చిన్న పత్రికలను ఆదరించాలె..

తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ కొరకు ఏపత్రికా, ఏటివి చానల్ లేనీ రోజుల్లో సుదమళ్ళ వెంకట స్వామి తన సంపాదకత్వంలో సాహసంచేసి ‘ప్రజా తెలంగాణ’ అనే పక్ష పత్రికను 2004లో తీసుకొ చ్చారు.ఆపత్రికకు ప్రొ.కేశవ్‌రావుజాదవ్‌గారు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. మన తెలంగాణలో ఇప్పుడున్నంతటి చైతన్యం లేక పక్కువమంది తెలంగాణవాదులు అప్పట్లో ముందు కొచ్చి సహకరిం చక, ఆర్థికంగా నిలదొక్కుకోలేక కూడా నిలిపివెయ్యాల్సి వచ్చింది. వెంకటస్వామిగారు సారథ్యంలో మరోసారి సాహసంతో ‘దశ-దిశ’ అనే పక్షపత్రిక ఆరంభమైనది. అదేవిధంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టి.ఆర్.సి) నుంచి వేదకుమార్ ప్రచురిస్తున్న ‘దక్కన్‌లాండ్’ మాస పత్రిక కూడా కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నది.
మన తెలంగాణకు ‘నమస్తే తెలంగాణ’ ఒక్కటే ఇప్పటికీ ప్రధాన ది నపత్రిక. సీమాంధ్ర ప్రదేశ్‌కు పన్నో దిన పత్రికలతోపాటు పన్నో మాస, పక్ష, వార పత్రికలు ఉన్నాయి. లక్షల సర్క్యులేషన్లు కలిగిన ఆ పత్రికలు లక్షలాది మందికి తాము చెప్పదలచుకున్న విషయాన్ని వాటిని చదువు తున్నవారి మెదళ్ళకు పక్కిస్తుంటాయి. మనకు కూడా అటువంటి పత్రి కలు వచ్చినప్పుడే తెలంగాణకు వ్యతిరేకంగా అక్కడి మీడియాచేసే మా యలు, పక్కించే వక్రీకరణలు సమర్థంతంగా పదుర్కోగలుగుతాము. మన పత్రికలకు పందుకు సహాయం చెయ్యాల్నో, వీని పందుకు ర క్షించు కోవాల్నో మరికొంత చెప్పదలచాను.
తెలంగాణకు వ్యతిరేకంగా రాసే అక్కడి దిన పత్రిక లు మాత్రమే చదివే మన తెలంగాణ పాఠకులు ఇప్పటి కీ (తెలంగాణవచ్చిన తరువాతకూడ) వాళ్ళ (ఆ పత్రిక ల) వివరణలను (ఇంటర్‌ప్రిటేషన్లను), అభిప్రాయాల ను, భావాలను మోసుకుతిరుగుతుండటాన్ని నేను గమ నించాను. మన తెలంగాణ ప్రభుత్వంచేసే మంచి పను లను కూడా చెడ్డవిగా చిత్రిస్తున్న అక్కడి పత్రికలవారి ప్రచారాలను మనవారు ఆ పత్రికలే చదువుతున్నందు న అవే నమ్మి ప్రచారం చెస్తున్నారు. కాని ఈ ప్రచారకులు తాము చ దివి, తమ మతులు పోగొట్టుకొని మత ప్రచారకుల మాదిరిగా వివిధ తెలంగాణ వేదికలమీద పనిగట్టుకొని ప్రచారంచేసి మనవాళ్ళ (ఇతర తెలంగాణవాళ్ళ) మతులుపోగొడుతున్నారు, పెడదారిలో ఆలోచింప జే స్తున్నారు. తమకు తాము చెడిపోవడానికి వాళ్ళకు హక్కు ఉన్నది. కాని తెలంగాణ సమాజాన్ని చెడగొట్టడమే బాధ అనిపిస్తున్నది. ఇతర పత్రి కల్లో ఏది చదివినా, ఏపాలసీ గురించి చదివినా ఆ విషయానికి సం బంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తున్నది అనేది మాత్రం ఇతర త్రాగా కూడా సమాచారం సేకరించుకొని ఒక అభిప్రాయానికి, నిర్ణ యానికి వస్తే బాగుంటుంది. లేదా మన మాసపత్రికలలో ఆ విష యాలపై చర్చలు వస్తే వాటిని చదివైనా ఒక నిర్ణయానికి వస్తే బాగుం టుంది. అందుచేత ముల్లును ముల్లుతో తీసినట్లుగా మన పత్రికలు చదివి ప్రచారాన్ని పదురు ప్రచారంతోనే ఢీకొనడం సరైన ప్రత్యు త్తరం కాగలదు. వారికున్న పన్నో దిన, వార, మాసపత్రికలు మన దగ్గర బాగనే అమ్ముడుపోతున్నాయి. వాటిలో కొంత అధిక సమాచారం ఉం డటంవల్ల, వైవిద్యపు శీర్షికలు ఉండటం వల్లకూడా అవి మనదగ్గర గ ణనీయమైన సంఖ్యలో అమ్ముడుపోతుండవచ్చు. అంటే కారణమేదైనా మనం వాటిని కొనుక్కొని, చదివి ఆదరిస్తున్నాం. ఐతే వారు ప్రచురించే వక్రీకరణవార్తలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు మాత్రం ని స్సందేహంగా మన తెలంగాణ వారి బుర్రలు చెడగొడు తున్నాయి. మనం వాళ్ళ పత్రికలు కొంటున్నట్లుగా, వా టిని కొని మనం చదువుతున్నట్లుగా మనకున్న కొద్ది పత్రి కలను అక్కడి సామాన్యుల దగ్గరికిపోనిస్తలేరు కనుక మ న పత్రికలు రాసే వాస్తవాలు కూడా అక్కడి ప్రజలకు చేర్తలేవు.
అందుచేత మనకు కూడా పన్నో దిన, వార, పక్ష, మాస పత్రికలు ముందు ముందు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ పత్రికల్లో రచనలెన్నో మనం చూడగలుగుతాము. ఏ వి ధంగా చూసినా ఈ పత్రికలు మన అందరి సహకారానికి యోగ్యత కలిగి ఉన్నవని నా అభిప్రాయం. ఈ పత్రికలకు తెలంగాణ వాదులం దరం రకరకాలుగా తమతమ సేవలను, ఆర్ధిక తోడ్పాటును అందిం చవచ్చు. మన మన్సులను, బుద్ధిని చెడగొట్టే ఆంధ్ర పత్రికలనే ఆద రి స్తున్న మనం మన పత్రికలను కొనడానికి, ఇతరవిధాలుగా తోడ్పడ టా ని వెనకా ముందూ చూడొద్దు. అందుచేత ఈ చిన్న పత్రికలను కొన కుండ ఉండటానికి సాకులు వెతకకుండా దయచేసి కొనండి, చదవం డి, ఆదరించండి. ఈ పత్రికలకు తమ రచనలను పంపొచ్చు.
చందా రాములు, (రిటైర్డ్ అధ్యాపకులు,హైదరాబాద్)


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *