నిరుపేదలూ నగరవాసులే!

నేను నోరు లేని పేద ప్రజలతో పని చేసే కార్యకర్తను. హైదరా బాద్ నగరంలో పేదల సమస్యలను పరిశీలిస్తే… అవెన్నో.. పట్టణ ప్రాంత సమస్యలెన్నో… బాలగోపాల్, శంకరన్, బీడీ శర్మ, కాళోజీ లాంటివారే మాకు స్ఫూర్తి. అప్పట్లో చత్తీస్‌గఢ్‌లో సల్వాజుడం మొ దలవడంతో 30వేల మంది గుత్తికోయలు శరణార్థులుగా మన రాష్ట్రా నికి వచ్చారు. వారి సమస్యలను పట్టించుకున్న వారే లేరు. ఐదారేళ్ళు గా మేము వారి కోసం కృషి చేశాం.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఎప్పు డైతే ఒక డెవలప్‌మెంంట్ మోడల్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించారో అప్పటి నుంచే నగర సుస్థిరదాయక అభివృద్ధికి మరింతగా గండి ప డింది. ప్రపంచబ్యాంక్ ముద్దుబిడ్డగా ఆయనను చాలా మంది అభివర్ణి స్తుంటారు. తనకు తాను ఆయన సీఈఓగా అభివర్ణించుకున్నారు. అ దంతా వరల్డ్ బ్యాంక్ భాష. తాను ఉన్నది అభివృద్ధి కోసం అని చంద్ర బాబు అన్నారు. ఒక్క చుక్క నీటిని వృథా పోనీయనన్నారు. సెంటు భూ మినీ పోనివ్వనని అన్నారు. మూసీనదిని కుంచించి… దాదాపు 75 ఫీ ట్లు ఉన్న చోట.. దాన్ని 20 అడుగులకు కుదించే ప్రయత్నం చేశారు. నాలాగా దాన్ని మార్చి ‘నందనవనం’ పేరిట పక్కనే ఉన్న స్థలాలను వాడుకోవాలని చూశారు. మూసీ తీరంలో పన్నెండు బస్తీల దాకా ఉ న్నాయి. నందనవనం పేరిట ప్రభుత్వం వారిని తరలించే ప్రయత్నం చేసింది. పట్టాలిస్తాం… దూరం పొండి అన్నారు. స్థానిక ప్రజలు ఈ పథకాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ప్రజలు కొన్ని డిమాండ్లు పెట్టారు. అభివృద్ధిలో తాము భాగమవుతామన్నారు. మూసీని శుభ్రం చేయడంలో సహకరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో మేము ఆ సమస్య ప రిష్కారం లోకి ప్రవేశించాం. అప్పట్లో నందనవనం బస్తీల సమాఖ్య పేరుతో ప్రజల ఆందోళన కొనసాగింది. ఆ ఆందోళన వివిధ రూపాల్లో సాగింది. ఉద్యమించిన ప్రజలకు రాజకీయ పార్టీలేవీ సపోర్ట్ చేయ లేదు. తమ ఆందోళనలో భాగంగా ప్రజలే వినూత్న రూపాలు ఎంచు కున్నారు. అవి చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఆయా పార్టీలకు, ప్రభుత్వానికేమీ అర్థం కాలేదు. ఒకరోజు పిల్లలంతా రోడ్లపై కూర్చు న్నారు. మరో రోజున రోడ్డు పక్కన వంటలు చేశారు.ఇలా ఎన్నో రూ పాల్లో ఆ ఆందోళన కొనసాగింది.
1999లో నగరంలో మూసీ నదికి వరదలు వచ్చాయి. అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో రెండో అంతస్తు వరకు నీళ్ళు వచ్చాయి. మూసీని గనుక కుదించి ఉంటే, హైదరాబాద్ నగరం కొట్టుకుపోయి ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు తన తప్పిదాన్ని అంగీకరించారు.
ప్రపంచంలో ఎక్కడా నది ప్రవాహదిశను మార్చలేదు. ఆనకట్టలు కట్టారు. చైనాలో మాత్రమే ఓ చిన్న నది దిశను మార్చారు. ఈ విధం గా నది దిశ మార్చడం హైదరాబాద్‌కు హాని అని చెప్పాం. నందనవ నం ప్రాజెక్టు పేరిట రూ.7 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నీటిలో కొట్టు కుపోయాయి. దాంతో వారికి అర్థమైంది… హైదరాబాద్ ను వరదల బారి నుంచి రక్షించుకోవాలంటే నదిని కాపాడుకోవాలని…
పట్టణంలో అన్ని రకాల ప్రజలుంటారు. సంపన్నులు, మధ్య తర గతి వారితో పాటుగా వారికి సేవలందించే వారూ ఉంటారు. కూరగా యలు విక్రయించే వారు, ఇళ్ళలో పని చేసేవారు, ఆటోరిక్షా డ్రైవర్, వెండర్ …ఇలా ఎన్నో వృత్తులకు చెందిన వారు, సేవలు అందించే వా రు. వీరంతా పట్టణంలో ప్రజలకు సేవలందిస్తున్నారు. మరి నగర అభి వృద్ధిలో వారి వాటా ఎంత? వారి కోసం ఎందుకు ప్రభుత్వం ఏం చే యలేకపోయింది? మరి ఈ ప్రజంతా ఎవరు…ఎక్కడి నుంచి వస్తు న్నారు… ప్రభుత్వం, సమాజం వీరి విషయంలో ఎలా ఆలోచిస్తున్నాయి … లాంటి విషయాలను మనం ఆలోచించాలి.
మురికివాడల వాసులను నగరం నుంచి తరిమేసే ప్రయత్నాలు దశాబ్దాలుగా కొనసాగాయి. వీరి గుడిసెలను తొలగించాలంటే అధికా రులు పోలీసులతో కలసి శనివారం ఉదయం 4 గంటలకు వస్తారు. శని, ఆదివారాలు కోర్టులుండవు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధు లు దొరకరు. ప్రభుత్వాలే ఇలా చేస్తే ఎలా… హక్కులు వారికి లభించ కుండా అవి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. దేనికైనా ఒక ప్రొసీ జర్ ఫాలో కావాలి. సాధారణంగా ఇలాంటి కూల్చివేతలకు ముందుగా బాధితులకు నోటీసులు ఇవ్వాలి.. అవి ఇస్తే వారు కోర్టుకు పోతారు కా బట్టి అవేవీ లేకుండానే కూల్చేస్తుంటారు. ప్రభుత్వం ఎప్పుడైనా పేద ప్ర జలతో ఫెయిర్‌గా డీల్ చేయదు. అధికారులు… పోలీసులతో పాటుగా ప్రభుత్వ సంస్థలు పేదలకు అనుకూలంగా వ్యవహరించక పోవడం కొ న్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. సంపన్నుల, నాయకుల, వారి కు టుంబసభ్యుల, బంధుమిత్రుల నేరాలపై ఉదాసీనంగా ఉండే ప్రభుత్వం పేదలను మాత్రం నేరాలు చేయకున్నా వేధించడం ఆనవాయితీగా మా రింది.
అందుకే మేం ప్రశ్నిస్తున్నాం. పేదలు ఎక్కడుండాలి… మనకు సేవ చేసే వారు ఎక్కడుండాలి… వారి ఆరోగ్యం సంగతేమిటి… ప్రస్తుతం మేము ఆరోగ్యం అంశంపై పని చేస్తున్నాం. పట్టణంలో మూడు రకాల వ్యవస్థలు ఉంటాయి. అర్బన్ హెల్త్‌పోస్ట్‌లు ఉంటాయి. వాటిలో డాక్టర్ రెండు గంటలు ఉండాలి. నర్స్, కాంపౌండర్ ఉండాలి. వారానికి రెం డు రోజులు సోమవారం, శనివారం చుక్కల మందు ఇవ్వాలి. ఆ తరు వాత పన్నెండు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని స్పెషలైజ్డ్. కేన్సర్, ఇఎన్‌టి, రెండు మెటర్నిటీ,… ఇలా ఉన్నాయి. వీటిని మేం పరి శీలిస్తున్నాం. ఇవన్నీ కూడా పేదలకు సంబంధించినవి. మధ్యతరగతి, సంపన్న వర్గాల వారు కార్పొరేట్ ఆసుపత్రులకు పోతున్నారు. కోఠి హాస్పిటల్, జజ్‌ఖానా ఆసుపత్రుల దుస్థితి… జజ్‌ఖానాకు రోజుకు వె య్యి మంది వస్తుంటే అందులో 700 మంది గర్భవతులు. సౌకర్యాలు లేవు. రోజూ 10 ఆపరేషన్లు… 30, 40 మంది జననాలు. గతంలో ఓ గర్భిణి టాయ్‌లెట్ సౌకర్యం లేక బయటకు పోతే అత్యాచారం జరి గింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నైపుణ్యాలు గలవారు ఉన్నారు. వారి సే వలను వినియోగించుకోవాలి. ఉస్మానియాకు రోజు 1400 మంది ఓ పీకి వస్తుంటారు. పేదలే. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. గుల్బర్గా, రాయ్‌చూర్‌ల నుంచి కూడా… వారికి అదే పెద్దాసుపత్రి. ఇ లాంటి ఆసుపత్రులను కాపాడుకోవాలి. గతంలో ఎన్నో వాగ్దానాలు చే శారు. అవన్నీ ఇప్పుడేమయ్యాయి. అర్బన్ హెల్త్ మిషన్ నుంచి నిధులు వస్తున్నాయని అంటున్నారు. వాటి వినియోగానికి కృషి చేయాలి. రెం డేళ్ళ క్రితం ఇది ప్రారంభమైంది. ఏ బడ్జెట్ వచ్చినా కూడా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు కానీ సిబ్బంది సంఖ్యను పెంచడం లేదు. ఇందు లో వరల్డ్ బ్యాంక్ రహస్య ఎజెండా ఉందేమోనని అనిపిస్తోంది. ఉద్యో గుల సంఖ్య తగ్గించాలన్న యోచన కావచ్చు.
ఆహారం
ఆహార పంపిణి వ్యవస్థ అంటాం కానీ రేషన్ షాప్‌లు సరిగా లేవు. ఉన్నా సమయానికి సరుకులు రావు. బస్తీ ప్రజలకు రెండు రకాల కార్డు లుంటాయి. వాటిలో అంత్యోదయ ఒకటి. అంటే ఆ బస్తీలోని అతి పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చే స్కీవ్‌ు. అప్పట్లో ఆకలి చావులు ఎ న్నో జరిగాయి. ప్రభుత్వం వాటిని ఆకలి చావులుగా గుర్తించదు. అనారోగ్యంతో చనిపోయారు అని అంటారు. పోషకాహారం లేక, ఆకలి అయినప్పుడు, శక్తి కావాల్సి వచ్చినప్పుడు కొవ్వు, కండరాలను శరీరం వాడుకుం టుంది. కీలక భాగాలు పాడైపోతాయి. అలా నిరుపేదలు ఆకలిచావులతో చనిపోతారు. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో కులవృత్తుల వారు ఆకలి మరణాలకు గురవుతున్నారు. వేరే పని చేత కాక, కూలీపనికి వెళ్ళలేక చనిపోతున్నారు. రేషన్ డీలర్ వద్ద ఒక 25 కిలోల బియ్యాన్ని ఉచితంగా అన్నార్థులకు ఇచ్చే సదుపాయం ఉంది. అది ఎలా పంపిణి జరుగుతుందో చూడాలి. రేషన్ డీలర్ల సమస్యలు వారికి ఉన్నాయి. తరుగు ఉంటుంది. కమీషన్ సరిగా ఇవ్వరు. అద్దె ఖర్చులు అధికం…ఇలా ఎన్నో..దీన్నెలా మెరుగుపర్చవచ్చో చూడాలి.
నివాసస్థలాలు
సేవలు అందించే ప్రజలు పనికి అందుబాటులో, పనిస్థలాలకు ద గ్గర్లో నివాసాలు ఉండాలి. గౌరవంగా జీవించే హక్కు వారికి లభిం చాలి. ప్రభుత్వం ఆ అవకాశాలు కల్పించాలి. చదువు, ఉద్యోగం, ఉపా ధి అందించాలి. జీవించే హక్కు ఇందుకు వీలు కల్పిస్తుంది. జీవనోపా ధికి దూరంగా ఉంచే వీల్లేదని అంతర్జాతీయ ఒప్పందాలు చెబుతున్నా యి. రెండు సార్లు ఒక సమూహాన్ని డిస్‌ప్లేస్‌మెంట్ చేయడానికి వీల్లేద ని నిబంధనలు ఉన్నాయి. అయినా దేశవ్యాప్తంగా కూడా ఆ నిబంధన లను ఉల్లంఘించి అలా చేస్తున్నారు. హక్కులతో పాటు వాటిని రక్షించే చట్టాలు కావాలి. చాలా ప్రాంతాల్లో నివాసహక్కులు లేకుండానే ఉం టున్నారు. న్యాయపరంగా ఉండే హక్కులు లభించడం లేదు. నగరం లో 2,500 దాకా బస్తీలు ఉన్నాయి. నోటిఫైడ్ బస్తీలు చాలా తక్కువ. నోటిఫైడ్ బస్తీల వారికి కొన్ని హక్కులు లభిస్తాయి. మూసీ దగ్గర ఉన్న పేదలు అక్కడక్కడే పనులు వెతుక్కుంటూ ఉంటారు. ఈ చిరు వ్యా పారస్తులంతా అధిక రేట్లకు ప్రైవేటుగా వడ్డీ తీసుకుంటూ ఉంటారు. అన్ని బస్తీల్లో ఈవిధమైన సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తోంది.
విద్య
నగరాల్లో ప్రభుత్వ పాఠశాలలకు పోయే వారు బస్తీల్లో ఉండే వారు మాత్ర మే. అవి చక్కగా ఉన్నాయో లేదో చూడాలి. ప్రభుత్వగణాంకాలే చెబుతున్నాయి…వందలాది పాఠశాలల్లో ఈ సదుపాయాలు లేవని. అందుకే ఎన్నికల సందర్భంగా, నిన్నటి హామీలు ఏమయ్యాయని నిల దీయాలని ప్రజలకు చెబుతుంటాం. నగరంలో రెండు వేల దాకా అంగ న్‌వాడీలు ఉన్నాయి. వాటిలో 1200 మాత్రమే కమ్యూనిటీ హాల్స్‌లో ఉ న్నాయి. సమాజంలో నిరుపేదలకు ఆరోగ్యం, ఉపాధి, నివాస స్థలాల పై రక్షణ ముఖ్యం. భద్రత కావాలి. సమాజంలో సంక్షోభం పెరుగుతు న్న కొద్దీ వీరికి ముప్పు పెరుగుతోంది. అది బస్తీల్లో కానవస్తోంది. తె లంగాణ ఉద్యమం సందర్భంగా వడ్డెరబస్తీపై ఎన్నో దాడులు జరిగా యి. పాతబస్తీలోనూ అదే పరిస్థితి. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ రావాలి. చి త్రహింసలు మానివేయాలి. తెలంగాణ స్వరాష్ర్టం ఏర్పడిన నేపథ్యంలో వీటన్నింటికీ భిన్నమైన వ్యవస్థ రావాలని ఆశిద్దాం.
జీవన్ కుమార్, మానవహక్కుల వేదిక అధ్యక్షుడు


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *