జనజాతరల్లో క్లిక్.. క్లిక్!

ఫోటోగ్రాఫర్ రామ వీరేశ్ బాబు
జనజాతరలో కానవచ్చే సందడి మదిపై చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్రను పదిలం చేసే ప్రయత్నమే రామ వీరేశ్ బాబుచే కెమెరాను పట్టించింది. జాతరలోని జనాన్ని కెమెరాలో బంధిస్తే ఆ ఫ్రేవ్‌ు లివింగ్ హెరిటేజ్‌కు నిర్వచనంలా నిలుస్తుంది. ఈ సత్యం తెలిసిన ఫొటోగ్రాఫర్ రామ వీరేశ్‌బాబు.
వరంగల్‌లో పుట్టిపెరిగి డిగ్రీ వరకూ అక్కడే చదువుకున్న రామ వీరేశ్ బాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో పోస్టల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన 197లో ఫోటోగ్రఫీపై ఆసక్తితో కెమెరా చేతబట్టారు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్‌పై ఉన్న ఆయన ఆసక్తి పెద్దయ్యేసరికి లెన్స్ వైపు మళ్లింది. డాక్యుమెంటరీల కోసం ఆయన పట్టిన కెమెరా తెలంగాణకు తలమానికమైన మేడారం, ఐనవోలు జాతరలను అన్ని కోణాల్లో స్పశించింది. తపాలా శాఖలో ఉద్యోగం వచ్చినా ఆ హాబీని మాత్రం వీడలేదు.
చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడమంటే ఆయనకు ఎంతో ఆసక్తి. అలా ఎన్నో గ్రామీణ చిత్రాలు, జాతర ద శ్యాలను కాన్వాస్‌పై చిత్రించారు. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్‌భూషణ్‌తో స్నేహం ఆయన్ను కెమెరా వైపు మళ్లించింది. 1977 నుంచే ఫొటోలు తీస్తున్నారు. 190లో వరంగల్‌లోనే తపాలా శాఖలో ఉద్యోగం వచ్చింది. అయినా తన ప్రవత్తిని విడిచి పెట్టలేదు. 197 నుంచి ఫొటోగ్రఫీని సీరియస్‌గా తీసుకున్నారు. డాక్యుమెంటరీల కోసం ఎన్నో జాతరలకు వెళ్లి ఫొటోలు తీశారు. లంబాడాల జీవన విధానాన్ని కెమెరాలో బంధించారు.
ప్రజల నిత్య జీవితాన్ని, జాతరలను, చెట్లను, పురాతన వార సత్వ భవనాలను, వీధి దృశ్యాలను ఫోటోలుగా తీయడమంటే ఆయ నకు ఆసక్తి. సహజవాతావరణంలో ప్రజల జీవన కార్యకలా పాలను అందంగా కెమెరాలో బంధించడం ఫోటోగ్రఫీలో ఆయన శైలిగా ఉంటోంది.
మనలో చాలామందికి బోనాలు లాంటి పండుగలు ఓ సం ప్రదాయంగా, మరి కొందరికి అది అర్థం లేని ఆచారంగా కనిపి స్తాయి. ఒక ఫోటోగ్రాఫర్ లెన్స్‌కు మాత్రం ఇలాంటి పండుగలు మత విశ్వాసాలకు మించినవిగా కనిపిస్తాయి. వీరేశ్ బాబు పాతికేళ్ళుగా బోనాల పండుగ స్ఫూర్తిని తన కెమెరాలో బంధిస్తూ వచ్చారు. అందుకే ఆయన తీసిన ఫోటోలతో ‘బియాండ్ ఫెయిత్’ అనే డాక్యుమెంటరీ కూడా రూపొందింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో దీన్ని ప్రద ర్శించారు.
బోనాల పండుగ స్ఫూర్తిని చాటిచెప్పడం ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం. బోనాల పండుగ విశేషాలను వీరేశ్ బాబు దృశ్యరూపంలో వివరించారు.
ఆయన ప్రధానంగా బోనాల పండుగనే ఎంచుకునేందుకు ఓ కారణముంది. నెల రోజుల పాటు జరిగే ఈ జనజాతరలో సంస్కృతి, ఆహారం, పాటలు ప్రధానపాత్ర వహిస్తాయి. పైగా దీ న్ని రాష్ర్ట పండుగగా కూడా ప్రకటించిన నేపథ్యంలో దానిపై డాక్యు మెంటరీ తీసేందుకు తగిన సమయంగా భావించి ఈ డాక్యు మెంటరీ రూపొందించినట్లు ఆయన తెలిపారు. కులమతాలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఒకచోట చేరి చేసుకునే ఏ పం డుగైనా వీరేశ్ బాబుకూ పండుగే. తన కెమెరాతో అక్కడ వాలి పోతారు. పోతురాజులు ఆ వేషం వేసుకునేందుకు పడే కష్టాలు, బోనాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు పడే ఇబ్బం దులు లాంటివన్నీ ఆయన ఫోటోలకు ముడిసరుకుగా మారుతాయి.
జనజాతరకు వచ్చే ప్రజల్లో కనిపించే అమాయకత్వం, అక్కడ వెల్లివిరిసే రంగులే తనను ఆయా వేడుకల ఫోటోలు తీసేం దుకు స్ఫూర్తినిస్తాయని ఆయన అంటారు. గతంలో పోతురాజులు పసుపు రాసుకునే వారని, ఇప్పుడు సింథటిక్ రంగులు వచ్చాయని, గతంలో వారి వేషధారణ భారీస్థాయిలో ఉండేదని, ఇప్పుడంతగా ఉండడం లేదనీ ఆయన అంటారు. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో బోనాల ఫోటోలు తీశారు. మరెన్నో వేల సంఖ్యలో ఇతర పండుగల ఫోటోలూ ఉంటాయి.
సిటీలో పాత గడియారాలు, చెట్లను పూజించే విధానం, వాటిని ఉపయోగించే తీరుపై లెక్కలేనన్ని ఫొటోలు తీశారు. ఇదే సమయంలో ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ ద పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ డెరైక్టర్ సి.పటేల్‌తో పరిచయం ఆయన జీవితంలో గొప్ప మలుపు. ఒక్కో సబ్జెక్ట్‌ను ఎంచుకుని ఫొటోలు తీయమని ఆయన సూచించారు. జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో మేడారం జాతర ఫొటోల తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే మంచి స్పందన వచ్చింది. వివిధ నగరాల్లో పలు షోలు నిర్వహించారు. హైదరాబాద్ గడియారాల ఫొటోలకు ఇంగ్లండ్‌లోని అసోసియేట్‌షిప్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల గుర్తింపు లభించింది.
‘‘గతంలో జరిగిన జాతరలకు, ఇప్పుడు జరుగుతున్న జాతరల కు చాలా తేడాలు వస్తున్నాయి. అప్పుడు నేను తీసిన డాక్యుమెంటరీలు భవిష్యత్ వాళ్లు గతంలో జాతర ఇలా జరిగేదే అని తెలుసుకునేందు కు చక్కగా ఉపయోగపడతాయని నా అభిప్రాయం’’ అని అంటారు రామ వీరేశ్ బాబు.
వ్యక్తిగతం:
పేరు: రామ వీరేశ్ బాబు
జననం: 1956, వరంగల్
చదువు: బిఎస్సీ
వృత్తి: పోస్టల్ అసిస్టెంట్, హైదరాబాద్
నివాసం: రాంనగర్, హైదరాబాద్
సోలో ప్రదర్శనలు:
2012: ఇమేజెస్ ఆఫ్ హైదరాబాద్ బోనాలు, ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
200: ఇమేజెస్ ఆఫ్ హైదరాబాద్ ట్రీస్ జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, హైదరాబాద్
2004: ఇమేజెస్ ఆఫ్ ఫెయిత్ మేడారం సమ్మక్క సారలక్క జాతర, జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, ముంబై 2004: ఇమేజెస్ ఆఫ్ హైదరాబాద్ ట్రీస్ ఆర్ట్ హెరిటేజ్, న్యూఢిల్లీ
2001: ఇమేజెస్ ఆఫ్ హైదరాబాద్ క్లాక్స్ పిరమల్ గ్యాలరీ, ఎన్‌సీపీఏ, ముంబై
199: ఇమేజెస్ ఆఫ్ జాతర ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ
1993: పీపుల్ యాక్టివిటీ చెన్న విశ్వేశ్వరయ్య హాల్, వరంగల్
గ్రూప్ ఎగ్జిబిషన్స్:
200607: ెవ్‌ులాండ్స్ జిందాల్ ఫుజి ఫిల్మ్ సూపర్ సిక్స్ ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ భారతదేశంలో ఐదు మెట్రో నగరాల్లో
2011: ‘సవ్‌ుథింగ్ దట్ ఐ విల్ నెవర్ రియల్లీ సీ’తో కలసి ‘ఫోటోగ్రాఫిక్ థాట్స్’ హైదారబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో కాంటెంపరరీ ఎగ్జిబిషన్ ఫ్రవ్‌ు వి ఎ మ్యూజియం, లండన్
2011: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం లో గోతెజంత్రవ్‌ు, జర్మన్ ఆధ్వర్యంలో నిుష్ట్రవ ష్ట్రఅఱఅ నవసవతీపస్ణ డ ాణఱవ ూ్‌స్. శీఎ ఔవతీసవఅ అస వతీవష్ట్రవఅ్ణ
అవార్డులు:
2000: రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అసోసియేట్‌షిప్
2005: ‘ఐ ఇన్ ప్రోగ్రెస్’కు గాను ఇండియా హాబిటేట్ సెంటర్ ఫోటోగ్రఫీ ఫెలోషిప్ అవార్డు (న్యూఢిల్లీ)
1996: నికాన్ ఫోటో కాంటెస్ట్ ఇంటర్నేషనల్
199: హానరబుల్ మెన్షన్డ్ అవార్డు (సింగపూర్)
రాజేశ్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *