జోనల్ వ్యవస్థలో మార్పులు రావాలి

తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ర్టం జో నల్ వ్యవస్థ – 371 (డి) పరిణామాలు’ అనే అంశంపై 19వ చర్చా కార్యక్రమం జరిగింది. టీఎన్‌జీవో గౌరవాధ్యక్షులు జి.దేవీ ప్రసాద్, టీ ఎన్‌జీవో అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ఇంటర్ విద్య జాక్ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసి యేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సయీద్ సలీముద్దీన్, రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీధర స్వామి తదితరులు వక్తలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీఎన్‌జీవో గౌరవాధ్యక్షులు జి.దేవీప్రసాద్ మాట్లా డుతూ, స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా జోనల్ వ్యవస్థలో మార్పులు రావాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాలు, ఉద్యోగాల హే తుబద్ధీకరణ, స్థానికత, వివిధ జిల్లాల మధ్య ఉన్న అసమానతలు, ల భిస్తున్న విద్యా ఉద్యోగావకాశాలు తదితరాలను దృష్టిలో ఉంచుకొని జో నల్ వ్యవస్థలో మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశానికి హాజరైన ఇతర వక్తలు మాట్లాడుతూ…… ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యోగ రంగాల్లో అందరికీ సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 371 (డి) రూపొందించారు. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 1974లో దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. దీంట్లో మొ త్తం 10 క్లాజులున్నాయి. విద్య, ఉద్యోగావ కాశాల గురించి 1వ క్లాజ్ లో నిర్వచించారు. దీని ఆధారంగానే రాష్ర్టపతి ఉత్తర్వులు వచ్చాయి. 1974లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 674 జి.ఒ. ప్ర కారం, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు.
తెలంగాణ 5,6 జోన్ల కింద ఉంది. 5వ జోన్‌లో నాలుగు, 6వ జోన్‌లో ఆరు జిల్లాలు ఉన్నాయి. ఈ విధంగా విద్య, ఉద్యోగావకాశాల్లో ‘స్థానికత’ భావన తీసుకువచ్చారు. నిజానికి తెలంగాణలో ముల్కీ నిబం ధనలు అమలు కావాలి. 1919లో వచ్చిన ముల్కీ నిబంధనలు హైదరా బాద్ స్టేట్‌లో, ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కొంత కాలం పాటు కొనసాగాయి. ఆర్టికల్ 35 (బి) కూడా ముల్కీ నిబంధ నలను సమర్థించింది. ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ముల్కీ నిబం ధనలు రద్దయ్యాయి.
ముల్కీ నిబంధనల ప్రకారం ఇతర నిబంధనలకు తోడుగా కనీసం 15 ఏళ్ళ పాటు తెలంగాణలో నివసించిన వారికే స్థానికత లభిస్తుంది. ఈ కాలపరిమితిని ఆ తరువాత 7 ఏళ్ళకు, మరికొంత కాలం తరు వాత 4 ఏళ్ళ విద్యాభ్యాసానికి కుదించారు. గతంలో ప్రభుత్వ ఉద్యో గాలు జిల్లా, జోనల్, మల్టీ జోన్, రాష్ర్టస్థాయి అంటూ నాలుగు రకా లుగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో ఎల్‌డీసీ, అంత కన్నా దిగువ స్థాయి ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. వీటిలో 0 శాతం స్థానికులకు కేటాయించారు. ఇంత పక్కాగా నిబంధనలు రూపొందించుకున్నా తెలంగాణ వారికి అన్నింటా అన్యాయమే జరిగింది…’’ అని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన నేపథ్యంలో జోనలైజేషన్ అ వసరమా, కాదా అనేది చర్చనీయాంశంగా మారింది. స్థానిక అభ్యర్థు లు ఆయా ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు జోనల్ వ్యవస్థ ఉండాల ని వక్తలు పేర్కొన్నారు. అదే సమయంలో జోన్ల సంఖ్యను పెంచి వాటి ని హేతుద్ధీకరణ చేయాలని అభిప్రాయపడ్డారు. వివిధ పోస్టులను కూడా రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమానికి కారెం రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. విశ్రాం త అధ్యాపకులు, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉపాధ్య క్షులు చందా రాములు సమన్వయకర్తగా వ్యవహరించారు. టీఆర్‌సి చైర్మన్ యం.వేదకుమార్, డా॥జి.త్రిపాఠి, జె.శ్రీనివా స్‌రెడ్డి, ఎన్.ఆది నారయణ రెడ్డి, ఎం.నరేంద్రకుమార్, డి.కరుణాకర్, ఎస్. లక్ష్మణరావు, బి.వేణుమాధవ్, జి.రాజేంద్రకుమార్, గోలి రవీందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివిధ ఉద్యోగసంఘాల నాయకులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *