బహుళ అంతస్తుల ప్రాజెక్టు | సుప్రీంకోర్టు కమిటీ సిఫారసులకు వ్యతిరేకం

హుసేన్ సాగర్ పరిసరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మా ణాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సిఫారసులకు మరింత నిర్దిష్టంగా చెప్పా లంటే, 6.1 నుంచి 6.3 వరకు ఉన్న సిఫారసులకు వ్యతిరేకం. కమిటీ సిఫారసులలో వేటికీ తమకు అభ్యంతరం లేదని రాష్ర్ట ప్రభుత్వం 2014 జనవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా మారే దిశలో హైదరాబాద్ వేగంగా పురోగమి స్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, హుసేన్‌సాగర్ పరిసరాల్లో బహుళ అం తస్తుల భవనాల నిర్మాణ ప్రతిపాదనను ఫోరవ్‌ు ఫర్ ఎ బెటర్ హైదరా బాద్ (ఎఫ్‌బీహెచ్), మరికొన్ని ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
‘‘హుసేన్ సాగర్ పరిసరాలో బహుళ అంతస్తుల భవనాల ని ర్మాణం గురించి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బహుళ అం తస్తుల భవనాలకు వ్యతిరేకం కానప్పటికీ, హుస్సేన్‌సాగర్ పరిసరాలు అందుకు అనుకూలం కాదని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎంచుకున్న ప్రాంతాలు అన్నీ కాకపోయినా కొన్నయినా ఈ సరస్సు శిఖం భూమి పరిధి లోకి వస్తాయి. ఫలితంగా అక్కడ కార్యకలాపాలు అధికమైపోయి వాయు, భూగర్భ జల, శబ్ద కాలుష్యాలు ఎక్కువై పోతాయి. చెత్త ఎత్తివేత, మురికినీళ్ళు, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు ఏర్పడుతాయి. హుసేన్ సాగర్ సరస్సు మరింతగా కలుషితమై పోతుంది. ప్రాజెక్టు కాంటూరుల పై స్పష్టత వచ్చినప్పుడు ఈ అంశాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తాం’’ అని ఎఫ్‌బీహెచ్ పేర్కొంది.
సుప్రీంకోర్టు కమిటీ నివేదికలో సిఫారసులు ఇలా ఉన్నాయి.
‘‘హైదరాబాద్‌కు కేంద్రంగా ఉన్న హుసేన్‌సాగర్ సరస్సు మరియు దాని సెంట్ర ల్ బిజినెస్ డిస్ట్రిక్టు (సీబీడీ)ని, పార్కుల ఏర్పాటు పేరిట సీబీడీలో భాగం అయ్యేందుకు లేదా పిక్‌నింగ్, వినోదం మరియు వాణిజ్యం కోసం వినియోగించకూడదు. ఇకపై సరస్సులో ఎలాంటి పార్కులు ఏర్పాటు చేయకూడదు. సరస్సు ప్రాంతం అంతటా కూడా మొత్తంగా ఏ విధమైన భవనాలు లేదా నిర్మాణాలు అను మతించకూడదు. సరస్సు, దాని పక్కనే ఉన్న పరిసరాలను వాణిజ్య కార్యకలాపాలకు దూరంగా ఉంచడం ద్వారా నగరంలో ఆస్తమా, వాయు కాలుష్య సంబంధిత ఇతర వ్యాధుల నుంచి విముక్తి పొందగ లదు. ఆక్రమణలకు గురికావడాన్ని, కాలుష్యం బారిన పడడాన్ని అనుమతించకూడదు. 4.2 సెక్షన్‌లో సూచించిన విధంగా ఆక్రమణలు తొలగించడం ద్వారా సరస్సు పునరుద్ధరణ చేపట్టాలి. 2000కు ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించి రోడ్డు మరియు రైల్వే లైను మినహా కోర్టుల్లో ఉన్న అన్ని కేసులనూ పరిష్కరించాలి. అప్పుడు సమకూరిన భూమిని చెరువులో చేర్చి విస్తరించాలి. పేదలకు అనుకూలంగా క్రమబద్ధీకరించడం తెలివైన పని కాదు. దానికి బదు లుగా వారికి సరస్సు వెలుపల, అది వారి జీవనోపాధిని, సామాజిక సంపర్కాన్ని ప్రభావితం చేయని రీతిలో పునరావాసం కల్పించవచ్చు. సరస్సు లోకి ఆక్రమణలుగా వచ్చిన కాలనీ ఎఫ్‌ఎస్‌ఐ ని 1:1గా చూడాలి. రెండు అంతస్తులకు (గ్రౌండ్ + మొదటి అంతస్తు) మించిన భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు’’.(Next News) »Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *