ప్రసారాలు ‘ప్రాంతీయత’ను ప్రతిబింబించాలి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న కార్యక్రమంలో తెలంగాణా యాస-భాషకు తగిన ప్రాధాన్యం లభిం చడం లేదు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమయ్యే కార్యక్రమాలు తెలంగాణా జిల్లాలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణా ప్రాం తానికి విస్తరించబడి ప్రసారమవుతున్నాయి. కేవలం తెలంగాణాకే పరి మితమయిన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రప్రసారాలలో తెలంగాణ భాష ప్రతిబింబించకపోవడం బాధకరం.
తెలంగాణాలోని ప్రతి పల్లెపల్లెలో ఆకాశవాణి గణనీయమైన సంఖ్య లో శ్రోతలు, అభిమానులున్నారు. కాని ప్రసార కార్యక్రమాలలో తెలం గాణ భాషను ఉపయోగించడం లేదు. కేబుల్ టివిలు, సెల్ఫోన్లు, ఇంట ర్నెట్లు మారుమూల ప్రాంతాలకు కూడ అందుబాటులోకి వచ్చిన నేప థ్యంలో కూడా నేటికి ఆకాశవాణి ప్రసారాలకు విశేషమైన ఆదరణ ఉండటం విశేషం. అదే విధంగా ఎన్నో ఎఫ్.ఎం. రేడియో ఛానళ్ళు వచ్చిన కూడా ఆకాశవాణి వివిధభారతి కార్యక్రమాలకు ముఖ్యంగా ‘జనరంజని’ ‘ఈ పాట మీకోసమే’‘ ‘మధురగీతాలు’ తదితర వినోద కార్యక్రమాలను విశేషమైన ప్రజాదరణ ఉందని చెప్పవచ్చు.
తెలంగాణ ప్రతి పల్లెలో ఇంకా రేడియో ప్రసారాలకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. కరెంటుకోతల నేపథ్యంలో రేడియోకు ఇంకా ఇంకా ప్రాధాన్యత పెరుగుతోంది. తెలంగాణా పల్లెల్లో చేతివృత్తులు, కుటీరపరిశ్రమలు, చిన్న చిన్న వృత్తులలో పనిచేసేవారికి రేడియో ఒక ముఖ్య వినోద సాధనం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్ర సారమయ్యే వినోదత్మక కార్యక్రమాలకు తెలంగాణ పల్లెల నుండి ఆ కాశ వాణికి విశేష సంఖ్యలో శ్రోతలు, అభిమానులు ఉన్నారన్న విష యం, వారు ప్రసారం చేసే ఉత్తరాలు, చదివే ఊర్లు, పేర్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణా జిల్లాల నుండి అనేక ఏండ్ల నుండి నేటికీ ని రంతరం, ప్రతి నిత్యం ఉత్తరాలు వ్రాస్తున్న రేడియోను ఎంతగా అభి మానిస్తుందో అధికారులకు, వ్యాఖ్యాతలకు తెలియనిది కాదు. ప్రసా రాలలో మాత్రం తెలంగాణ జీవ భాషకు, యాసకు ఏ మాత్రం ప్రాధా న్యం లేకపోవడానికి కారణాలు ఏమిటో తెలియదు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రసారాలలో మొదటి నుంచి ఆంధ్ర వా రి భాష, యాసతో కూడిన కార్యక్రమాలే ప్రసారం అవుతున్నాయి. హై దరాబాద్ కేంద్ర ప్రసారాలకు ఏ సందర్భంలో, ఏ యాసను ప్రామాణి కంగా తీసుకున్నారో తెలియదు కాని, అవి ఏ రోజూ తెలంగాణా జీవ భాషను ప్రతిబింబించలేకపోయాయి. యాంకర్లు వాడే భాష పూర్తిగా ఆంధ్ర యాసే! ప్రసారం చేసే నాటకాలలో, రచనల్లో ఆ యాస కొట్టొ చ్చినట్టు కనబడుతోంది. ఉదహరణకు ఇటీవల ప్రతి ఆదివారం ఉద యం వివిధ భారతిలో ప్రసారం అయ్యే ‘వినోదవల్లరి’కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న నాటకాలలో వస్తున్న భాష, పాత్రధారుల జీవనశైలి పూర్తిగా సీమాంధ్రుల జీవనాన్ని ప్రతిఫలింపజేస్తున్నాయి. మాకు ఇతర యాస వినాలని ఉంటుంది. కానీ తెలంగాణా ప్రాంత జీవనశైలి, సం స్కృతి సంప్రదాయాలు కుటుంబాలు పల్లెలు ఆ వాతావరణాలు, మా చెరువులు, చెరువు చుట్టు అల్లుకునే సబ్బండ వర్ణాల సాంగత్యం, ప్రతి ఫలించే కార్యక్రమాలు మా ప్రాంత యాస భాషలో ఆకాశవాణిలో ప్ర సారం కావాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసా రమయ్యే 101. ఎఫ్.ఎం. రెయిన్ బో చానల్ పూర్తిగా యువత కో సం హైదరాబాద్ జంటనగరాల శ్రోతల కోసం ప్రారంభించబడినది. ఈ ఛానల్లో అప్పుడప్పుడు హైదరాబాద్ నగర యాస పేరిట యాంకర్లు వాడే భాష నానా గందరగోళంగా ఉంటుంది. దీనిపై కొంచెం దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది.
ఆకాశవాణి గొప్పతనం ఏమిటంటే, తెలంగాణా యాసను కించప రిచేవిధంగా, వెక్కిరించే విధంగా ఏనాడూ ప్రవర్తించలేదు. ఇంతవర కు జరిగిందేందో జరిగింది, కానీ కనీసం ఇప్పుడైనా తెలంగాణా రా ష్ర్టం వచ్చినాకనైనా ఇక్కడి ప్రజల్ని వారి నుడికారాల్ని, పదాల్ని, పద ప్రయోగాల్ని భాషలోని గొప్పతనాన్ని గుర్తించండి. కార్యక్రమాలు రూ పొందిచండి.
తెరమరుగయిన తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు చరిత్రను నిలబెట్టే విధంగా తెలంగాణ భాషలలో తెలుగుదనాన్ని, కమ్మదనాన్ని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ప్రసారం కావాలి.
ఇంతవరకు అటువంటి ప్రసారాలు జరిగాయా? లేదా? అన్న వివ రాలు, వివరణలు, వివాదాల్ని పక్కనబెట్టి, తెలంగాణ కవులు, కళాకా రులు, గాయకులను ప్రోత్సహించి వారి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇ వ్వాలి.
వార్తలు, విశేషాలులో తెలంగాణా ప్రాంతానికి ప్రత్యేక ప్రాధా న్యం ఇవ్వాలి. గ్లోబలీకరణ నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాలల్లో ప్ర జల్లో వస్తున్న మార్పుల కనుగుణంగా కార్యక్రమాలు రూపొందాలి. అప్పుడే ఆకాశవాణి తెలంగాణ ప్రజల మన్ననలను పొందగలుగు తుంది.
– కాలేరు సురేష్


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *