తెలుగు వాచకాల విశిష్టత

ఒకటో తరగతి తెలుగు వాచకం : జాబిలి – 1
తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దృష్టితో తెలుగు వాచకాలను రూపొం దించడం తొలి ప్రయత్నం. కనుక అనేక సూచనలను ఆహ్వానించారు. ఆ సూచనలను అనుసరించి వచ్చే సంవత్సరం పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పులు చేసి తప్పులు సవరించుకొని, మరింత ఆకర్షణీయంగా, ఆసక్తిక రంగా పాఠ్యాంశాలను రూపొందిస్తామని ముందు మాటలో పేర్కొన్నారు. అందువల్ల ఈ పాఠ్యాంశాల్లోని ఏమైనా లోపాలు ఉంటే వాటిని విమర్శిం చడం కాకుండా సహృదయతతో సూచించడం ద్వారా సవరించుకోవడా నికి అవకాశం ఉంటుంది.
ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పదే పదే గుర్తు చేసినట్టు ఇంతదాకా సీ మాంధ్ర ప్రయోజనాల, ఆధిపత్యాల దృష్టితో ప్రాధాన్యత ఇచ్చి అన్ని రం గాలను నిర్దేశించారు. ఇపుడు మనం తెలంగాణ ప్రయోజనాల దృష్టితో, తెలంగాణ అవసరాల దృష్టితో, తెలంగాణ అభివృద్ధి దృష్టితో ప్రతిదీ పరి శీలించాలి. కొత్తచూపుతో ఆలోచించాలి. రూపొందించుకోవాలి అని కె. సి.ఆర్. గుర్తు చేయడం అందరికి తెలుసు. దాని ప్రాధాన్యత ఏమిటో అం దరూ గుర్తించడం అవసరం. అలా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ దృష్టి కోణంతో, తెలంగాణ ప్రజల అవసరాలను, ఆత్మగౌరవాన్ని, చరిత్రను, సంస్కృతిని, సాహిత్యాన్ని పరిచయం చేస్తూ, రూపొందించిన ఈ పాఠ్య పుస్తకాలు, పాఠ్యపుస్తకాల చరిత్రలో ఒక మైలురాయి. మరింత అందం గా, సమగ్రంగా రూపొందించుకోవడానికి ఈ పాఠ్యపుస్తకాలు ఒక బల మైన ప్రాతిపదికను నిర్మించాయి అని చెప్పక తప్పదు.
తెలుగు వాచకం ఒకటో తరగతి-జాబిలి-1 సంపాదక మండలిలో సువర్ణ వినాయక్, డా॥ దహగాం సాంబమూర్తి, ఆచార్య బన్న అయిల య్య, దేశపతి శ్రీనివాస్, విషయనిపుణులులో డా॥నన్నూరు ఉపేందర్ రెడ్డి, డా॥ ఎవ్‌ు. భూపాల్, పాఠ్యపుస్తక ప్రచురణ సమితిలో ఎస్. జగన్నా థ రెడ్డి, కె. కృష్ణమోహన్ రావు, బి. సుధాకర్ బాధ్యతలు తీసుకొని పుస్త కాన్ని రూపొందించడంలో ఉన్నతస్థాయి కమిటీగా విశేష కృషి చేశారు.
వీరి నేతృత్వంలో పాఠాల రూపకల్పనలో పసుల ప్రతాప్, బెజ్జారపు వినోద్‌కుమార్, కోట సుకన్య, గట్టు త్రివేణి, కె.ఉపేందర్ రావు, వేము గంటి మురళీకృష్ణమాచారి, వురిమళ్ల సునంద, పల్లి మాధవి, కె. ఉదయ్ కుమార్, కోట వెంకటేశ్వర్లు, యు. బుగ్గమ్మ తమ ఉపాధ్యాయ అనుభవా లను జోడించి క్రియాశీలంగా పాల్గొన్నారు. ఈ పుస్తకంలోని బొమ్మలను కూరెళ్ల శ్రీనివాస్, కూరెళ్ళ రాఘవాచారి, బి.కిషోర్ కుమార్, టి.వి. రామ కిషన్‌లు చక్కగా తీర్చిదిద్దారు. డి.టి.పి, లే ఔటు, డిజైనింగ్ ప్రతిమా పా తురి చాలా అందంగా రూపొందించారు.
పాఠ్యపుస్తక సమీక్ష, అభివృద్ధి కమిటీ సభ్యులుగా విశ్వవిద్యాలయ స్థా యిలో రవ్వా శ్రీహరి, ఎన్. గోపి, కోవెల సుప్రసన్నాచార్య, ఎస్.వి. రామా రావు, బన్న అయిలయ్య, ఎస్.రఘు, ఎన్.రజని, జి.బాల శ్రీనివాస మూ ర్తి ఆయా విశ్వవిద్యాలయాలకు, వారి అనుభవాలకు ప్రతినిధులుగా ఉన్నా రు.
విద్యావేత్తలు, విషయ నిపుణులు కమిటీలో చుక్కా రామయ్య, దహ గాం సాంబమూర్తి, నందిని సిధారెడ్డి, నలిమెల భాస్కర్, సుంకిరెడ్డి నారా యణ రెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, వేణు సంకోజు, సంగిశెట్టి శ్రీనివాస్, దేశపతి శ్రీనివాస్, ఎన్.ఉపేందర్ రెడ్డి, కె.కృష్ణమోహన్ రావు, శ్రీమతి దీపిక, సువర్ణ వినాయక్, కె.రాజేందర్ రెడ్డి, తల్లావజ్జల మహేష్‌బాబు తమ సూచనలు, అనుభవాలు అందించారు. క్షేత్రస్థాయి లోని అనుభవా లను, ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి పల్లెర్ల రామమోహన రావు, వి.చెన్నయ్య వొజ్జల శరత్‌బాబు, అవుసుల భానుప్రకాశ్, కందా డై రంగరాజు, ఎల్. ఎం. ప్రసాద్, పల్లి మాధవి ఈ వాచకం రూపకల్పనలో పాల్గొన్నారు.
ఈ పాఠ్యపుస్తకం ద్వారా పిల్లలు సాధించాల్సిన సామర్ధ్యాలు
నవిని అర్థం చేసుకోవడం, స్వేచ్ఛగా మాట్లాడడం, పరిచితమైన కథలు, పాటలు, సంభాషణలు విని అర్థం చేసుకోవడం, విన్న అంశం గురిం చి ఎవరు? ఏమిటి? ఎక్కడ? వంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, వింటున్నప్పుడు అక్షరాల మధ్య ధ్వని భేదాలు గుర్తించడం, తెలిసిన, చూసిన వాటి గురించి స్వేచ్ఛగా మాట్లాడగలగడం, బొమ్మల ఆధారం గా మాట్లాడ్డం, ఎవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం చేస్తున్నారు వంటి అంశాలు చెప్పడం, గేయాలు, పాటలు రాగంతో భావంతో పా డడం, తెలిసిన కథలు సొంత మాటల్లో చెప్పడం, వర్ణమాల, గుణిం తాల పదాలు, అక్షరాలను స్పష్టోచ్ఛారణతో పలకడం మొదలైనవి సాధించడం ఒక లక్ష్యం.
నధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, గేయాలు, పాటలు వంటి వాటిలో వాక్యాలు గుర్తించడం, ఇచ్చిన అంశంలో కీలక పదా లు, వాటిలోని అక్షరాలు గుర్తించడం, పదాలలోని అక్షరాలను వర్ణమా ల, గుణింతాల చార్టులు గుర్తించడం, సరళపదాలు, గుణింత పదా లు, సరళమైన వాక్యాలు ధారాళంగా, తప్పుల్లేకుండా చదవడం, చదు వుతున్న పదాలలో లోపించిన అక్షరాలను గుర్తించి రాయడం, బొమ్మ లతో పదాలు జతచేయడం వంటి వాటిలో సామర్ధ్యం సాధించాలి.
నరాయడం, నేర్చుకున్న అక్షరాలు ఉపయోగించి సొంతంగా పదాలు రా యడం, వర్ణమాల ఆధారంగా సరళపదాలు రాయడం, గుణింత పదా లు రాయడం, బొమ్మ ఆధారంగా సరళ, గుణింత పదాలు, వాక్యాలు రాయడం, తప్పుల్లేకుండా అందంగా రాయడం, ఉక్తలేఖనం రాయ డం చేయగలగాలి.
నసృజనాత్మకత. గేయాలు అభినయంతో పాడడం, బొమ్మలుగీసి, రంగు లు వేసి పదాలు రాయడం, అభినయగేయాలు పొడిగించడం, మట్టి తో బొమ్మలు చేసి వాటి గురించి మాట్లాడడం, బొమ్మ ఆధారంగా కథ ను ఊహించి చెప్పడం చేయగలగాలి.
ఈ కొత్త వాచకాలకు కొత్తగా ఉపశీర్షికలు పెట్టడం బాగుంది. ఒక టో తరగతి నుండి ఐదో తరగతి వరకు తెలుగు వాచకాలకు జాబిలి అని ఉప శీర్షికతో ప్రచురించారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వర కు జాబిలి-1 – జాబిలి-5 అని ఉప శీర్షిక పేరు పెట్టారు. ఆరవ తర గతి నుంచి ప్రథమ భాష తెలుగు అని ప్రత్యేకంగా పేర్కొంటూ ఆరవ తర గతి వాచకానికి నవవసంతం-1. ఏడవ తరగతికి నవ వసంతం-2, ఎ నిమిదవ తరగతికి నవవసంతం-3 అని పేరు పెట్టారు. తొమ్మిదికి సిం గిడి-1, పది తరగతి పుస్తకానికి సింగిడి-2 అని పేర్లు పెట్టడం జరి గింది.
తెలంగాణ భాషను, ఇంటింటి భాషను, మాట్లాడుకునే భాషను మం డలాలవారీగా సేకరించి, జిల్లాస్థాయిలో చర్చించి, ఒక రూపం యివ్వాలి. బడికి రాకముందే ఐదేళ్ళవరకు పిల్లలు ఏయే పదాలు, వాక్యాలు ఉప యోగిస్తున్నారో వాటన్నిటిని రికార్డు చేసి, వాటినే ప్రామాణికంగా తీసు కొని తెలంగాణ భాషా వాచకాలను రూపొందించాలి. అలా పదేళ్ళ వయ స్సు దాక మాట్లాడే వాటితో ఐదవ తరగతి వరకు, పదిహేనేళ్ళ వయస్సు వాళ్లు మాట్లాడుకునే భాషతో పదవ తరగతి వరకు పాఠాలు రూపొందిం చడంలో ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రతి జిల్లాలో ఇలా సేకరించిన స మాచారాన్ని రాష్ట్రస్థాయిలో కూర్చొని తుది రూపం ఇచ్చి ఆ ప్రక్రారంగా తెలంగాణ భాషలో పాఠ్యపుస్తకాలు రాయడం అవసరం. అలా తెలంగాణ పత్రికాభాష, రేడియో, సినిమా, టీవి, పాఠ్యపుస్తకాల భాష ప్రత్యేకంగా రూపొందించుకోవడం అవసరం. ఈ విషయాలను నా ప్రతిపాదనలో సూచించాను.
ఈ పాఠ్యపుస్తకాలను అన్నింటిని ఉపాధ్యాయులు ఒకసారి తమకే సి లబస్ అనుకొని చదివితే గతంలోని శిక్షణకు, పాఠ్య బోధనకు నేటి బో ధనా అవసరాలకు మధ్య తేడా తెలిసి వారి మైండ్‌సెట్ మారుతుంది. త ద్వారా విద్యార్ధులకు మరింత ఆకర్షణీయంగా పాఠాలు చెప్పటం వీలవు తుంది. తల్లిదండ్రులు కూడా ఒకవ తరగతి నుంచి పదవ తరగతి దా కా గల ఈ పుస్తకాలను కనీసం ఒకసారి తిరగేసి చూస్తే మంచిది. తాము చదువుకున్నప్పటి పాఠాలకు, నేటి వాచకాల రూపకల్పనకు మధ్య ఎంత తేడా ఉందో, తమ పిల్లలు, నేటి పిల్లలు చదువుకుంటున్న పాఠ్యాంశాలు తమకు కూడా ఎంత ఉపయోగకరమో తెలుసుకుంటారు. అందువల్ల తల్లి దండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, సా మాజిక శావేత్తలు మొదలైన విభిన్న రంగాలవాళ్లందరు ఒకసారైనా పుస్త కాలను సమగ్రంగా పరిశీలించడం ఎంతో అవసరం. తద్వారా వారు పా త భావాలనుండి కొత్త భావాలకు ఎదగడం సులభమవుతుంది.
ఉదాహరణకు నేను ఢిల్లీని 195-6లో చూసిన తర్వాత తిరిగి పదేళ్ళదాక చూడలేదు. 1996లో ఒకసారి, ఆ తర్వాత 2001లో మరో సారి ఇలా ఢిల్లీని చూస్తుంటే పాత కాలంలో చూసిన ఢిల్లీ యొక్క దృశ్యా లు అదృశ్యమై కొత్త దృశ్యాలు మనస్సులో నిలిచిపోయాయి. మళ్ళీ చూసే దాకా నాలో పాత జ్ఞాపకాలే, పాత దృశ్యాలే మెదిలేవి. మళ్ళీ చూసిన త ర్వాత మారిన ఢిల్లీ దృశ్యాలు హృదయంలో నిలిచి పోయాయి. అలాగే మ నం వెనకట చదువుకున్న పాఠ్యపుస్తకాల దృశ్యాల నుండి కొత్త దృశ్యాల కు మారడానికి తప్పనిసరిగా ఈ కొత్త పుస్తకాలను చూడ్డం అవసరం. అపుడే తల్లిదండ్రులుగా, మేధావులుగా, సామాజిక శావేత్తలుగా, ఉపా ధ్యాయులుగా, జర్నలిస్టులుగా, అప్‌డేట్ అవడం, నూతన దృశ్యాలను హృ దయంలో నింపుకోవడం సాధ్యపడుతుంది. అంతదాకా పాత దృశ్యాలే కొ నసాగుతాయి. తద్వారా అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్యార్ధులను తీర్చి దిద్దడంలో ప్రభావితం చేసి, కష్టపెడతాయి, నష్టపరుస్తాయి. ఈ పాఠ్య పుస్తకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే విద్యార్ధులందరికి తెలంగాణ ప్రాంతంలోని ప్రదేశాలు, పదాలు, భాష, పండుగలు, ఉద్యమా లు, తెలంగాణ హృదయం, తెలంగాణ అభివృద్ధి, అవసరాలు తెలుస్తాయి. తద్వారా తెలంగాణ సమాజంలో పాలల్లో పాలలా వారు కలిసిపోవడానికి, కలిసి జీవించడానికి ఎంతో ఉపయో గపడతాయి.
అయితే ఈ కొత్త వాచకాల్లో తెలంగాణ భాషలో వాక్య నిర్మాణం చే పట్టలేదు. ఒకేసారి తెలంగాణ భాష నిర్మాణాన్ని, వ్యాకరణాన్ని ప్రవేశ పెడితే ఉపాధ్యాయులకు కష్టమని, విద్యార్ధులకు కూడా కష్టమేనని భా వించడం జరిగింది. తొలిదశలో తెలంగాణ పదాలను, పలుకుబడు లను, జీవితాలను, సంస్కృతిని, జాతీయాలను పరిచయం చేస్తూ, పత్రికా వ్యవ హారిక భాషలోనే కాస్త స్వతంత్రం తీసుకొని రాస్తే ప్రస్తుతానికి చాలని నిర్ణ యానికి వచ్చారు. అందువల్ల ఈ పాఠ్యాంశాల్లో పూర్తి స్థాయిలో తెలం గాణ ఇంటింటి భాష పూర్తిస్థాయిలో చేరలేదు.
గతంలో ఈ విషయంలో కొంత ప్రయత్నం జరిగినా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఒకేసారి వరుస క్రమంలో అన్ని తరగతుల పాఠ్యాంశాలను రూపొందించి ఒక సమగ్ర దృక్పథంతో సమన్వయం సా ధించిన తీరు ఈ పాఠాల్లో, వాచకాల్లో కనపడుతుంది. గతంలో రూపొం దించిన వాచకంలో ఐదవ తరగతి వరకు ఒక తీరు ఉండి, ఆరవ తరగతి నుంచి అకస్మాత్తుగా ప్రమాణాలు పెంచి, పాఠ్యాంశాలు, వాచకాలు రూ పొందించడం కనబడుతుంది. అలా జంప్ కనపడేది. ఈ వాచకాలు అ లా కాకుండా మెట్టుమెట్టుగా ప్రతిదీ వ్యాకరణం, ఛందస్సు, అలంకారా లు, సంధులు, సమాసాలు, పదాలను స్వంత వాక్యాల్లో రాయడం, ఖాళీ లను పూరించడం, ప్రాజెక్టు పని మొదలైనవి అన్ని చక్కగా పొందుపరచ డం జరిగింది. జ్ఞాపకశక్తి, ప్రాచీన సాహిత్య పరిచయం, పదసంపద, ప ద్య విశిష్టతను ప్రధానం చేసి రూపొందించిన పాత పుస్తకాల అవగాహన నుండి ముందుకు సాగి నేటి సమాజంలో భాషలో ఎన్ని ప్రక్రియలు ఉ న్నాయో, ఆ ప్రక్రియల ప్రత్యేకత ఏమిటో వాటిని నేర్చుకొని, ఎలా తన భావాలను వ్యక్తీకరించుకోవాలో, అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, జ్ఞా పక శక్తికి కాకుండా, పరిశీలన, పరిశోధన, ఊహాశక్తి, సృజనాత్మకత, ఆ సక్తి, ఆకర్షణీయత, ఆధునిక అవగాహన, సామాజిక అవసరాలు, ఆధు నిక భాషా అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి రూపొందించిన గొప్ప వాచకా లు యివి.
బి.ఎస్. రాములు
(తరువాయి భాగాలు వచ్చే సంచికల్లో)


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *