పదాలను నినాదాలు చేసిన – పోరాట గద్దెలు ‘గిద్దె రామనర్సయ్య’ పాటలు

అడవి ఆకురాలిన శబ్ధాన్ని పసిగట్టి పాటై ప్రవహించిన రామ సక్కని సంగీతం, అది కణకణ మండే డప్పు సప్పుళ్ళలోంచి ఉబికి వచ్చిన రగం. ఆ పదాలకు సమ్మక్క సారక్కల శౌర్యముంటది. మాదిగ జీవన సౌందర్యంతో పాటు తెలంగాణ పౌరుషం తాండవి స్తుంది. చిర్రా, చిటికెనపుల్లతో పోటీపడి చిందేస్తది. చీకటి కోటల్ని పెకలించే ఆయుధమైతది. అందుకే ఆ అక్షరాలను మనసు పల్లకిలో ఊరేగిద్దాం. రాగరంజితమైన ఆ పదాలను తాకి పరవశిద్దాం. మ ట్టి పరిమళాలను వెదజల్లి తెలంగాణ ఉద్యమంలో పల్లెని, ప్రకృ తిని ఏకంచేసి, పదాలను యుద్ధనినాదాలుగా ప్రతిధ్వనింప చేసిన కవి గాయకుడు గిద్దె రామ నర్సయ్య గురించి మన ‘అలుగెల్లినపాట’ లో…
కళలకు పుట్టినిల్లు, కమ్మనైన అమ్మమనసు కు ఆనవాళ్ళు కాకతీయ రాజులేలిన ఓరుగుల్లు. ప్రస్తుతం వరంగల్లుగా పిలువబడుతున్న ఈ జిల్లా విప్లవోద్యమ చైతన్యానికి ప్రతీకగా చెప్పు కోవచ్చు. వరంగల్లు జిల్లా తొర్రూరు మండలం చిట్యాల గ్రామంలో గిద్దె సాయిలుసోమ నర్స మ్మ దపంతులకు కలిగిన నలుగురు సంతానం లో రామనర్సయ్య ఏకైక మగ సంతానం. వ రుసగా హేమలత, రామనర్సయ్య, స్వప్న, సు నిత. వీరిలో స్వప్న చనిపోయింది. గిద్దెసాయి లు తన కుటుంబాన్ని పోషించడం కోసం అనేక బాధలు పడ్డడు. జీతమున్నడు. కూలి పనులు చేసిండు. కలో గంజో కలిగింది తలాఇంత పెట్టి కష్టాలకు ఎ దురీదిండు. గిద్దె సాయిలు సాటింపేస్తే ఊరుఊరంత ధ్వని పలికేది. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని కలిగించే తనదిగా పడరానిపాట్లు పడుతూ సంసారాన్ని ఎల్లదీసిండు. ఇల్లు గవడమే కష్టంగా ఉన్న సాయిలు పిల్లల్ని గొప్పగా సదివించే అవకాశం లేకుండా పోయింది. ఇట్ల బతకుంతా పోరాటంగ బతికిన సాయిలు ఆరేండ్ల కింద ఇంటిని శోకసముద్రంలో ముంచి ఆయన కాలంజేసిండు. గొప్ప కవిగా తెలంగాణ ఉద్యమంలో ధూంధాం జేసిన కళాకారున్ని కన్నతండ్రి తన కొడుకు ఉన్నతిని చూడకుండానే కన్ను మూసిండు. తెలంగాణ ఉద్యమానికి ఎన్నో అద్భుతమైన పాటల్ని అందించి వేదికలమీద అలరించిన గిద్దె రామనర్సయ్య గురించి మాట్లాడడమంటే పాటని గురించి మాట్లాడడమే. పాట పుట్టుకని గురించి మాట్లాడడమే.
మార్చి 16, 1977లో జన్మించిన గిద్దె రామనర్సయ్య స్థానిక పాఠశాలలోనే పదవ తరగతి వరకు చదువుకుండు. పాఠశాల దశ లోనే పాటలు పాడి అనేక బహుమతులు గెలచుకుండు. రామ నర్సయ్య పాటవైపు రావడానికి, ఇంత గొప్పగా పాడడానికి ప్రధాన మైన కారణం ఆయన మేనమామ ఈదురు వెంకన్న. ఈయన ప్ర స్తుతం ఆర్.టి.సి.హనుమకొండ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తుండు. అయితే వెంకన్న ఇప్పకీ మంచి గాయకుడు. ఉద్యమ భావజాలంతో పాటలు రాస్తూ, పాడుతూ ఉండేవాడు. మేనమామ వెంకన్నను గ మనించిన రామనర్సయ్య చిన్నప్పటి నుంచే పాటలు పాడడం అల వాటైంది. మేనమామ సాన్నిహిత్యం, శిక్షణ రామనర్సయ్యను గొప్ప గాయకుడిగా మలిచిందడనంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ విధంగా రామనర్సయ్యకు తన మేనమామ వెంకన్న పాటల గురువుగా మారిండు. ఇట్ల ఆటపాటల తరంగమైన గిద్దె రామనర్సయ్య సదువు ఇంటర్‌మీడియట్‌లోనే ఆగిపోయింది.
రామనర్సయ్య అంటేనే పాట, పాటం టేనే రామనర్సయ్య. పాటతో అంత విడదీయ లేని బంధాన్ని పెనవేసుకున్న పాటమ్మ ముద్దు బిడ్డ గిద్దె రామనర్సయ్యను గురించి ఎంత చె ప్పినా తక్కువే. అందుకే ఆయన తన గురించి రాసుకున్న పాటతోనే ఈనాటి మన పాట ప్రవా హాన్ని కొనసాగిద్దాం.
‘‘ఏ తల్లి గన్నదొ నిన్ను గిద్దే రాం నర్సయ్య… ఆ కన్నతల్లికే వందానాలయ్య
నినుగన్నా పల్లె సల్లగుండాలయ్య నువ్వు నమ్ముకున్న పాట పురుడుబోయాలయ్య
జానపదుల పల్లెతల్లి ముద్దుబిడ్డవో పేదల్లో ఇంటిలోన పేగుబంధమో
పల్లెతల్లి పాటల్ని పాడుతుంటవో.. నువ్వు పస్తులుండే సంగతినే మరిసిపోతవో..’’ అంటడు.
పాటకు పనిలోని కష్టాన్ని మరిపింపజేసే గొప్పగుణంతో పాటు ఆకలి దూపను సైతం మరిపింప జేస్తది. పాటతోని పస్తులు న్న సంగతినే మరిచిపోతడు. పాటను కడుపునింపే కన్నతల్లిగా భావిస్తడు.
పాటే ప్రాణప్రదంగ జీవనాధారంగా బతికిండు. సామాజిక మార్పులో పాట ప్రాధాన్యతను గుర్తించిండు. అందుకోసం కవులు, కళాకారులు ఎట్ల తపిస్తరో ఏ విధంగ జీవిస్తరో అనే అంశాన్ని అ క్షరీకరించి అద్భుతంగా చేసిండు, రామనర్సయ్య రాసిన తన మొదటి పాటతోనే తనలోని కవిని, కళాకారున్ని ఈ ప్రపంచానికి చాటి చె ప్పిండు.
‘‘ప్రజల కొరు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగు నిచ్చె సూర్యచంద్రులం
లాలిపాటపాడి అమ్మ పాట నేర్పెనా ఊయలలో ఊపుతు నను ఊరడించెనా
అమ్మరుణం తీర్చె శక్తి లేకపోయెనా నా రచనే మా అమ్మ పాట రుణం దీర్చెనా
గలగల గజ్జెలు గట్టి గంతులేసినం గళం విప్పి కమ్మనైన పాటపాడినం
గజ్జెగట్టి ఆడినా గతికిలేనివాళ్ళమే గళం విప్పి పాడినా ఈ పూటకులేనోళ్ళమే
డప్పుడోలు మద్దెలతో దరువులేసినం పల్లెసుద్దులు భాగోతా లెన్నో ఆడినం
సద్దులెన్ని జెప్పినా సుఖం లేదురా భాగోతాలాడిన బతుకు దెరువు లేదురా’’
కళాకారులకు సప్పట్లు, సన్మానాలు, ప్రశంశలు తప్ప వాళ్ళ ఆకలి గురించి గాని, కుటుంబాన్ని గురించి గాని ఆడిగేటోల్లుండరు. ఎట్ల బతుకుతున్నరని ఆలోచించే నాధులే ఉండరు. ఎవరు ఏమిచ్చినా, ఇయ్యకున్నా రామనర్సయ్య ఏనాడు పాటను విడిచి బ తకలేదు. అప్పటికే గద్దర్, గూడ అంజన్న, గోరటి వెంకన్న, అంద్శై, జయరాజు, వరంగల్ శ్రీనివాస్, వంటి వాళ్ళు రాసిన పాటల్ని వింటూ పాడుకుంటూ తనకుతాను దిశా నిర్దేశం చేసుకుండు. చివరికి ఆ పాటే బతుకుదెరువయ్యింది. పాటే ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చింది. ఈ క్రమంలోనే 1996 మేనెలలో అరుణతో రామనర్స య్య వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఒక బిడ్డ ఉంది. పేరు విశ్లేషిత. రామనర్సయ్య పాటలైన, మాటలైన విడమరిచి చెప్పినట్టు ఉంటయి. ఎక్కడ దాపరికం ఉండదు. ఎవరికి భయపడడం ఉం డదు. అందుకేనేమో తన భావాలకు అనుగుణంగ తన బిడ్డకు విశ్లే షిత అనే పేరు పెట్టుకున్నడు. గద్దర్ రాసిన ‘‘వద్దురా ఓ కొడుకా రాక్షసుల రాజ్యంలో.. ’’ అనే పాటని రామనర్సయ్య నిత్యం మననం చేసుకుంటడు. రామనర్సయ్య ఎంతో ఇష్టంగ పాడుకునే ఈ పాట ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఒకరకంగ రామనర్సయ్యని వెం టాడిన పాట ఇది. ఒక్కచోట నిమ్మలంగ కూసోనియ్య నిత్యం నాలుక మీదనే నాట్యం చేసింది. ఆ పదాల ఆర్తిలోంచి, ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ పాట.
పేదలకు అండగా నిలిచిన పోరాటయోధుల్ని తలుసుకుం టడు. తానెప్పుడు అటువైపుగా అడుగులు వేయనప్పటికి వాళ్ళ త్యాగాన్ని ఆరాదిస్తడు. అదే క్రమంలో దూరమైన కొడుకును త ల్చుకొని తల్లిపడే వేదనను అక్షరీకరించి మన కంటిమీద కునుకు లేకుండ చేస్తడు. ‘‘ఎక్కడున్నావురా కొడుకా.. ఆ.. ఆ.. నువ్వు యాడికో తివి సిన్న కొడుకా
నా ఆయుష్షు బోసుకున్నోడ నువ్వు అందరిలో చిన్నవాడ
ఆకలైతే అడిగెటోడ అందరాకలిని తెలుసుకున్నోడ
అందరిని విడిచినావా.. ఆ.. ఆఈ అమ్మనే మరిచినావా..
కూడు తిందామంటే కొడుకా గా కూడులో నీ గుర్తె కొడుకా
నీళ్ళు తాగి నిద్దరోతే కంటిరెప్ప కింద నీవె కొడుకా
నా కంటిపాపవయ్యి రార.. నా కంటనీరు తుడిచిపోరా..’’ ఇట్లాంటి ఎన్నో పాటల్ని రాసిన గిద్దె రామనర్సయ్య గొప్ప ప్రకృతి ఆరాధకుడు. ఎందుకంటే ఏ పాటలో చూసిన పచ్చని ప్రకృతి అం దాలు, పల్లె జీవన సౌందర్యమే తన పదాల నిండ కుప్పలుపోసినట్టు కనిపిస్తాయి. మొత్తంగా పల్లెని తన పాటల్లోకి వంపుకుంటడు. క మ్మగా అమ్మ పాలు తాగినంత హాయిగా పాడుకుంటడు. రామనర్స య్యకు తన ఊరన్న, పేరన్న, చెట్టన్న, చెరువన్న చెప్పలేనంత ప్రే మ. నిత్యం తన కండ్లముందు ఉండే గొర్లు, బర్లు, కోళ్ళు, మేకలు, పశువులు, పక్షులు ఒక్కటని కాదు మొత్తం ఊరునే పాటగా కై గడతడు. పదమై ప్రతిధ్వనిస్తడు. ఊరే వల్లకాడై వలసపోతే తప్ప బతకలేమన్నంత దౌర్భాగ్యస్థితిని తలచుకొని దుఖ:సాగరమైతడు. పల్లెలు పట్టుగొమ్మలన్న కాలం నుంచి నిన్న మొన్నటి సమైక్య పా లనలో పట్టుదప్పిన పల్లెని, కన్నతల్లిని తలుసుకొని సోకంబెడతడు.
‘‘ఉన్నాది మా ఊరు పేరుకు ఆడ బతుకుదెరువే లేదు పల్లెకు
సక్కాని నా పల్లె పాడిపంటలు గల్ల పరువుగల్ల పల్లే ప్రేమాగల్ల తల్లి
కొక్కొరోకో అంటె తెల్లారే నా పల్లె తల్లీరో నా పల్లె తల్లడిల్లీ పాయె
తాటాకు గుడిసెలల్లో కరకర లాడేది ా వాకిట్ల సాంపితో సక్కంగ మెరిసేది
ఎర్రమన్ను దెచ్చి ఇల్లలికి పూసేది ా గుడిసెలన్ని ఊడి వల్ల కాడయ్యే వల్లే
అల్లమెల్లి గడ్డ పల్లెకొస్తే సాలు మా అయ్య సాయిలు సాటింపు వేసేది
కచ్చీరు కాడంటు కలెదిరిగి వచ్చేది సాటింపు లేదాయే చిన్నాబాయె పల్లే’’ అంటూ రామనర్సయ్య పల్లెని తలుచుకున్న తీ రు మొత్తం తెలంగాణ పల్లెల్ని కదలించింది. సాటింపేకాదు. ఆసది పెద్దజేసిన కన్నతండ్రి కూడ లేడన్న కఠోర సత్యాన్ని అద్భుతమైన కవిత్వం చేస్తడు. ‘‘నా జిల్లా వరంగల్లు కళలకు పుట్టినిల్లు ా వెన్నంటిన హనుమాకొండ కన్నకడుపు సల్లాగుండ కాకతీయులేలిన అడ్డ కాళోజీని కన్న గడ్డ తెలంగాణ గుండెనిండ సాకలి ఐలవ్వ జెండ’’ అంటూ తన చుట్టూ ఉన్న అంశాలనే దాదాపు పదిహేను సంవత్సరా లుగా పాటలు రాస్తున్న గిద్దె రామనర్సయ్య ఎన్నో ప్రదర్శనలు చే సిండు. తెలంగాణ మలివిడత పోరాటం ఉధృతమైతున్న కాలంలో గిద్దె రామనర్సయ్య తన పాటలకు మరింత పదునుపెట్టిండు. ఈ క్రమంలో ఎక్కడో మారుమూల పల్లెలో మార్మోగుతున్న రామనర్స య్య పాటని స్టేజిమీదికి తీసుకొచ్చిన ఘనత తన మిత్రడు, ఆప్తుడు ఉగ్ర శ్రీనుకే దక్కుతుంది. అట్ల తెలంగాణ ఉద్యమంలో రసమయి బాలకిషన్‌తో కలిసి లెక్కలేనన్ని ధూంధాంలు చేసిండు. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన పాట
‘‘కొమ్మాల్లా కోయిలమ్మ పాటబాడుతన్నది జై తెలంగాణ అన్నది
అలసిపోయిన లేగదూడ గంతులేస్తున్నది కాలి గజ్జెగడుత నన్నది
ప్రాణంబోయే మేకాపిల్ల డప్పునైతనన్నది దండోర వేస్తనన్నది
ఇప్పుడు బుట్టిన లేగదూడ దుంకులాడ్తనన్నది ధూంధాం జేస్తనన్నది
గోరుకొల్లు డువంగ కూతబెడుతునన్నది ా పోరుబాటనై తనన్నది
చెట్టు చేమాలన్ని ఊగి ఊపిరోస్తమన్నయి ఉద్యమాలు జేస్తనన్నయి
పొడిసేటి పొద్దు గూడ పొద్దుగూకనన్నది పోరుకు సైయన్న ది’’ అంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంగట్టిండ్రన్న సంగతిని వివరిస్తరు. అందరికి అర్థమయ్యే అతి సాధారణ పదాలతో అసాధారణ భావాన్ని వ్యక్తీకరిస్తడు. అనేక కుట్రలు, కుత్రంతాతో కూడిన సమైక్య పాలనతో అమయాకులైన తెలంగాణ బిడ్డలు ఒక్కక్కరుగా నేలరాలుతున్న దృశ్యాలను చూసి పోరాటయోధుల్ని కన్నతల్లులకు దండం పెడతడు. అదరక బెదరక యుద్ధరంగంలో ముదుకురికే శక్తినిచ్చిన కన్నతల్లుకు వందనాలని కడదాక పోరాడే స్ఫూర్తినిస్తడు.
‘‘అమ్మా ముద్దుబిడ్డను గన్నావమ్మ.. అమ్మా తొలిపొద్దును గన్నావమ్మ
కన్నందుకు నీ కాళ్ళకు దండాలు బెడుదునా.. కన్నీళ్ళతో కాళ్ళుగడిగి రుణం దీర్చుకొందునా
పురినిటినొప్పుల బాధ తెలంగాణ కంకితమా.. పురుడోసుఉన్నాడో ఉదయించిన సూరిడిలా
నేలమీదడుగు బెడితే పుడిమి పులకరించిందా.. ప్రకృతే పల కరించి ెరు నూరిపోసిందా
అడవిలో ఆకులన్ని అలముకొని ముద్దాడి మోదుగుపూల మోము తిలకాన్ని దిద్దుకొని
ఎర్రని వర్ణములు ఆ కండ్లను తెచుకుకొని ఎదురుతిరిగి పోరాడే ధైర్యాన్ని ధారబోసి’’ ॥అమ్మా॥ అంటూ పొడిసేటి పొద్దు పొడుపై కాసోజు శ్రీకాంతువంటి ఎందరో అమరవీరులను అలిం గనం చేసుకుంటడు. మొకం చాటేసిన వానచినుకుని రమ్మని బతి లాడ్తడు. ఒక్క డల్లన్న వచ్చిపోవాలని వేడుకుంటడు.
‘‘సినుకమ్మ సిన్నబోయిందో.. మా పల్లెంత గుండె బగిలిందో
అలిగినా వెందుకే సినుమ్మా ఒక్క డల్లన్న వచ్చిపోవాలమ్మా
పాలుదాగే పాప అడిగింది నీ రాకకై ఎదురు చూసింది
తల్లి రొమ్ముపాలు పిండింది ఆ సేనుకు నీరుగా పోసింది
పాలన్న తాపిపో వానమ్మ ఒక్క డల్లన్న వచ్చిపో సినుకమ్మ’’ ఇట్ల తెలంగాణ కరువు పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తడు. ‘‘నాగలి ఏడ్చింది అమ్మా గొడ్డు గోద తల్లిడిల్లేనమ్మా’’ అంటూ అ నేక సామాజిక, తెలంగాణ పాటల్ని రాసిన గిద్దె రామనర్సయ్య తన పాటల్లో అమ్మలు, అక్కలు పాడుతుంటే విని నేర్చుకున్న పదాలే ఎక్కువని అంటడు. సామాజిక మార్పుకై పరితపించే కవి, గాయకుడి గా గిద్దె రామనర్సయ్య సినిమాల మీద తనకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తడు. అర్థంలేని సినిమాలు, సీరియళ్ళతోని సమాజం ఎట్ల పాడైపోతుందో నాటకీయంగ అదరికి అర్థమయ్యే రీతిలో వివరిస్తడు. ‘‘ఏమి సినిమాలు దీస్తున్నరయ్యో ఓ దర్శక నిర్మాతలారా
పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లీల గుండ అయ్యిండు మా గుండెల్ల గుణపమయ్యిండు
సదువుకోని సక్రమంగ ఉండుమంటె విక్రమార్కుడు జూసి వచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు’’ ఇట్ల తన పాటల ప్ర స్థానంలో అనేక ఒడిదుడుకుల్ని చవిచూసిన గిద్దె రామనర్సయ్య ‘మయట్టితల్లి, నేలరాలిన మందారాలు’ అనే ఆడియో సి.డి.లను రికార్డు చేసిండు. మల్లి అనే లఘచిత్రంతో పాటు నటుడిగా బతుక మ్మ, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, తురుంవంటి సినిమాలు చేసిండు.
తెలంగాణ ప్రజల నాలుకల మీద ప్రతిధ్వనించే పాటల్ని ఆర్.నారాయణమూర్తి తన సినిమాలలో వాడుకుంటడు. అట్ల రామ నర్సయ్య రాసిన ‘‘కొమ్మాలల్ల కోయిలమ్మ’’ పాటని ‘‘రాజ్యాధికారం’’ అనే సినిమాలో ఉపయోగించుకున్నడు. సార తాగితే సావుతప్పదనే హెచ్చరికతో అనేక వంగ్యాస్త్రాలను గురిచూసి కొట్టిన గిద్దె రామ నర్సయ్య సార పాట అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో ఒకటి. ఈ బాణీలో ఆయా సందర్భాలకు తగిన అనేక పాటలు వచ్చినయి. అయితే ఈ పాటలో సాకీలోనే గిద్దె రామనర్సయ్య అటు స్వర్గాన్ని, ఇటు నరకాన్ని చూపిస్తడు.
‘‘కల్లుతగినోడు కైలాసమెళ్ళుతడు.. సారాతాగినోడే స్వర్గానికెళ్ళుతడు… ఏమి తాగనోడే.. యమలోకెమెళ్ళుతడు
సారా సారమ్మ సార నా ప్రాణమైతీవమ్మా సార అబ్బ నిన్ను తాగకుంటెనే సార
నా ప్రాణమంత గాయిగాయి సార నిన్ను తాగి నడుస్తుంటె సార భూమి సుట్టు తిరుగుతాంది సార
హె.. నువ్వు దొరకన్నాడు సార అరె సిన్నబోయెనం టుంది కార
బువ్వలేకుంటెమాయె రార ఒక్క పావుసేరు గుద్దు దాము సార
నిన్ను మరువనవ్వ మీద ఒట్టు నా ఇంటికిబోతె పెళ్ళం గొట్టు
నిన్ను దాగి పండుకుంటె ఇంట్ల నేనుచ్చబోస్తే పక్క దడిసె ఎట్ల
పొద్దుగాల తాగకుంట ఉండం తాగి సోయిదప్పెదాక మేము పండం
సారమ్మ నీకో దండం మేము సచ్చేదాక నువ్వో గండం’’ అంటూ సారా తాగడాన్ని వ్యతిరేకిస్తడు. సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో ఎంతో ముందున్న కవి కళా కారుడు గిద్దె రామనర్సయ్యకు ప్రజల చప్పట్లే సన్మానపత్రా లు అయినయి. పాటే ఆయువుపట్టుగా జీవితాన్ని మొదలు పెట్టిన గిద్దె రామనర్సయ్యకు తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం ఎనలేని ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా పాటని న మ్ముకున్న కళాకారులకు ప్రబుత్వం సాంస్కృతిక సారథి ద్వార ఉద్యోగ భద్రతను కల్పించడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఏ రంగంలోనైన తన నైపుణ్యానికి సము చిత స్థానం దక్కాలనే ఎవరైనా కోరుకుంటారు. అందుకు ఆయా సంస్థలుగాని, వ్యక్తులుగాని తగిన ప్రోత్సాహం కల్పించాలని అంటడు. సారథి చైర్మన్‌గా రసమయి బాల కిషన్ చేస్తున్న కృషిని ఎంతగానో అభినందిస్తడు. తన సారథ్యం లోనే తెలంగాణ కళలకు మహర్ధశ కలుగుతుదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తడు. ఏదిఏమైనా పాటని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటానని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అం దేలా తన పాటలు ఉంటాయని ‘‘నన్నాబియ్యం చిన్నా పిల్లల చెంతకు జేర్చిండే సారు కేసియారు’’ అంటూ పాటందుకుం టడు. ఈ విధంగ గిద్దె రామనర్సయ్య ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.
అంబటి వేకువ
మొబైల్: 94927 5544
మెయిల్:ఙతీ.ఎప్‌ఱఏఎఱశ్రీ.శీఎ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *