తెలుగు వాచకాల విశిష్టత

1 నుంచి 5 తరగతుల తెలుగు వాచకం జాబిలి సిరీస్

తెలంగాణ రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ సంస్థ ఒకటో తరగతి పుస్తకం ముందుమాటలో ఈ వాచకం లక్ష్యాలను ఇలా పేర్కొన్నారు.
‘‘ఎన్నో పోరాటాల ఫలితంగా మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం 2వ జూన్ 2014వ తేదీన ఆవిర్భవించింది. మన రాష్ట్రంలో మన సంస్కృతితో కూడిన పాఠ్యపుస్తకాల ఆధారంగా మన పిల్లలు నేర్చుకోవా లి. మన సంస్కృతి, మన చరిత్ర, మన వైభవం, మన జీవితం గురించి పిల్లలు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠాలను నిర్ణయించడానికి కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాన్ని సమీక్షించి తెలంగాణ ముద్ర ఉండేలా వాచకాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లల కోసం రూపొందిన తొలి వాచకం ఇది.
పిల్లలందరికీ జన్మత్ణ భాషను నేర్చుకునే సామర్థ్యం ఉందని భాషా శావేత్తలు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. తమ పరిస రాలలో అర్థవంతమైన సందర్భోచిత సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా తమకున్న సామర్థ్యాన్ని వినియోగించుకుని పిల్లలు అందరూ భాషను అత్యంత సహజంగా, సులువుగా పొందుతున్నారు. ఏ భాషకయినా సంక్లిష్టమైన నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. పాఠశాలకు రాక ముందే పిల్లలు భాషను ఎంతో సులువుగా గ్రహించి సందర్భోచితంగా వినియోగిస్తున్నారు. బడిలో చేరకముందే, భాషను వినియోగించే సామ ర్థ్యం కలిగిన పిల్లలు బడిలో చేరిన తర్వాత భాషాభ్యసనంలో ఆశించిన ప్రగతిని కనబరచాలి.
ఆశించిన విధంగా పిల్లలందరూ భాషాభివృద్ధి సాధించాలంటే, ఉపాధ్యాయులు అర్థవంతమైన సన్నివేశాలను కల్పించి సందర్భోచితం గా భాషను నేర్చుకునేలా చేయాలి. దానితోపాటు పిల్లలందరూ పాల్గొ నేలా, భయరహితమైన, స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కల్పించాలి. వివిధ రకాల సన్నివేశాలు, భాషావ్యవహార రూపాలు ఆధారంగా బోధ నాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. ఇందుకు దోహదపడే అంశాలు పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకోవాలి.
జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం-2005, ఆర్.టి.ఇ. 2009 కూడా ఈ అంశాలనే ప్రస్తావించాయి. వీటి ఆధారంగా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నూతన తెలుగు వాచకాన్ని రూపొందించారు. ఈ వాచకాలను పదపద్ధతిలో, ఆకర్షణీయ చిత్రాలతో ఆసక్తిని, ఆలోచ నలు రేకెత్తించే విధంగా అర్థవంతమైన కృత్యాలతో రూపొందించారు. ప్రతీ పాఠ్యాంశం ఒక సన్నివేశ చిత్రంతో మొదలవుతుంది. దీన్ని అ నుసరించి ఒక అభినయ గేయం/ కథ/పాట ఉన్నది. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడానికి, పదాలు-అక్షరాలు గుర్తించి చదువడానికి, రాయడాని కి తగిన అభ్యాసాలు ఉన్నాయి. గేయపంక్తులు పొడగించడం, బొమ్మ లు గీయడం, రంగులు వేయడం, వంటి సృజనాత్మక కృత్యాలు ఉన్నా యి. వివిధ నేపథ్యాలున్న పిల్లలు స్వేచ్ఛగా తమ భాషలోనే మాట్లాడేలా ప్రోత్సహిస్తూ, తెలుగు భాషపై పట్టు సాధించేలా చూడాలి.
నూతన దిశగా పాఠ్యపుస్తకాలను రూపొందించే క్రమంలో ఇది ఒక తొలి అడుగు. పాఠ్యపుస్తక వినియోగాన్ని గురించి ఉపాధ్యాయులకు సూచనలు కూడా చేర్చాం. వీటిని అమలుపరచాలి. తద్వారా పిల్లం దరూ వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదువడం, అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పడం, రాయడం, సృజనాత్మకత వంటి భాషా సామర్థ్యాలు సాధించేలా ఉండాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకం తోపాటు పాఠశాల గ్రంథాలయ పుస్తకాలు, అదనపు పఠనసామగ్రిని కూడా వినియోగించాలి.
పాఠ్యపుస్తక రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్స హించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఉప ముఖ్యమంత్రి, పాఠశాల విద్యాశా ఖామాత్యులు కడియం శ్రీహరి, విద్యాశాఖ పూర్వ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి రంజీవ్. ఆర్. ఆచార్య, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు టి.చిరంజీవులు, ప్రభుత్వ సలహాదారు డా॥ కె.వి. రమణాచారి లకుప్రత్యేక ధన్యవాదాలు. దీని రూపకల్పనలో పాల్గ్గొన్న ఉపాధ్యాయులు, విషయ నిపుణులు, కమిటీ సభ్యులు, చిత్రకారులకు, డి.టి.పి., లే-అవుట్ చేసిన వారికి, పాఠ్య ప్రణాళికా విభాగ సభ్యులకు అభినందనలు.
తెలంగాణలో వస్తున్న తొలి వాచకం కాబట్టి విజ్ఞులు, విద్యావేత్తలు తమ సలహాలు సూచనలు ఎస్.సి.ఇ.ఆర్.టి.కి అందజేయవచ్చు. వీటి ని పరిశీలించి మలి ముద్రణలో తగిన చర్యలు చేపడుతారు. ఈ వాచ కం పిల్లలలో భాషా సామర్ధ్యాలను పెంపొందించుటకు తోడ్పడుతుం దని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే మరొక పేజీలో ఉపాధ్యా యులకు అనేక సూచనలు చేశారు. పాఠాలను ఎలా పీరియడ్‌లలో పంచి చెప్పాలో సూచించారు. ఆ సూచనలు ఎంతో విలువైనవి. ము ఖ్యంగా ఒకటో తరగతి పూర్తయ్యేసరికి పిల్లలు సరళ పదాలు, గుణిం తాలు, చదవడం, రాయడం చేయగలగాలి. ఈ లక్ష్యసా ధనకు ప్రణా ళికా బద్దంగా బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి… సిలబస్ పూర్తి కావడమంటే పాఠాలు పూర్తి చేయడం మాత్రమే కాదు. పాఠం ఆధారంగా సామర్థ్యాలను సాధించడం కాబట్టి యాంత్రికంగా పాఠాలు పూర్తి చేయడం కన్న సామర్థ్యాలను సాధించడంపై దృష్టి పెట్టాలి అని సూచించారు.
ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు రూపొందించిన ఈ వాచకాలకు ముందు చదువుకోవడానికి మరో నాలుగు ప్రి-నర్సరీ, న ర్సరీ, ఎల్‌కేజి, యుకేజి వాచకాలను కూడా రూపొందించాల్సిన అవ సరం ఉంది. ఇంగ్లీషులో వెలువడుతున్న ఇలాంటి పుస్తకాలను ముందే సుకొని అందులోని మార్గదర్శకాలను గమనించి వీటిని రూపొందించ డం వల్ల తెలంగాణ విద్యార్ధులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అ వి ఎక్కువమేరకు బొమ్మలతో కూడుకొని అక్షరాలను పరిచయం చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు.
తొలుత జాబిలి సిరీస్‌లో ప్రచురించిన ఒకవ తరగతినుంచి ఐ దవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల విద్యార్ధులకు రూపొందించిన పాఠ్యాంశాలను, వాచకాలను, వాటి ప్రత్యేకతలను పరిశీలిద్దాం. సంసి ద్ధత పాఠాలుగా కేవలం బొమ్మలు వేసి, బొమ్మలు చూసి కథ చెప్పండి అని సహాయం, ఉపాయం, పనిచేద్దాం, ఆడుకుందాం, ఈత కొడదాం, బడికి పోదాం, బొమ్మలు చూసి ఇంతకుముందు బొమ్మలు ఇవి ఎక్కడ ఉన్నాయో వెతకండి, ఈ బొమ్మలు గురించి మాట్లాడండి అని ఏడు సంసిద్ధత పాఠాలు ఇచ్చారు.
ఆ తర్వాత ఒక్కొక్క బొమ్మ వేసి దాన్ని ఏమని పిలుస్తారో అక్షరాలు రాశారు. ఇంతకుముందు ఉన్న బొమ్మల్లో ఇవి ఎక్కడ ఉన్నాయో వెత కమని కోరారు. పిల్లలకు అవి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆ త ర్వాత మరి కొన్ని బొమ్మలు వేసి ఆ బొమ్మ గురించి మాట్లాడాలని సూ చించారు. మొడటి పాఠం ‘తబల’ పిల్లల ఆటపాటలకు అనువుగా ఆ కర్షణీయంగా ఉండే పాఠాన్ని బొమ్మను రూపొందించారు. తబలా అ క్షరాలను రాయడానికి, తబల అక్షరాలనుండి తల, లత, తబల, తల తల, లబలబ, బలబల వంటి పదాలను రూపొందించి చూపించారు. చూచిరాతకు పుస్తకంలోనే రెండు గీతల మధ్య రాయడానికి స్థలం కే టాయించారు. ఆ తర్వాత ఆ తబల బొమ్మలను గీసే ప్రయత్నం చే యండని, పేరు రాయండని సూచించారు.
ఇలా రెండవ పాఠం ‘కంజర’ గురించి, మూడవ పాఠం ‘ఆట’ గు రించి, నాలుగవ పాటం ‘ఉంగరం’, ఐదవ పాఠం ‘శనగ’, ఆరవ పా ఠం ‘అనప’, ఏడవ పాఠం ‘సవరం’, ఎనిమిదవ పాఠం ‘ఊడ’, తొమ్మి దవ పాఠం ‘దండ’, పదవ పాఠం ‘ఈత’, పదకొండవ పాఠం ‘మం చం’, పన్నెండవ పాఠం ‘ఓడ’, పదమూడవ పాఠం ‘కాకర కాయ’ ప ద్నాలుగవ పాఠం ‘గీతల అంగి’, పదిహేనవ పాఠం ‘మూకుడు’, పద హారవ పాఠం ‘ఇటుక’, పదిహేడవ పాఠం ‘ఎలుక-ఏనుగు’, పద్దెనిమి దవ పాఠం ‘తేనెటీగ’, పందొమ్మిదవ పాఠం ‘కొంగ సోపతి’, ఇరవ య వ్వ పాఠం ‘మైదాకు’, ఇరవైయొకటవ పాఠం ‘సింహం-జింక’, ఇర వై రెండవ పాఠం ‘పాఠశాల’, ఇరవైమూడవ పాఠం ‘ఝషము’, ఇరవై నా లుగవ పాఠం ‘రథం’, ఇరవై ఐదవ పాఠం ‘పొడుపు కథలు’, చివరి అ ట్ట లోపలి పేజీలో బొమ్మలు చూడండి, కథ చెప్పండి అని దీపావళి ప టాకులు గురించిన చక్కని బొమ్మలు ప్రచురించారు.
ఇంగ్లీషులో యూరప్, అమెరికా తదితర దేశాల్లో పిల్లల పాఠ్య పు స్తకాలను రూపొందించడంలో ఉండే అవగాహనను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలోని పిల్లల పరిసరాలను, జీవితాలను తీసుకొని అ పూర్వంగా రూపొందించిన వాచకాలు ఇవి. వెనుకట తెలుగు వాచకా లు ఇలా ఉండేవి కావు. రంగురంగుల బొమ్మలు, దృశ్యాలు, అభ్యా సాలు, ఊహాశక్తిని పెంచే, ఊహించి కథ అల్లే సృజనాత్మకతను పిల్లల నుంచి వెలికితీసే విధంగా రూపొందించిన ఈ పాఠాలు ఒక ప్రత్యేక దృష్టితో రూపొందించబడ్డాయి. పూర్వం పాఠాలను ఎక్కాలవలె వల్లె వే యడానికి, జ్ఞాపకశక్తి, ధారణ శక్తి పెరగడానికి ఉపయోగపడాలని తెలుగువాచకాలను రూపొందించేవారు. దీనివల్ల పాఠ్యపుస్తకాన్ని బట్టీ యం ద్వారా నేర్చుకునే పద్ధతి కొనసాగింది. పద్యాలు, పాటలు ఇం దుకు అనుకూలంగా చేర్చేవారు. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలు, గ ద్యాలు, కఠిన పదాలు, వ్యాకరణ సూత్రాలు మొదలైనవాటికి ప్రాధాన్య త ఇచ్చేవారు. మతపరమైన పాఠాలు ఎక్కువగా ఉండేవి.
ఇప్పుడు ఈ పద్ధతిలో రూపొందించడం పూర్తిగా మారిపోయింది. కొంత కాలం నుండి అవగాహన మార్చుకుంటూ పిల్లలకు పుట్టిన్నుం చి అమ్మ ద్వారా పరిచయం అవుతున్న అమ్మనుడి అనుసరించి పదా లను, దృశ్యాలను, లౌకిక ప్రజాస్వామ్య దృష్టితో రూపొందించడం కన పడుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. ఈ మార్పు యొక్క ప్రత్యేకత పిల్ల ల ఊహాశక్తిని, కథన శక్తిని, భావాన్ని వ్యక్తం చేసే తీరును ఎదిగిం చడం. తద్వారా జరిగే మేలు ఇంతా అంతా కాదు. ఊహాశక్తి ద్వారానే సైన్సు నూతన ఆవిష్కరణలు, సాహిత్య, కళా, సృజన రంగాలు సాధ్య మవుతాయి. అందువల్ల యూరప్, అమెరికా దేశాల్లో ఈ విధానంలో పాఠ్యాంశాలను రూపొందించడం వల్ల అవగాహన శక్తి పెంచే కృషి చే స్తున్నారు. అవగాహన శక్తి పెరిగితే ఆ తర్వాత నూతన అంశాలను ఊ హించడం, సృజనాత్మకంగా ఆలోచించడం పెరుగుతుంది. అట్ల క్రమ క్రమంగా తమ జీవితంలో ఏదో ఒకటి కొత్తగా కనుక్కోవాలి. తనదైన ఒక ప్రత్యేకమైన కృషి చేయాలి. సాధించాలి అనే లక్ష్యం స్థిర పడుతూ, అనేక రంగాల్లో ఎదగడం జరుగుతున్నది. వెనుకట మేం చదువుకున్న ప్పుడు మన పాఠ్యపుస్తకాలు ఇలా ఉండేవి కావు. చెప్పింది విను. వల్లె వెయ్యి, బట్టీ పట్టు, అప్పజెప్పు, రాయి. ప్రశ్నలు కూడా చెప్పింది విని అప్పగించే విధంగా ఉండేవి. అనగా టేపురికార్డరులా పాఠ్యపుస్తకం ధ్వ నికి ప్రతిధ్వనిగా మారేవిధంగా రూపొందించేవారు. తద్వారా పాండి త్యం, జ్ఞాపకశక్తి పెరగడం తప్ప ఊహాశక్తి, సృజనాత్మకత పూర్తిగా తగ్గి పోయేవి. స్వంతంగా ఆలోచించి రాస్తే బెత్తం దెబ్బలు, హేళనలు తప్పే వి కావు. అలా అవమానించి కొత్తగా కొత్త పదాలతో, ఊహలతో తన దైన కథనాత్మకత పద్ధతిలో మాట్లాడినా, రాసినా, చెప్పినా క్లాసు రూం లో ఉపాధ్యాయుడు అవమానించేవారు. పిల్లలు నవ్వేవారు. దాంతో సృ జన శక్తి అడుగంటిపోయేది. భారతదేశంలో నూతన ఆవిష్కరణలు లేకపోవడానికి విద్యావిధానమే ప్రధాన కారణం. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించి పాఠ్యపుస్తకాలలో మార్పులు, చేర్పులు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అచ్చువేసిన ఈ పాఠ్య పుస్తకాలు అమెరికా, యూరప్ పాఠ్య పుస్తకాలతో పోటీ పడే విధంగా ఊహాశక్తిని, కథన శక్తిని, పరిశీనా శక్తిని, అర్థం చేసుకొని స్వంత మాటల్లో చెప్పడం, భావాన్ని గ్రహించడం, స్వీయ రచన, సృజనాత్మ కత వ్యక్తీకరణ పెంచేవిధంగా రూపొందించడంలో చాలా మేరకు విజ యవంతమయ్యారు. ఈ పుస్తకాలు సాధించిన మొట్ట మొదటి గొప్ప వి జయం ఇది.
ఒకటో తరగతి పాఠ్య పుస్తకం అట్టలపై పిల్లల ఆటపాటలు, గ్రా మం యొక్క దృశ్యాలు బొమ్మలుగా ప్రచురించారు. అవి చూడగానే పి ల్లల్లో చదవాలనే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అట్ట లోపలి పేజీల్లో బొ మ్మలు వేశారు. ఆ బొమ్మలు చూసి ఆలోచించి మాట్లాడాలి. ఊహించి కథను అల్లాలి. బొమ్మలు గీయాలి. చదివి అర్థం చేసుకోవా లి. చూసి రాయాలి. స్వంతంగా రాయాలి అనే లక్ష్యాలను బొమ్మలుగా ప్రచురిం చారు. ముందుమాటలో ‘ఎన్నో పోరాటాల ఫలితంగా మనం కోరుకు న్న తెలంగాణ రాష్ట్రం 2వ జూన్ 2014వ తేదీన ఆవిర్భ వించింది. మ న రాష్ట్రంలో, మన సంస్కృతితో కూడిన పాఠ్య పుస్తకాల ఆధారంగా మ న పిల్లలు నేర్చుకోవాలి. మన సంస్కృతి, మన చరిత్ర, మన వైభవం, మన జీవితం గురించి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇం దుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠాలను నిర్ణయించడానికి క మిటీ నియమించింది. కమిటీ సభ్యులు ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాన్ని సమీక్షించి తెలంగాణ ముద్ర ఉండేలా వాచకాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లల కోసం రూపొందిన తెలుగు వాచకం ఇది. పిల్లలందరికి జన్మత్ణ భాష నేర్చుకునే సామర్ధ్యం ఉందని, భాషా శావేత్తలు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు’. నూతన దిశగా పాఠ్యపుస్తకాలు రూపొందించే క్రమంలో ఇది తొలి అడుగు. తెలంగా ణలో వస్తున్న తెలుగు వాచకం కాబట్టి విజ్ఞులు, విద్యావేత్తలు తమ సల హాలు, సూచనలు ఎస్.సి.ఇ.ఆర్.టి.ఆర్.టి.కి అందజేయవచ్చు. వీటిని పరిశీలించి మలి ముద్రణలో తగిన చర్యలు చేపడతారు అని పేర్కొ న్నారు.
మొదటి అట్టలోపల వందే మాతరం, జాతీయగీతం జనగణమన, ప్రతిజ్ఞ ప్రచురించారు. ‘ఉపాధ్యాయులకు సూచనలు’ అంశంలో ఈ పాఠ్య పుస్తకాన్ని రూపొందించిన క్రమాన్ని, లక్ష్యాలను, పిరియడ్‌లుగా విభజించుకోవాల్సిన తీరును, ప్రదర్శనా అంశాలను, అభ్యాసాలను స మగ్రంగా సూచించారు. ఈ సూచనలు తల్లిదండ్రులు కూడా చదవ డం అవసరం. ఈ పుస్తకాల రూపకల్పనలో పాల్గొన్న వారి వివరాల ను పేర్కొన్న తర్వాత ఈ పాఠ్యపుస్తకం ద్వారా పిల్లలు సాధించాల్సిన సామర్ధ్యాలను ఒక పేజీలో చక్కగా వివరించారు.
ఒక్కొక్క పాఠ్య పుస్తకంలో ఒక్కొక్క తరగతికి ఆ తరగతి స్థాయిని అనుసరించి సూచనలను పేర్కొనడం బాగుంది. వీటిని కూడా తల్లిదం డ్రులు చదవడం అవసరం. పాఠ్యాంశాలకు ముందుగా సంసిద్ధత పా ఠాలు బొమ్మల ద్వారా చూపించారు. అనేక దృశ్యాలు గల బొమ్మలు చూసి కథ చెప్పండి అని ఊహాశక్తిని పెంచేవిధంగా ఈ పాఠాలను రూ పొందించిన తీరు ప్రశంసనీయం.
బి.ఎస్. రాములు
(తరువాయి భాగాలు వచ్చే సంచికల్లో)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *