తెలుగు వాచకాల విశిష్టత

తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం సింగిడి 1

ఆరు దశాబ్దాల తెలంగాణ స్వప్నం సాకారమై కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన చారిత్రక సందర్భంలో రూపొందించిన కొత్త పాఠ్యాంశాలలో అనేక విశేషాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్థానిక సంస్కృతి, స్వంత భాష పాఠ్యాంశాల్లోకి తీసుకు రావడంలో పాఠ్యపుస్తక అభివృద్ధి కమిటీ చాలామేరకు విజయం సాధించింది. ఆ క్రమంలో 9వ తరగతి పాఠ్య పుస్తకాన్ని సింగిడి-1 శీర్షికతో వెలువరించిన వాచకంలో ఈ కింది 12 పాఠాలు ఉన్నాయి.
1వ పాఠం ధర్మార్జునులు-చేమకూర వేంకటకవి-నైతిక విలు వలు-ప్రాచీన పద్యం
2వ పాఠం నేనెరిగిన బూర్గుల-పి.వి. నరసింహారావు-స్ఫూర్తి- అభినందన వ్యాసం
3వ పాఠం వలసకూలీ- డా॥ ముకురాల రామారెడ్డి-సామాజిక స్పృహ సహానుభూతి-పాట
4వ పాఠం రంగాచార్యతో ముఖాముఖి-సాహిత్య సేవ-ఇంట ర్వ్యూ
5వ పాఠం శతక మధురిమ-శతక కవులు-నైతిక విలువలు-శతకం
6వ పాఠం దీక్షకు సిద్ధంకండి-దేశభక్తి కరపత్రం
7వ పాఠం చెలిమి-పొన్నికంటి తెలగన-మానవ సంబంధాలు -అచ్చతెలుగు కావ్యం
వ పాఠం ఉద్యమ స్ఫూర్తి సంగెం లక్ష్మీబాయి- ప్రేరణ, దేశభక్తి – ఆత్మకథ
9వ పాఠం కోరస్ -సలంద్ర లక్ష్మీనారాయణ-సామాజిక స్పృహ -వచనకవిత
10వ పాఠం వాగ్భూషణం-డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి-భాషాభి రుచి-వ్యాసం
11వ పాఠం వాయసం-మామిండ్ల రామగౌడు-జీవకారుణ్యం పర్యావరణం-ఆధునిక పద్యం
12వ పాఠం తీయని పలకరింపు-ఇల్లిందల సరస్వతీ దేవి- మాన వ సంబంధాలు-కథానిక
9, 10 తరగతుల ప్రథమ భాష వాచకాలు-సింగిడి సిరీస్-1, 2
ఉపాధ్యాయుల పని భారాన్ని, పనిదినాలను దృష్టిలో పెట్టు కొని ఆచరణకు వీలుగా పాఠ్యాంశాల సంఖ్యను తగ్గించి రూపొందిం చిన వాచకం ఇది అని పేర్కొన్నారు. పాఠం బోధించడం అంటే వి షయాన్ని వివరించడం మాత్రమే కాదు. దాంట్లోని విలువలను, క వి హృదయాన్ని, అంతరార్థాన్ని పిల్లలు అర్థం చేసుకునేటట్లు చూ డాలి. ఇందుకోసం ఆలోచింపజేసే ప్రశ్నలు అడగాలి. పదబంధాలు, జాతీయాలు, ఆలోచనాత్మక, సందేశాత్మక వాక్యాలపట్ల చర్చ ద్వారా, ప్రశ్నించడం ద్వారా పిల్లలే అవగాహన పొందేటట్లు చేయాలి. పి ల్లల అభిప్రాయాలను చెప్పించడం, సమకాలీన అంశాలతో అన్వ యించడం, బహు కోణాల్లో విశ్లేషించడం జరగాలి అని పేర్కొన్నారు. పిల్లలు రాసిన అంశాలను భావాత్మకంగా వాక్యాలు, పదాలు, అక్షర దోషాలపరంగా సరి చేయాలి. పాఠశాలలో భాషాభివృద్ధికి దోహద పడే కార్యకలాపాలు, భాషామేలాలు, భాషోత్సవాలు, బాలకవి సమ్మే ళనాలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, వార్షికోత్సవాలు వంటివి నిర్వహించాలి. పిల్లలు రాసిన సృజనాత్మక అంశాలను సంకలనం చేసి తరగతి గదిలో ప్రదర్శించాలి అని ఉపాధ్యాయులకు, విద్యార్ధుల కు చక్కని కార్యక్రమాలను సూచిస్తూ ఈ పాఠ్యపుస్తకం ముందుమాట రాశారు.
మొదటి పాఠం కింద ఒక పద్యం ప్రతిపదార్ధం ఇచ్చి, మరి కొన్ని పద్యాల ప్రతిపదార్ధం స్వయంగా రాయాలని కోరారు. మరొక పద్యం ఇచ్చి ఆ పద్యంలోని అంశాలకు సంబంధించి ప్రశ్నలు వే శారు. వ్యక్తీకరణ-సృజనాత్మకత శీర్షికలో పాఠంలోని విశేషాలను వెలికి తీయడానికి ప్రశ్నలు వేశారు. ధర్మరాజు వ్యక్తిత్వాన్ని స్వంత మాటల్లో రాయమని సూచించారు. అలాగే నీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి అని సూచించారు. ఇది ఒక చక్కని ఆచరణాత్మక సూచన. పదజాలం గురించి కొన్ని పదాలు సోయగం, ఏవురు, వెగటు, మార్జన ప దాలకు అర్థాలు రాసి స్వంత వాక్యాల్లో ఉపయోగించండి అని కోరారు. తనూజుడు, సార్వభౌముడు, నందనుడు పదాలకు వ్యుత్పత్తి అర్థాలు పేర్కొనమన్నారు. ప్రతిమ, కుమారుడు, మొగము, ప్రాణం పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయాలని కోరారు. ప్రకృతి, వికృతి పదాలను గుర్తించాలని కొన్ని ఇచ్చారు. కొన్ని పదాలు ఇచ్చి వాటి నానార్ధాలు పట్టిక రాయమన్నారు. వ్యా కరణాంశాల్లో కర్మధారయ సమాసం గురించి వివరించారు. ప్రాజెక్టు పనిలో ఉత్తమ పాలనను రామరాజ్యంతో పోలుస్తారు. శ్రీ రాముని పాలన ఏవిధంగా ఉండేదో తెలుసుకొని నివేదిక రాయమని కో రారు. ఈ పాఠం తర్వాత మన సామెతలు-మన జాతీయాలు కొ న్ని పేర్కొన్నారు. అతి రహస్యం బట్టబయలు, నీల్లునములు వంటి వాటిని ఇవ్వడం బాగుంది.
హైదరాబాద్ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు గురించి పి.వి. నరసింహారావు రాసిన వ్యాసం ఇందులో పొందుపరిచారు. ఇది తెలంగాణ చారిత్రక వ్యక్తులను, వారి ద్వారా తెలంగాణ సామాజిక పరిణామాలను తెలుసు కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పాఠం చివర ఇతరుల కంటే తాను అధికుడిని అని అనిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయం తెలపండి అని కోరారు.
ఈ పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయమన్నారు. రాణి రుద్రమదేవి గురించిన ఒక పేరాను ఇచ్చి వాటికి సంబంధిం చిన ప్రశ్నలు, జవాబులు రాయమని సూచించారు. బూర్గుల, పి.వి. నరసింహారావుగార్ల విశిష్ట వ్యక్తిత్వాల గురించి జవాబులు రాయమని కోరారు. బూర్గుల, పీవీగార్ల సంబంధం గురుశిష్యుల లాంటి సంబంధం. దీన్ని సమర్ధిస్తూ ఐదు వాక్యాలు రాయమని అన్నారు. బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్ష్యాలను పదేసి వాక్యాల్లో రాయమన్నారు. పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి. లేదా ఈ పాఠం ఆధారంగా నీ కు నచ్చిన గొప్ప వ్యక్తిని ప్రశంసిస్తూ సన్మాన పత్రం రాసి ప్రద ర్శించండి అని కోరడం పిల్లల్లో చక్కని భాష అభివ్యక్తిని పెంపొందిం పజేస్తుంది. వ్యాకరణాంశాల్లో కొన్ని సంధుల గురించి పరిచయం చేశారు. తత్పుర్ష సమాసాల గురించిన పదాలు ఇచ్చి వాటి విగ్రహ వాక్యం రాయమన్నారు. ప్రాజెక్టు పనిగా మహోన్నత వ్యక్తిత్వంతో, పరిపాలన దక్షతతో సేవచేసిన వారి వివరాలు సేకరించి ఒక సం కలనాన్ని రూపొందించి తరగతి గదిలో ప్రదర్శించండి అని నిర్దేశిం చారు.
‘వలసకూలీ!’ పాఠంలో సుద్దాల హనుమంతు పాటలోని కొన్ని చరణాలు చేర్చారు. పాలమూరు జిల్లా కరువు, తద్వారా కూలికి వలసపోవడం గురించి ఈ పాఠం చేర్చబడింది. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పేద ప్రజల జీవితాన్ని, కష్టాలను చిత్రించిన ఈ గేయ పాఠం పిల్లల్లో మంచి అవగాహనను కలిగింప జేస్తుంది. సామాజిక స్పృహను పెంచుతుంది. అవగాహన- ప్రతి స్పందనలో తెలంగాణలో శతాబ్దాలుగా జీవితంలో భాగమైన చెరు వుల ప్రాధాన్యత గురించి వివరించారు. అంత్యానుప్రాస అనే శబ్దా లంకారాన్ని పరిచయం చేశారు. ఉపమాన ఉపమేయాలను పరి చయం చేశారు.
దాశరథి రంగాచార్య గురించిన పాఠం ముందు చేకూరి రామారావు ఇంటర్వ్యూను కూడా చేర్చారు. దాశరథి రంగాచార్యతో జరిగిన ముఖాముఖి పాఠం ద్వారా పత్రికల్లో వచ్చే ఇంటర్వ్యూలను ఒక ప్రక్రియగా పరిచయం చేయడం ప్రశంసనీయం. ఇంటర్వ్యూలు ఎన్ని రకాలో అవగాహన – ప్రతిస్పందనలో పేర్కొన్నారు. వ్యక్తీకరణ – సృజనాత్మకతలో ప్రజల భాష అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయమని కోరారు. దాశరథి రంగాచార్య వ్యక్తిత్వాన్ని, సాహిత్య సేవను ప్రశంసిస్తూ వార్తా పత్రికకు ఒక లేఖ రాయండి అని సూచించారు. ఇలా చదివిన అంశాన్ని మరొక ప్రక్రియలోకి మార్చి రాయడాన్ని అభ్యాసం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగ ప డుతుంది. వాక్యాల్లో కర్తరి, కర్మణి వాక్యాలు ఎలా ఉంటాయో సూచించారు. సాధారణంగా తెలుగులో కర్తను బట్టే వాక్యాలు రా స్తుంటాం. ఆ విషయం కూడా ఈ సందర్భంగా చెప్తే మంచిది. పాఠం చివర మీకు తెలుసు అనే అంశంలో తెలంగాణ సాయుధ పోరాటం, గోర్కి, చెకోవ్, ఛార్లెస్ డికెన్స్ గురించి సంక్షిప్తంగా వివరించారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా పత్రికల్లో వచ్చిన ఏదైనా ఇంటర్వ్యూ సేకరించి తరగతి గదిలో చదివి వినిపించాలని కోరారు.
‘శతక మధురిమ’ పాఠానికి ముందు ‘బలవంతుడు నాకేమని’ అనే సుమతి పద్యాన్ని చేర్చారు. ఇందులో మరుగున పడిన శతక కవులను కూడా కలిపి ఒక్కొక్క పద్యం కూర్చారు. అలా శతక వా ఙ్మయాన్ని పరిచయం చేశారు. పాఠం తర్వాత ప్రసిద్ధి రామప్ప వరకవి (సిద్దప్ప) పద్యాన్ని చదవడానికి ఇచ్చారు. వ్యాకరణాంశాల్లో దృతాన్ని పరిచయం చేశారు. శార్దూల పద్యం గణ విభజన చేసి చూపారు. పాఠశాలలోని గ్రంథాలయాన్ని సందర్శించి శతక పద్యా ల పుస్తకాలను పరిశీలించి నీకు నచ్చిన పది పద్యాలు సేకరించి, వాటికి భావాలు రాయండి అని కోరారు.
చదవండి-తెలుసుకొండి అనే శీర్షికలో కొన్ని పొడుపు పద్యా లు ఇవ్వడం బాగుంది. చిన్నప్పుడు పొడుపు కథలు విప్పడం, వి నడం ఎంతో ఆసక్తికరమైన అంశం.
‘దీక్షకు సిద్ధంకండి’ అనే పాఠానికి స్వచ్ఛభారత్‌కోసం సన్నద్దం కండి అనే ఒక ప్రకటనను, లేఖను ప్రచురించారు. ఇది కరపత్రం కూడా. ఈ పాఠం కరపత్రం అనే ప్రకియకు చెందింది. 1969లో తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ ప్రజాసమితి, విద్యార్ధి కార్యాచరణ సమితి ప్రచురించిన కరపత్రాన్ని ఇందులో ప్రచురిం చడం ద్వారా తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని తరాలుగా ఉద్యమి స్తున్నామో అర్థమయ్యేట్టు చేశారు. ఉపాధ్యాయులు ఈ సందర్భంగా తాము ఎన్నో విషయాలు తెలుసుకొని, మరెన్నో విషయాలు ఈ సందర్భంగా విద్యార్ధులకు హృద్యంగా చెప్పవచ్చు. కరపత్రం ఎలా రాయాలో, వాటి అవసరం ఏమిటో అవగాహనలో పేర్కొన్నారు. చెరువుల గురించి, చెరువుల అభివృద్ధి గురించి కరపత్రం చేయాల ని, అది చదివి వినిపించాలని కోరారు. కొన్ని కరపత్రాలు సేకరిం చి, వాటిని ఒక పట్టికలో రాయాలని ప్రాజెక్టు పని ఇచ్చారు.
‘చెలిమి’ అనే పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగులో రాసిన కావ్య మిది. పొన్నికంటి తెలగన రాసిన ‘యయాతి చరిత్ర’ నుండి ఈ పాఠం తీసుకోవడం జరిగింది. ప్రవేశికలో సృష్టిలో తియ్యనిది స్నే హం అని దాని ప్రాధాన్యత గురించి వివరించడం చక్కని ఆలోచన. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్ నది చూడ్డానికి వెళ్లిన విజ్ఞానయాత్రలో జరిగిన ప్రమాదాన్ని సంక్షిప్తంగా ఇచ్చి ఈత నేర్చుకోవడం ఎంత అవసరమో పేర్కొన్నారు. అలాగే భీమకవి గురించి ఒక గద్యం ఇ చ్చారు. ప్రశ్నల్లో కుల, మత, వర్గ, పేద, ధనిక లేనిది స్నేహం ఒ క్కటే అని సమర్ధిస్తూ ఐదు వాక్యాలు రాయాలని సూచించారు. స్నేహితుల మధ్య వివాదాలు ఎందుకు వస్తాయో ఐదు వాక్యాలు రాయమన్నారు. తేటగీతి పద్య ఛందస్సును ఈ పాఠం కింద పరి చయం చేశారు. మీకు తెలుసా శీర్షికలో ‘గాథాసప్తశతి’లోని ఒక కథను సంక్షిప్తంగా పేర్కొన్నారు.
‘ఉద్యమస్ఫూర్తి’ పాఠానికి ముందు స్నేహ సంపద గురించి ఒక పేజీ వ్యాసం చక్కగా పొందుపరిచారు. ‘ఉద్యమస్ఫూర్తి’ పాఠంలో సంగెం లక్ష్మీబాయి గురించి, గాంధీజి నాయకత్వంలో సాగిన జా తీయోద్యమం గురించి, స్వాతంత్య్రానంతరం స్వార్ధం పెరిగి, సాం ఘిక బాధ్యత లోపించడం గురించి వేదన చెందారు. ఈ పా ఠం తర్వాత ప్రాజెక్టు పనిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు ముగ్గురు మహిళల వివరాలను సేకరించి నివేదిక రాయాలని కో రారు.
‘కోరస్’ పాఠం ఒక వచన కవిత. ఆ పాఠం ప్రారంభంలో కాళోజి ప్రసిద్ధ ‘అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట’ అనే గేయాన్ని చేర్చారు. కవి ఒంటరిగా ముందుకు సాగితే తర్వాత ప్రజలు తన పాటకు కోరస్ అందుకొని ముందుకు సాగుతారని అనే విశ్వాసంతో ఎదుర్కొనే కష్టాలను, అవమానాలను ఈ కవితలో పేర్కొన్నారు. ప్రతిస్పందన శీర్షికలో ‘ఆకులు లేకుంటే, చెట్టును ఎలా గుర్తిస్తావు? పచ్చదనమే చెట్టుకు చిహ్నమా?’ అనే కవితను ప్రచురించారు. ప్రాజెక్టు పనిలో అభ్యుదయ కవులుగా పేరు పొందిన ఎవరిదైనా ఒకరి కవితను సేకరించి, దానిపై అభిప్రాయాన్ని రా యమని, చదివి వినిపించమని కోరారు. మీకు తెలుసా శీర్షికలో తెలంగాణ సాయుధ పోరాటం గురించిన సంక్షిప్త పరిచయం ఇ చ్చారు.
‘వాగ్భూషణం’ పాఠం ప్రారంభంలో వేముగంటి నరసింహా చార్యులు రాసిన ‘మాటలు కోటులు గట్టి, మహరాజుగా మసలు తాడొకడు’ అనే కవితను చేర్చారు. ఈ ప్రక్రియ ఉపన్యాస ప్రక్రియను పరిచయం చేస్తుంది. ఉపన్యాసం ఎలా ఉండాలో, ఉపన్యాసం ఇ వ్వడంలో ఎదుర్కొనే సంకోచాలు ఎలా ఒదిలించుకోవాలో, మాట్లాడే అంశాలపట్ల అనేక విషయాలను ముందే తెలుసుకోవడంతో పాటు, జ్ఞాపకశక్తి ఎంత అవసరమో సూచించారు. ప్రసంగాన్ని ప్రారంభించే టప్పుడు ఎలా ఉండాలి? ముగించేటప్పుడు ఎలా ఉండాలి? అనే అంశాన్ని ఈ పాఠం ఎంతో చక్కగా వివరిస్తుంది. ఉపన్యాస ప్రక్రియ ఎంతో ప్రధానమైన ప్రక్రియ కూడా. ఆ ప్రక్రియను గురించిన ఎంతో వివరంగా ఉన్న పాఠాన్ని చేర్చడం అభినందనీయం. మీకు తెలుసా శీర్షికలో పలుకే బంగారం అనే అంశాన్ని చేర్చారు. ఉపన్యాసం ఇవ్వడం కోసం మీకు నచ్చిన ఒక అంశాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని తరగతి గదిలో ఉపన్యాసం ఇవ్వాలని ప్రాజెక్టు పనిలో సూచించారు.
‘వాయసం’ పాఠానికి ముందు పద్య చమత్కారం అనే శీర్షి కలో కొన్ని పద్యాలు ఇచ్చారు. ఆ పద్యాల విశేషాలను వివరించ డం బాగుంది. ‘వాయసం’ అంటే కాకి. కాకి గురించిన ఈ పాఠంలో నలుపు వర్ధిల్లాలి అనే చిత్రం ఎంతో ఆకర్షిస్తుంది. కాకి అరిస్తే చు ట్టాలు వస్తారని అనుకునే విషయాన్ని బొమ్మగా చిత్రించడం బాగుం ది. ఈ పాఠం తాత్పర్యాన్ని ఎంతో చక్కగా వివరించారు. పక్షి జాతిలో కాకిని చిన్న చూపు చూడడం సరియైందేనా అని చర్చించండి అని కోరారు. పిచ్చుకలు, కాకులు, గద్దలు వాటి ప్రాధాన్యతను గు రించిన ఒక పేరా ఇచ్చి, అందులోని విశేషాంశాలను రాయమని కోరారు.
‘తీయని పలకరింపు’ పాఠం మొదట్లో ఒకరి సంభాషణ ఇచ్చి అది ఎవరు ఎవరుతో మాట్లాడుతున్నారో గ్రహించాలని ప్ర శ్నలు వేశారు. తీయని పలకరింపు’ పాఠం ఉద్దేశం వృద్ధుల గు రించిన శ్రద్ధ, కుటుంబ విలువల గురించింది. అవగాహనలో ముసలివారు వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి గల కారణాలను చర్చిం చండి అని కోరారు. ఒక వచన కవిత ఇచ్చి అందులోని భావాన్ని ప్రశ్నలు, జవాబులుగా రాయమని సూచించారు. ప్రాజెక్టు పనిలో పనిగా ఇంటిచుట్టుపక్కల ఉండే వృద్దులవద్దకు వెళ్ళి, వాళ్లతో మాట్లాడి, వాళ్ళకు ఇష్టమైన, అవసరమైన పనులు ఏవో తెలుసుకొని చెప్పండి. వారు ఏమనుకుంటున్నారో రాయండి అని నిర్దేశించారు.
ఉపవాచకంలో ఈ కింది వారి గురించి సంక్షిప్తంగా పరిచ యం చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మహోన్నతులు. ఈ పాఠాలు తెలంగాణ మహనీయులతో పాటు, దేశంలో తొలి మ హిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫూలే గురించి, స్వామి వివేకానంద గురించిన పాఠాలు ఉన్నాయి. ఇలా జాతీయ స్థాయి అవగాహన పెరగడానికి ఈ ఉపవాచకం ఎంతో ఉపయోగ పడు తుంది. పెద్దవాళ్ల జీవిత చరిత్రలు చదవడం ద్వారా విద్యార్ధుల్లో తాము కూడా ఎదగాలనే గొప్ప లక్ష్యం, స్ఫూర్తి కలుగుతుంది. ఇంత చక్కని పాఠ్యాంశాలు చేర్చిన రూపకర్తలకు అభినందనలు. అట్టవెనుక కొమురం భీం, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, డా.కె. జయశంకర్, స్వామి వివేకానంద, సావిత్రిబాయి ఫూలేతో పాటు ఉపన్యాసం ఇస్తున్న దృశ్యాన్ని చిత్రించారు.
1. కొమురం భీం జూలై
2. సురవరం ప్రతాపరెడ్డి సెప్టెంబరు
3. కాళోజి అక్టోబరు
4. జయశంకర్ డిసెంబరు
5. స్వామి వివేకానంద జనవరి
6. నేను… సావిత్రిబాయిని ఫిబ్రవరి
9వ తరగతి ఉపవాచకంలో కొమురం భీం, సురవరం ప్రతా పరెడ్డి, కాళోజీ, డా. కె. జయశంకర్, స్వామి వివేకానంద, సావిత్రి బాయి ఫూలే వంటి తెలంగాణ, జాతీయ నాయకులను, సంస్కర్తల ను పరిచయం చేయడం ఎంతో చక్కని దృష్టికోణం. కొమురం భీం ఆదివాసి జీవితాలకు, నాయకత్వానికి, ఉద్యమాలకు ప్రతీక అయితే సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ జాతీయోద్యమానికి ఒక ప్రతీక. కాళోజీ తెలంగాణ సమాజంలో సమాజంతోపాటు నడుస్తూ, సమాజాన్ని ముందుకు నడిపే కవులు, కళాకారులకు కాళోజి, డా. కె. జయశంకర్ ఉదాహరణప్రాయంగా నిలుస్తారు. స్వామి వివేకానంద ఒక అంతర్జాతీయ, జాతీయ భావజాల సంస్కరణ ఉద్యమానికి ప్రతీక. సావిత్రిబాయి ఫూలే దేశంలోని ఆధునిక విద్యా రంగానికి పునాదులు వేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురా లు. అలా మహిళా చైతన్యానికి సావిత్రిబాయి ఫూలే ఒక ప్రతీక. ఇలా అనేక రంగాల్లోని మహనీయులను పరిచయం చేసే 9వ తరగతి ఉపవాచకం ఎంతో గొప్పగా రూపొందింది.
ఇలా తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలో అనేక వైవిధ్య పూరితమైన అంశాలు, ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. ఒక వాచకంగా ఒక సమగ్ర స్వరూపాన్ని సంతరించుకున్న ఈ పుస్తక రూపకల్పనలో ఎందరో కృషి చేశారు. పలువురి కృషి, ఆలోచనలు, చర్చలు, పాఠ్యాంశాల లక్ష్యాలు, విద్యార్ధుల వయస్సు, ఆధునిక సమాజంలో అవసరమైన భాష, అవగాహన, ప్రక్రియలు, స్నేహం, త్యాగం, ఉద్యమం, ఉదాత్త జీవిత లక్ష్యాలు మొదలైనవి విద్యార్ధుల హృదయాల్లో నిలిచిపోయి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. పదాలు, నుడికారాలు, సంస్కృతి, పద్యాలు, పాట లు, వచన కవితలు, సంభాషణ, ఇంటర్వ్యూలు, ఉపన్యాసం, వ్యా సం, జీవిత చరిత్ర, లేఖా రచన వంటి అనేక ప్రక్రియలను తొమ్మిదో తరగతిలోనే పరిచయం చేసి వాటిపట్ల ఒక చక్కని అవగాహన క లిగిస్తుంది. ఉపాధ్యాయుడు ఎంతో ఉత్సాహంగా ఈ పాఠాలు చెప్పగలిగితే వారుకూడా ఎంతో ఎదుగుతారు.
బి.ఎస్. రాములు, మొబైల్: 33196697
మెయిల్: పరతీఎశ్రీఏఎఱశ్రీ.శీఎ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *