తెలుగు పలుకుబడికి మారుపేరు

భారతీయ సాహిత్యంలో ఓ అరుదైన పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. తెలుగు కవి, అందులోనూ వెనుకబడ్డ జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సామల సదాశివకు ఈ అవార్డు లభించడం విశేషం. అవార్డు రావడం ఆయనకు గర్వకారణం కాదు. ఆయనను వరించినందుకు ఆ అవార్డు గర్వించాలి. అలాంటి మహోన్నతుడు సామల సదాశివ. ఆయన రచించిన ‘స్వరలయలు’ పుస్తకానికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు లభించడం జీవితంలో మరువలేని మధురానుభూతిగా ఆయన తన చివరి రోజుల్లో పేర్కొన్నారు. చెలిమి ఫౌండేషన్ ప్రచురించిన అత్యుత్తమ ప్రచురణల్లో ‘స్వర లయలు’ కలికితురాయిగా నిలిచింది. సదాశివ మన మధ్య లేకపోవడం తెలుగు సాహితీరంగానికి తీరని లోటు అని అంటున్నారు చెలిమి ఫౌండేషన్ వ్యవస్థాపకులు యం. వేదకుమార్
తెలుగు పలుకుబడిపై చెరిగిపోని సంతకం సామల సదాశివది. సృజనాత్మక రచనలైనా, అనువాదాలైనా చదువుతుంటే కళ్ళ ముందు ఆ భావాలు దృశ్యరూపం సంతరించుకుంటాయి. ఆయన భాషా ప్రావీణ్యం తెలుగుకు మాత్రమే పరిమితం కాదు. పర్షియన్, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, హిందీ, ఆంగ్లంలలోనూ అపార మైన పట్టు సాధించారు. పర్షియన్ కవుల, తాత్వి కుల విశిష్టతను వివరిస్తూ ఆయన రచించిన ‘ఫారనీ కవుల ప్రసక్తి’ గ్రంథం ఆయన పర్షియన్ భాషా వైదుష్యానికి అద్దం పట్టింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కోసం ఆయన దాన్ని రచించారు. నిజానికి అది అనువాదమే అయినప్పటికీ దాన్ని రచించిన తీరుచూేన్త అది స్వతంత్ర సృజనాత్మక రచన అని అన్పించక మానదు. ఛందోబద్ద కవిత్వమైనా, వచనమైనా అన్నింటిలోనూ ఆయన మేటిగా నిలిచారు. ప్రాచీన తెలుగు కవిత్వాన్ని ఆస్వాదించేలా ఆయన రచించిన ‘సదాశివ కావ్యసుధ’ రస జ్ఞులను అలరించింది. పదిహేడేళ్ళ చిన్నతనంలోనే ఆయన ‘సాంబశివ శతకం’ రచించారు. పండితుల మన్ననలను అది పొందింది. ప్రభాతము, నిరీక్షణము తదితర ఛందోబద్ద గ్రంథాలను కూడా ఆయన రచించారు. ఉర్దూ, పర్షియన్ భాషల్లోని సాహితీ సౌరభాలను ఆయన తెలుగు పాఠకు లకు అనువాద రూపంలో పరిచయం చేశారు. అమ్జద్ రుబాయిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ అనువాదం పురస్కారం లభించింది. సదాశివ రచించిన ‘యాది’ ఒక ఆధునిక క్లానిక్‌గా గుర్తింపు పొందింది. ఆయన రచించిన ‘స్వరయలు’ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సంగీతకళా కారులను పరిచయం చేనిన తీరు అందరినీ ఆకట్టు కుంది.
సాహితీరంగంలోనే గాకుండా మరెన్నో రంగాల్లోనూ సదాశివ పేరొందారు. సంగీత శాస్త్రంలో నిష్ణాతుడు. నిష్పాక్షిక సంగీత విమర్శకుడు. సంగీత శిఖరాలు, మలయ మారుతాలు లాంటి పుస్తకాలు సంగీతంపై ఆయన అభిరుచికి అద్దం పడుతాయి. చిత్రకారుడిగా కూడా సదాశివ పేరొందారు. ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్…ఇలా ఎన్నో ప్రయోగాలు చేశారు. అవన్నీ ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఎంతో మంది ఆయన వద్ద చిత్రలేఖనంలో ఓనమాలు నేర్చుకోవడం, ఆ తరువాత సుప్రనిద్ధ చిత్రకారులు కావడం విశేషం.
వ్యక్తిగతం
ఆదిలాబాద్ జిల్లా లోని మారుమూల గ్రామంలో సదాశివ జన్మిం చారు. ఆయన తండ్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. తండ్రి ేన్నహితుడైన రియాద్ రహ్మాన్ వద్ద ఆయన ఉర్దూ, పర్షియన్ భాషల్లో శిక్షణ పొందారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ సాహిత్యం, చిత్ర లేఖనం తదితరాలు ఆయన ప్రవృత్తిగా నిలిచాయి. కీర్తిశిఖరాలపై ఆయ నను నిలబెట్టాయి.« (Previous News)Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *