తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం

ప్రకృతితో జీవజాలానికి, తల్లితో బిడ్డకు గల అనుబంధం లాంటిదే మనకు, మన వారసత్వానికి గల సంబంధం. ఈ పేగు బంధం… కృ త్రిమంగా ఏర్పరచలేని అనుబంధం. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి నా, ప్రపంచంలోని సమస్త సంపదను ధారపోసినా ఈ విధమైన అను బంధాన్ని కృత్రిమంగా ఏర్పరచుకోలేము. మనకు, మన పూర్వీకులకు మధ్య ఉన్న అనుబంధంలో కొన్ని గొలుసులు తెగిపోయాయి. ఆ అను బంధాన్ని సంపూర్ణం చేసే క్రమంలో, తెగిన గొలుసులను అతికించే మహత్కార్యమే కొత్త చారిత్రక స్థలాల పుస్తకం.
మన సాంస్కృతిక, చారిత్రక, విద్యాత్మక, సౌందర్యాత్మక, స్ఫూర్తి దా యక, ఆర్థికపరమైన వారసత్వాలకు కీలకమైన లింకులు చారిత్రక ప్రా ధాన్య స్థలాలు. వాటిని కనుగొనడం ద్వారా, మరుగునపడిన వాటిని వెలికితీయడం ద్వారా మన వారసత్వాన్ని, దాని మూలాలను కనుగొన డం, ప్రాచుర్యంలోకి తీసుకురావడం యావత్ తెలంగాణ జాతి గర్విం చదగ్గ మహత్కార్యాల్లో ఒకటి.
మన చరిత్ర… మనకు మాత్రమే ప్రత్యేకమైంది. అలాంటిది మరె వరికీ ఉండదు. ఎంత ప్రయత్నించినా మరెవరూ అందులో భాగస్వా ములు కాలేరు. అలాంటి చరిత్రను తెలుసుకొని, పదిలం చేసుకొని, భా వితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. అందులో భాగంగా ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నాం.
మన వారసత్వాన్ని భావితరాలకు అందించడం వారికి మనమిచ్చే ఒక అమూల్య కానుక. మరెవరూ అలాంటి అద్భుత కానుకను రేపటి తరాలకు అందిం చలేరు. ఇది మన అందరి ఆస్తి. ఆ ఆస్తిని భద్రపర్చు కోవడం, దాన్ని భావితరాలకు అందించడం మన బా ధ్యత. ఈ విధమైన వారసత్వాన్ని అందించి నేడు మ నం ఇలాంటి మెన్నత చారిత్రక, సాంస్కృతిక వా రసత్వ సంపదను కలిగి ఉండేందుకు కారణమైన పూ ర్వీకులకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకునే విధా నం ఆ సంపద ను పరిరక్షించుకోవడమే. మనం ఎ వరిమో తెలుసుకునేందుకు, మన మూలాలు ఎక్కడున్నాయో తెలుసు కునేందుకు ఉపకరించేంది ఈ విధమైన వారసత్వ సంపదనే.
మన ఇంట్లో ఒక పాత తరం ఉంటే మనకు ఎంతో ధీమాగా ఉం టుంది. క్లిష్టమైన సమస్యలకు వారు మనకు మార్గదర్శనం చేస్తారు. మ నకు మరెన్నో అంశాలను బోధిస్తారు. జాతికి సంబంధించి వారసత్వ సంపద ఇదే విధమైన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. అడుగడుగునా అది మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. పాఠాలను, గుణపాఠాలనూ నే ర్పుతుంది. సరైన బాటలో ఎలా పయనించాలో మార్గనిర్దేశనం చేస్తుం ది. చిమ్మచీకట్లో చిరుదీపం లాంటిది మన వారసత్వ సంపద. ఆ దీపం కొండెక్కకుండా, కొండల్లో దాగి ఉన్న మన చరిత్రను ఆ దీపం వెలుగు లో మనం చూడాల్సి ఉంది. ఆ కర్తవ్యంలో ఒక అడుగు ఈ పుస్తక ప్రచురణ. సహజవనరులను అపరిమిత స్థాయిలో వెలికిితీయడం అన్ని విధాలుగా మనకు చేటు తెస్తోంది. మరీ ముఖ్యంగా చారిత్రక ప్రాధా న్యం ఉన్న స్థలాల విషయానికి వస్తే, కొండల, గుట్టల విధ్వంసాన్ని, అ డవుల నరికివేతను మనం అడ్డుకోవాలి. ఆయా చారిత్రక ప్రాధాన్య ప్రాంతాలను పరిరక్షించుకోవాలి. తెలంగాణ స్వరాష్ర్ట సాధనకు ఉద్య మించిన రీతిలోనే ఈ ప్రాంతాల పరిరక్షణకు ఉద్య మించాలి. ఆ దిశలో మన కార్యాచరణను ఉధృతం చేసేందుకు ఒక కరదీపికగా ఈ పుస్తకం ఉపకరిస్తుం ది.
నాటి కాలంలో ఒక్కో వ్యక్తి అనుభూతులకు, అ నుభవాలకు, జ్ఞాప కాలకు, విజ్ఞానానికి ఇచ్చిన ఉమ్మడి రూపమే వివిధ రూపాల్లోని మన చారిత్రక వారసత్వ సంపద. అక్షరాలుగా, చిత్రలేఖనాలుగా, శి ల్పాలుగా, ఉపకరణాలుగా ఈ సంపద నేడు మనకు లభ్యమవుతోంది. మన చారిత్రక ప్రాధాన్య వారసత్వ సంపద మనకు ఉన్నది దాన్ని నాశనం చేసుకునేందు కు కాదు… దాన్ని మనం ఆనందించేందుకు … ఇ తరులతో పంచుకునేందుకు… భావి తరాలకు అందించేందుకు. తెలం గాణ సమాజం ఐక్యంగా ఉండేందుకు ఈ చారిత్రక వారసత్వం తోడ్ప డుతుంది. యావత్ ప్రపంచంలో మానవ వికాసం చోటు చేసుకున్న అ తి కొద్ది ప్రాంతాల్లో దక్కన్ పీఠభూమిలో భాగమైన మన తెలంగాణ ఒ కటి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవ జాతి నాగరికత అభివృద్ధి చెందడం మొదలైంది. అందుకు సాక్ష్యం మన వద్ద ఉన్న చారి త్రక ప్రాధాన్య ప్రాంతాలే. తెలంగాణలోని పది జిల్లాలు కూడా ఒకే గొలుసులోని రంగు రంగుల పూసల్లాంటివి. వీటన్నింటినీ అనుసంధా నిస్తూ తెలంగాణ అనే దారం ఉంది. ఆ దారాన్ని పదిలం చేసుకుంటూ పది జిల్లాల అను బంధాన్ని పటిష్ఠం చేసుకుంటూ మన చారిత్రక వార సత్వాన్ని పదిలం చేసుకుంటూ మునుముందుకు సాగుదాం.
నేటి కాలంలో వ్యక్తి తన స్వీయ ఉనికి కోసం సామూహిక ఉనికిని, సామాజిక శక్తులను, చారిత్రక వారసత్వాన్ని తోసిపుచ్చుతున్నాడు. ఇది క్షమించలేని నేరం. తెలంగాణలోని ప్రతి వ్యక్తి కూడా ఇక్కడి సుసం పన్న చారిత్రక వారసత్వానికి గర్వించాలి. దాన్ని తరతరాలకూ అం దించాలి. అలా చేయడంలో తెలంగాణ యావత్ ప్రజానీకానికీ ఈ పు స్తకం ఒక దివిటీ కావాలి. కరీంనగర్ జిల్లాలోని పాండవలొంక జల పాతం సమీపంలోని గుహల్లోని చిత్రలేఖనాలు, మహబూబ్‌నగర్ జిల్లా మన్నెంకొండ సమీపంలోని పోతన్‌పల్లి గుహల్లోని చిత్రాలు, దొంగల గట్టులో మధ్య, కొత్త రాతియుగపు ఉపకరణాల సేకరణ, నల్గొండ జి ల్లాలో ఆదిమ మానవుల చిత్రలేఖనాలు …తెలంగాణ జిల్లాల్లో ద్యావన పల్లి సత్యనారాయణ ఎంతో శ్రమకోర్చి వెలుగులోకి తీసుకు వచ్చిన చరిత్రను ఇప్పుడు పుస్తకరూపంలో అందిస్తున్నందుకు ఎంతో ఆనందం గా ఉంది. తప్పిపోయిన చిన్నారి తన తల్లిని కలుసుకుంటే కలిగే ఆనం దం ఇది. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఇప్పటికి ఇది చిన్న ప్రయత్నమే అయినప్పటికీ తెలంగాణ సంపూర్ణ చరిత్రను వె లుగులోకి తీసుకువచ్చే రేపటి ప్రయత్నానికి ఇది ఒక పటిష్ఠపునాదిని వేస్తుందని విశ్వసిస్తున్నాం. ఒక జాతిని తుదముట్టించేందుకు ఆధునిక కాలంలో శత్రువులు ఎంచుకునే మార్గం ఆ జాతి చరిత్రను, సంస్కృతిని నాశనం చే యడం. తెలంగాణ జాతిపై కూడా అలాంటి ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ప్రయత్నాలు ఇక ముందు జరగకుండా ఉండాలం టే, అలాంటి దాడులను తిప్పి కొట్టాలంటే మన చరిత్రను మనం కాపా డుకోవాలి. ముందు తరాలకు అందించాలి. ఆ లక్ష్య సాధనలో మనం విజయం సాధించేందుకు ఒక అస్త్రంగా ఈ పుస్తకం ఉపయోగపడు తుందని విశ్వసిస్తూ, ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళ డంలో మీ సహకారాన్ని కోరుతున్నాం.
ఆరు దశాబ్దాల పరాయి పాలనలో మన చారిత్రక వారసత్వం మన కు కాకుండా పోయింది. అంతకు ముందు పాలించిన కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ వంశీయులు దక్కన్ సంస్కృతిలో భాగమై పోయినప్పటికీ, మన చరిత్రను వెలుగులోకి తీసుకురావడంలో, చారిత్రక ఆధారాలను పరిరక్షించడంలో చేసిన కృషి స్వల్పమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళూ మనకు దక్కకుండా పోయిన చరిత్రను ఇప్పుడు వెలుగులోకి తేవడం ఎంతో కష్టం. అలాంటి కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఎంతో శ్రమించి అమూల్య అంశాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి ఎంతోమంది ఎన్నో విధాలుగా కృషి చేశారు. అ లాంటి వారిలో ద్యావనపల్లి సత్యనారాయణ ఒకరు. ఈ పుస్తక రచనకు గాను ఆయనకు నా అభినందనలు. మన చరిత్రను, సంస్కృతిని రేపటి తరం పౌరులైన నేటి విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. అందుకుగాను ఈ పుస్తకంతో పాటుగా ఈ తరహా పుస్తకాలను విద్యా ర్థులకు పాఠ్యపుస్తకాలుగా, ఉప వాచకాలుగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసిన నాడు చరిత్ర, సంస్కృతిపై అవగాహన కలిగిన బలమైన రేపటితరాన్ని రూపొందించుకోగలుగుతాం. ఆ దిశలో ప్రభుత్వం కూడా తగు ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ చరిత్రను నమోదు చేయడంలో గతంలో ఎంతో నిర్లక్ష్యం జ రిగింది. ఎన్నో వక్రీకరణలు చోటు చేసుకున్నాయి. స్వరాష్ర్టం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు మన చరిత్రను మనమే రాసుకోవాలి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్‌ను విడగొట్టి తెలంగాణ స్టేట్ హిస్టరీ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయాలి.
చరిత్రకారులంతా తెలంగాణ చరిత్రను వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ చరిత్ర రచన అధి కారికంగా, సాధికారికంగా జరిగేలా చూడాలి. పాలక వర్గాల జీవితా లనే గాకుండా పాలితవర్గాల జీవితాలకు కూడా అద్దం పట్టేలా ఆ ర చన ఉండేలా జాగ్రత్త పడాలి.
ఇక రచయిత ద్యావనపల్లి సత్యనారాయణ విషయానికి వస్తే, ఆ యన ఇప్పటి వరకు రాసిన పుస్తకాల్లో అత్యంత విలువైన పుస్తకం ఇది. ఎందుకంటే ఇందులోని మొదటి 11 వ్యాసాల్లో ఆయన కను గొన్న 15 కొత్త చారిత్రక విశేషాలున్నాయి.
13వ వ్యాసంలో మరో ఆవిష్కరణ ఉంది. ఈ పదహారు చారిత్రక ఆవిష్కరణలు కూడా తెలంగాణ చరిత్రను తెలుసుకునే క్రమంలో ఆ యన పేరును గుర్తు చేసుకునేలా చేస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ అంశాలు భవిష్యత్తులో తెలంగాణ చరిత్ర పాఠ్యాంశాలవుతాయని కూడా మేము విశ్వసిస్తున్నాం.
టి.ఆర్.సి ఇప్పటి వరకు ప్రచురించిన అన్ని ప్రచురణల మాదిరి గానే ఈ పుస్తకాన్ని కూడా తెలంగాణ ప్రజానీకం విశేషంగా ఆదరిం చగలదని ఆశిస్తున్నాం.

(ద్యావనపల్లి సత్యనారాయణ ఇటీవల నూతన రచన ‘తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు’ పుస్తకానికి టి.ఆర్.సి. చైర్మన్ యం.వేదకుమార్ ముందుమాట)


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *