బాలల చలన చిత్రోత్సవం

వినోదం.. విజ్ఞానం అందించేలా

రెండేళ్ళకోసారి జరిగే అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం నవంబర్ 14న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. చిన్నారుల కేరింతల మధ్య జరిగిన ఈ వేడుక సందర్భంగా శ్పికళావేదిక చప్పట్లతో మా ర్మోగిపోయింది. వివిధ పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థినులు ‘మా భాగ్యనగరంలో మహా సంబరం’ అంటూ చేసిన నృత్యం వేడుకకు ప్రత్యేకతను తీసుకువచ్చింది. విదేశీయులు ఈ నృత్య ప్రదర్శనలు ఆ సక్తిగా తిలకించి ఆనంద పరవశులయ్యారు. ఈ నృత్య ప్రదర్శనకు కథ క్ నృత్యగురువు రాఘవ్‌రాజ్ భట్ కొరియోగ్రఫీ అందించారు. అక్షత్ అనే బాలుడి వెస్ట్రన్ డాన్స్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా మారింది. ఆ డాన్స్‌కు మంత్రముగ్ధులైన కరిష్మాకపూర్, కరీనా కపూర్‌లు అక్షత్‌తో క లసి స్టెప్పులేశారు. సైకత కళాకారుడు హరికృష్ణ వేసిన చిత్రాలు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి.
చిత్రోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 20వ తేదీ వరకు న గరం లోని వివిధ థియేటర్‌లలో సుమారు 300 చిత్రాలు ప్రదర్శించా రు. ప్రసాద్ ఐమ్యాక్స్, సినీపోలిస్, ప్రశాంత్, శ్రీరామ, శివపార్వతి, హైటెక్, రంగా, ఈశ్వర్, మహాలక్ష్మి థియేటర్లతో పాటుగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, హరిహర కళాభవన్, రవీంద్రభారతి, శిల్ప కళావేదిక తదితరాల్లో సైతం ఈ చిత్రాలను ప్రదర్శించారు.
ఈ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు సంబంధిం చిన పూర్తి సమాచారంతో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా (సీఎఫ్‌ఎ స్‌ఐ) రూపొందించిన మొబైల్ యాప్‌ను నవంబర్ 14న ఆవిష్కరించా రు. కరీనాకపూర్, కరిష్మా కపూర్, టబూ ఆవిష్కరించారు. కార్యక్ర మంలో ఫెస్టివల్ డైరెక్టర్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, సీఎఫ్‌ఎస్‌ఐ చైర్మన్ ముకేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
తళుక్కుమన్న భారత్
చిత్రోత్సవాల్లో భారతదేశం తళుక్కుమంది. ఉత్తమ నటుడు, ఉత్త మ లఘుచిత్రం (ఇంటర్నేషనల్ లైవ్ యాక్షన్), ఉత్తమ ఫీచర్, ఉత్తమ లఘు చిత్రం (ఏషియన్ పనోరమ), రెండు ఉత్తమ చిత్రాలు (లిటిల్ డైరెక్టర్ 1316 ఏళ్ళలోపు), రెండు ప్రత్యేక బహుమతులు (లిటిల్ డైరెక్టర్ 612 ఏళ్ళలోపు) కలిపి మొత్తం 9 పురస్కారాలను గెలుచు కుంది. అయితే తెలుగు చిత్రాలకు పురస్కారం దక్కలేదు. రెయిన్‌బో (హిందీ) చిత్రంలో తన తమ్ముడి చూపు కోసం తపించిన పదేళ్ళ పారీ నటన అందరిచే కన్నీళ్ళు పెట్టించింది. ఇంటర్నేషనల్ లైవ్ యాక్షన్ (పెద్దల జ్యూరీ) విభాగంలో ఉత్తమ నటిగా బంగారు ఏనుగుతో పాటు రూ.1.5 లక్షల నగదు గెలుచుకుంది.
బాలిక రజస్వల అయినప్పుడు పెద్ద పండుగ చేయడాన్ని నేటి తరం ఇష్టపడడం లేదు. ఇదే అంశంపై చెన్నైకు చెందిన కమల్ సేథ్ ‘యెల్లో ఫెస్టివల్’ను తెరకెక్కించారు. ఇంటర్నేషనల్ లైవ్ యాక్షన్ (పెద్ద ల జ్యూరీ) కేటగిరీలో ఉత్తమ లఘు చిత్రంగా రూ.లక్ష గెలుచుకుంది.
వారం రోజుల పాటు చిన్నారులను కొత్త లోకంలోకి తీసుకెళ్ళిన 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం నవంబర్ 20వ తేదీన ముగిసింది. వినోదం, విజ్ఞానం, సందేశం మేళవించిన సినిమాలు చూ సి బాలలు ఆనందించారు. దేశవిదేశాల నుంచి వచ్చిన చిన్నారులు, ద ర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులతో నగరంతో పాటుగా వివిధ జిల్లాల బాలలు కలసి వారం రోజుల పాటు సందడి చేశారు. అక్క డక్కడా కొన్ని లోపాలు ఉన్నా మొత్తం మీద చిన్నారుల పండుగ ఆనం దదాయకంగా ముగిసింది. చివరి రోజు మధ్యాహ్నం వరకు నగరంలో బాలల సినిమాలు ప్రదర్శితమయ్యాయి. సాయంత్రం నుంచి శిల్పకళా వేదికలో సందడి చోటు చేసుకుంది. ఇక్కడ ముగింపు వేడుకలు, ఉ త్తమ చిత్రాలకు పురస్కార ప్రదాన కార్యక్రమాలు జరిగాయి. హైద రాబాద్‌లో ఈ చిత్రోత్సవాలు జరగడం ఇది పదకొండోసారి. తెలం గాణ రాష్ర్టం తరువాత ఈ ఉత్సవాలు జరగడం ఇదే మొదటిసారి కావడంతో వీటి నిర్వహణను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీమ సుకుంది. నగరంతో పాటు మిగితా జిల్లాకేంద్రాల్లో కూడా ఈ ఉత్స వాల్లో ప్రదర్శించిన సినిమాలను చిన్నారులకు అందుబాటులోకి తీసు కువచ్చారు. రవీంద్రభారతి, శిల్పకళావేదికలలో నిత్యం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చా టాయి. చిన్నారులు కళాకారులతో ఫోటోలు దిగి సంబరపడ్డారు. బా లల చలన చిత్రోత్సవంలో ఎక్కడా తెలుగు తారలు దర్శనమివ్వ లేదు. దేశవిదేశాల నుంచి ప్రఖ్యాతిగాంచిన దర్శకులు, నటులు, నిర్మాతలు వ చ్చి నగరంలో కలివిడిగా పర్యటిస్తూ పిల్లలతో కలసి సినిమాలు చూస్తూ సందడి చేశారు. బాలీవుడ్ తారలు కరిష్మా, కరీనాలు ఉత్సవం ఆరం భంలో శిల్పకళావేదికపై నృత్యం చేయడం, బీ హ్యాపీ సినిమా చూసేం దుకు ప్రసాద్ ఐమాక్స్ రావడంతో ఉత్సాహం నెలకొంది. డిజిటల్ ఇండియా థీవ్‌ుతో ఈ సారి చిత్రోత్సవాలను నిర్వహించారు.
సినిమా తీయడం, స్క్రిప్ట్ రైటింగ్, కెమెరా పనితీరు… ఇలా వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు కార్యశాలలు, కార్యక్రమాలను నిర్వహించారు. 0 దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఉత్సవాలకు వచ్చా రు. వీరందరికీ ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు చిత్రాలను చూపించి తిరిగి ెటల్‌కు తీసుకె ళ్ళారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలను వారికి చూపిస్తే బా గుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అతి తక్కువ నిడివి గల చిత్రాల కంటే కనీసం గంట నిడివి ఉన్న చిత్రాలను చిన్నారులు ఎక్కువగా ఇష్ట పడ్డారు. ముగింపు కార్యక్రమంలో రాష్ర్ట సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, రాష్ర్ట పర్యాటకాభివృద్ధి శాఖ ఎగ్జిక్యూ టివ్ చైర్మన్, ఓఎస్‌డీ కిషన్‌రావు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మా మిడి హరికృష్ణ, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు.


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *