చెత్త తగ్గితేనే నగరానికి మేలు

ఎఫ్‌బీహెచ్ ‘టాక్’లో జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.సుధాకర్ 
నగరంలో నివసించే ప్రతి వ్యక్తి కూడా సగటున రోజుకు అర కిలో చెత్త ఉత్పత్తి చేస్తున్నారని, దీన్ని ఎంత తగ్గించుకుంటే న గరానికి అది అంత మంచి చేస్తుందని జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.సుధాకర్ అన్నారు. 2016 ఆగస్టు 27న శనివారం హిమాయత్‌నగర్‌లోని దక్కన్ అకాడమీ ‘చంద్రం’లో ఫోరవ్‌ు ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జ రిగిన ‘టాక్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫోరవ్‌ు ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ అధ్యక్షులు యం.వేదకుమార్ అధ్యక్షత వహించారు.
‘హైదరాబాద్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఇన్షియేటివ్ టేకెనప్ బై జీహెచ్ ఎంసీ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీస్’ (హైదరా బాద్ ఘనవ్యర్థాల నిర్వహణజీహెచ్‌ఎంసీ తీసుకున్న చర్యలు పౌర సమాజం పాత్ర) అనే అంశంపై ఈ చర్చ జరిగింది.
రోజుకు 4500 టన్నుల చెత్త: సుధాకర్
నగరంలో రోజుకు సగటున 4, 500 టన్నుల మేరకు చెత్తను జీహెచ్ ఎంసీ సేకరిస్తున్నది. చెత్త తరలింపుపై ఏటా రూ.260 కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నాం. కనీసం ఒక వెయ్యి టన్నుల మేరకు చెత్త తగ్గినా మంచిదే. ఆ మేరకు సేకరణ, తర లింపు తదితర వ్యయాలు తగ్గుతాయి. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ప్లానింగ్ ము ఖ్యం. నగరా భివృద్ధికీ ఇది వర్తిస్తుంది. చెత్త సేకరణ, తరలింపు, శుద్ధి తదితరాల్లో జీ హెచ్‌ఎంసీకి అందరు వ్యక్తులు, అన్ని సం స్థలు, విభాగాలు సహకరించాలి. జీహెచ్ ఎంసీ ఒక్కటి మాత్రమే ఈ బాధ్యత చూడాలంటే సాధ్యం కాదు. అన్ని వర్గాల ప్రజల నుంచి తగు సహకారం అందాల్సి ఉంటుంది. ఒక విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే ముందు మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నామో కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. హైద రాబాద్‌కు గతంలో మూడుసార్లు అంతర్జాతీయంగా గ్రీన్‌సిటీ అవార్డు వచ్చింది. ప్రజలందరి సహకారంతోనే ఇది సాధ్యపడింది. అది కొనసాగాలి. జీహెచ్‌ఎంసీ వి స్తీర్ణం 625 చ.కి.మీ. నగర జనాభా 2011 సెన్సెస్ ప్రకారం 6.33 లక్షలు కాగా, ఇప్పుడు అనధికారిక అంచనాల మేరకు ఒక కోటి వరకూ ఉంటుంది. నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య రోజుకు 15 లక్షల దాకా ఉంటుంది. ఎవరికి వారు తమ వంతు బాధ్యతను విస్మరించడంతో సమస్యలు అధికమ వుతున్నాయి.
నగరంలో చెత్తను జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌కు తరలి స్తుంటారు. జోన్ల వారీగా చేయాలనుకుంటే స్థలం లభ్యత ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇంటర్నెట్‌లో రోజూ గంటల తరబడి ఎన్నో అంశాలపై అన్వేషించే ప్రజలు ‘చెత్త’ను తగ్గించుకోవడం, సరిగా డిస్పోజ్ చేయడం లాంటి అంశాల గురించి మాత్రం వెతకరు. చె త్త సేకరణ, తరలింపు, శుద్ధి తదితరాల్లో జీహెచ్ ఎంసీ అధునా తన విధానాలు అవలంబిస్తోంది. వివిధ రకాల సాంకేతికతలను వినియోగించుకుంటోంది. విధి నిర్వహణలో వివిధ యాప్‌లను వినియోగిస్తున్నాం. ఎంతో పారదర్శకతతో పని చేస్తున్నాం. ఎప్ప టికప్పుడు ఆయా వివరాలను అధికారులు నమోదు చేస్తూ, షేర్ చేసుకుంటూ ఉంటారు.
చెత్తను తగ్గించే మార్గాలను అన్వేషించాలి. చెత్తను ఎంత త గ్గిస్తే అంతగా మాకు సహకరించినట్లవుతుంది. ఇంటింటికీ రెండు చెత్తబుట్టలను ఇచ్చాం. నగరంలో ఇప్పటి వరకూ 90 శాతం పం పిణి పూర్తయింది. వాటిని ఎంతమేరకు సక్రమంగా వినియోగి స్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నగర పారిశుద్ధ్య విభాగంలో అవుట్ సోర్సింగ్‌లో సుమారు 1,900 మం ది, రెగ్యులర్ సిబ్బంది సుమారుగా 100 మంది పని చేస్తున్నారు. పారి శుద్ధ్యం తీరుతెన్నులను మెరుగుపరిచేం దుకు జీహెచ్‌ఎంసీ ‘పరిచయం’ కార్య క్రమాన్ని ప్రవేశ పెట్టింది. స్థానికంగా పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, సం బంధిత అధికారుల పేర్లు, ఫోన్ నెంబ ర్లను స్థానికంగా గోడ లపై రాయిస్తు న్నాం. ఈ సదుపాయాన్ని వినియోగిం చుకోవాలి. ఈ విధానాన్ని ప్రధానమంత్రి కూడా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. స్వచ్ఛ్ భారత్ థీవ్‌ులో కూడా దీన్ని చేర్చారు.
హైదరాబాద్‌లో రాత్రివేళ స్వీపింగ్ ప్రవేశపెట్టాం. దేశం లోని ప్రధాననగరాల్లో ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నారు. ఇంట్లో చెత్త ఉత్పత్తి కావడం నుంచి అది డంపింగ్ యార్డ్‌కు చేరుకునే వ రకు ఏయే దశలు ఉంటాయో తెలుసుకోవాలి. తడి చెత్త, పొడిచెత్త కలసిపోతే బాక్టీరియా వృద్ధి చెంది చెడువాసన వస్తుంది. లిచెట్ (చెత్త నుంచి కారే ద్రవపదార్థం) వస్తుంటుంది. డోర్ టు డోర్ కలె క్షన్, సెగ్రిగేషన్, డంపర్ బిన్స్, ప్రైమరీ ట్రాన్స్‌పోర్టేషన్, సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్, టెరిటరీ లేదా ఫైనల్ ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి దశలు ఉంటాయి. అంతిమంగా చెత్త జవహర్‌నగర్‌కు చేరుకుంటుంది. అక్కడ ట్రీట్‌మెంట్, డిస్పోజల్ చేస్తారు. అక్కడ చెత్తతో కంపోస్ట్ చే స్తారు. ప్లాస్టిక్, రబ్బరు లాంటి వాటితో ఆర్‌డీఎఫ్ (ఇంధనం) త యారు చేస్తారు. లిచెట్ (చెత్త నుంచి కారే ద్రవపదార్థం)ను కూడా శుభ్రపరుస్తారు. మిగిలిన చెత్తను సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తారు. అక్కడి లిచెట్ భూమిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడుతారు. అక్కడి వాయువులు పర్యావరణం లోకి వెళ్ళకుండా చూస్తారు. ఇందుకు ఒక సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నాం. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. చెత్తను ఎప్పుడూ తగులబెట్టకూడదు. అది ప ర్యావరణానికి హాని చేస్తుంది. కొన్నేళ్ళుగా జవహర్‌నగర్‌లో పే రుకుపోయిన చెత్త 0 నుం చి 115 అడుగుల మేరకు ఉంటుంది. అక్కడి లిచెట్‌తో భూగర్భజలం కలుషితమైంది. చుట్టుపక్కల 19 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారు. శా స్త్రీయంగా ఆయా పనులు చే పట్టకపోవడంతో ఇలా జరిగింది. వాళ్ళూ మనుషులే. వారి బాధలు తగ్గాలంటే మనం చెత్త ఉత్పత్తి తగ్గించుకోవాలి. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచాలి. పూనాలో కొన్ని వార్డులలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఈ విషయంపై అవగాహన పెంచుతున్నాయి. ఈ చైతన్యం సా ధిస్తే మనం ఏదైనా సాధించవచ్చు.
గృహవ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మెడికల్ వ్యర్థాలు, ఇవేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, కన్‌స్ట్రక్షన్ అండ్ డిమా లిషన్‌వేస్ట్ అని చెత్త పలు రకాలుగా ఉంటుంది. గృహవ్యర్థాలు (ముని సిపల్ సాలిడ్ వేస్ట్), కన్‌స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్‌కు మాత్రమే నగరపాలక సంస్థ బాధ్యత వహిస్తుంది. ఇండస్ట్రియల్, మెడికల్, ప్లాస్టిక్ వేస్ట్, ఇవేస్ట్‌లకు పొల్యూషన్ కం ట్రోల్ బోర్డ్ బాధ్యత వహిస్తుంది. ఇది తెలియక అంతా జీహెచ్ ఎంసీనే విమర్శిస్తుంటారు. కార్పొరేటర్లు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం ఇటీవల ఒక సదస్సు కూడా ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడు వెంక టయ్యకు ఇటీవల అవార్డు వచ్చింది. ఈ తరహాలో వివిధ స్థాయిల్లో ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని ప్రో త్సహించాల్సిన అవసరం ఉంది.
అవగాహన పెంచుకోవాలి:ఎం.హెచ్. రావు
చెత్తను ఎలా తగ్గించవచ్చో మనం అవగాహన పెంచు కో వాలి. కాలనీల్లో వెల్ఫేర్ సొసైటీలను ఇందులో భాగస్వాములుగా చేయాలి. సంబంధిత అధికారుల సిన్సియారిటీ, కమిట్‌మెంట్ కూడా ప్రధానం. నీలగిరి జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ కన్పించకూడదని 30 ఏళ్ళ క్రితం అక్కడి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు కారణం అక్కడ ప్లాస్టిక్‌తో వచ్చిన ఇబ్బందులే. ఇప్పటికీ ఆ నిబం ధనలు అమలు చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లోనే తనిఖీలు చేసి వాటిని డిపాజిట్ చేసుకోవడం లేదా స్వాధీనం చేసుకోవడం చేస్తారు. శ్రీశైలం అడవుల వద్ద కూడా ఈ విధమైన నిబంధనలు అమలు చేస్తే బావుంటుంది. పేపర్ సంచులు వాడే కల్చర్ పెంచుకోవాలి. ఇక్కడ కూడా తక్కువ మందంతో కూడిన ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై కొన్ని ఆంక్షలు మొదట్లో అమలు చేసి నప్పటికీ, తరువాత అమలు తగ్గిపోయింది.
నగర సమస్యల పరిష్కారంలో ఫోరవ్‌ు ఫర్ ఎ బెటర్ హైద రాబాద్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. అధికార యంత్రాంగానికి ఫోరవ్‌ు తగు సలహాలు, సూచనలు కూడా ఇస్తోంది. రకరకాల సమస్యలపై సలహాలు ఇవ్వ డం, సూచనలు చేయడం, ప్రభుత్వంతో పోట్లాడడం, కోర్టుల్లో కేసులు వేయడం, మనకు ఉన్న హక్కుల్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, ప్రభుత్వాన్ని అడగడమే కాదు… మనం ఏరకంగా తోడ్పడాలి లాంటి అంశాలపై కృషి చేస్తోంది.
నగరాన్ని తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిది: వేదకుమార్
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిపై ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు ‘బ్యూటీషియన్స్ ఆఫ్ ది సిటీ’. నగరం శుభ్రంగా, పచ్చదనంతో ఉంటేనే జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతాయి. బాధ్యతతో నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త ఎక్కువైతే పర్యావరణానికి అంత హాని. ఉత్పత్తి అయ్యే చెత్త కూడా రీసైక్లింగ్‌కు వీలయ్యేదిగా ఉండాలి. నగరం ఎంతో వృద్ధి చెం దుతున్నప్పటికీ వివిధ స మస్యలు కూడా అంతగా వృద్ధి చెందు తు న్నాయి. కాలుష్యం, ఇతర సమ స్యల కారణంగా నగరవాసుల ఆయుర్దాయం తక్కువగా ఉం టోంది. ఆరోగ్య సమస్యలు అధిక మవుతున్నాయి. గ్రామీణులతో పోలిస్తే నగరవాసుల ఆయుర్దాయం పదేళ్ళు తక్కువగా ఉంటుందని కూడా అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. నగర సమస్యల పరిష్కారం కోసం ఒక మాస్టర్ ప్లాన్ కావాలి. ఇది రకరకాలుగా కాకుండా ఒక్కటిగానే ఉండాలి. నగరవాసు లకు నాణ్యమైన జీవితం అవసరం. కొన్ని దశాబ్దాలుగా నగరపాలక సంస్థపై భారం పెరగింది. పరిధి పెరిగినా, సమస్యలు ఎక్కువైనా సిబ్బంది సంఖ్య మాత్రం పెరగడం లేదు. పాఠశాల విద్యార్థులకు సైతం ‘చెత్త’ అంశంపై అవగాహన కల్పించాలి. ఇతర నగరాల్లో అమలవుతున్న మంచి కార్యక్రమాలను ఇక్కడ కూడా చేపట్టవచ్చు. చెత్తను విక్రయించే అంశం కూడా జీహెచ్‌ఎంసీ పరిశీలించాలి. ఎం.హెచ్.రావు తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు.
ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ నేచర్ క్లబ్ విద్యార్థులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. మహ్మద్ తురబ్, కె. సి. ప్రసాద్, బస్వరాజ్, ఆదర్శ్, ధనలక్ష్మి, అశోక్, సాబీర్, సుజాత, లత, నర్సింహులు, మీనా అగర్వాల్, సుదర్శన్, అఫ్జల్, నరహరి, రవికుమార్ తది తరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆదిత్య


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *