తెలంగాణ చరిత్ర పితామహుడు – ఠాకూర్ రాజారాం సింగ్

తెలంగాణలో ఎక్కడ ఇంతపిడికెడు మట్టిముట్టుకున్నా అపూర్వ మైన చరిత్ర బయటపడుతుంది అన్నాడు గజపతిరాయ్ వర్మ. ఆయన నరసురలు పత్రికాసంపాదకులు,నల్లగొండజిల్లా హుజూర్ నగర్ తన జన్మభూమి.ఆ మాట నిజంచేస్తు ఆదిలాబాద్ నుండి ఖమ్మందాక ప్రాణహిత, గోదావరి నదీలోయల్లో అఖండమైన తెలంగాణచరిత్రను వెలికితీసిన అసామాన్యమైన చరిత్రకారుడు ఠాకూర్ రాజారాంసింగ్. ఒంటిచేత్తో 150 తావులలో తవ్వకాలు జరిపి, తెలంగాణచరిత్రకు ప్రాణం పోసినవాడు, చరిత్రంటే ప్రాణమిచ్చే పురాతత్వవేత్త సింగ్. మల్లంపల్లి సోమశేఖరశర్మ తర్వాత నిబద్ధతతో, నిస్వార్థంతో ఎటువంటి కీర్తి, ధనకాంక్షలు లే కుండ చరిత్రకొరకు నిరంతరం శ్రమించిన వా డు ఒక్క ఠాకూర్ రాజారాంసింగేనన్నడు ప్రసిద్ధ జర్నలిస్టు జి.కష్ణ.
రాజారాంసింగ్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నివాసి ఠాకూర్ నారాయణసింగ్, కష్ణాబాయి దంపతులకు పెద్దకొడుకు. సింగ్ 15. 09.192న పుట్టిండు. జాతీయ భావాలు, పో రాటతత్వం కలిగిన మేనమామ బలదేవ్ సింగ్‌తో 1939లో జరిగిన వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నప్పు డాయన వయస్సు 11 ఏళ్ళే. తమ్ముడు శ్యామసుందర్ సింగ్‌తో కలిసి నిజాం వ్యతిరేకపోరాటంలో విద్యార్థి నాయకుడుగా పాల్గొన్నాడు. చిన్నప్పటి నుండి అన్యాయాల్ని ఎదిరించే తత్వమాయనది. రెండవసారి నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా నడిపిన ఊరేగింపుకు నాయకత్వం వహించిండు రాజా రాం సింగ్. ఆ ఊరేగింపుపై పోలీసులు జరిపిన లాఠీఛార్జిలో గాయపడి ఆసుపత్రిపాలైతే, డా.అమ్జదలీ విద్యార్థు లందరికి చికిత్స చేయించిండంట. ఆ వరుసన బడినుండి తొలగించ బడ్డడు. తమ్మునితో కలిసి హైద్రాబాద్ చేరుకుని చదువుసాగించు కుంటనే కామ్రేడ్స్ క్లబ్, ఆంధ్ర మహాసభల్లో పనిచేసిండు. ఎన్నో ఢక్కామొక్కీలు తినుకుంట 1947లో అలీఘడ్ యూనివర్సిటి నుంచి మెట్రిక్యులేషన్, 1956లో గ్వాలియర్ యూనివర్సిటినుంచి ఇంటర్మీడియెట్, ఉస్మానియా నుంచి 1960 నాటికి బి.ఎ. తర్వాత ఎల్.ఎల్.బి. పూర్తిచేసిండు.1975వరకు ఎం.ఏ (ఆర్కియాలజీ) పట్టాను జైపూర్ యూనివర్సిటి నుండి పొందిండు.అదే సంవత్సరం పూనా యూనివర్సిటిలో చరిత్రపరిశోధకవిద్యార్థిగా చేరిండు.
ఆ రోజుల్లో తెలంగాణసాయుధపోరాటం ఉధతిని గురించి మహాత్మాగాంధీకి చెప్పడానికి ఢిల్లీకి పోయొస్తుంటె పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టిండ్రంట. గాంధీజీ చనిపోయినపుడు ఆయన స్మతిలో తనకాత్మీయులైన ఆరుగురు దోస్తులతో కలిసి జీవితాంతం తమ సంపా దనలో 60 శాతం ప్రజాసేవకు ఖర్చుపెట్టాలని తీసుకున్న నిర్ణయం రాజారాంసింగ్ తుచ తప్పకుండ పాటించిండు. ఆయన మాటంటే మాటే. ఖచ్చితం. సమయపాలనలో అంతే ఖచ్చితంగా వుండేవాడని ఆయన్నెరిగిన వారంత చెపుతుంటరు. ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నం దుకు ప్రభుత్వ మిచ్చిన పెన్షన్ తీసుకో లేదు. ఇటు ఆర్కియా లజీవారు తనకిస్తనన్న గౌరవవేతనం కూడ తీసుకోలేదు. రాజారాం సింగంటేనే ఆయన కమిట్మెంట్‌ని, సీరియస్ నెస్‌ని చూసి గౌరవించేవారు. భయపడే వారంట. అంత కరుకుమనిషి (లోకంమాట)లో మార్ద వమైన మనసు న్నది.ఆయన చదువుకునే కాలంనుంచే ‘అమరభారతి’ అనే కలం పేరుతో కవిత్వం రాస్తుండేవాడు. కొంత కాలం జర్నలిస్టుగా కూడ పనిచేసిండు. ఆయనకు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో మంచిపట్టుండేది. తెలుగువచ్చు కాని, ఆయన రాత చిన్నపిల్లగాని రాత లెక్కుం టది. కవిసమ్మేళనాల్లో పాల్లొన్నప్పుడు బహుభాషల కవిత్వం వినిపించేవాడు. ఢిల్లీ నుండి వచ్చే ‘ఫన్ కార్’ అనే ఉర్దూపత్రికకు శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని అనువాదం చేసి పంపిండంట. వేమన గురించి ఇంకో పత్రిక ఫయాంకు వ్యాసం రాసిండు.
‘పురాణేతిహాసాల రహస్యాలను విప్పిచెప్పే చారిత్రకకేంద్రం తెలంగాణ’ అన్న కొమర్రాజు వెంకటలక్ష్మణ్ రావు చెప్పిన మాటలను రుజువు చేస్తూ ఠాకూర్ రాజారాంసింగ్ తెలంగాణంతట తిరిగి స్వ యంగా తెలుసుకున్న విషయాలతోనే చరిత్రను రాసిండు. ‘బాసర నుంచి భద్రాచలం దాక’ అనే చారిత్రకవ్యాసమొక్కటి చాలు ఆయన ప్రతిభకు మచ్చుతునక. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో చారిత్రకాన్వేషణలు చేసిండు.ఎన్నో చారిత్రకపరిశోధనా పత్రాలను రాసిండు. ూ్‌శీఅవవ శ్రీ్‌తీవర శీ ఖతీఱఎఅతీ’ అన్నది ఆయన పరిశోధనాంశం. కాని, ఆయన రాసిన వ్యాసాలు చదివితే ఇంత పరిశోధన ఎప్పుడు చేయగలిగిండు, ఎట్ల చేయగలి గిండనిపిస్తది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *