సృజన్‌స్వాప్నిక్ రాసిన ‘లిటిల్ హార్ట్స్, .బి.దామోదరరావు రచించిన ‘తెలంగాణ కవు లు’ ‘మన గ్రామీణ క్రీడలు’ మొ॥ వ్యాసాల సంపుటి గ్రంథాలు.
6. సంకలనాలు :
జిల్లాలో పిల్లలను ప్రోత్సహించడానికి, మానసిక వికాసాన్ని పెంపొం దించడానికి సంకలనాలు వెలువరించారు.
1. కరీంనగర్‌లో తొలుతగా కనిపించే సంకలన గ్రంథం మడికి సిం గన రాసిన ‘సకలనీతి సమ్మతం’
2. 1979లో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అరుణోద య కళానికేతన్ పెద్దపల్లివారు ఆర్. బాలప్రసాద్ సంపాకత్వంలో ‘పు వ్వులు’ పిల్లల కవితలు, గేయాలతో సంకలనం ప్రచురించారు. ఇందు లో మలయశ్రీ, చొప్పకట్ల చంద్రమౌళి, కె.వి. సంతోష్‌బాబు, గొట్టిపర్తి యాదగిరి, వెల్పుగొండ రామచంద్రాగౌడ్, కె.రాజకిషన్‌ల గేయాలు న్నాయి.
3. 1993లో కరీంనగర్ బాల వికాస సమితి వ్యవస్థాపకులు వావిలాల భూపతిరెడ్డిగారు మలయశ్రీ సంపాదకత్వంలో ‘బాల వికాస గేయాలు’ సంకలన గ్రంథం వెలువరించారు. ఇందులో సినారె, జె. బాపురెడ్డి, మ లయశ్రీ, ఎస్.వెంకటాద్రి, డా॥బి.దామోదర్‌రావు, లక్ష్మణ్‌రావు, జి.వి. కృష్ణమూర్తి, భూపతిరెడ్డి, ఎ.హరికిషన్‌రావు, దూడం నాంపల్లి, సబ్బని లక్ష్మినారాయణ, బి.రాంబాబు మొదలగు వారి గేయాలున్నాయి.
4. వాసాల శౌరి సంపాదకత్వంలో శుభోదయ పాఠశాల సంచిక వెలు వరించారు. చిటపట చినుకులు, బుజ్జాయి గేయాలు వీరు రాశారు.
5. వాసాల నర్సయ్య: బాల సాహిత్యంలో విశేష కృషి చేస్తూ వీరు మూ డు బాల సంకలన గ్రంథాలు వెలువరించారు. 2010లో ‘తెలంగాణ లో బాలసాహిత్య రచయితలురచయిత్రులు’ 2011లో ‘గోగుపూలు’ 2013లో ‘గులాబీ’ ఇందులో ఒకటి బాసాహిత్య రచయితల సంక్షిప్త పరిచయం. మిగిలినవి బాలసాహిత్యకారులు రాసిన కవితలు, గేయా లు, పొడుపుకథలకు సంబంధించినవి. 2014లో మరొక బాలల గేయ సంకలనం. ఎల్లారెడ్డిపేట హైస్కూల్ పిల్లల సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగంగా మంజువాణి పత్రికను వెలువరించింది.
7. నాటికలు నాటకాలు:
కరీంనగర్ జిల్లాలో రచయితలు నాటికలు అనేకం రచించారు. పిల్లల కు సంబంధించినవి తక్కువే కాని పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉ న్నాయి.
1. డా.సి.నారాయణరెడ్డి ‘భలే శిష్యులు’ రాయగా ఇది అలభ్యం. మరొకటి ‘శిథిల శీల’ నాటిక
2. జె.బాపురెడ్డి ‘బాబురెడ్డి గేయనాటికలు’ రాశారు.
3. గర్షకుర్తి రాజేంద్ర 1991లో ‘నీతికి నీరాజనం’ నాటిక రాశారు.
4. ఖుర్షీద్ బేతాబ్ ‘జాతీయ పొదువు’ నాటిక రాశారు.
5. వాసరవేణి పరశురాం: ‘అక్షరాలు నేరుద్దాం’ ‘మూఢ నమ్మకాలు వీడండి’, ‘పచ్చదనంపర్యావరణం’ ‘మహనీయులను కించపరుచరా దు’ మొదలగు నాటికలు రచించి విద్యార్థులచే ప్రదర్శింప జేశారు.
6. వాసాల శౌరి నాటికలు రచించారు. అలభ్యం
7. పి.హైమావతి ‘సోమరి’, ‘పొదువు’ ‘వందేమాతరం’ ‘సమాజ స్వ రూపం’ ‘నకిలీ డాక్టర్’ ‘పసిడి బాల’ ‘అమ్మ’ మొదలగు బాలలకు సం బంధించిన నాటికలు రాశారు.
. బాల సాహిత్య పత్రికలు:
కరీంనగర్‌లో బాలసాహిత్య పత్రికలు వచ్చినవి, నడిపారు. కొన్ని మధ్య లో ఆగిపోయినవి.
1. 1970లో ప్రభాకర్‌గారు ‘విద్యార్థి’ పత్రికను ప్రారంభించి నడిపారు, ఆగిపోయింది.
2. బి. రాజవీరుగారు ‘బాలలోకం’మాసపత్రికను నడిపారు.
3. బి.రఘువీర్‌సింగ్ 1991లో ‘బాల మందిరం’ సచిత్ర మాసపత్రికను నడిపారు.
4. వావిలాల భూపతిరెడ్డి ‘బాలవెన్నల’ పత్రికలను 1992 నుండి న డుపుతున్నారు. పిల్లల వికాసానికి తోడ్పడుతున్నారు.
5. ప్రముఖ తెలంగాణ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ సిరిసిల్ల ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట బండలింగంపల్లి గ్రామంలో ‘గుండ్ల చెఱువు’ పిల్లల వార పత్రికను 2007లో ప్రారంభించి 200 వరకు నడిపారు. పిల్లల కథలు, గేయాలు, వ్యాసాలు, కవితలు రాశారు.
6. ముస్తాబాద్ మండల హైస్కూల్లో గరిపెల్లి అశోక్ రచయిత సంపా దకత్వంలో ‘జామపండు’ పేరిట పిల్లల గోడపత్రిక నిర్వహిస్తున్నారు. పిల్లల కవి సమ్మేళనం పెట్టి పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు.
7. వేదాంతసూరి ‘మొలక’ పత్రికను 201314లో ప్రారంభించారు.
ఇంకా కరీంనగర్ జిల్లాలో బాలల కోసం కవులు, రచయితలు, వి ద్యావేత్తలు కాకుండా జిల్లా గ్రంథాలయాల శాఖ, గ్రంథాలయ వారో త్సవాలు నిర్వహించి పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి పిల్లల వికాసానికి తోడ్పడుతున్నాయి.
ఈ వ్యాసరచయితగా, ‘ఈ దశాబ్ధి బాలసాహిత్యం (200120 10) ఒక పరిశీలన అను అంశంపై పరిశోధనలో భాగంగా సేకరించి న పుస్తకాలు. చదివిన, నాకు తెలిసిన మేరకు అందుబాటులో ఉన్న మేరకు ‘కరీంనగర్ జిల్లా బాల సాహిత్యం’లో చేర్చాను.
ఆధార గ్రంథాలు:
1.కరీంనగర్‌జిల్లా సాహిత్యచరిత్ర, చుక్కలలోకం, పల్లెసీమమలయశ్రీ
2. బాల వెన్నెల పత్రికలు, బాలవికాస గేయాలు, కరీంనగర్ శతవ సంతాల సంచికవావిలాల భూపతిరెడ్డి
3. గోగుపూలు, గులాబీలు, తెలంగాణ బాలసాహిత్య రచయితలు రచయిత్రులు వాసాల నర్సయ్య
4. చుక్‌చుక్ రైలు, చల్‌చల్ గుఱ్ఱం, చిఱ్ఱగోనె వాసరవేణి పరశురాం
5. పూలతోట, హరివిల్లు, నెలవంక కందేపి రాణిప్రసాద్
6. చందమామరావే, పిల్లలకోసం మన కవులుడా॥పత్తిపాక మోహన్
7. ఆచార్యదేవోభవ శతకం, తెలుగు లంబాడీల గేయ సాహిత్యండా॥ జనపాల శంకరయ్య
. మధురమైన మా బాల్యం, మిమ్ముల్ని మీరు జయించడమెలా ? వేదాంత సూరి
9. తెలంగాణ కవులు, మన గ్రామీణ క్రీడలు, ఈ సామెత మీకు తె లుసా ? డా॥బి.దామోదర్‌రావు
10. సాహితీ కిరణాలు, బాలలోకం ఎర్రోజు సత్యం
వాసరవేణి పరశురాం
కరీంనగర్ జిల్లా
సెల్. 9492193437


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *