కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు

’ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన మట్టి మనుషులు చిత్రం తెలంగాణ గ్రామీణ వలస కార్మిక జీవితానికి అద్దం పట్టేలా ఉందని వక్తలు అన్నారు. తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వ ర్యంలో హిమాయత్‌నగర్‌లోని దక్కన్ అకాడమీలో వారం వారం జరిగే చర్చలో భాగంగా 2015 నవంబర్ 14న 200వ చర్చగా ‘మట్టి మను షులు’ చిత్రంపై చర్చా గోష్ఠి జరిగింది. కె.ముఖర్జీ, యం.వేదకుమార్ నిర్మాణసారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆనాటి సామాజిక విలువ లను చిత్రీకరించిందని వక్తలు అన్నారు. అర్చన, మోహిన్ అలీ బేగ్, నీ నా గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎ.కె.బీర్ సినిమాటోగ్ర ఫీ అందించారు. భవన నిర్మాణకూలీల జీవితాలు ప్రధాన కథాంశం గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం డిప్లొమా ఆఫ్ మెరిట్ అవార్డును అందుకుంది. 1990 లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శిత మైంది.
పల్లెల నుంచి పట్టణాలకు వలసలు, వడ్డీ వ్యాపారులు, కార్మికులు, మధ్యవర్తులు, నిర్మాణ రంగంలో ప్రమాదాలు, మహిళల వ్యథలు, సా యం పేరుతో చేసే మోసాలు, …ఇలా జీవితాల్లోని ఎన్నో అంశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయని వక్తలు పేర్కొన్నారు కమర్షియల్ సినిమాలకు భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనం సృ ష్టించిందన్నారు.


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *