జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలకం కానున్న తెలంగాణవాదం

తెలంగాణ రాష్ర్టం సాధనతోనే తెలంగాణవాదం ముగిసిపోలేదు. నిజానికి రాష్ర్ట సాధన అనంతరమే తెలంగాణవాదానికి ప్రాధాన్యం మ రింత పెరిగింది. పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్న హైదరాబాద్ నగరానికి సంబంధించి తెలంగాణ వాదం ప్రాధాన్యం మ రింత కీలకం కానుంది. హైదరాబాద్ నగర స్థానిక పాలనకు మారు పేరైన జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ నేప థ్యంలో హైదరాబాద్‌లో తెలంగాణవాదం అంశం మరోసారి చర్చనీ యాంశంగా మారింది.
తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్‌ను సీమాంధ్ర వర్గా లు తమ సొంత ఆస్తిగా భావించడం గత కొన్ని దశాబ్దాలుగా జరుగు తూనే ఉంది. అందుకే తెలంగాణ రాష్ర్ట విభజన సందర్భంగా హైదరా బాద్‌పై పట్టు బిగించారు. కేవలం ఈ ఒక్క అంశం కారణంగానే తెలం గాణ రావడం ఆలస్యమైందనడం అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌ను గనుక వదులుకొని ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చిఉండేదని పలు సందర్భాల్లో కేసీఆర్ అనడం గమనార్హం.
సీమాంధ్రులు హైదరాబాద్‌కు రావద్దని ఎవరూ అనడం లేదు. జ మ్మూ కాశ్మీర్, ఇతరత్రా కొన్ని ప్రాంతాలు మినహా దేశంలో ఎవరైనా ఎక్కడై నా స్థిరనివాసం ఏర్పరుచుకోవచ్చు. ఆ మాటకు వస్తే హైదరా బాద్‌కు దేశంలోని ప్రతి రాష్ర్టంనుంచి వేలాది మంది వచ్చి స్థిరపడ్డారు. వారంతా హైదరాబాద్ సంస్కృతితో మమేకమైపోయారు. హైదరాబాదీ లలో కలసిపోయారు. సీమాంధ్రకు చెందిన వారు మాత్రం ఎంతో మంది తెలంగాణ సంస్కృతిలో ఇమడలేకపోయారు. ఇక్కడ స్థిరపడి దశాబ్దాలు గడిచినా తెలంగాణ భాషా సంస్కృతులను విమర్శిస్తూనే ఉ న్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలను కొల్లగొట్టేందుకే ప్రాధాన్య మిచ్చారు. ఈ కారణాల వల్లే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రాంతం వారికంటే కూడా సీ మాంధ్ర ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వారి సంఖ్య అధికం అని అన్నా కూడా అతిశయోక్తి కాదు. ఇలా వలస వచ్చిన వారు హైద రాబాద్ అభివృద్ధి, సుస్థిరత లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తమ ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నగరాన్ని వృద్ధి చేస్తూ పోయారు. వృద్ధికి, సుస్థిర దాయక అభివృద్ధికి ఎంతో తేడా ఉంటుంది. కేవలం వృద్ధి మాత్రమే సాధిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు అతి తేలిగ్గా కుప్పకూలుతుంది. నేడు హైదరాబాద్‌కు కావాల్సింది సు స్థిరదాయక అభివృద్ధి. హైటెక్ సిటీ నిర్మించిన వారు దానికి డ్రైనేజీ వసతులు కల్పించడం మరిచారు. అందుకు ప్రధాన కారణం వారు కో రుకున్నది వృద్ధి మాత్రమే. మరికొన్ని వందల ఏళ్ళ పాటు హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలన్న తపన వారిలోలేదు. హైదరాబాద్‌ను ఎంతగా దోచుకోవాలో అంతగా దోచుకున్నారు. మరింత దోచుకునేందుకు ప్ర యత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణవాదులు గెలవాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది.
మొత్తం మీద నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలు, 24 అ సెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 150 డివిజన్లుగా జీహెచ్‌ఎంసీ ఉం ది. ఇందులో అత్యధిక డివిజన్లలో సీమాంధ్రులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. కొన్ని డివిజన్లలో వారు గెలుపు ఓటములను ప్రత్యక్షంగా ప్ర భావితం చేయగల సంఖ్యలో కూడా ఉన్నారు. ఇదే సమయంలో కొన్ని సీమాంధ్ర పార్టీలు హైదరాబాద్‌లో పాగా వేయడం ద్వారా తెలంగాణ లో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకు రకర కాల కుయుక్తు లు పన్నుతున్నాయి. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బా ధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. మిగిలిన తెలంగాణలో మాదిరిగా నే హైదరాబాద్‌లో కూడా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతోం ది. తెలంగాణవాదులంతా ఒకవైపు, సీమాంధ్రవాదులు, వారికి వత్తాసు పలికే స్థానికులు మరోవైపు చేరుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ తాజా ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సీమాంధ్రులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలని తెలంగాణవాదులు అనకున్నా, తెలుగుదేశం నాయకు లకు తోడుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లాంటివారు మాత్రం తా ము సీమాంధ్రులను కాపాడుతామంటున్నారు. అసలు సమస్య అంటూ ఏమీ లేనిదే వారంతట వారు ఒక సమస్యను సృష్టించి దాన్ని భూతద్దం లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్ని కలను దృష్టి లో ఉంచుకొని, రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే ఇలా చే స్తున్నారన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.
గుజరాత్, బీహార్, రాజస్థాన్, మహారాష్ర్ట, కర్నాటక…ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వలస వచ్చారు. వారికెవరికీ లేని సమస్యలు ఆంధ్ర నుంచి వచ్చిన వారికి మాత్రమే ఎందుకు ఉంటున్నా యి? వారి ప్రయోజనాల గురించి మాత్రమే కొన్ని పార్టీలు ఎందుకు అంతగా పట్టించుకుంటున్నాయి? ఇవన్నీ తెలంగాణ ప్రజానీ కానికి ఏ విధమైన సంకేతాలు అందిస్తాయి? ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రభావాన్ని కనబరచనున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తెలంగాణవాదులు నెగ్గితేనే తెలంగాణ గుండె కాయ సుస్థిర అభివృద్ధికి బాట పడుతుంది. లేని పక్షంలో గత ఆరు దశాబ్దాల కాలంలో జరిగినట్లుగానే దోపిడి, వివక్ష లాంటివి వికృత రూపం దాల్చే అవకాశం ఉంది. తెలంగాణవాదానికి హైదరాబాద్‌లో మద్దతు క్రమం గా పెరుగుతోంది. సీమాంధ్ర పార్టీల నాయకులెంతో మంది ఆ పార్టీ లను వీడుతున్నారు. జీహెచ్‌ఎంసీలో ఎవరు అధికారంలో ఉన్నా సరే …వారికి తెలంగాణ ప్రయోజనాలే పరమావధి కావాలి. సీమాంధ్ర పా ర్టీల నాయకులే రేపటి నాడు ఎన్నికైతే తెలంగాణ ప్రయోజనాల కోసం వారి కృషి ప్రశ్నార్థకం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ వాదులనే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కిరణ్


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *