ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ

ఇప్పటికే ప్రజల సాహిత్యం ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా వచ్చిం దని, ఆ సాహిత్యానికి తయారవుతున్న వారసునిగా రాజేశంను చూడా లని ప్రసిద్ధ నవలా రచయిత అల్లం రాజయ్య అన్నారు. మంచిర్యాల లోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మంటపంలో ప్రముఖ కవి, విమర్శ కుడు తోకల రాజేశం రచించిన సాహిత్య వ్యాసాల సంకలనం ‘‘పాతాళ గరిగె’’ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సాంస్కృతిక వారసత్వానికి తోకల రాజేశం దగ్గరవుతున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెరవే జిల్లా (తూర్పు) అధ్యక్షుడు తోటపల్లి భూమన్న అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి పాల్గొన్నారు. సిధారెడ్డి మాట్లా డుతూ రాజేశం చదవుకు దూరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి తెలంగాణ గడ్డమీద ఈనాడు ఒక విమర్శకునిగా నిలబడటం చాలా గర్వించదగిన అంశమన్నారు. రాజేశంలాగే ఎందరో తెలంగాణ రచ యితలు ఈనాడు అనేక ప్రతికూలాంశాల మధ్య ఎదుగుతున్నారన్నారు. తెలంగాణలో ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టిన కవులను బయటకు తీసుకురావటంలో ప్రయత్నమే ఈ ‘పాతాళ గరిగె’ అని, ఇందులోని వ్యాసాలన్నీ సామాజిక ప్రయోజనాన్ని ఆశించేవేనని అంచనా వేశారు. రాజే శం వ్యాసాలు చదివితే అభ్యాసం, అధ్యయనం రెండుపాయల కలయిక గా ఆయన కనబడుతాడని పేర్కొన్నారు. పుస్తకాన్ని సమీక్షిస్తూ గోపగాని రవీందర్ తోకల రాజేశం కవులు జీవితాలను తన పరిధిలో చూపించే ప్రయత్నం చేశాడని, సదాశివ, వానమామలై వరదాచార్యుల గురించి రాసిన వ్యాసాలు ఎంతో ఆత్మీయంగా వున్నాయని, దానిక్కారణం వారు మనవాళ్లు అన్న భావనేనని పేర్కొన్నారు. జలంపల్లి శ్రీనివాస్ మాట్లా డుతూ, ప్రజలవైపు నిలిచిన వాళ్ల గురించి రాయటం అభినందనీ యమన్నారు. పాతాళ గరిగె పేరు ఔచిత్యాన్ని డా. చమన్‌సింగ్ తెలియ జేశారు. జక్కేపల్లి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రాజేశం రచయితగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. తోకల రాజేశం ప్రతిస్పందిస్తూ నిరంతర అధ్యయనం తరువాత రాయకుండా వుండలేక రాసిన వ్యాసా లే ఇందులో వున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షులు గురిజాల రవీందర్ రావు, పుస్తక స్వీకర్త అర్కాల హేమ లత, తెరవే జిల్లా ఉపాధ్యక్షులు హెచ్. రవీందర్, నూటెంకి రవీంద్ర, కార్యదర్శులు నాగవర్మ ముత్యం, మేకెల రామస్వామి, సభ్యులు వడ్డేపల్లి రాం ప్రసాద్, నూతన్, కవులు శ్రీమన్నారాయణ నీలాదేవి, చీపెల్లి బాపు, శ్రీరామోజు లక్ష్మీరాజయ్య, జాఫర్, బండవరం రంగనాథస్వామి, మాడుగుల నారాయణ మూర్తి, బోనగిరి రాజారెడ్డి, యోగీశ్వర్, వై.ఉమామహేశ్వర్‌రావు, రామ్మూర్తి, తోట సదానందం పాల్గొన్నారు.


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *