నా మూసీ నది

ఒకనాడు సుందర అందమైన మహానది మన మూసినది. వికారాబాద్ అనంతగిరి కొండ గుండెల్లో పురుడు పోసుకొని నిరం తర ప్రవాహ జలాలతో వందల కిలోమీటర్లు ప్రయాణిస్తు గ్రామ గ్రామాన్ని తాకుతూ, కాలువలు, చెరువులు, కుంటలను నింపుకుంటూ విరామమంటూ ఎరగని పరమ పావని నా తల్లి నిత్య పుష్కరిణి నా మూసిమ తల్లి.
మూసి అంటెనే అదో ఆనందం. కల్మషం, కాలుష్య విషం లే కుండా, శంఖంలో తీర్థంలా పవిత్రంగా వుండేది. పసిపాపల మన స్సుల లాంటి తన నీటి అలలపై తామెర పువ్వుల నవ్వులలో వయ్యా రాల సొగసుల మలుపులలో లోలోన మురుస్తూ తళతళ ముత్యాల్లా మెరుస్తూ పర్యాటకులని మైమరిపించేది నా మూసి.
మూసి అంటే ముత్యాల నగరానికి రతనాల పసిడినగ వంటిది. మూసి అంటె తెలంగాణలో ఓ జీవనది. ఓ పుష్కరిణి మూసి. నిజాం నిలువెత్తు పాలనకి సజీవ సాక్ష్యం మూసి. భాగమతి స్వప్నం మూసి. నయాపూల పరిమళాల సోయగం.
తరతరాల నుంచి లక్షలాది ప్రజలకి అన్నపూర్ణల సకల జీవ జాతికి దివ్యఔషధిని మూసి. పక్షుల పర్యాటకుల, సందర్శకుల సుందర కేంద్రం మూసి. నిశ్శబ్ద అద్దంలా నిజాం పాలన అంతరంగం కనిపించె చూపరులకు. చుట్టూరా ఎంత సందడి ఉన్నా, మౌనంగా, ధ్యానం చేస్తున్నట్లు ఉంటుంది మూసి.
నిరంతర గంగా తరంగమై లక్షలాది విహార విహంగ విడదియై కాకతీయుల కత్తుల, నిజాం మధుపానీయ మత్తుల గమ్మత్తుగ ఉం టుంది నామూసి.
మూసికి నెలవు సత్యమే. తన తనువులో నేలరాలిన రూపాయి కూడ తన అంతరంగపు అందపు అద్దంలోన తన పై నిలచిన వారికి నిశ్శబ్దంగా చూపించేది మూసి.
ప్రతి కులానికి తన జలం జీవమై నిలిచింది! రజకుల బట్టలకు రత్న కుండలి అలల నాట్య మంజరి కళల కానాచి మంచి గుణపు మంచు కుండ మూసి.
గొల్లవారి గొర్రెలకి పచ్చని పసిడి. గౌడ్లవారి కల్లు ముంతల్లో అమృత భాండం నా మూసి. చేను చెలక వంటిది మూసి.
వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టి వికారాబాద్ నుంచి వాడపల్లి దాక ఓ తీగల ఇంద్ర ధనస్సుల సాగిపోయింది.
ఇక ఎందరితో విడదియ్యలేని అనుబంధాలతో నా తెలంగాణ పుడమి పాదాలను పావనం చేస్తు ఇల దివ్య ఫలాలుగ చేసింది నా మూసి.
ఈస మూసీ నదుల సంగమమైనాది ఓ దివ్యనిధి. సుందర భాగ్యనగరపు సోయగాల సొంపులకు పసిడి నగని కట్టినట్లు ఉంటుంది నా మూసి నది. స్వార్థం తెలియని తీర్థం. ప్రేమికుల దివ్యధామం.
అలాంటి మూసీనది ఇప్పుడు మురికి నది. మూసినది దరి.. దారి.. ఒడి.. బడి … గుడి. మూసినది పక్కన నివసించడం ఓ శాపం. జన్మజన్మలపాపం. దినదినగండం. మూసి సుడిగుండం.
ఆ పట్నపు కర్మాగారాల కలుషిత రసాయనాలతో నిండిన మూసి దుర్గంధంలో చిక్కుకుని, కలుషిత జలాల నడుమ జీవిస్తున్నాం.
విషజ్వరాలతో జీవచ్ఛవాలుగా మారిపోతున్నాం. మూడు పదుల వయస్సులోనే పోర్లెడ్ దాడిలో మా దేహం చెదలుపట్టి లోలో వ్యధలలో వంకరలు పోయిన యువకులు కాటికి దగ్గరై కటికచీకటిలో వేదనలో యమలోకపు దారులనీ వెతుకుతున్నారు.
పాడు మురుగు నీటిలో కోడెనాగుల విషపు బురుగుల గక్కుతు కారుమబ్బుల పరుగులు తీస్తు ప్రాణాలు తీస్తోంది మూసి.
మత్యకారులకు బతుకు కరువు. బోయవారి బతుకు ఖాళీ.
రజకులు బట్టలు రంగుమయం. వేసుకుంటే రోగం ఖాయం.
గౌడ్లవారి తాటి కుండల కల్లు విషం.
మూసి ఒడిలో గర్భిణి కడుపులో పిండానికి దినదినగండం.
ఎదగని ఒళ్లు, పాచిపట్టిన పళ్లు, మసక బారిన కండ్లు, వంకర కాళ్ళు, చెదలుపట్టిన చేతులు, వంటినిండ కురుపులు, నెరిసిన జుట్టు, మూడు పదులకి ముసలితనం మూసి పక్కన మా బతుకు చిత్రం.
గాసం తిన్న గొల్లవారి గొర్రెల గొంతులు కాయలు. పశువుల దాహం తీర్చే…ప్రాణం తీసే హలాహలం.
గంగనది మస్తుగ గబ్బు పట్టెరా
తాకిన చాలు ఉత్తగ జబ్బు పట్టెర
నక్కల తుములో నుంచి మూసి
కుక్కలు కూడ ఆ నీళ్ళు తాగవు
మొక్కలు మసియైపోయె
పల్లెలు పిల్లాలకి తీరాని కష్టం
ఏదీ ఆనాటి సిరుల మూసి
మిగిలినది మురికి మూసి
అష్టవంకరల్లో మా బతుకు
అయిష్టంగానైనా నీ తీరంలోనే
బతకలేక చావలేక బతుకుతున్నం.
జి.ఆంజనేయులు, అలియాబాద్, రంగారెడ్డి జిల్లా


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *