చుక్కా రామయ్య జీవితం ఆదర్శప్రాయం

చుక్కా రామయ్య విద్యావ్యవస్థకు చుక్కాని లాంటి వారని ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని విశాలాంధ్ర ఎడిటర్ కె. శ్రీని వాసరెడ్డి అన్నారు. రామయ్య వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ నారాయణగూడలోని భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారత్ కళా శాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య ను ఘనంగా సత్కరించారు. ఆయన రచించిన ‘సింగపూర్ చదువులు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలువురు ప్రముఖ పాత్రికేయులు, పత్రికా సంపాదకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
నేటి విద్యావిధానం కార్పొరేట్లకు అనుగుణంగా ఉండటం వల్లనే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలనే ఆలోచన నేటి తరానికి లేకుండా పోయిందని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘గణిత మంటేనే చుక్కా రామయ్య అన్నట్లుగా ఆయన గుర్తింపు పొందారు’ అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ‘సమాజానికి ఎలాంటి విద్య అవసరం, భాష ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి అనే అంశాలపై అందరినీ అనుసంధానం చేస్తూ విద్యా విధానాన్ని మెరుగుపరచడానికి రామయ్య ఎంతో కృషి చేశారు’ అని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ కొనియాడారు.
ఐఐటీ అంటే ఏమిటో తెలియని దశలో సాంకేతికంగా ఉన్నత స్థాయికి చేరిన తన శిష్యులు ఐఐటీ రామయ్యగా తనకు గుర్తింపు తె చ్చేలా చేశారని చుక్కా రామయ్య ఆనందం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఖరగ్‌పూర్ వేదికపై నాటి ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగం తనను ప్రభావితం చేసిందని.. దేశానికి కావాల్సిన ఇంజనీర్ల ను తయారుచేసే విద్యను అందించాలనే లక్ష్యంతో విద్యాసంస్థను స్థా పించే విధంగా మార్గనిర్దేశం చేసిందని ఆయన అన్నారు.
సంపాదకులు వీరయ్య, శర్మ, శేఖర్‌రెడ్డి, తెలంగాణ రచయితల వేదిక మాజీ అధ్యక్షు డు జూలూరి గౌరీశంకర్, భారత్ విద్యాసంస్థల చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్వీ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *