పెంబర్తి మెమెంటోలు

జ్ఞాపిక అనగానే గుర్తుకొచ్చేవి పెంబర్తి హస్తకళారూపాలు అంటే అతిశయోక్తి కాదు. వరంగల్ జిల్లా జనగాం మండలానికి చెందిన గ్రామం పెంబర్తి హస్త కళాఖండాలకు దేశవ్యాప్తంగా గొప్ప పేరున్నది. ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు ప్రసిద్ది కాకతీయుల కాలం నుండి పేరొందాయి.
పెంబర్తి హస్తకళాకారుల లోహపు రేకుల కళను పెంబర్తి లోహ హస్తకళలుగా వ్యవహరిస్తారు. పెంబర్తి లోహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహల మీద ఉంటాయి. కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది. కాకతీయ శైలిని అనుసరించడం వీరి కళ ప్రత్యేకత.
పూర్వకాలం నుంచి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిల యంగా మారింది. పూర్వం కాకతీయుల పాలనలో రాజకుటుంబానికి అవసరమైన పనిముట్లను అందించిన వీరు రాను రాను తమ నైపుణ్యాన్ని పెంచుకొని ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. యాదగిరి గుట్ట నుండి తిరుపతి వరకు- గుడి, బడి సంబంధిత పనులను, సచివాలయం నుండి కళాతోరణం వర కు ప్రభుత్వ, ప్రైవేటు మెమొంటోలు ఇక్కడ తయారు చేస్తారు
చరిత్రపుటల్లో…
ఈ ప్రాంతం లోహపు రేకుల కళకు ప్రసిద్ధి గాంచినది. ఈ లోహపు రేకులను పురాతన కాలం నుంచి కూడా దేవాలయాలకు, రథాలకు అలంకరించడానికి ఉపయోగించేవారు. మధ్యలో కొంతకాలం ఈ కళకు ఆదరణ లేక అంతరించిపోయిం ది. తర్వాత నిజాం నవాబు కాలంలో ఈ కళను ప్రభువులు బాగా ఆదరించడం ఈ కళకు జీవం పోసింది.
విశేషాలు
పెంబర్తి హస్తకళాకారులు తయారుచేస్తున్న షీల్డ్స్, మెమెంటోలు, గెపకరణాల వస్తువులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుం టున్నాయి. వీరు వివిధ దేవాలయాల గోపురాలకు, ఇత్తడి, రాగి, వెండి, బంగారు తాపడాలను తయారు చేశారు. ధ్వజస్తంభ తొ డుగులు, గోపుర కలశాలు, కవచాలు రూపొందించడంలో వీరు దిట్ట. లోహాలు, లోహ మిశ్రమాలతో కుడ్యాలంకరణ చేయడంలో, గీతోపదేశం, దశావతారాలు, అష్టలక్ష్మీ, సీతారామ పట్టాభిషేకం, కాకతీయ కళాతోరణం, చార్మినార్, గణేష్, లక్ష్మీదేవి, సరస్వతి, హంస తదితర రూపాలను హద్యంగా ఆవిష్కరిస్తారు.
తెలంగాణకు ఖ్యాతి :
కంచు కళా వైభవానికి పుట్టినిల్లయిన పెంబర్తి గ్రామానికి ప్రపంచ పటంలో సుస్థిరమైన పేరు ప్రతి ఉన్నాయి. కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది. పెంబర్తి కళారూపాలు అనేకం గొప్ప కళాఖండాలుగా దేశ విదేశాల్లో వర్థిల్లుతున్నాయి. సంస్క తి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, దేవతల విగ్రహాలను, కళాఖండాలను, గహ అలం కరణ వస్తువులను- గుడి, బడి మొదలైన అనేక హస్త కళారూపాలను కళాకారులు చేతి నైపుణ్యంతో తయారు చేస్తారు.
కాకతీయుల కాలం నుంచి…
కాకతీయ రాజుల కాలంలో కళలు పరిఢవిల్లాయి. రామప్ప, వేయి స్తంభాల గుడి, ఏకశిలా తోరణాలు మాత్రమే కాదు, ఈనాటికీ తెలంగాణ మారుమూల పల్లెల్లో సైతం నాటి శిల్పకళ సజీవంగా అబ్బురపరుస్తుంది. కానీ, కళాకారులు చెల్లాచెదురయ్యారు. వలస వెళ్లారు. ఊరూరా ఉన్న వారిలో కొందరు నవాబ్ లను ఆశ్రయిం చారు. వారి కళకు ముగ్దులైన నాటి ఏలికలు వారికంతా ఒకే చో ట నివాసాల ఏర్పాటుకు సంకల్పించారు. అలా రూపుదిద్దుకున్నదే ‘పెంబర్తి’.
హైదరాబాద్‌కు 55 మైళ్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతాన్ని గుర్తించి వారికి అక్కడ నివాసాలు కల్పించారు. అది అప్పటికే ఉని కిలో ఉన్న జనగామ సమీప ప్రాంతం. అంతకు ముందు అయిలోని, తంగెళ్లపల్లి, మల్యాల, పోలంపల్లి, బెజ్జంకి తదితర గ్రామాల్లో ఉన్న కళాకారులంతా పెంబర్తి ప్రాంతానికి ఉపాధి కోసం తరలి వచ్చారు. కాలక్రమంలో గ్రామ పేర్లే వారి ఇంటిపేర్లుగా స్థిరపడ్డాయి. నవాబ్, ఆయన పరివారం, అధికారుల అభిరుచులకు అనుగుణంగా పెంబర్తి కళాకారులు ఆక తులు తయారు చేసేవారు. అత్తర్‌దాన్, పాన్‌దాన్ నుంచి మొదలుకొని దర్బార్ హాల్‌లోని వివిధ కళాక తులు, సింహాసనం, దాని అలంకారాలు తయారు చేసేవారు. రాగి, ఇత్తడి, కంచు లోహాల మిశ్రమంతో వీరు చేసే కళాకతులు కళా ప్రేమికుల హదయాలను నాటి నుంచి నేటి దాకా దోచుకుం టూనే ఉన్నాయి. నగిషీలతో గంగాళాలను వివిధ పరిమాణాల్లో తయారు చేయడం వీరికే చెల్లింది. దేవాలయాలలో మూల విరాట్టు నుంచి ఎన్నెన్నో విగ్రహాలను తయారు చేసిన ఘనత వీరి సొంతం. గీతోపదేశం, దశావతారాల చిత్రికలను లోహంతో తయారు చేసి ఎలాంటి కర్రను వాడకుండా గోడలపై తాపడంలో నేర్పరితనం ఎప్పటికీ పెంబర్తి కళాకారులదే అగ్రాసనం! సంప్రదాయంగా వీరిది పూర్తిగా చేతి పని.
లోగోలు.. షీల్డులు.. సమస్తం
తొలి తెలుగు ప్రపంచ మహాసభలకు (1975) లోగోలు, షీల్డులను తయారు చేసిన ఘనత వీరిదే. అం తకు ముందే ఐదో దశకం ఉత్తరార్థం నుంచి అయిలా చారి అనే కళాకారుడు ఈ గ్రామ ఘనతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయనకు రాని అవార్డు లేదు. సన్మానించని రాష్ర్టపతి, ప్రధానులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన స్థాపించిన విశ్వకర్మ సహకార సంస్థను ఎందరో గవర్నర్లు, ముఖ్యమంత్రులు పెంబర్తికి వెళ్లి స్వయంగా సందర్శించారు. ఆయన గ్రామంలోని కళా కారులకు ప్రాత: స్మరణీయులు. 1956లో అయిలా చారి నే తత్వంలో ‘విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండిస్టియల్ సొసైటీ’ ఏర్పాటైంది. ఆయన పర్యవేక్షణలో కేంద్రప్రభు త్వం 30 మాసాల శిక్షణ కోర్సును ప్రారంభించింది. అందులో శిక్షణార్థులకు డ్రాయింగ్, డిజైనింగ్ నేర్పేవారు. ఆయన హ యాంలో జపాన్ దేశస్తులు సైతం ెమ కలశాలను ఇక్కడి నుంచే తయారు చేయించి తీసుకెళ్లారు.
తాపడ రారాజులు
తాపడ కళలో పెంబర్తి వాసులను మించిన వారు కానరారు. వివిధ దేవా లయాలపై ఉన్న ఇత్తడి, రాగి, వెండి, బంగారు తాప డాలను తయారు చేశారు. ధ్వజస్తంభ తొడుగులు, గోపుర కలశాలు, కవచాలు రూపొందించడంలో వీరు దిట్టలు. లోహాలు, లోహ మిశ్రమాలతో కుడ్యాలం కరణ చేయడంలో వారు అద్వితీయులు. హైకోర్టు భవనంపైనున్న లోహ తాపడం ఇక్కడి కళాకా రుల చేతుల్లో రూపుదిద్దుకున్నదే. మహారాష్ర్టలోని తుల్జాభవానీ మాత దేవాల యంలో వీరి కళాకతులు ఉన్నాయి. కాకతీయ శైలిని అనుస రించడం వీరి కళ ప్రత్యేకత. ఆదరణ కరువై కళాకారులు పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లి ఇతర వత్తుల్లో అవకాశాలు వెతుక్కుం టున్నారు. చాలా మంది వంటపాత్రల తయారీకే పరిమిత మ య్యారు. అలంకరణ వస్తువులు, బంగారు సిగరెట్ పెట్టెలు, యాష్ ట్రేల పైకి వారి కళ ప్రసరించింది. వీరు ఇత్తడి లోహంతో తయారు చేసే గోడ దీపాలకు (1950లలో) ఆస్ట్రేలియాలో విపరీతమైన డి మాండ్ ఏర్పడింది. కళాకారులకు ఉత్పత్తికి అవసరమైన నిధుల లేమితో ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు.
ఇ-కామర్స్ ద్వారా అమ్మకాలు
పెంబర్తి బ్రాస్ సొసైటీని స్ఫూర్తి పథకం కింద అభివద్ధి చే యనున్నట్లు కేంద్ర హస్తకళల అభివద్ధి సంస్థ కమిషనర్ కుంతాటి గోపాల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో 70 కార్యాలయాల ద్వారా అభివద్ధి అధికారులు హస్త కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వడం, గ్రూపులు, ఫెడరేషన్లు ఏర్పాటుచేసి వారికి ముద్ర పథకం ద్వారా బ్యాంకు రుణాలు, బీమా సదు పాయం కల్పిస్తున్నట్లు చె ప్పారు. తెలంగాణ రాష్ర్టంలో నిర్మల్, పెంబర్తి వంటి ప్రాంతాల్లో 1.50లక్షల మంది కళాకారులు వివిధ సొసైటీలు, సంస్థల ద్వారా ఆయా రంగాల్లో ఉత్పత్తులు తయారు చేస్తు న్నట్లు గుర్తించామన్నారు. ముంబై నుంచి ముడిసరుకు తీసుకువచ్చి స్థానికంగా ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉందన్నారు. ఒకేచోట సామూహికం గా పనిచేసేందుకు వర్క్‌షెడ్లు ఏర్పాటు చే యాలని నిర్ణయించామన్నారు. అభివద్ధి చెందబోతున్న యాదాద్రిలో పెంబర్తి బ్రాస్ ఎంపోరియం ఏర్పాటు చేయాలనే ప్రతి పాదన ఉందన్నారు. త్వరలో హస్తకళలకు సంబంధించి ఒక వెబ్ పోర్టల్ దేశవ్యాప్తంగా రూపొందించి ప్రత్యేక యాప్ ద్వారా కళా కారులు తయారుచేసే వస్తువులను రాష్ర్ట హస్తకళల అభివద్ధి సంస్థ, సొసైటీల ద్వారా ఇ-కామర్స్‌తో అమ్మకాలు సాగించాలని నిర్ణయించా మన్నారు.
కళాకారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆధునిక ఉత్పత్తుల తయారీకి అవకాశం కల్పించాలని స్థానిక కళాకారులు వినతిపత్రం అందజేశారు.
కీర్తితోరణం వెనుక పెంబర్తి కళ!
ఓరుగల్లు ఘనమైన వారసత్వ సంపదకు ఇంతకాలం గుర్తుగా ఉన్న కాకతీయుల శిలాతోరణం ప్రభుత్వ అధికారిక చిహ్నంగా మారింది. కాకతీయులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కీర్తి తోరణం. వరంగల్, తెలంగాణ, తెలుగు ప్రజలను సింబాలిక్‌గా చూపించేందుకు కాకతీయుల కీర్తి తోరణాన్ని మించిన చిహ్నం మరొకటి లేదు. కాకతీయుల కీర్తితోరణానికి ప్రచారం తీసుకురా వడంలో పెంబర్తి గ్రామానికి చెందిన ఐలాచారి కీలకపాత్ర పోషిం చారు. 1973లో వరంగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా ఆపే ట్రాక్టర్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకుడు ఆహూతులకు ఇచ్చేందుకు ఏదైనా జ్ఞాపికను తయారుచేయమని కళాకారుడు ఐలాచారిని కోరగా… కాకతీయ కీర్తితోరణం మధ్యలో ఆపే ట్రాక్టర్ ఉండేలా ఓ జ్ఞాపికను తయారు చేశారు. షోరూం ఫంక్షన్‌లో ఆ జ్ఞాపిక హైలెట్‌గా నిలిచింది. అక్కడికి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ జ్ఞాపికపై ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
ప్రపంచ కీర్తికి నాంది
1974లో రాష్ర్ట ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించి లోగోను రూపొందించాల్సిందిగా కళా కారులను కోరింది. దీంతో గతంలో పేరు తెచ్చిన కాకతీయ కీర్తి తోరణం ప్రధానంగా డిజైన్ రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు ఈ డిజైన్ చూసి ముగ్ధుడై ఆ సభలో బహూకరించేం దుకు 200 జ్ఞాపికలు కావాలంటూ అక్కడికక్కడే ఆర్డరు ఇచ్చారు. ఒక్కో జ్ఞాపిక తయారీకి రూ.10 కోట్ చేస్తూ ఐలాచారి టెండర్ వేశారు. ఈ కళాఖండానికి రూ.10 అంటే తక్కువ అని… రూ. 200గా కోట్ చేయమని వెంగళరావు ప్రత్యేకంగా సూచించారు. అంతేకాదు… అదనంగా మరో 300 జ్ఞాపికలు తయారు చేయాలని పురమా యించారు. అలా మొదటిసారిగా కాక తీయుల కీర్తి తోరణం ప్రపంచ వేదికలపై సగర్వంగా దర్శనం ఇచ్చింది. ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసిన మూడు నెలలకు నాటి ముఖ్యమంత్రి వెంగళరావు పెంబర్తిని దర్శించారు. ఈ నేపథ్యంలో కీర్తితోరణం డిజైన్‌కు డిమాండ్ అనూ హ్యంగా పెరిగిపోయింది. అప్పటి నుంచి వందల ఫంక్షన్లలో వేలాదిగా జ్ఞాపికలు పంచారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులకు మెడల్స్ తయారు చేసే పని పెంబర్తి కళాకారులకు అప్పగించారు. గోల్కొండ, చార్మినార్‌లతో కూడిన వివిధ డిజైన్లు ఆయనకు నచ్చలేదు. చివరకు కాకతీయ కీర్తితోరణంతో డిజైన్ తయారు చేయగా… వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఇప్పటికీ ఆ డిజైన్‌తోనే పోలీసులకు మెడళ్లు ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ యూనివర్సిటీ, కలెక్టరేట్, జిల్లా సరిహద్దులు ఇలా అంతటా కీర్తితోరణాలు నిర్మించారు. ఇలా అన్ని ప్రముఖ స్థలాల ముందు ఠీవీగా నిలబడి అందరికీ స్వాగతం పలికిన కీర్తి తోరణం తెలం గాణ ప్రభుత్వ అధికార చిహ్నంలో భాగమైంది.
పెంబర్తి విశ్వకర్మ బ్రాస్ సొసైటీ
పెంబర్తి గ్రామంలో 1990 ముందు వరకు పెంబర్తి విశ్వకర్మ బ్రాస్ సోసైటీ కార్యక్రమాలకు బాగా డిమాండ్ ఉండేది. దాదాపు 100 విశ్వకర్మ కుల వత్తివారు ఈ వత్తి మీద ఆధారపడి జీవించే వారు. దేశ విదేశాల ప్రతి నిధులు నిత్యం పెంబర్తి గ్రామానికి వచ్చేవారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ తదితరులు పెంబర్తి గ్రామాన్ని సందర్శించారు. నిత్యం గ్రామంలో కంచు పైన సుత్తి దెబ్బల మోత కంచరి వాడల్లో ప్రతిధ్వనించేది. జాతీయ, అంతర్జాతీయ మీడియా వారు, విదేశీ టూరిస్టులతో పెంబర్తి నిత్యం రద్దీగా ఉండేది. విశ్వకర్మ బ్రాస్ సోసైటీ భవనం ఆ రోజుల్లో ఇంద్ర భవనం లాగ ఉండేది. హస్త కళాకారుల వల్ల ఆ గ్రామంలో పెరిగిన సందర్శకుల తాకిడికి- ఇతర వత్తులవారైన గీత కార్మికులు- ఆరె కటిక, కిరాణ షాపుదారు ల వస్తువులకూ బాగా ఆదరణ ఉండేది. ప్రపంచ పటంలో ఒక వెలుగు వెలిగిన పెంబర్తి హస్తకళలు నేడు మసకబారుతున్నవి. ప్రపంచీకరణ, ఆధునికీకరణ- వీరివ త్తి పైన తీవ్రమైన ప్రభావం చూపుతున్నవి. రెండు దశాబ్దల క్రితం ఉన్న హస్తకళల మార్కెట్ నేడు లేకుండా ఉన్నది. సొసైటీలోని సభ్యులు కొందరు సొంత దు కాణాలు పెట్టుకున్నారు. కొంతమంది హైద్రాబాద్‌కు వలస వచ్చి కొత్తగా హస్త కళల షాపులు పెట్టుకొని జీవిస్తున్నారు. ఇత్తడి, రాగి, వెండి మొదలగు వాటికి ధరలు పెరగ డంతో మార్కెట్‌లో తగిన రేటు రావడం లేదు. ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముడు పోక పోవడం, ఆధునిక పద్ధతిలో హస్త కళా ముద్రణ మిషన్లు రావడంతో హస్త కళల వ త్తి రోజు రోజుకూ క్షీణిస్తున్నది. ఇత్తడి స్థానంలో కొత్త పద్ధతి, ప్లైవుడ్ షీట్స్ పై స్టిక్కరింగ్ మెమొంటోలు త యారై అవి అన్ని ప్రాంతాలలో అందు బాటులోకి రావడంతో- ఈ వత్తి దారులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆధునిక పద్ధతులను సైతం వీరు ఎప్పటికప్పుడు చేరదీసుకొని ముందుకు వెడుతున్నారు. ఈ మధ్య కాలంలో విశ్వకర్మ బ్రాస్ సోసైటీ వారు కాకుండా ఇతర కులాలకు చెందిన వారు కూడా చాల వరకు ఈ వ త్తిలోకి వచ్చారు. స్వతహాగా వారు హస్తకళా షోరూంలు ఏర్పాటు చేసుకొన్నారు. తద్వారా దాదాపు వంద మంది వరకు స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వయం ఆధారిత వత్తివారైన హస్త కళా కారులను ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ముఖ్యం గా హస్త కళాకారులకు ఇత్తడి, రాగి, వెండి రేకులకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. ఆధునికతతో భాగంగా వీరికి హస్తకళా మిషన్లను ప్రభుత్వం కొని ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేపాక్షి హ్యండి క్రాఫ్ట్స్‌లో వీరి వస్తువులకు స్థానం కల్పించి, ప్రభుత్వం ముందుగానే వీరి వస్తువులకు డబ్బు చెల్లించాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న హస్తకళల నైపుణ్యంపైన వీరికి ప్రతి సంవత్సరం వర్క్‌షాపులు నిర్వహించాలి.
పెంబర్తి గ్రామంలో హస్తకళల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. హస్త కళాకారుల కుటుంబాలకు హస్తకళా సోసైటీ హౌస్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలి. 60 సంవత్సరాలు నిండిన ప్రతి వత్తిదారుడికి నెలకు రూ. 3000 పెన్షన్ ఇవ్వాలి. వారి కుటుం బాలకు విద్య, వైద్యం అందించాలి. ఎంతో విశిష్టమైన పెంబర్తి హస్తకళలను భవిష్యత్ తరాలకు అందించ వలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం హస్తకళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాలి. పూర్వవైభవం తీసుకు రావాలి.
బ్రాండ్‌నేవ్‌ుతో బతికేయవచ్చు….
‘పెంబర్తి’ అన్న ఒకే ఒక బ్రాండ్ నేవ్‌ుతో బతికేయవచ్చు. మార్కెట్ అవసరాలకు సరిపడా కళాకతుల ఉత్పత్తి జరగడం లేదు. ఇప్పుడు యాం త్రీకరణ ప్రభావం మాపై ఉన్నది. జాతీయ రహదారి ఇరుపక్కలా గ్రామ దుకాణాల్లోని వస్తువులన్నీ ఇక్కడే తయారయ్యా యనుకోవద్దు. అడిగి తీసుకోవాలి. గతంలో విశ్వకర్మ ‘కులవ త్తి’గా కొనసాగినా.. ప్రస్తుతం ఇతర కులస్తులు సైతం ఇందులో ప్రవేశించా రు. మా సంఘంలో విశ్వకర్మలు కేవలం 20 శాతం మందే ఉన్నారు. మిగతా వారు ముదిరాజ్, కుమ్మరి, రజక, తురక, మాల- మాదిగ, గౌడ, కురుమ తదితర కులాల వారున్నారు. మా సభ్యులకు ప్రభుత్వం మరింత మెరుగైన శిక్షణ కల్పించి మార్కెటింగ్ మెలకువలు నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ‘’గోల్కొండ’’ (గతంలో లేపాక్షి) ఎంపోరి యం కొంత మేర మా మార్కెటింగ్ అవసరాలను తీరుస్తోంది అని అంటారు పెంబర్తి కళాకారులు.
పెంబర్తి ప్రముఖులు
అయిలాచారి: రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కళాకారుడు. ఆయా స్థాయిల్లో అవార్డులందుకున్నారు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత. గురువు. ఈయనంటే గ్రామస్తులం దరికీ ఎనలేని అభిమానం.
రుద్రోజు శ్రీనివాస చారి: ఈయనకు 2001లో రాష్ర్ట స్థాయి ప్రథమ పురస్కారం లభించింది. దాదాపు 210 కిలోల ఇత్తడితో కెప్టెన్ ఉమ్రావ్‌సింగ్ ఇత్తడి విగ్రహాన్ని రూపొందించినందుకు ఆ పురస్కారం లభించింది.
అయిల వేదాంతాచారి: ఈయన సైతం రాష్ర్ట పురస్కార గ్రహీత.
రంగు వెంకటేశ్వర్లు: రాష్ర్ట ప్రభుత్వ పురస్కార గ్రహీత. జాతీయ స్థాయి అవార్డును సాధించారు.
అయిలా సోమ బహ్మ్రచారి: పంచలోహ కళాక తులను తయారు చేయడంలో దిట్ట. అవార్డు గ్రహీత కూడా.
అమెరికాలోని రెస్టారెంట్‌కు పెంబర్తి కళాఖండాలు
హస్త కళలకు పుట్టినిల్లయిన పెంబర్తి కళా వైభవం ఖం డాంతరాలు దాటి వెళుతోంది. అమెరికాలోనూ ఇక్కడి కళా ఖండా లకు ఘనకీర్తి దక్కుతోంది.
ఇక్కడ తయారైన ఇత్తడి కళాఖండాలు అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో అలరించనున్నాయి. హైదరాబాద్ దుర్గాభాయ్ దేశ్ ముఖ్ కాలనీకి చెందిన కొమ్మిడి బల్వంతరెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన న్యూజెర్సీలో మొఘల్ దర్బార్ రెస్టారెంట్‌ను నెలకొల్పు తున్నారు. ఈ రెస్టారెంట్ ముఖద్వారం, కాన్ఫరెన్స్ హాల్, భోజన శాలతో పాటు ఇంటీరియల్ డిజైన్లను పెంబర్తిలో తయారు చేయి స్తున్నారు. సుమారు రూ.7 లక్షల విలువైన 250 కిలోల ఇత్తడితో ఈ కళాఖండాలు రూపుదిద్దుకుంటున్నాయి. రెస్టారెంట్ ముఖ ద్వారంపై ‘మొఘల్ దర్బార్ ెటల్’ అని తెలుగులో రాయిస్తూ మాతభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.
పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన మరో ఎన్‌ఆర్‌ఐ సం పత్‌రెడ్డి టెక్సాస్‌లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభాల రేకులను కూడా పెంబర్తిలోనే తయారు చేయించి తీసుకెళ్లారు. ముఖద్వారం కోసం రూ.5 లక్షలతో తీర్చిదిద్దిన తలుపు లను పంపించారు. కళాఖండాల తయారీ కోసం అమెరికా నుంచి ఆర్డర్లు రావడం ఆనందంగా ఉందని స్థానిక కళాకారులు అంటున్నా రు. అమెరికా, జపాన్, ఇటలీ లాంటి ఎన్నో దేశా లకు ఇక్కడ తయారు చేసిన వాటిని తీసుకెళ్తున్నా రని చెప్పారు.
పెంబర్తి హస్తకళల పితామహుడు ఐలా
ప్రపంచ వ్యాప్తంగా పెంబర్తి హస్తకళలకు ప్రాచుర్యాన్ని కల్పించిన ఐలా ఆచారి(79) గుండె పోటుతో హైదరాబాద్‌లోని ఓప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవల మతి చెందారు. వరంగల్ జిల్లా జన గామ మండలం పెంబర్తికి చెందిన ఆచారి విశ్వ కర్మ హస్తకళల సొసైటీ ద్వారా పెంబర్తి హస్త కళలను విశ్వవ్యాప్తం చేయడానికి ఎంతోకషి చేశా రు.
ఇత్తడి, రాగి, వెండి లోహాలతో వివిధ రకా ల షీల్డులు, పలు ఆకతులను చేయడం ఆచారి కుటుంబంతోనే ప్రారంభమైంది. వీరి పూర్వీకులు నైజాం నవాబుల కు వెండితో కూడిన అత్తర్‌దాన్, పాన్‌దాన్‌లను చేసేవారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా హస్తకళలను నేర్చుకున్న ఆచారి.. గ్రామంలో 1970లో విశ్వకర్మ హస్తకళల సొసైటీని స్థాపించి ఎందరో కళాకారు లను తీర్చిదిద్దారు.
పలు దేశాల్లో పెంబర్తి కళలకు విశేష ప్రాచుర్యం కల్పించడం లో ఆచారి కషి ఎంతగానో ఉంది. జాతీయ అవార్డు అందుకున్న ఆచారి: హస్తకళల విభాగంలో 1979లో అప్పటి రాష్ర్టపతి నీలం సంజీవరెడ్డి నుంచి ఆచారి దిల్లీలో జాతీయఅవార్డు అందుకొన్నారు. నాటి ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, అప్పటి ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు తదితరుల నుంచి ఆయన అవార్డులు, సన్మానాలు పొందారు. వెంకట్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *