ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’

ఈ మధ్య 5 రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా ఒపీనియన్ పోల్స్‌పేర విపరీతమైన చర్చను లేవనె త్తాయి. ఈ మీడియాకు దేశంలో ఉన్న ముఖ్య సమస్యలు ఏమి పట్టక పోయినా, 5 రాష్ట్రాల ఎన్నికల పేరిట, దేశ రాజకీయాలను శాసించే దిశగా పనిచేస్తోంది. రాబోయే 2014 పార్లమెంట్ ఎన్నికలకు, ఇవి ఒక అంచనాగా కూడా పనికి వస్తాయన్నది వాటి అభిప్రాయం.
మీడియా కచ్చితంగా సామాజిక కోణంలో ఆలోచించాలి. ప్రతీ పౌరుడికి ఉన్న హక్కులు, స్వేచ్ఛ మీడియాకు కూడా వర్తిస్తాయి. పౌరులకు సరైన సమాచారం, వాస్తవాలు చెప్పవలసిన అవసరం మీడియాకు ఉంది. అలాంటి కోణం లోనే వచ్చిన ఒపీనియన్ పోల్స్ నిర్వహణ లేదా వాటి ప్రచారంలను నిషేధించాలని జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీఎస్పీలు ప్రకటించాయి. ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు. అదే సమయంలో మీడియా పదేపదే తన వర్గ స్వభా వాన్ని చాటుకుంటున్నది. తన భావాలను ప్రజలపై రుద్ది ‘కాదు అనే విషయాన్ని అవును’ అనే వరకు, అలాగే ‘అవును అనే విషయాన్ని కాదనే’ వరకు తన వంతుగా విపరీత ప్రచారం చేస్తోంది.
గతంలో బోఫోర్స్ కుంభకోణం కేసులో రాజీవ్‌గాంధీని ‘దోషి’గా నిలబెట్టడం, వి.పి.సింగ్‌ని ప్రధానమంత్రి దాకా తీసుకెళ్ళటం, ఈ మధ్య అన్నా హజారేను వర్తమాన రాజకీయాలకు ప్రత్యామాయంగా నెలకొల్పటం, తిరిగి అదే అన్నా హజారే ప్రస్తుతం, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిని తీసుకురావటం… ఇదంతా మీడియాకే చెల్లింది అని చెప్పవచ్చు. వీటన్నింటికి కారణం, రాజకీయ పార్టీలు తమ తమ ఇష్టానుసారంగా వ్యవహరించటమే. తమకంటూ ఒక సిద్ధాంతం, కార్యాచరణ ఏ పార్టీకి లేని కారణంగానే ఇలాంటివి ఉత్పన్నం అవుతున్నాయి. ఒపీనియన్ పోల్స్ మీద వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాల కోసం, ఎలక్షన్ కమిషన్ 2004 ఏప్రిల్ 6న ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు, తమ అభిప్రాయాలను తెలిపాయి. సీపీఎం ఒపినియన్ సర్వేకు ఓకే చెప్పి, బయటకు చెప్పవద్దు అని అన్నది. ఎన్నికల నియమా వళి అమల్లోకి వచ్చిన తరువాత వీటిని నిషేధించాలని సీపీఐ చెప్పింది. ఈ సమావేశం పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వం 2009లో ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించింది. అప్పుడే రాజ్యాంగ సవరణను కేంద్రం చేప ట్టింది. నిజానికి ఒపినియన్ పోల్స్‌లో ఎంతవరకు నిబద్ధత ఉం ది? ఎంత డిగ్రీవరకు ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది? అనేది చెప్పలేం. నిజానికి నిషేధం అనేది కరెక్టుకాదు. ఆర్టికల్ 19(1)క్యూ, పౌరులు ప్రాథమిక హక్కుగా స్వేచ్చగా మాట్లడవచ్చు. ఆర్టికల్ 19(2), దేశ సౌభ్రాతృత్వం, సమగ్రత దృష్ట్యా ఇది కరెక్ట్ కాదు. వీటిని నియం త్రించ గలిగే శక్తి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉండాలి. ఎందుకంటే పెయిడ్ న్యూస్ లాగే ఇదీ కాకూడదు అని. భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎంతో సాంస్కృతిక వైవిధ్యం ఉన్నదగ్గర మీడియా ఒపీని యన్ పోల్స్ మీద ఎక్కువ ఖర్చు చేయలేదు. అందువల్ల వాటి శాస్త్రీయత అనేది తగ్గుతుంది. అందుకనే ప్రపంచంలోనే పెద్ద మీడియా సంస్థలైన పి.ఇ.డబ్ల్యు, గాల్ఫ్‌లు ఇండియాలో ఒపీనియన్ పోల్స్ నిర్వహించవు. అందుకనే యోగేంద్రయాదవ్, సి.వి.ఎల్.నరసింహ రావు లాంటి ప్రెఫోలజిస్ట్స్ తిరిగి రాజకీయాలలోకి రావటం జరిగింది. ప్రస్తుతం ఒకరు ఆవ్‌ుఆద్మీ పార్టీతో, మరొకరు బీజేపీతో ఉన్నారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రిప్రెజెంటేషన్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం 2009లో రాజ్యాంగ సవరణతో నిషేధించింది. ఈ సవ రణ ప్రకారం ఎన్ని దశలలో పోలింగ్‌లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్పటికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించా రు. ఇది ఎన్ని దశలలో పోలింగ్ జరిగితే అన్ని దశలలో పోలింగ్ ముగిసే వరకు వర్తిస్తుంది. పోలింగ్ జరిగిన తర్వాత వీటిని ప్రచురించ వచ్చు. ఈ నిషేధం భారతదేశం లోనే కాదు, పలు దేశాలలో కూడా ఉంది. కొన్ని దేశాలలో మాత్రం వీటి పై ఎలాంటి నిషేధం లేదు. వాటి వివరాలు కూడా కొన్ని ఇక్కడఇచ్చాం.
నిషేధం ఉన్న దేశం ఎన్ని రోజులు నిషేధం లేని దేశాలు
దక్షిణ కొరియా 21 ఆస్ట్రేలియా
అర్జెంటినా 15 అమెరికా
ఇటలీ 15 బంగ్లాదేశ్
శ్రీలంక 7 జర్మనీ
రష్యా 5 జపాన్
స్పెయిన్ 5 పాకిస్థాన్
కెనడా 3 ఇంగ్లాండ్
మెక్సెకో 3 ఫ్రాన్స్
బ్రెజిల్ 2
ఒపియన్ పోల్స్ ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగానైనా ఇతరులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నో కుటుంగాధా సీరియల్స్‌ను స్త్రీలు విపరీతంగా చూసి చూసి, వారి వారి కుటుంబాలలో వాటి ప్రభావం పడే విధంగా వారి ప్రవర్తనలో మార్పును, మనం సహజంగా, అనుభవ రీత్యా గుర్తించ వచ్చు. ఏకధాటిగా రామాయణం, మహాభారతం లాంటి సీరియల్స్ కొన్ని సం॥లుగా ప్రసారం చేయటం ఒక విధంగా బీజేపీ ప్రభుత్వం అప్పట్లో అధికారంలోకి రావటానికి కొంత దోహద పడింది అని చెప్పవచ్చు. అదే సందర్భంలో ఈ ఒపీనియన్ పోల్స్‌ని ఆధారం చేసుకొని ఏ నిర్ణయానికి రాలేం. అది శాస్త్రీయం కూడా కాదు.
నీలం జానయ్య
(తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్)


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *