గొందెలి: అంతరించిపోతున్న అరుదైన జానపద కళ

జానపద కళారూపాలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో వాటిని తిరిగి వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఇటీవల టీఆర్‌నీ ఆధ్వర్యంలో జరిగిన చర్చా కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఆ జానపద కళారూపం గురించి వివరిస్తున్నారు ఈ రంగానికి చెందిన పరిశోధకులు డా॥ ద్యవనపల్లి సత్యనారాయణ,
ప్రజలు పట్టణీకరణ, ఆధునీకరణ చెందుతున్న క్రమంలో వందల ఏళ్ళుగా పల్లెల్లో ఆదరించి ఆనందించిన జానపద ప్రదర్శన కళలు ఆంతరించిపోతున్నాయి. దీనివల్ల సాంస్కృతిక వైవిధ్యం మరుగైపోయి ప్రజల మనుగడ ప్రశ్పార్థకమై పోతుంది. ఇది ప్రమాద సంకేతం. కాబట్టి జానపద కళలను కాపాడుకోవాలి. ఈ సృ్పహతోనే ఈ మధ్య మే 25న హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ 11వ నంబరు వీధిలో ఉన్న ‘చంద్రం’లో గొందెలి అనే ఒక ప్రాచీన జానపద కళారూపాన్ని మహ బూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన నర్సింగరావు బృందం చే ప్రదర్శింపజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు తన జీవిత కాలంలోనే ఒకప్పుడు తెలం గాణలో సుమారు మూడువందల గొందెలి ప్రదర్శన బృందాలుండగా ఇప్పుడది వందకు పడిపోయాయని, వాటికీ ఆదరణ లేక ప్రమాదపు అంచున ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రసంగించిన మరో విశ్రాంత ఆచార్యుడు తంగెడ కిషన్‌రావు గారు, కళను కాపాడా లంటే కళాకారులను కాపాడాలని, కానీ గొందెలి కళాకారులకు ప్రభుత్వం ఏ కుల గుర్తింపు ఇవ్వలేదని, ఈ సభలో గొందెలి ప్రదర్శనలో పాల్గొన్న బృంద నాయకుడు నర్సింగరావు మనుమడు సాయికుమార్ (పదేళ్ళ వయసు) ఇటు ప్రదర్శనతో పొట్టపోసుకోలేక, అటు చదువుకొని ఏ కులం రిజర్వేషన్ ఉపయోగించుకొని పైకి రావాలో తెలియక అయో మయ పరిన్థితిలో ఉన్నాడని వాపోయారు. ఇలాంటి పరిన్థితుల్లోనే తెలంగాణ నుంచి మహారాష్ర్టకు, అటు నుంచి ఇటు చరిత్రలో అనేక వలసలు చోటు చేసుకున్నాయని, ఈ వలసలతో పాటే గొందెల వంటి జానపద కళా రూపాలూ ఆయా ప్రాంతాల్లో ప్రవేశించి ప్రజాదరణకు నోచుకున్నాయని, ఇప్పుడు ఆ ఆదరణ లేకపోవడం వల్ల ఆ కళలు తెల మరుగు అయ్యే ప్రమాదానికి గురయ్యాయని, ఇది చరిత్రలో చోటు చేసుకోకూడని పరిణామమని మరో ప్రాసంగికుడు, చరిత్రకారుడు ఆచార్య అడపా సత్యనారాయణ గారు అన్నారు.
సదస్సులో పాల్గొన్న ప్రేక్షకులు గొందెలి ప్రదర్శనను చూని తాము ఎంత సంతోషించిందీ ఒక్కొక్కరుగా వ్యక్తం చేశారు. తమకు ఇలాంటి కళలు అందుబాటులో లేక తామూ చింతిస్తున్నామని, తమకు ఆదరణ లేక కళాకారులూ చింతిస్తున్నారని, సంధి సమన్వయ మార్గం ఒకటి చోటు చేసుకోవాలని కాంక్షించారు.
కళను కాపాడాలంటే ‘ఎందుకు’ అనే ప్రశ్న ఎదురవుతుంది. అలాంటప్పుడు కాపాడవలనిన కళ మొక్క విశిష్ఠతను, ప్రాచీన వైభవాన్ని గూర్చి ప్రజలకు చెప్పవలని ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేద్దాం.
గొందెలికి పూర్వ రూపం కుండలి
గొందెలి అని పిలువబడుతున్న జానపద కళ పూర్వ రూపం ‘కుండలి’ అని పరిశోధన ప్రయత్నంలో తెలుస్తుంది. ‘కుండలి’ అంటే కుండల ఆకారంలో గుండ్రంగా వేదిక మీద తిరుగుతూ ప్రదర్శించే కళ అని అర్థం. ప్రస్తుత ప్రదర్శనలో కూడా జంట తబలలు వాయిస్తున్న కళాకారుడు, పంబ వీణ వాయిస్తున్న కళాకారుడు ఒకరి వెనుక ఒకరు లయబద్దంగా నృత్యం చేస్తూ గుండ్రంగా తిరగడం కనిపిస్తుంది.
గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి ప్రకారం కుండలి .. గుండలి అవుతుంది. ‘బుందేల్‌ఖండ్’ ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చినవారిని ‘బొందిలివారు’ అన్నట్లుగా గుండలి.. గొండలి అవుతుంది. పల్లీయుల ఉచ్చారణలో గొండలి.. గొందలి, గొందెలి వంటి రూపాలను సంతరించుకుంది. ఇలా జరిగిందని ఊరికే అలా కట్టుకథలు చెప్పడం లేదు. ఇందుకు నిదర్శనాలు తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. అవేమిటో చూద్దాం.
సాహిత్యంలో గొందెలి
సాహిత్యం ఉన్నత కులాలకే పరిమితమైంది. ఉన్నత కులస్థులు శిష్టశాన్ర్తీయ కళలనే ఇష్టపడుతారు. జానపద కళలను కాదు, సాధా రణంగా అయినా ఆనాటి శిష్ట సాహిత్యంలో శిష్టకళలతో పాటు జానపద కళలూ వివరించబడ్డాయంటే అవి పక్కకు పెట్టలేనంత ప్రాధాన్యం కలవని అర్థం. కాబట్టి ఇప్పుడు మనమూ ఆదరించకపోవడం చారిత్రక తప్పిరమవుతుంది.
సాహిత్య గ్రంథాల్లో గొందెలి శాన్ర్తీయ నృత్య రూపకంగా కాకుండా దేశి నృత్య ప్రదర్శన కళగా, జానపదులు ఆదరించిన కళగా ప్రస్తావించ బడింది. అలా దేశి కళలను మొట్టమొద ప్రస్తావించింది హాలుని ‘గాధాసప్తశతి’ అనే కవిత్వ గ్రంథం. రెండు వేల సంవత్సరాల కింద కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల నుండి యావత్ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన హాలుడు మొట్టమొదటి తెలంగాణ రాజవంశం శాత వాహన వంశానికి చెందినవాడు. ఈయన గ్రంథంలో శబ్థ వాయిద్యాలకు తడిపిన పిండి పూని వినసొంపైన శబ్దాలను ఎలా సృష్టించి జనపదులు ఆనందించేవారో తెలిపే ప్రస్తావనలున్నాయి.
తెలుగు సాహిత్యంలో ఆదికవిగా పేర్కోనబడుతున్న నన్నయ ‘ఆంధ్ర మహాభారతం’ మొదలు ప్రధాన తెలుగు సాహిత్య సారస్వత గ్రంథాలన్నీ గొందెలి నృత్య రూనకాన్ని దేశి, జానపద కళగా అభివర్ణించాయి. కాంస్య మృదంగ వాయిద్యానికి అనుగుణంగా ఆడుతూ, పాడుతూ వెళ్ళి ప్రజలు రైవతకాద్రి అనే కొండను ఎలా పూజించారో నన్నయ వర్ణించాడు. ప్రస్తుత గొందెలి కళాకారులు కూడా కాంస్య వాయిద్యాన్నే వాయిస్తుండడం గమనార్హం. తిక్కన రచించిన మహాభారత విరాట పర్వంలో బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు విరాట రాజుతో గుండలి మొదలైన కళలను అభ్యనించానని కింద విధంగా చెప్పాడు.
అభ్యపించితి శైశవమాదిగాగ
దంగలాసక విధమును గుండలియును
ప్రెక్కణంబు తెరుంగును పేరణమును
నాచప సోమన ‘ఉత్తర హరివంశం’లో హంస డిభకులపైకి యుద్ధా నికి వెళ్ళిన శ్రీకృష్ణడు తన పాంచజన్యాన్ని పూరించగా సకల చరాచర స్థావరాలు చలించిపోయిన విధానాన్ని గొండలి తదితర నృత్యాలతో పోల్చి వర్ణించాడు కింది విధంగా.
తెరలెత్తి సప్త సాగరములు పొరలంగ
వరుణుండు గొండలి పరిఢవింపు
పై పద్య పాదంలో గొండలి ప్రదర్శనలో భాగంగా ఉధృతమైన సముద్రపు అలల శబ్ధం, ఉరుముల శబ్ధాలు ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేస్తాయని చెప్పడం కనిపిస్తుంది.
శ్రీనాధుడు కూడా తన ‘కాశీఖండం’లో ‘ఉరుము చప్పుళ్ళు మర్దళ ధ్వనులుగా గగన రంగస్థలంబునం క్రొమ్మెరుంగు మెరుంగు పోడి గొండ్లి పరిఢవించే’ నని మెరుపు వంటి సుందరి ఉరుములను సృష్టించే మద్దెల ధ్వనులకు అనుగుణంగా రంగస్థలంపై ఆడి పాడిందని వర్ణించాడు. అలాంటి కుండలి నృత్యాన్ని బెండపూడి అన్నయ మంత్రి కట్టించిన మొగసాల వాకిట్లో కూర్చుండి వేమారెడ్డి అనే రాజు వీక్షించాడని శ్రీనాధుడు తన ‘భీమేశ్వర పురాణం’లో ప్రస్తావించాడు. తన ‘ పల్నాటి వీర చరిత్ర’లో కూడా నలగామరాజు సభలో ప్రదర్శించిన దేశి నృత్యాల్లో ‘కుండలి’ ని పేర్కొన్నారు.
వినుకొండ వల్లభరాయుడు తన ‘క్రీడాభిరామం’ అనే వీధి నాటకం లో ఓంు్టగల్లులో గొరవయ్యలు అనే వీరశైవ మత గురువులు గొండ్లి ఆడించగా గొరగ పడుచు ‘ఆడుచున్నది చూడు మూర్ధాభినయము’ అంటూ ఆమె ఎంతటి నేర్పుతో ఎలాంటి విన్యాసాలు చేనిందో కింద పద్యంలో వర్ణించాడు.
వెనుకకు మ్రొగ్గవాలి కడు వెన్నును వోప్పగ తొట్టె నీళ్ళలో
మునిగి తదంతరస్థమగు ముంగర ముక్కున క్రుచ్చికొంచు లే
చెను రసనా ప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే
రనుపమ లీలనిప్పడచు పాయములిట్టివి యోట్లు నేర్చెనో!
పైపద్యములో గొరగ పడుచు గొండ్లి ఆటలో భాగంగా వెనుకకు పిల్లి మొగ్గ వేని తొట్టి నీళ్ళలో తలను పెట్టి ముక్కుకు ముంగరనె కుచ్చుకొని లేచి దానికి నల్ల పూసలను అత్యంత వేగంగా పురుగా కుచ్చిందట, ఇట్లాంటి ఉపాయములు, విన్యాసాలు ఎలా ఆమె ఎట్లా నేర్చుకుందోనని కవి ఆశ్చర్యపడ్డాడు. ఇక ప్రేక్షకుల ఆనందాశ్చర్యాలకు అవధులుంటాయా?
ఇదే విధంగా కుండలినా పుష్పగంధి అనే సుందరి ప్రదర్శించిందని ‘మల్హణ చరిత్ర’లో పేదపాటి ఎర్రనార్యుడుచ, ఊర్వశి ప్రదర్శించిందని ‘వాల్మీకి చరిత్ర’లో రఘునాధరాయలు, వార వనిత (వేశ్య) ప్రదర్శించిం దని ‘హంస వింశతి’లో అయ్యలరాజు రానాయణామాత్యుడు తదితర కవులు వర్ణించారు. అయితే వీరందరూ గొందెలిని న్ర్తీలు ప్రదర్శించారని వివరించారు. అచ్చ తెలుగు తెలంగాణ కవి పాల్కురికి సోమనాధుడు మాత్రం కాకతీయుల కాలంలో పురుషలు ప్రదర్శించారని పేర్కొన్నారు. తన ‘బసవ పురాణం’లో బసవేశ్వరుని పెండ్లి సందర్భంలో శివభక్తులు గొండ్లి తదితర నృత్యాలను చేశారని కింద పద్యంలో వర్ణించాడు.
కోలాటమును బ్రాత్ర గొండ్లి పేరణియు
కేళిక జోకయు లీల నటింప
జాగ్రత్తగా పరిశీలిేన్త పై పద్యంలో పద్య పాదంలో గొందెలి ప్రదర్శన లో పాత్రలను అభినయించడం ఉంటుందని గమనించవచ్చు. నర్సింగ రావు బృందం కూడా తుల్జాభవాని కథలో పాత్రలను అభినయించడం గమనించవచ్చు. అయితే ఈ తుల్జాభవానీ కథ గత మూడు వందల సంవత్సరాల నుంచి శివాజీ దండయాత్ర కాలం నుంచి మహారాష్ర్ట నుంచి తెలంగాణలో ప్రవేశించింది.« (Previous News)Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *