తెలంగాణ భాషా, మాండలికమా?

ఒక భాష మరొక భాషపై ఆధిక్యం చలాయించడం అనాదిగా వస్తున్నదే. అలా ఎన్నో భాషలు కాలగర్భంలో కలినిపోయాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ భాష, దాని పూర్వాపరాల గురించి చర్చిస్తున్నారు తెలుగు భాషా పండితులు డా॥ నలిమెల భాస్కర్

ప్రపంచవ్యాప్తంగా సమస్త ఆధిపత్యాలను ప్రశ్నిస్తున్న కాలం యిది. పురుషల్ని న్ర్తీలు నిలదీస్తున్నారు. మేమూ మనుషలమేనని! అగ్రవర్ణాల వారిని దళితులు అడుగుతున్నారు, మేమూ మీలాంటి మానవులమే నంటూ. ప్రపంచ భాషగా చేయబడ్డ ఇంగ్లీష పెత్తనాన్ని తన మాతృభాష ‘గికుయూ’ లో తప్ప రాయనని గుగివాథియాంగో ధిక్కరిస్తున్నాడు. ఉత్తరాది హిందీని నిన్నా మొన్నటి వరకు తమిళులు తిరస్కరించారు. త్రిభాషా సూత్రం ప్రకారం మీరూ మా దక్షిణ దేశ భాషల్లో ఏదైనా ఒకటి నేర్చుకోవాలని వాళ్ళు తమ నిరసన గళం బలంగా విప్పారు. బెంగాలీ ఆధిపత్యాన్ని అస్సామీన్, ఒరియా భాషీయులు కడిగేశారు. పైగా జయదేవుడు మా వాడేనని నినదించారు ఓఢ్రులు. తమిళ పెత్తనం మలయాళం మీద చెల్లదని చెప్పేశారు కేరళీయులు. ఇవాళ… ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నర జిల్లాల అగ్రవర్ణాల ఆంధ్ర భాష పెద్దరికాన్ని నిలవరిస్తూ, తెలంగాణది కూడా భాషేనని నిరూపిస్తున్నారు తెలంగాణ తల్లి ముద్దు బిడ్డలు.
మరి ఇప్పటివరకు ఎందుకు తెలంగాణ మాండలికం అయ్యింది? సాహిత్యంలో స్థానీయత ప్రవేశించాక, ప్రాంతీయ అన్తిత్వ పరివేదనలు మొదలయ్యాక మనకు తెలిసొచ్చిందేమంటే నోరున్నవాడిదే ఊరూ, బడితై ఉన్నవాడిదే బర్రె, చెప్పుకొన్నవాడిదే చరిత్రా అని. ఇప్పుడిప్పుడే అసలు నిజాలు తెలిని వస్తున్నాయి. ఆంధ్ర భాషావేత్తల పాక్షిక సత్యాలు, తప్పుడు సూత్రీకరణల అసలు విషయం బయటపడుతున్నది. సత్యం తేటపడుతున్నది.
తెలంగాణ భాషేననీ, అది మాండలీకం కాదనీ చెప్పడానికి కావలనినన్ని ఆధారాలున్నాయి. అంతేకాదు, రెండున్నర జిల్లాల ఆంధ్రభాష అసలు భాషే కాదనీ, అది కేవలం మాండలీకమనీ నిరూపించ డానికీ చాలినన్ని సాక్ష్యాలున్నాయి. పాఠకుల సౌకర్యం కోసం రెండున్నర జిల్లాల అగ్రవర్ణాల ఆంధ్రభాష, ఆధునిక ప్రమాణ భాష, ప్రామాణిక భాష, పత్రికా భాష, శిష్ట వ్యావహారిక భాష… వీటిని నేను సమా నార్థకాలుగా గ్రహించి వ్యాసం కొనసాగిస్తాను.
ముందుగా తెలంగాణ భాషలోని కొన్ని పదాలనూ ప్రామాణిక భాషలోని కొన్ని పదాలనూ ఆధారంగా చేసుకుని ఏది భాషో, ఏది మాండలికమో నిర్థారణ చేసుకుందాం: అనంగనంగ, ఎదురంగ, రాంగరాంగ, పోంగపోంగ, గేంగులు, బానింగాలు, తేటుంగ, టుగుటుయ్యాల, తెలంగాణ, వరంగల్, తంబాకు, చిమ్మంజీకటి, తెల్లందాక, పొద్దుందాక, ఆంబోతు, తాంబేలు, నాగుంబాము, యాసంగి, పండుకునుడు…ఇవన్నీ తెలంగాణ పదాలు. ఇంక వీటిని ప్రామాణిక భాషలో చూద్దాం : అనగా అనగా, ఎదురుగా, రానూరానూ, పోనూపోనూ, తేగలె, బానికాలు, తేటగ, తూగుటుయ్యాల, తెలంగాణ, వరంగల్, పొగాకు (టుబాకో), చిమ్మచీకటి, తెల్లవార్లూ, పొద్దుగూకులూ, ఆబోతు, తాబేలు, నాగుపాము, వేసవి, పడుకోవడం. ప్రామాణిక భాషలోని తెలంగాణ, వరంగల్ పదాల్లో తప్పితే ఎక్కడా పూర్ణానుస్వారం లేదు. అనుస్వారాన్ని బట్టి మనం ఏది భాషో, ఏది మాండలీకమో నిర్ణయానికి రావచ్చా? వచ్చు. ఒక్కసారి నిఘంటువులు తిరగేయండి. అసలు ఆ పదాల్లో సున్నాలు లేక అరసున్నాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. కాదంటే ప్రాచీన పద్యసాహిత్యం చదవండి. అక్కడ దాదాపు సున్నాలతో ఉన్న పదాలున్నాయో లేదో తెలుస్తుంది. ఉంటాయి. దాదాపు అవి పూర్ణంగానో, ఖండంగానో ఉంటాయి. దీన్నిబట్టి మనకేం తెలుస్తు న్నది? తెలంగాణ పదాలు చాలావరకు మూల భాషా పదాలకు సమీపం గా ఉన్నాయని. ఇంకో విశేషం… ఈ పూర్ణానుస్వారమే తెలుగు భాషకు అనూహ్యమైన నాదాన్ని ఇస్తున్నది. అందుకే పాశ్చాత్యులు ఈ భాషను ఇటాలియన్ అఫ్ ద ఈస్టు అన్నది. సున్నాలతో పలికి చూేన్త ఎంత నాదాత్మకంగా వున్నదీ, పలక్కపోతే ఎంత పేలవంగా ఉన్నదీ ఇట్టే అర్థమవుతుంది. ‘సరిగమపదని’’లలో ‘మ’’ ఉన్నది. అది పొల్లుగా (మ్) మారితే సున్నాగా పలుకుతున్నది. ‘‘మ్’’ అనే హమ్మింగ్ సౌండులో ఎంత సంగీతం వున్నదో గమనించండి. ఇది తెలంగాణ భాష. అనుస్వార సహిత రూపాలూ మూల భాషకు దగ్గర కనుక, అనుస్వారమే నాదానికి మూలభాతం కనుక తెలంగాణ పదాలన్నీ భాషాపదాలే! ఈ నాద రహస్యం తెలంగాణీయులకు బాగా తెలుసు కాబట్టే సున్నాలేని చోట కూడా నిలుపుకున్నారు. ఉదాహరణకు : క్లాసుమెంటు(క్లాన్‌మేటు), గాంచునూనె (కిరసనాయిల్, గ్యాన్‌నూనె), కాంచు గిలాస (గాజుగ్లాసు), మేనింజర్ ( మేనేజర్), కంసల్య (కౌసల్య), బోదునం (బోదన్ నిజామాబాద్ జిల్లాలోనిది), బొంతల (భోథ్ అదిలాబాద్ జిల్లాలోనిది), మెంతెం (మెంతి), సోంపు (సోపు తిన్నాక నోట్లో వేసుకునేది), తింపుడు (తిప్పడం), తెగారం (తెగింపు), మాంకాళి (మహాకాళి), వచ్చినంక (వచ్చాక), బబ్బులింగం (బబుల్‌గమ్), పంకా (ఫ్యాన్, పక్ష్) మొ॥నవి. పైగా పదమధ్యంలో ఉన్న ‘‘ల’’ కారాన్నీ, ‘‘న’’ కారాన్నీ కూడా అనుస్వారంగా మార్చుతారు. తెలంగాణ వాళ్ళకు కావల్సింది తొందరగా ఉచ్చరించడం. ఆ ‘‘ఉచ్చారణా త్వర’’లో ెనైతం నాదం కోల్పోకుండా చూసుకోవడం. చూద్దాం: ఎంకయ్య పండుగు (వినాయకచవితి), పుంటికూర (పుల్లటికూర అంటే గోంగూర), మెంటకన్ను (మెల్ల(ట) కన్ను), మంటిపొయ్యి (మన్ను(టి)పొయ్యి మట్టి పొయ్యి), తండాట్ల (తన్నులాట), జుంపాలు ( జులుపాలు), పుంజీతం (పులిజూదం మేక పులుల ఆట), బాంచెన్( బానిసను) మొ॥పవి. ఇంకా ‘‘మ’’ కారాన్ని కూడా పూర్ణబిందువుగా మార్చుకొన్న రూపాలున్నాయి. లచ్చిందేవి (లక్ష్మిదేవి), కంజు (కముజు), దుంకుడు(దుముకు), పరంచె దోతులు (పరమ్‌సుఖ్ ధోవతులు) మొ॥నవి.
మరొక ఆధారం.. మూలద్రావిడ భాషకు ఏ పదాలు దగ్గరగా ఉన్నాయో తెలిేన్త ఏది భాషో, ఏది మాండలీకమో అన్న స్పష్టత వస్తుంది.
అదువర్దాక, ఇదువర్దాక, ఎదువర్దాక, తమ్మీ, అరేయ్, అవ్వ, ఉల్లోపల, ఉల్లారుడు, కావలి, కూలి, ఎల్లుతది, కైకిలి, అర్ర, పాలోడా పంగోడా, పురుగుబూచి, పేరీదు, మక్కజొన్నలు మొ॥నవి తెలంగాణ పదాలు. వీటికి ప్రామాణిక భాషలో వరుసగా సమానార్థకాలు ఇలా ఉంటాయి: అంతవరకూ, ఇంతవరకూ, ఎంతవరకూ, తమ్ముడూ, ఓరేయ్, అమ్మ, లోపల్లోపల (ఇన్నర్ ఏరియా), లోపల ఆరడం, కాపలా, మూల్యం చెల్లించాలి, కూలి, గది, దాయాదా, పురుగుపుట్రా, పెద్ద ఈత చెట్టు, మొక్కజొన్నలు మొ॥నవి. ఇందాక తెలిపిన తెలంగాణ పదాలకూ ఇప్పుడు చెప్పబోవు తమిళ పదాలకూ ఎంతో సామీప్యం ఉంది. చూద్దాం : అదువరైయిల్, ఇదువరైయిల్, ఎదువరైయిల్, తంబీ, అడుయ్, అవె్వై, ఉళ్ళే, ఉళ్ళే ఆరువదు, కావల్, కైక్కూలి, అరై, పంగు వహిక్కుమ్ అవన్, పూచ్చి, పెరియ ఈంద మరం, మక్కాచ్చోళం మొ॥నవి. వీటిని నేను మళ్ళీ వివరించనక్కరలేదనుకుంటాను. తెలంగాణ పదాలను వరుసగా తమిళ పదాలతో పోల్చండి. ఉదాహరణకు అరువర్దాక, అదువరైయిల్, ఇదువర్దాక, ఆదువరైయిల్, అని. అట్లాగే ప్రామాణిక పదాల్ని తమిళంతో సరిచూడండి. మక్కాచ్చోళం అంటే తెలంగాణలో మక్కజొన్నలు. అదే ప్రామాణిక భాషలో ఇది మొక్కజొన్నలు ఇది తప్పు. మక్కజొన్నలు కరెక్టు పదం. కారణం ‘చోళం’ అంటే జొన్న. ఇంక నేను అన్ని పదాల్ని వివరించననీ, పాఠకులే సరిపోల్చుకోవాలనీ మరోమారు విన్నవిస్తున్నాను. మరింతకూ ఏం తెలుస్తున్నది? తెలంగాణ పదాలు తమిళానికి (దాదాపు ఇదే మూలద్రావిడం) చాలా దగ్గరని. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన కారణం చేత తెలంగాణ పదాలు ద్రావిడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకే తెలంగాణలో పలుకుతున్నది భాష.
అచ్చతెనుగు పదాలు ఏ భాషలో ఎక్కువగా ఉంటే దాన్ని మనం భాషగా నిర్థారించవచ్చు. మొదటి అచ్చ తెలుగుకావ్యం ‘‘యయాతిచరిత్ర’’ రానింది పొన్నెగంటి ‘‘తెలుగన్న’’. ఆయన ‘‘ఆంధ్రన్న’’ కాదు. తల్లిదండ్రులు తమ బిడ్లకు పేర్లు ఉత్తగా పెట్టరు. సాభిప్రాయంగా నామకరణం చేస్తారు. తెలుగన్న సార్థక నామధేయుడు. పైగా అతడు తెలంగాణవాడు. ఆ కావ్యం పురుడు పోసుకున్నది తెలంగాణ గడ్డమీదనే! పైగా తెలంగాణలో ‘‘తెలంగాణ్యులు’’న్నారు. వీళ్ళు కేవలం తెలంగాణలో మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్‌లో ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళారు. మరి తెలంగాణలోని తెలంగాణ్యులకు తెలుగు రాదా? అది భాష కాదా? మాండలీకమా? అంతెందుకు అసలు ‘‘తెలంగాణ’’ అన్న పదంమీద దృష్టి సారిేన్త విషయం విశదం కాదూ? ‘‘తెలంగాణ’’కు మూలం తెలంగాణము తెలుంగాణెము తెలుంగు ఆణుము. ‘‘ఆణుమనగ దేశాహ్వయంబు’’ అని చదివినట్లు గుర్తు. ఆణెము అంటే స్థానం. ఏమి స్థానమది? తెలుంగు స్థానము అదే తెలంగాణము. మరి ఇక్కడ ఏ మాట్లాడుతారు? తెలుగు. ఏం తెలుగు? అచ్చ తెలుగు. చూద్దాం : ఒక్క కట్టు మీద ఉండడు (ఏకత్రాటిపై నడవడం), ఒక్క చిత్తం చేసుకునుడు ( న్థిరచిత్తం చేసుకోవడం), ఓంు్ట్పమల్లెతనం (అసూయ), ఓం్ట్వలేనితనం (ఈర్ష్య), కండ్లమంటతనం(ఈర్ష్య), కన్నెర్రతనం (అసూయ), కాల్లురెక్కలు సల్లవడుడు (నవనాడులూ క్రుంగిపోవడం), కోడిగుడ్డు అట్టు (ఆమ్లెట్), గంటగొట్టినట్టు (ఘంటాపథంగా), చెరిసగం రాత్రి(ఆర్థరాత్రి), చెయ్యిరిగినట్లు (భుజం పోయినట్లు), జెట్టక్క నెత్తి మీద కూసునుడు (దరిద్రదేవత తాండవించడం), తెల్వనితనం (అజ్ఞానం), తెల్సినతనం (జ్ఞానం), తెలినితెల్వనితనం (హాఫ్ నాలెడ్జ్), దగ్గెరదగ్గెర (రమారమి), నిప్పులమీద బొర్లిచ్చుడు (అగ్నిపరీక్షకు గురిచేయడం), నీల్లు పోయినంక రాల్లు ఏనినట్టు (గతజల ేనతుబంధం), నోటికచ్చుడు (కంఠతాపాఠం), బరువు మనిషి (గర్భిణీ న్ర్తీ), మంచితనం (సజ్జనత్వం), సగం కడ్పుకు తినుడు(అర్థాకలి), సక్కదనం (అందం), బ్రాకెట్లలో ఇచ్చినవన్నీ శిష్ట వ్యావహారికాలు. తెలంగాణలో పండితులూ, పామరులూ మాట్లాడేది దాదాపు అచ్చ తెనుగు పదాలే! ఇట్లా మనం వందలాది, వేలకొద్ది పదాలు ఉదాహరణలుగా చూపవచ్చు. ‘‘వాడు గంట గొట్టినట్లు మాట్లాడుతడు’’ అంటే తప్పేముంది? ‘‘వాడు ఘంటా పథంగా మాట్లాడుతాడు’’ అంటే గొప్పేమిటి? ప్రామాణిక భాషలో చాలా వరకు తత్సమాలుంటాయి. అవన్నీ తత్ అంటే సంసృ్కత ప్రాకృత సమాలే కదా! తెలంగాణలో చాలావరకు తెలుగు పదాలుంటాయి. కనుక తెలం గాణలో సంభాషిస్తున్నది భాష. రెండున్నర జిల్లాల అగ్రవర్ణభాష మాండలికం.
ఏ భాషలో నాదం ఉంతో, ఎక్కడ తూగు అద్భుతంగా నిలదొక్కుకుం దో, ఏ ప్రాంతం లయాత్మకమైన భాష మాట్లాడుతుందో పాఠకులు గ్రహించవలనిన అవసరముంది. ముందుగా తెలంగాణలోని పదాలను గమనిద్దాం : అతులంకుతలం (అతలాకుతలం), తల్లడం మల్లడం (తల్లడిల్లడం), కలగం పులగం(కలగాపులగం), ఇచ్చుకం పుచ్చుకం (ఇచ్చిపుచ్చుకోవడం), కిందవడి మీదవడి (కిందామీదా పడి), చెప్పకుంట చెయ్యకుంట (చెప్పాపెట్టకుండా), అంటుకు లేదు సొంటుకు లేదు (అంటూ సొంటూ లేదు), ఇల్లు లేదు ముంగిలి లేదు (ఇల్లూవాకిలీ లేదు), ఈక తెల్వది తోక తెల్వది( తలా తోక తెలీదు), ఉలుకు తేదు పలుకూ లేదు(ఉలుకూ పలుకూ లేదు), ఎగ్గు లేదు నిగ్గు లేదు( ఎగ్గూ నిగ్గూ లేదు), ఈక గాదు తోక గాదు (ఎందుకూ కొరగానిది), మెసుల రాదు కసులరాదు(కదలరాదు), నోరామోరా? (నాలుకా తాటి మట్టా?), కడుపా కయ్యా?(కడుపా కొల్లేటి చెరువా?), ఉంటె వైకుంటం లేకుంటే ఊకుంటం(ప్రామాణిక భాషలో దీనికి సమానార్థకం ఏ సామెత ఉందో తెలియదు), ఇర్కడు దొర్కడు (చిక్కడు దొరకడు), సుట్టాలు పక్కాలు (చుట్టపక్కాలు), తెలంగాణ పదాలకు సుమారు సమానంగా ఉన్న పదాల్ని ఆధునిక ప్రమాణ భాషలోంచి బ్రాకెట్లలో చూపించాను. తెలంగాణ పదాలు, పదబంధలు, సామెతలు అన్నీ ఒకే రకమైన ‘‘తూకం’’ పాటిస్తున్నాయి. ఇంకా ‘‘అతులం కుతులం’’ మొదలైన వాటిల్లో ఈ ‘‘తూగు’’ మాత్రమే కాక అదనంగా నిండుసున్నా కూడా వచ్చి చేరు తున్నది. ఈ లక్షణాలతోనే తెలంగాణ భాష ఇతర ప్రాంతాల కన్న విల క్షణంగా ఉన్నది. నిజానికి అది విలక్షణమా, సలక్షణమా, అవలక్షణమా ఎవరు చెప్పగల్గుతారు? ఆంధ్రన్రదేశ్‌లోని మూడు ప్రాంతాల భాషలూ లేదూ మాండలికాల మీద పట్టు ఉన్నవాళ్ళు చెప్పగలరు. శోచనీయ విషయం ఏమంటే… తెలుగు భాషావేత్తలందరూ నిజానికి ఆంధ్ర భాషావేత్తలు కావడం. వాళ్ళకు తెలంగాణ భాషరాదు. రాకున్నా తెల్సుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళందరూ ఇంగ్లీషలో ఆలోచించి తెలుగులో రాస్తారు. వాళ్ళందరూ భాషాశాస్త్రాలు తిరగేశారు కానీ తెలంగాణ ప్రాంతంలో తిరగలేదు తిరగలేరు వాళ్ళకు తెలంగాణ భాషరాదు. కనుకలే తప్పుడు నిద్ధాంతాలు తప్పుడు సూత్రీకరణ. భాషావేత్తలకు ముందు భాష తెలియాలి తర్వాత శాస్త్రం తెలియాలి. కానీ చాలామందికి తెలంగాణ భాష రాదు ఇంక అసలు విషయానికొద్దాం. పై ఉదాహరణల వల్ల తెలంగాణ పలుకులో ‘‘లయ’’ ఉన్నదని తెలుస్తున్న ది. ఈ ‘‘లయ’’ వల్లనే తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈన్‌‌ట అయ్యింది. ‘‘లయ’’ మిన్ అయినది భాష కాదు మాండలికం అవుతుంది.
భాషలోని మూలరూపాలకు తెలంగాణ పదాలు అతి దగ్గరగా ఉన్నా యని చెప్పడం ద్వారా కూడా తెలంగాణలో ఉన్నది భాషేనని నిరూపించ గలం. అదీ చూద్దాం : అక్క, అన్న, చెల్లె, అత్త, చిన్నాయన, పిల్ల, పిల్లగాడు, పావురం, కీచేపిట్ట, కొంగ, సార. ఇవి తెలంగాణ పదాలు. ఈ పదాలన్నీ దాదాపు మూలభాషకు దగ్గరగా ఉన్నవే! ఇంకా పత్రికా భాషలో వరుసగా ఇవి ఇట్లా ఉంటున్నాయి. అక్కయ్య లేదా అక్కాయ్, అన్నయ్య లేదా అన్నాయ్, చెల్లి లేదా చెల్లాయ్, అత్తయ్య లేదా అత్తాయ్, బాబాయి, అబ్బాయి, అమ్మాయి, పావురాయి, కీచురాయి, కొక్కిరాయి, సారాయి. అక్కకు మూలరూపం ‘‘అక్కాళ్’’ (తమిళం). ప్రమాణ భాషలో లక్కకు అయ్యను కలిపారు. న్ర్తీ లింగానికిక పుంలింగం కలపడం దేనికి? మరి మొత్తంమ్మీద ‘‘అక్కయ్య’’ ఏ లింగపదం? ఆ చివరి అయ్యను చూేన్త అది ఏ లింగస్ఫూర్తిని కల్గిస్తున్నది? ‘‘అన్న’’ కు తమిళరూపం ‘‘అణ్ణన్’’ పోనీ అన్నయ్య అంటే ఒప్పుకుందాం. ఏతావాతా అది పుంలింగ పదం కనుక. మళ్ళీ ‘‘అన్నాయ్’’ ఏంటి? రాజమండ్రి వైపూ కాకినాడ దిక్కూ మాటిమాటకి ‘‘ఆయ్’’ అంటారు కదూ! (తెలంగాణలో దొరా బాంచెన్ అన్నట్లు) మరో చిత్రం ఏమిటంటే.. ఆంధ్రప్రాంతంలో ‘‘చెల్లి’’ అన్నను పట్టుకొని ‘‘ఒరే అన్నాయ్!’’ అంటూ ఆట పట్టించడం. పెద్ద వాళ్ళను ఒరేయ్ అని సంభోదిస్తారా ఎక్కడైనా? ఇదేం వైపరీత్యం? ఇదేం పైత్యం? పైగా ఇది భాష! ఈ పదాలు తెలుగులోని మూల రూపాలకు గానీ, తమిళానికి గానీ, ప్రాచీన రూపాలకు గానీ దగ్గరగా ఉండవు. పైగా హేతువుకి అందనంత వికృతంగా మార్చి మీదు మిక్కిలి నాజూకైన భాషను మాట్లాడుతున్నట్లు భంగిమలు. ఇంకా చూడుండ్రి : చెల్లె పోయి చెల్లాయి అయ్యింది. అయ్యో! ఈ ‘‘ఆయి’’ ల మీద అంత మోజా? పిల్లగాడు వెళ్ళి అబ్బాయిగా మారాడు (నిజానికి అబ్బయ్య పదం), పిల్ల ‘‘అమ్మాయి’’ అయింది. ప్రాచీన పద్యసాహిత్యంలో ఎక్కడైనా ఈ అక్కయ్య, అత్తయ్య, అబ్బాయి, అమ్మాయిలను చూపించగలరా? లేరు. అయినా అది భాష. మనం కావ్య భాషలో అక్క, అత్త, పిల్ల, పిల్ల(వా)డులను చూపిస్తాం. అప్పటికీ ఇది మాండలికం. తెలినిరావడం లేదూ! కుట్ర ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎప్పుడు, ఎలా, ఎన్నడు జరిగిందో తెలినిరావడం లేదా? ‘‘పావురం’’ అంటాం గానీ ‘‘పావురాయి’’ అంటామా? ఓహో! ఇక ‘‘ఆయి’’ (అబ్బాయి, బాబాయి)ల భాష అయిపోయి ‘‘రాయి’’ ల భాష (రాళ్ళ భాష) వచ్చిందన్నట్లా? నిజమే! కొక్కెర (కొంగ)కొక్కిరాయి, కీచుపిట్ట (చిమ్మటపురుగు) కీచురాయి అయ్యింది. తమాషాగా లేదూ? ఇంకా విచిత్రం వినండి. పావురాయి(ఏకవచనం), పావురాళ్ళు (బహువచనం). పావురాలు కాదు సుమా! ఇది భాష అని మనమంతా నమ్మాలి. నమ్మకపోతే మనకు భాషాశాస్త్రం తెలియదన్నట్లు. శభాష్! ఎంతకైనా తగుదురు. ఈ మధ్య నాకు ‘‘లేకోకుండా’’ అన్నమాట తరచుగా వినవస్తున్నది. దీని తెలంగాణల ఏమంటరు? ‘‘లేకుండ’’ అన, లేదూ ‘‘లేకుంట’’ అని, మరి ఈ ‘‘లేకుండా’’ అంటే అర్థం కావడం లేదనా ‘‘లేకోకుండా’’ అంటున్నారు. పాపం ‘‘విస్సన్న చెప్పింది వేదం’’ కాదూ! ఈ ‘‘ఆయి’’ ల భాష, ‘‘రాయి’’ల భాష వదిలేద్దాం. కారణం…అవి మూల రూపాలకు దగ్గరగా లేవు. అందువల్ల అవి భాషాపదాలు కావు. కచ్చితంగా మాండలికాలు, తెలంగాణవి భాషాపదాలు.
మరొక అంశం…భాషకూ, బతుక్కూ దగ్గరి సంబంధం వుంటుంది. పైగా తెలంగాణ లాంటి జీవద్భాషకూ, జీవితానికీ ఉన్న అనుబంధం అణుబంధం కన్నా పరమాణుబంధం కన్నా గొప్పది. ఎట్లాగో చూద్దాం : తెలంగాణలో ‘‘అంబటి బీరకాయలు’’ంటే, ప్రామాణిక భాషలో ‘‘నేతి బీరకాయ’’లున్నాయి. రెండూ ఒకటే! పేర్లు వేరు. ఒకప్పుడు అంబలి తెలంగాణలో అమృత సదృశ్యమైన ద్రవాహారం. మరి ‘‘నేయి’’ ఏం చెబుతున్నది? ఉన్నవాళ్ళ ఇళ్ళలోనే కదా నేయి వుండేది? తెలంగాణలో ‘‘చూర్లచెక్కుడు’’ జీవితానికి దగ్గరైన అభివ్యక్తి. అట్లాగే ‘‘వాడు వాని చేతిల మైలయిడువడు’’ అన్నది తెలంగాణ పలుకుబడి. ప్రామాణిక భాషలో ‘‘చేతి చమురు వదిలింది’’ అంటున్నారు. మైలా, చమురూ… రెండు చేతుల్లో ఉన్నవే! కానీ మైల అందరి చేతుల్లోనూ ఉంటుంది. పైగా పేదవాళ్ళు, కష్టజీవులు, శ్రమజీవుల చేతులకు తప్పక ఉంటుంది. సంపన్నహస్తాలకు మైల ఉండదా? చమురుంటుంది. కారణం… తలకు రాసుకుంటారు తలంటు స్నానం చేస్తారు శరీరానికి పట్టించు కుంటారు. మరి చమురు, నూనె, తైలం సంపన్నులవి. ‘‘చేతి చమురు వదిలింది’’ సంపన్నుల అభివ్యక్తి. ‘‘నా చేతిల మైలనే! పోతే పోయింది’’ తెలంగాణ భావప్రకటన. ఇది బతుక్కి నికటమైన ప్రకటన. పై రెండు జాతీయాల అర్థం ఒక్కటే కావచ్చు. కానీ అవి పురుడు పోసుకున్నవి ఆయా ప్రాంతాల్లో, ఆయా ధనిక పేద జీవితాల్లో. ఇంకొకటి గమనిం చండి : మక్కిత్తును ఇసుర్రాయిల ఏని నలిపినట్లు నలుపుతున్నడు. ఎంత గొప్ప ఆవిష్కరణ! తెలంగాణల ఏం పండుతయి? మక్కలు. అవి ఎవరు తింటారు. పేదలు. ఆ మక్కవిత్తును ఇసుర్రాయిల ఏని నలిపినట్లు నలుపుడు. ఇత్తు చిన్నది. దానికి పైనొక రాయి కిందొక రాయి. పైగా విసరడం ఎట్లా ఉంటుంది విత్తు న్థితి? విపత్కర పరిన్థితి. ఇదే అర్థంలో ఆంధ్రలో ‘‘అడకత్తెరలో పోకచెక్కలా’’ అన్నదది వాడుకలో ఉన్నది. అడకత్తెర ఎవని దగ్గర ఉంటుంది? సాధారణంగా ఉన్నోని దగ్గర. ఆ అడకత్తెర దేనికి? బాగా తిన్నాక పోకచెక్కకు అడకత్తెరలో కత్తిరించి పళ్ళకింద ఉంచడానికి. ఈ పని ఎవరిది? ధనికులది! ఏ భాషకైనా జవజీవాలు జాతీయాలూ, సామెతలే!! ఆంధ్రభాషలో జాతీయాలు పేదల జీవితానికి దూరమైనవి. కనుక తెలంగాణ భాషా, మాండలికమా అన్నప్పుడు భాషేనని చెప్పగలం. ప్రజాబాహుళ్యానికి సంబంధించినది భాష. జన జీవితానికి దగ్గరైనది భాష.
పోగా… తెలంగాణలో కొన్ని పదాల మీదా, ప్రామాణిక భాషలోని కొన్ని పదాల మీదా దృష్టి సారించి ఏవి సరైన పదాలో చూని భాషగా నిర్ణయించవచ్చు. మొలలు, ఓమ, తోలు తీసుడు, చెవుడు, చెరుకు పాలు, కొబ్బరికాయ, కొట్టుడు, ఉర్కుడు మొ॥నవి. వీటిని అక్కడి భాషలో ‘‘మేకులు, వాము, తాట ఒలవడం, చెముడు, చెరుకురసం, టెంకాయ, బారుడు లేదా మోదడం, పరుగెత్తడం’’ అంటారు. తెలంగాణ ‘‘మొలల’’కు బదులు ‘‘మేకులు’’ సరైనవి అయితే మరి ఆంధ్రులు ‘‘మేకుల వ్యాధికి చికిత్స’’ అంటారా? ‘‘మొలల వ్యాధికి…’’ అంటారా? దీనికి కామన్ ెనన్స్ చాలు. పెద్ద లోతుల్లోకి వెళ్ళాల్సింది లేదు. నింపుల్ లాజిక్. ‘‘మొలలు’’ సరైన పదం. అందుకే మనం ‘‘ఆర్షమొలలు’’ అంటాం, మొలల వ్యాధిని. అర్షం అంటే రక్తం, అస్రం. (అనల వేదిక ముందు అస్ర నైవేద్యం శ్రీశ్రీ). తెలంగాణ వారికి ‘‘మొలలు’’ అంటే ఇనుప మొలలు. అర్షమొలలు అంటే నెత్తురు మొలలు (ఫైల్స్). ఎంత స్పష్టత వుంది తెలంగాణల! ఇంక ‘‘ఓమ’’ సంగతి. ఇది ఆంధ్రలో ‘‘వాము’’ అయ్యింది. అది సరైందా? కాదు. ‘‘కడుపునొచ్చినోడు ఓమ బక్కుతడు’’ తెలంగాణలో ఒక సామెత. మరి ‘‘వాము’’ అంటే గడ్డివాము మొ॥న తప్పుడు అర్థం స్ఫురించడం లేదా? తోలు తీసుడంటే అర్థమవుతుంది. ఈ ‘‘తాట ఒలవడం’’ ఏమిటి? దానికేమైనా (తాటకు) వ్యుత్పత్తి ఉందా? భగవంతునికి తెలియాలి. కొబ్బరికాయకు ‘‘టెంకాయ’’. కొబ్బరి చెట్టు కొబ్బరి మట్ట, కొబ్బరి నూనె, కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ’’ అంటాం. ఈ పదాలన్నీ ఆంధ్రలో అట్లాగే ఉంచి ఉన్న పళంగా కొబ్బరికాయను ‘‘టెంకాయ’’ ఎందుకన్నారు? పోపీ మరి కొబ్బరి నూనెను టెన్నూనె అంటారా? ఆకుకి అందక, పోకకు పొందక, కాలికి వేేన్త మెడకు, మెడకు వేేన్త కాలికి అన్న చందంగా అందంగా ఉన్న భాషను మార్చడం దేనికి? అదేమంటే ‘‘తెన్‌కాయ’’(దక్షిణం కాయ) టెంకాయ కాదా అంటారు. ‘‘కొబ్బరికాయ’’ అంటే తెలినివస్తున్నది. కొత్తగా తెలుగు భాషను నేర్చుకునే వ్యక్తికి ఏది సులభంగా ఉంటుంది? చెట్టు కొబ్బరిది. కాబట్టి దాని కాయ కొబ్బరి కాయ. తెలంగాణ ‘‘కొట్టుడు’’ రెండున్నర జిల్లాల్లో ‘‘బాదుడు, మోదుడు, తట్టడం’’ అయి కూచుంది. తమిళంలో కూడా ‘‘కొట్టువుదు’’. మళ్ళీ భాషంతా నాశనమై పోతుందంటూ గుండెలు బాదుకోవడం, గుండెల్ని హాయిగా కొట్టుకోవచ్చు కదా! లేదా బొచ్చె అంతా గుద్దుకోవచ్చు కదా! గుద్దుకోవచ్చు అనగానే ‘‘గుద్దుడు’’ గుర్తుకొచ్చింది. దీన్ని ఆంధ్రులు ‘‘మోదుడు’’ అంటున్నారు. మరి ‘‘మోదుడే’’ సరైన పదం అయివుంటే ‘‘ముసుగులో మోదులాట’’ అనొచ్చు కదా! అనరు. అక్కడ మళ్ళీ ‘‘ముసుగులో గుద్దులాట’’ అంటరు. ఈ ‘‘ముసుగులో గుద్దులాట’’ వద్దు. చాలా స్పష్టంగా తెలంగాణది భాష అని అంగీకరించండి.
్పు.ఆ. బ్రౌన్ ఏమన్నారంటే వఊనీలి జూశిగిళీళిజిళివీగి ళితీ ఊలిజితివీతి ఇళిజీఖిరీ నీబిరీ తీతిజిజి ళితీ రీతివీవీలిరీశిరిఖీలి ళీలిబిదీరిదీవీవ అని. అంటే చాలా తెలుగు పదాలకు మనం ‘‘వ్యుత్పత్తి’’ చెప్పగలమని. అవి అర్థవంతమైన పదాలని. చూడుండ్రి : ఎల్త కట్టెలు (వెదురు కర్రలు) ఆ కట్టెల లోపల ‘‘వెలితి’’ ఉంటుంది. బోలు ప్యాలాలు (మరుమరాలు) ఆ పేలాల లోపల ‘‘బోలు’’ ఉంటుంది. చల్ల (మజ్జిగ) అది చల్లగా ఉంటుంది. చలువ చేస్తుంది. ఎర్ర (వానపాము) అది ఎర్రగా ఉంటుంది, చేపకు ఎరగా ఉంటుంది. మెత్త(దిండు) అది మెత్తగా ఉంటుంది. వందలాది అర్థవంతమైన పదాలను తెలంగాణలోంచి చూప వచ్చు. (కాపు, మేర, కుష్కి, తరి, పతాకం, పసాడం, మా ెుల్లం, పబ్బులు, ఇత్తార్లు, ఇన్ర్తీ, బేసన్ తట్ట, గుండి, గల్లా, గుల్బందు, అంగి, లాగు, బేలన్‌కోల, సజ్జలు, మోర్దోపు, మనిషి, జాంబు రంగు, ఒల్లెక్కాలకు మొ॥నవి). వ్యాస విస్తరణ భీతితో వీటిని వివరించడం లేదు. వీటికి సమానార్థకంగా ఉన్న ప్రామాణిక భాషా రూపాలను చూపించడం లేదు. ఈ అనేకానేక అర్థవంతమైన పదాలు ఏం చెబుతాయంటే తెలంగాణ పదాలు భాషకు సంబంధించినవి.
‘‘కన్నడక్కె యతి ఇల్ల కోణక్కె మతి ఇల్ల’’ అని కన్నడంలో ఒక సామెత. అంటే ‘‘కన్నడ భాషలో యతి లేదు ఎద్దుకు మతి లేదు’’. అని. కానీ తెలుగు భాషకు యతి ఉన్నది. ఆ నియతి తెలుగుకు ఎక్కడలేని సంగీతాన్నీ సమకూర్చుతున్నది. తెలుగంటే తెలంగాణ భాషే! ఎర్రటి ఎండ, పాలు పల్గుడు, కాటకల్సుడు, బెక్కన బెంగటిల్లుడు, పట్టిన పల్గుడు, మూట ముగ్గురు, పిటానపిరం, చెటాన చెంపదెబ్బ, తెల్లన తెల్లారుడు… వీటిలో యతి ఎక్కడ వుందో చెప్పక్కర్లేదు, అందుకే తెలంగాణలో భద్రాచల రామదాసు, గద్దర్, వెంకన్న, అంద్శై మొ॥ వాళ్ళు ఈ యతి నియమాదులు మరవకుండా పాటలు రాస్తున్నారు.
రెండున్నర జిల్లాలదే అసలు నిసలు తెలుగు భాష అని హుంకరించే వాళ్ళను నేనొక ప్రశ్న వేస్తున్నారు. నిజమే తెలంగాణలో ‘‘తౌరక్యాంధ్రం’’ ఉంది అని అంగీకరిస్తాం కాేనపు. మరి మీ తెలుగేమిటి? లగాయతు, సేనమిరా, సుతరామూ, దరిమిలా, దానాదీని, ఏతావాతా, ఎగాదిగా, అదివచ్చి, ఇదొచ్చేని, అదుర్స్, చీవాట్లు, చెడామడా, ఎడాపెడా, అమీతుమీ, అవాకులు చవాకులు, చిలువలు పలువలు, చెప్పేశాడు, దిసమొల, భోంచేశాడు, ఒంట్లో నలత, నప్పడం, పెందరాలే, తల పంకించడం, గెద్ద, గెడ్డం, గడప, గరిగించడం, కాళ్ల తీపులు, నెప్పి, గెల, కాళ్ళు పట్టడం, దెయ్యం, అరటి తొక్క, కిలుం, కురిడీలు, తాలూకా, తనఖా, కటకటాలు, గుబిలి, చెవులు కొరకడం, బొప్పాయి, బొద్దింకలు, చాస్తున్నాడు, ఆస, దేసం, బాస, లెంపలు, బాబుగోరు, అమ్మాయిగోరు, అబ్బాయిగోరు, ఉప్పగా, పిచ్చకొట్టుడు, పరుగు లంకించుకోవడం, వేగం పుంచుకోవడం, లావాదేవీలు, రెట్టమతం, ఎట్టకేలకు, రక్కడం, గిల్లడం, పల్లెటూరి బైతు, పచ్చగడ్డి.. ఇవా తెలుగు పదాలు. వీటికి అర్థాలు ‘‘వ్యుత్పత్తి’’ తో చెప్పగలరా?
వ్యాకరణ పరంగా ఆలోచించినా తెలంగాణల ఉన్నది భాష అని తేలుతుంది. ఉదాహరణకు వర్తమాన క్రియల్లో ఒకటి చూద్దాం :
వస్తున్నడు ఒ వస్తలేడు
(వస్త ఉన్నడు ఒ వస్త లేడు)
దీన్ని ప్రామాణిక భాషలో ‘‘వస్తున్నాడు ఒ రావడం లేదు’’ అంటున్నారు. ‘‘వస్తున్నాడు’’ అంటే ‘‘అతడు వస్తున్నాడు’’ అని అర్థమవుతున్నది. దానికి వ్యతిరేకార్థకం ‘‘రావడం లేదు’’ (శ్రీలివీబివీరిఖీలి). ఒక వేళ ‘‘రావడం లేదు’’ సరైనది అయితే ‘‘రావడం ఉన్నది’’ అనైనా జురీరీలిజీశిరిఖీలి లో మాట్లాడాలి. కానీ తెలంగాణలో లాగే ‘‘వస్తున్నాడు’’ అంటూ నెగెటివ్‌లో ‘‘రావడం లేదు’’ అంటే అనడమేమిటి? పోనీ.. అదీ సరైనదీ అనుకుందాం. ఊరకే ‘‘రావడం లేదు’’ అంటేనే ఆ తికమక తొలగిపోతుంది. ఎందుకంటే ‘‘ నేను రావడం లేదు, మీరు రావడం లేదు, మేము రావడం లేదు, నీవు రావడం లేదు, ఆమె రావడం లేదు’’ లాంటి సవాలక్ష వాక్యాలు స్ఫురిస్తాయి, కేవలం ‘‘ రావడం లేదు’’ అంటే. అదే తెలంగాణల ‘‘వస్తలేను, వస్తలేరు, వస్తలేము, వస్తలేదు’’. అంటే ఆయా ‘‘పురుష’’ల ఆయా ‘‘వచనాలు’’ సర్వనామాలు ఆ నెగెటివ్ క్రియాపదాలకు ముందు ఉంచకుండానే అర్థస్ఫురణ జరిగిపోతున్నది. ఈ స్పష్టత భాషాలక్షణం. ఆ అస్పష్టత మాండలిక లక్షణం.
తెలంగాణలో కాలబోధక సామాన్యవాక్యానికి ఉపవాక్యంగా ‘‘నేను స్నానం చేయక వారం రోజులైంది’’ అంటున్నారు. పత్రికా భాషలో ‘‘నేను స్నానం చేని వారం రోజులైంది’’. రెండింటి అర్థమూ ఒక్కటే కావచ్చును. కానీ ఎక్కడ ఒక వ్యక్తి ఎదుటి వాడితో మొదట చెప్పదలచు కొన్నది స్నానం చేయకపోవడం గురించా? లేక స్నానం చేయడం గురించా? ‘‘స్నానం చేయక వారం రోజులైంది’’ అని చెప్పదలచు కున్నాడు. కనుక ఆ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఇది భాషకు సంబంధించిన లక్షణం. అనవసర క్లిష్టత లేకపోవడమే భాషాలక్షణం. తెలంగాణలో భావార్థక విశేషణాల్లో ఒకటి : ‘‘నువ్వు వచ్చుడు ఆలిశెం లేదు, లొల్లి ఏందిరా?’’ నన్నయలో ‘‘వాని పిఱుందన పారి పట్టి కొనుడు…తక్షణంబ నరిగె భూవివరమునన్’’ అని ఉండదు. నన్నయలోనే కాదు ఏ ప్రాచీన కవి అయినా తెలంగాణలోని భావార్థక విశేషణాన్నే వాడుతాడు. కారణం, అది తెలుగు కనుక. అది భాష కనుక. తెలంగాణలో భూతకాలిక క్రియా పదాల్లో మాత్రమే కాక ప్రత్యేకత విభక్తుల్లోనూ ఉంది. తృతీయావిభక్తి ప్రత్యాయాలు తెలంగాణల తోటి, తోని (దాని తోన దగ్ధుండై నన్నయ). పంచమీ విభక్తి తెలంగాణల ‘‘పటికె, చెయ్యవట్టి, చెయ్యంగ’’లు. (నువ్వు వచెపటికె మంచిదైంది, నువ్వు చెయ్యబట్టి, చెయ్యంగ గిట్లయింది, విద్వజ్జనంబుల యను గ్రహంబునం జేని నన్నయ). తెలంగాణలో ఉన్న తద్ధర్మకాలు నన్నయకు ఎంత దగ్గరో ఉదాహరణల ద్వారా చూద్దాం : నేను వత్త ( ఆ క్షణంబు వత్తును నన్నయ), నేను యిత్త (అపహరించి యిత్తు నన్నయ), నేను తెత్త (ఇష్టం బేయది దాని తెత్తును నన్నయ), వాళ్ళు పోతరు (పితృసంఘంబులును పోదురు నన్నయ), నేను చేస్త (అట్ల చేెనద నన్నయ), నేను యిస్త (చెఱి నూఱేని యిచ్చెద నన్నయ), ఇప్పుడు చెప్పండి! ఎక్కడైనా నేను వస్తా, నేను యిస్తా, నేను తెస్తా, వాళ్ళు పోతారు, నేను చేస్తా అంటూ ఈ క్రియలు ఇట్లా దీర్ఘాలతో ఉన్నాయా ప్రాచీన భాషలో? భూత కాలిక సమాపక క్రియల్లో ఒకటి చూద్దాం : అదీ ఒకటవ తరగతి తెలుగు వాచకంలో నుండి ‘‘అమ్మ అరటి పండు తెచ్చింది, అమలకు ఇచ్చింది. అయ్య అరకతో వచ్చాడు, అరుగుమీద పెట్టాడు’’. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ‘‘అమ్మ’’ పదం న్ర్తీ లింగం. ఆమె ఏం తెచ్చింది? అరటిపండు? ఎవరికి ఇచ్చింది? అమలకు. విషయం చాలా స్పష్టంగా ఉన్నది. అమ్మ న్ర్తీ లింగపదం కనుక ఆమె పండు తెచ్చే+ఇంది, అరుగుమీద పెట్టాడు. ఇదెక్కడి బాదరాయణ సంబంధం? బట్టతలకూ, మోకాలికీ ముడివేనిన బంధం? అమ్మ కాబట్టి తెచ్చింది. అయ్య కాబట్టి వచ్చిండు, పెట్టిండు కదూ ఉండాల్సిన పదాలు. అయ్య పుంలింగ పదం న్ర్తీలింగానికి తెచ్‌‌చ+ఇంది, ఇచ్‌‌చ+ఇంది ఉన్నప్పుడు పుంలింగానికి ఆ లెక్కన వచ్‌‌చ+ఇండు, పెట్ట్+ఇండు కదా ఉండాల్సినవి. మరి వచ్‌‌చ+ఆడు(వచ్చాడు), పెట్ట్+ఆడు(పెట్టాడు) ఎందుకొచ్చినట్లు? ఒకవేళ వచ్చాడు, పెట్టాడు సరైన భూతకాలిక సమాపక క్రియలు అయితే వీటిని బట్టి ‘‘అమ్మ అరటిపండు తెచ్చాది, అమలకు ఇచ్చాది’’ అనైనా ఉండాలి కదా! ఇది నింపుల్ రీజనింగ్ కదా! తర్కసహమైన, హేతుబద్ధమైన వాదన కదా!! అయినా అది భాష, దాన్ని ఒకటవ తరగతి నుండి రుద్దడం రాకడం గీకడం పులమడం. పైగా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల పిల్లలకు ఎక్కించడం. తెలంగాణలో ఎంత స్పష్టంగా ఉన్నాయా క్రియలు! ‘‘అయ్య అరకతో వచ్చాడు’’కు బదులు ‘‘నాయిన నాగలితోని వచ్చిండు అరుగు మీద పెట్టిండు’’ అంటే అది భాష కాకుండా పోతుందా?
తెలంగాణలో ‘‘కూరగాయలు తేనువోయిండు’’ అన్న వాక్యం ఉంది. ‘‘తేను పోయిండు’’ అంటే ‘‘తీసుకురావడానికి వెళ్ళాడు’’ అని. మరి నన్నయ ఏమన్నాడో చూడండి (దార పరిగ్రహంబు నేయను సంతానంబు పడయను నోల్లకొన్నవాడు)
అమహద్వాచక బహుబచన సర్వనామాలు తెలంగాణలో అవ్వీటిని, ఇవ్వీటిని, ఎవ్వీటిని అని ఉన్నాయి. ఇవి తమిళంలో అకట్ర్టై, ఇవట్ర్టై, ఎవట్ర్టై అని ఉంటాయి. తెలంగాణకూ, తమిళానికీ ఎంత సామీప్యమో చెప్పకనే చెబుతున్నాయి ఆ పదాలు, మరి శిష్టల భాషలో వాటిని, వీటిని, వేటిని అంటున్నారు. వీటికేమైనా మూల ద్రావిడంలో దగ్గరి సంబంధం ఉందా? అమహద్వాచక ఏకవచన సర్వనామాలు కూడా అదాని మీద పెట్టు, ఇదీని కింద పెట్టు, ఎదేని గురించి మాట్లాడుతున్నవ్? అనేవి వరుసగా తమిళంలో అదన్, ఇదన్, ఎదన్ అని ఉన్నాయి. మరి పత్రికా భాషలో ‘‘దాని మీద పెట్టు, దీని కింద పెట్టు, దేని గురించి మాట్లాడుతున్నావ్?’’ అన్నవి సమానార్థక పదాలు. దీన్ని బట్టి తెలిేనది ఏమంటే… వ్యాకరణ రీత్యాను తెలంగాణ భాషకూ, ప్రాచీన భాషకూ ఇంకా తమిళభాషకూ దగ్గరితనం ఉన్నదనేది.
ఇన్ని చెప్పినప్పటికీ తెలంగాణలో ఉన్నది భాషేనని ఒప్పుకోవడానికి భేషజాలు అడొే్డన్త, కనీసం ఇప్పుడు చెప్పబోయే అంశాలతోనైనా భాషేనని ఒప్పుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి మూడు ప్రాంతాలు అవి : తెలంగాణ, రాయలనీమ, కోస్తాలు. భౌగోళికంగా నీమాంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతం (ఒక్క ఆదిలాబాద్ మినహా) కనుక ప్రాంతాలు వేరైనపుడు భాషలు కూడా వేరవుతాయి. 1956 నుండి తెలంగాణలో ఎక్కవ పరీవాహక ప్రాంతాలు కల్గిన రెండు పెద్దనదులు (కృష్ణా, గోదావరులు) ఆంధ్రులకు పనికొచ్చినప్పుడు, 1956 నుండి తెలంగాణకు అప్పటివరకూ రాజధాని అయిన రెండు పట్టణాలు (హైదరాబాద్, నికింద్రాబాద్‌లు) ఆంధ్రులకు పనికొచ్చినప్పుడు… ఆ రెండు పట్టణాలలో మాట్లాడుతున్న భాష పనికి రాదా? ఆధునిక ఆంగ్ల భాషకు లండన్ కేంద్రం (ఒకప్పుడు కర్ణాటక రాజధాని మైసూరే!) మరి ఆధునిక తెలుగు భాషకు జంగ నగరాలు కేంద్రంగా ఎందుకు కాలేకపోయాయి? కారణం… తెలంగాణీయులకు తెలియదా? ఆంధ్రులకు నీళ్ళు కావాలి ఉద్యోగాలు కావాలి విద్యావకాశాలు కావాలి నిధులు కావాలి అవన్నీ తెలంగాణ ప్రాంతానికి అనుభవించాలి భాష మాత్రం వాళ్ళదే అయి వుండాలి. ఎంత స్పష్టంగా తెలుస్తున్నది? మూడు ప్రాంతాలు కలిని కదా ఆంధ్రప్రదేశ్ అవతరించింది! తెలంగాణలో మొత్తం పది జిల్లాలున్నాయి. నీమలో నాలుగు, కోస్తాలో తొమ్మిది ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఎక్కవ జిల్లాలున్నాయి? తెలంగాణలో. కనీస ప్రజాస్వామిక సూత్రం ప్రకారమైనా, ఒక నింపుల్ అరిథమెటిక్ ప్రకార మైనా ఎవరిది ప్రమాణ భాష కావాలి? తెలంగాణ వాళ్ళది. అదీ చేయలేదు… చేయరు. ఆంధ్ర వలస పాలకులు మాట్లాడింది భాష, తుపాకీ శరీరాన్ని వశపరచుకుంటుంది. భాష ఆత్మని లొంగదీస్తుంది. కత్తి కన్నా పదునైనది ‘‘నాలుక’’ అన్నది ఆధిపత్య భావజాలంగల మనుషలకు బాగా తెలుసు. తెలంగాణ ప్రాంతానికి బతకడానికి వచ్చిన వాళ్ళే ఇది భాష కాదు అన్నారు. రాయప్రోలు బజారు భాష అంటాడు. ఇట్లాంటి ఉదాహరణలు అనేకం. వాటిని వదిలేద్దాం. తెలంగాణలో తెనుగు కులం ఉన్నది. అంతేకాదు తెలగాలు ఉన్నరు. ఈ కులాలు, ఈ కులాల పదాలు ఏం చెబుతున్నాయి? తెలుగుతో ఉన్న సంబంధాన్ని చెప్పడం లేదా? పోనీ… గిడుగు ఏం చెప్పాడో చూద్దామా? ‘‘ఆరేండ్ల బాలునికి అతని లోక జ్ఞానముతో సమానమైన భాష అతనికుంటుంది. అదే అతని మాతృభాష’’ కనుక తెలంగాణలో మాట్లాడుతున్నది తెలంగాణ వాళ్ళకు భాష, ఇతరులకు మాండలికం అయితే కావచ్చును. ఇతర ప్రాంతాల భాషలు తెలంగాణ వాసులకు మాండలికాలు. అవి భాషలు కావు. రెండున్నర జిల్లాల అగ్రవర్ణాల ఆంధ్రభాష ఒక మాండలికం. ఆ మాటకొేన్త అన్ని భాషలూ మొదట మాండలికాలే! ఏ మాండలికం ప్రత్యేకమైన భౌగోళిక సరిహద్దులల్లో వుంటుందో, ఏది మూల భాషకు, ద్రావిడ భాషకు దగ్గరగా ఉంటుందో, ఏది జీవితానికి దగ్గరై ప్రజల పలుకును ప్రాణపదంగా న్వీకరిస్తుందో, ఏ మాండలికం వ్యాకరణానికీ, తర్కానికీ లొంగుతుందో, ఏది ఎక్కవ జిల్లాల్లో ప్రచలితం అయ్యిందో, ఏది సృజనాత్మకంగానూ, సులువుగానూ ఉంటుందో, ఏ మాండలికాన్ని చదివితే ప్రాచీన కావ్య భాష అర్థమవుతుందో, ఏది రాజధానితో సంబంధం కల్గివుందో.. అది భాష అవుతుంది. కానీ తెలంగాణలో మాత్రం తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నది మాండలికం అయ్యింది. రెండున్నర జిల్లాల్లోని అగ్ర కులాల్లోంచి విద్యావంతులు, కవులు, కళాకారులు, రచయితలు తెలంగాణ ప్రాంతం కన్న ముందుగా కళ్ళు తెరిచారు. ఈ ‘‘ఎలైట్’’ వర్గాలే తమ మాండలికాన్ని భాషగా మార్చాయి. ఈ వర్గాలు తెలంగాణ భాషను మాండలికంగా చూపి ఎగతాళి చేశాయి. ఈ విద్యావంతులే తెలుగుభాషలోంచి సున్నానూ, అరసున్నానూ, శకట రేఫాన్నీ తీేనశారు. పైగా అలా తీనివేయడం భాషా పరిణామంలో భాగం అన్నారు. తద్వారా భాషకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. శకటరేఫం ద్రావిడ భాషలన్నింటికీ పత్యేకమైంది. ఇది ఇప్పటికీ యితర సోదర ద్రావిడ భాషల్లో ఉన్నది. ఈమ ఇష్టం వచ్చినట్లు తెలుగు భాషను వలసవాదులు ఖూనీ చేశారు. ఆధునిక ప్రమాణ భాష పేరిట ఆ రెండున్నర జిల్లాల ప్రజలు భాషకూ, ఆంధ్ర ప్రాంతంలోని యితర జిల్లాల భాషకూ, నీమలోని భాషకూ తీరని అపచారం చేశారు. తెలంగాణ భాషకు జరిగిన ద్రోహం గురించి చెప్పనవసరమేలేదు. ఆధునిక ప్రమాణ భాషావాదులకు గ్రాంథిక భాష గడ్డ కట్టిన భాష. మరి తెలంగాణీయు లకు? ఈ ఆధునిక ప్రమాణ భాష తెలంగాణ వారికి కరడు గట్టిన భాషమూస. అది ఏకశిలా సదృశమైన భాష. మరో గ్రాంథిక భాష.
ఇంగ్లీషలో ఉన్న భాషాశాస్త్రాల వెలుగులోనూ, పూర్వ నిర్ధారిత అభిప్రాయాల ఆధారంగానూ, ఆధునిక ప్రమాణ భాషావేత్తల రాతల ఆధారంగానూ ఆలోచిస్తున్నంత కాలం తెలంగాణ మాండలికంగానే కనిపిస్తుంది. కాల్డ్వెల్ వచ్చేంతవరకూ అన్ని భాషలకు తల్లి సంసృ్కతం కాలేదూ! మనం మౌలికంగా ఆలోచించినప్పుడు, స్వతంత్రంగా వివేచించి నప్పుడు, సృజనాత్మకంగా పరిశీలించినప్పుడు, ఏ ప్రభావాల భావాల మాయలకు గురికాకుండా ఉన్నప్పుడు, తెలంగాణలోని పదాలను మూల భాషా పదాలతో బేరీజు వేసుకొన్నప్పుడు, ఆ పదాలను ప్రాచీన కావ్య భాషతో సరిపోల్చినప్పుడు, వాటిని మూల ద్రావిడ పదాలతో పోల్చుకున్న ప్పుడు, తెలంగాణ పదాల నాదమే తెలుగును గానానుకూలం చేనిందని గ్రహించినప్పుడు, సామాన్య ప్రజానీకం మాట్లాడుతున్న భాషలో నిఖారె్సైన పదహారణాల తెలుగు పదాలు దొర్లుతున్నప్పుడు. భాషకూ బతుక్కీ ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నప్పుడు… తెలంగాణ భాషా, మాండలికమా? అన్న ప్రశ్నకి స్పష్టమైన జవాబు దొరుకుతుంది. నన్నయ మొదలైన పూర్వకవుల భూతకాలిక క్రియలన్నీ (సమాపకాలు), వాళ్ళు ఉపయోగిం చిన గసడవాదేశ సంధులన్నీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా తెలంగాణలో ఉన్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో ఉన్నది సృజనాత్మకమైన, నాదమయమైన, లయబద్ధమైన, హేతుబద్ధమైన, సహజ సుందర సరళ భాష.
(రచయిత అఖిల భారత తెరవే అధ్యక్షులు)


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *