బాలల హక్కులు చట్టాలు

తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో 14వ చర్చ కార్య క్రమంలో భాగంగా బాలల హక్కులుచట్టాలు అనే అంశంపై చర్చను హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ‘చంద్రం’ లో నిర్వహించారు. ప్రొ॥ ఫాతిమా అలీఖాన్, ఆర్. వెంకట్‌రెడ్డి (ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్), మురళీ మోహన్ (తెలంగాణ బాలల హక్కుల వేదిక అధ్య క్షులు), ఎండీ రహిమొద్దీన్ (అడ్వకేట్), ఫిలిప్స్ (బాలల హక్కుల వేదిక), టీఆర్‌సీ చైర్మన్ యం. వేదకుమార్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఆర్.వెంకట్‌రెడ్డి …
కడుపులో ఉన్న బిడ్డ నుండి మొదలు 1 సం॥ బాలబాలికలకు బాలల హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు గౌరవించి అమలు పరిచే ప్రభుత్వాలు ఉంటేనే ప్రజాస్వామికం అని భావించాలి. 2011 లెక్కల ప్రకారం కోటిమందికి పైగా సరిగా చదువులేని వారే మన ప్రాంతంలో ఉన్నారు. 2% మాత్రమే పదోతరగతి చదివిన బాలబాలికలు ఉన్నారు. 72% మది బాలలు పదవతరగతి లోపుగా చదివిన వారే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి చాలా ప్రమాదకరం. బాలలు తమ బాల్యాన్ని బడిలో గడిపినప్పుడే బాలల హక్కులు అమలవుతున్నాయని అర్థం. తెలంగాణలో కోటి 20 లక్షల మంది బాలబాలికలు ఉన్నారు. గ్రామం లోకి వెళ్ళి ఓటర్లు ఎంతమది అంటే కచ్చితంగా చెబుతారు కానీ బాలల హక్కుల బృందం వారు పిల్లలు ఎంత మంది అని అడిగితే తెలువనటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ఆ గ్రామ పెద్దలు ఉన్నారు. ఒకటవ తరగతిలో లక్షల మంది చేరితే 4 లక్షల మంది మాత్రమే 10వ తరగతికి చేరుకుంటున్నారు. మిగతా వారు అందరూ చదువు మానేస్తున్నారు. ఇలాంటి వారిని డ్రాప్‌అవుట్స్ అంటారు. కానీ వీరు డ్రాప్ అవుట్స్‌కాదు, వాక్ అవుట్స్. రోజురోజుకు ఎంతో మంది బాలలు బాలకార్మికులుగా మారుతున్నారు. మన సమాజంలో ముఖ్యంగా ఇవాళ బాలబాలికల పైన చిన్నచూపు, దాడులు అనేకం జరుగుతున్నాయి. బాలలహక్కుల ఉల్లంఘనల్లో అత్యధికంగా బాలికలే బలి అవుతున్నారు. దేశంలో జరిగే బాల్య వివాహాల్లో మన రాష్ర్టంలోనే అధికంగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటితో బాలలు ఒత్తిడికి గురి అవుతున్నారు. బాలల హక్కులను మనం హరిస్తున్నాం. ఆడుతూ పాడుతూ పని భారం లేకుండా చదువు నేర్చుకోవటమే బాలల హక్కు. అది బాల్యం. బాలల హక్కులు అంటే మాకు తెలుసు అని చాలా మంది అనుకుంటారు. కాని వాళ్ళ ఇళ్ళల్లో కోప్పడప్పుడు, పని భారాలు మోపినప్పుడు ఇది బాలల హక్కుల ఉల్లంఘన అని తెలిసినరోజు మనందరికి అవగాహన ఉన్నట్లు అవుతుంది. ఇవాళ ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టినా బాలబాలికలకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం.
మోహన్..
బాలల హక్కుల గురించి మాట్లాడటం అంటే 45% మంది జనాభా హక్కుల గురించి మాట్లాడటం. కానీ దీనిని మనం విస్మరి స్తున్నాం. ప్రత్యేక దృష్టిపెట్టి వారి హక్కులు కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 1992లో అంతర్జాతీయ ఒడంబడికలో దేశంలోని పిల్లలందరిని రక్షిస్తాం అని అన్ని దేశాలు సంతకం చేశాయి. దానిలోని 54 ఆర్టికల్స్‌లో ప్రధానమైనది జీవించే హక్కు. నేటి సమాజంలో స్కానింగ్‌ల పేరు మీద బాలికలను పిండంగా ఉండగానే చంపేస్తున్నారు. రూ.500 పెడితే పిల్లలను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. మన సమాజంలో తరుచు చూస్తేనే ఉన్నాం. పౌష్టి కాహారం బాలలకు అందడంలేదు. బాలలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ప్రస్తుత బడ్జెట్ వల్ల ప్రాథమిక విద్యకు ఎలాంటి ఉపయోగంలేదు. ప్రాథమిక విద్యను హక్కుగా చేయాలని కోరుతున్నాం. అనేకసార్లు ఉద్యమాలు చేసాం. 1 సం॥ల లోపల పిల్లలకు హక్కులు కల్పించి చదువు చెప్పించాలి. 1 సం॥ వారిని కూడా బాలలుగా పరిగణించాల్సి ఉండగా, 514 సం॥లుగా చట్టం చేసారు. వారికి కూడా న్యాయం చేయడం లేదు. బడి ఈడు పిల్లలు బడికి వచ్చి చదువుకోవాలి అనేదాన్ని నెరవేర్చడంలో మన ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. కొఠారి కమిషన్ కామన్‌స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రతిక్షణం బాలల గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వం వారికి పిల్లలపై ఎలాంటి విధానం ఉందనే విధాన ప్రకటన చేయాలి. కేజీ పీజీ విద్య అనేది ఉచితంగా అవసరం లేదు, 1 ఇంటర్ వరకు చాలు అని మేం డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్ లేదనే సాకుతో నేడు పిల్లల భవిష్యత్‌ను గాలికొదిలేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జువెనల్ జస్టిస్ ఆక్ట్‌ను 1 సం॥ నుంచి16 సం॥లకు కుదిస్తోంది. 4 కోట్లమంది పిల్లల హక్కులు కాలరాస్తున్నారు. ఈ విధంగా కుదిం చడం కాకుండా దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ర్టంలో డీఈ వోలు, ఎంఈవోలు సరిపడా లేరు. హెచ్.ఎం.లు లేరు. డైట్ కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చేవారు లేరు. అక్కడ తగిన సౌకర్యాలు లేవు. నారాయణ ఖేడ్ లో ఓ బాలిక రోజూ 16 కి.మీ. నడిచి స్కూల్‌కు వెళుతుంది. దీని గురించి అడిగితే ఆమె బాధతో ఏడ్చింది. దాదాపు సం॥ కాలంలో పాఠశాల పనిదినాల్లో 2000 కిలోమీటర్లు ఆమె నడిచి వెళ్లింది. ఇ లా అనేక గ్రామాలు ఉన్నాయి. 12000 కిలోమీటర్లు తిరిగిన బాల లను పట్టించుకోరు కానీ 1000, 200 కిలోమీటర్లు తిరిగిన వారు ముఖ్యమంత్రులు అవుతున్నారు. విద్యా హక్కు చట్టం వచ్చాక 4 సం॥లకు ఎస్‌పిసిఆర్‌ను పెట్టారు. దీంట్లో ఒక చైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులు ఉండాలి. కానీ దీంట్లో మన రాష్ర్టంలో కమీషనరే లేడు. ఇలాంటి కమిషన్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి. దీనికి ఛైర్మన్‌ను నియమించాల్సిందిగా నివేదించినా పట్టించేకునే వారే లేరు. బాల కార్మికులు ఎంతమంది ఉన్నారో తేల్చి వారికి విద్యాహక్కు కల్పించాలి. ప్రభుత్వాలు ఇవాళ బాలకార్మికులే లేరనే నివేదికలు ఇస్తున్నాయి. పిల్లలకు సరిపడ ఉపాధ్యాయులను నియమించి తగిన బడ్జెట్‌ను కేటా యించాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లు 90% స్కూలల్లో బాలికలకు టా యిలెట్లు లేవు. విద్యార్థులు తగినంతగా లేరనే సాకుతో హేతుబద్ధీకరణ పేరిట స్కూళ్లనే మూయలనే ప్రభుత్వాల ఆలోచన సరికాదు. ఇవాళ స్కూళ్ళలో 4% మాత్రమే హాజరు శాతం నమోదు అవుతుంది. మిగితావారంత పొలాల్లో పనిచేసుకుంటున్నారు. మధ్యాహ్న భోజ నంలో పౌష్టికాహారం అందించడంలేదు. విద్యార్థులకు సరైన బట్టలు లేవు. పిల్లలను గౌరవించని, పట్టించుకోని ఏ ప్రభుత్వం కూడా ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు. ప్రజలుగా మనందరం కూడా మన వంతు బాధ్యతగా బాలల హక్కులను కాపాడాలి.
ఫిిలిప్స్…
మనందరం రాష్ర్టంలో అందరి గురించి మాట్లాడతున్నాం. కానీ పిల్లల గురించి మాట్లాడటంలేదు. జనాభాలో 40%గా ఉన్న పిల్లలకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదా? మహిళలకు రక్షణకు కల్పించి నట్లు పిల్లలకు ఎందుకు కల్పించడంలేదు. ఇవాళ పిల్లలపై కూడా అత్యాచారాలు జరుపుతున్నటువంటి దుర్భర పరిస్థితి ఉంది. మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతే మనం ఎవరిని రక్షించగలం. మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అందరి బాలలను అలాగే చూస్తు ర క్షణ కల్పించాలి. ఇవాళ బాల్యం ప్రతిరోజు ప్రమాదంలో పడిపోతుంది. కొత్త రాష్ర్టంలో పిల్లలకు కావాల్సిన రక్షణలు కొత్తగా మనం ఏర్పరు చుకోవాలి. అంగన్‌వాడీలో ప్రీ ప్రైమరీ చదువు జరగడంలేదు. ప్రీప్రైమరీ విద్యను సరిగా నిర్వహించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. 196 సీఎల్‌పీఆర్‌ఐ చట్టం కింద బాలకార్మికులను పని మాన్పించి బడిలోకి చేర్పించాలి. విదేశాల్లో బడిఈడు పిల్లలు బయట కనబడితే ఏదో తప్పుగా భావిస్తారు. అలాంటి వ్యవస్థ మన రాష్ర్టంలో రావాల్సిన అవసరం ఉంది. పిల్లలపైన లైంగిక వేధింపులు దేశవ్యాప్తంగా జరు గుతున్నాయి. మహిళల రక్షణ ఇస్తున్నట్లుగానే బాలలకు కూడా రక్షణ కల్పించాలి. దీనిని ఎందుకు ప్రభుత్వాలు మరుస్తున్నాయి అని ప్రశ్నిం చాలి. పిల్లలపై ఎలాంటి వేధింపులు జరగకుండా ఉన్న రాష్ర్టంగా ఉండాలి. మన పిల్లలపైన ఎలాంటి ప్రేమ కనిస్తామో అందరి పిల్లలపైన అలాంటి ప్రేమనే చూపించాలి. ప్రభుత్వాలు పిల్లల భద్రతపై హామీ ఇవ్వాలి. ప్రతీ ప్రాంతంలో పోలీసులకు వారి పరిధిలోని పిల్లలు, మహిళలపైన వేధింపులు జరగకుండా రక్షించాలి అని మనం సూచిం చినా ఈ ప్రభుత్వాలు మాత్రం అలా సూచించడంలేదు. ఇవాళ పిల్ల లను స్కూళ్ళకు పంపిచాలంటే భయపడుతూ పంపిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమాజం అవసరం మనకు ఉంటుందా? సురక్షిత తెలంగాణ మనకు కావాలి. రక్షణ లేకపోతే బంగారు తెలంగాణ ఏర్పడినట్లు కాదు. విద్యా హక్కు వారికి హక్కుగా భావించేలా ప్రచారం చేయాలి. ప్రతి ఊళ్ళో స్కూల్‌ను ఏర్పాటుచేసి స్థానికంగా వారికి చదువును అందించాలి. వారికి ఇంటి దగ్గర చదువుతున్నాం అనే అనుభూతిని ఇవ్వాలి. 56 స్కూళ్ళు కలిపి ఒక స్కూలుగా ఏర్పాటు చేయటం తప్పు. 1 కి.మీ. లోపు స్కూలు ఏర్పాటు చేయాలి. అన్ని స్కూళ్ళలో విద్యాప్రమాణాలు తగ్గాయి. దీంట్లో ప్రైవేటు పాఠశాలలు ఏం తీసిపోవటం లేదు. అంగన్‌వాడీ సెంటర్ అని బోర్డు ఉంటుంది. కానీ టీచర్ రావటంలేదు. వారానికి ఒకసారి వస్తారు. గర్భిణులకు, 5 సం॥లోపు పిల్లలకు పౌష్టిక ఆహారం అందుబాటు లోకి తేలేక పోతున్నారు. జీతాలు తీసుకుంటూ పనిచేయకపోవటం దారుణమైన పరిస్థితి. పేద ప్రజలకు, పిల్లలకు పౌష్టిక ఆహారం అందిం చాలి. ప్రతిరోజు హైదరాబాద్‌కు 20మందికి పైగా పిల్లలు పారిపోయి వస్తున్నారు. దీనికి కారణం బ్రోకర్లు, వ్యాపారాలు. ఇలాంటి వారిని బాల కార్మికులుగా చేస్తున్నారు. విద్యా వ్యవస్థను మార్చుకోవాలి. బంగారు బాల్యం కల్పించి వారికి రక్షణ కల్పించేలా వారి హక్కులను కాపాడాలి. విద్యార్థులు పశ్నించేటు వంటి సమాజం ఇవాళ మన రాష్ర్టంలో రావాలి. మన పిల్లలు మన భవిష్యత్ అనే నినాదంతో ప్రభుత్వం మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి. పిల్లల అనుభవాలు అభిప్రాయాలు పంచుకొన్ననాడే బంగారు తెలంగాణ సాధ్యమవు తుంది. అది ఈ వేదిక ద్వారా జరుగుతుందని ఆశిస్తున్నాను.
ఆర్.వెంకట్‌రెడ్డి…
లెక్కల గారడి ద్వారా ప్రభుత్వాలు మాయ చేస్తున్నాయి. తప్పుడు నివేదికలు ఇచ్చినవారిని శిక్షించాలి. పిల్లలకు న్యాయం చేయాలి. పిల్లలు వారికి కావాల్సింది వారు అడిగి తీసుకుంటారు. వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను మనం, మన ప్రభుత్వం కాపాడాలి. తల్లిదండ్రులు కూలీనాలీ చేసి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. వారికి డబ్బు ఉండికాదు, ఒకపూట పస్తులుండి పంపిస్తున్నారు. అలాంటి వారి తపనను గుర్తించి బాల్యాన్ని ప్రభుత్వం రక్షించాలి. వారి ఆకాం క్షను నెరవేర్చాలి. రైతుకూలీలను అడిగితే మా పిల్లలు మాలాగే ఉం డకూడదు అని ఒకే ఒక్క సమాధానం చెబుతారు. దీనిని మనం గ్రహించాలి. ఇవాళ తెలంగాణలో పుట్టాలంటే పిల్లలు సంశయం చెందకుండా ఉండేలా మనం ప్రజాస్వామికంగా ఉండాలి. పిల్లలకు న్యాయం చేయడం ద్వారా అందరికి న్యాయం చేసిన వాళ్ళం అవు తాం. పాఠం చెప్పడం కంటే ముందు పిల్లలకు మనం మర్యాదలు చేయాలి. సెలవుల తరువాత తెరిచిన బడిని ఆడపిల్లలతో ఊడ్పిస్తే మర్యాద తప్పినట్లే, టాయిలెట్లు లేకపోతే మర్యాద తప్పినట్లే అని గ్రహించాలి.
రహీమోద్దీన్
బాలల హక్కులకోసం స్వచ్చంద సంస్థలు చేస్తున్న కృషి, ఇలాంటి చర్చల ద్వారా మీరు చేసిన ప్రతి పాధనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి నేను సదాకృషి చేస్తాను. ప్రభుత్వ అధికారుల అలసత్వం సమన్వయ లోపం కారణంగా ఇవాళ మనం బాలల హక్కులపై మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యం పిల్లపట్ల గౌరవం లేకపోవటం వలన యుఎన్‌సిఆర్‌సి చట్టం మార్గదర్శకాలు ఇవాల మారుమూల ప్రాంతానికి చేరడం లేదు. కాని అదే ఏదైనా వస్తువు వస్తే మాత్రం అన్ని ప్రాంతాల్లోకి చేరుతుంది. మన ప్రభుత్వ వైఫల్యం ఎలా ఉందో ఈ ఉదా॥ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం పిల్లలకోసం ఎం చేయాలో ప్రజల నుంచి సామాజిక సంస్థల సలహాలు సూచనలు ఇవ్వాలి. బాలల హక్కులకు మీరు కలిసిరావాలి. 75% వరకు పిల్లలపై వేధింపులు స్కూళ్ళలోనే జరుగుతున్నాయి. ఇవాళ పాఠశాల్లో పిల్లలకు రక్షణ ఇవ్వడం కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేసుకోలేక పోతున్నాం. టాయిలెట్లు లేకపోవడం వల్ల రోడ్లపైన విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలపై వేధింపులు జరిగినా, విద్యావ్యవస్థలో లోపాలు ఉన్నా మాకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి తక్షణం చర్యలు తీసుకుంటాం. విద్యాహక్కు చట్టాన్ని కాపాడతాం, పిల్లల విద్యాహక్కులు కాపాడటానికి మా కమిషన్ తరుఫున అన్నిరకాల సేవలు అందిస్తాం.
సభికుల ప్రశ్నలు సూచనలు:
ప్రశ్న : ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? ఒక ఎంపీ ఈ వాఖ్య చేశారు. దీనిపై విశ్లేషణ చెప్పండి?
జవాబు: ఏ ప్రభుత్వాలు వచ్చిన ఈ పరిస్థితి మాదు. ఎందుకంటే ప్రభుత్వ పునాదులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. విద్యా వ్యవస్థ మొత్తం 23% బడ్జెట్ మించడంలేదు. దీంతో ప్రైవేట్ సెక్టార్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది.
మురళి..
కనీస విద్యను అందించడానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఒక చట్టం ద్వారా దీనిపై ముందుకు వెళ్ళాలి. విద్యావ్యవస్థలోకి పిల్లలను పంపించడం ద్వారా తాము ఎలా బతకాలి అనే ఆలోచనలు వారు చేయగలరు కాబట్టి ఇలాంటి చట్టాల్ని చేయగలిగితే పిల్లలకు న్యాయం చేసిన వాళ్లం అవుతాం. ఎంతోమంది కూలీ పనిచేస్తూ వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి న్యాయం చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నాయో ఆలోచించాలి. దేశంలోఎంతో మంది పిల్లలు తప్పిపోతున్నారు. ఇలాంటి పిల్లలను బిచ్చగాళ్ళుగా, వీధిబాలలుగా, వికలాంగులుగా చేస్తున్నారు. ఇలా జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రభుత్వ విద్యా విధానం అందించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే, చదివిన అనాథ పిల్లలకు వారి భవిష్యత్‌కు, బ్రతుకుతెరువుకు ఎలాంటి హామీ ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. చట్టంలో మార్పులు చేసి వారికి న్యాయం చేయాలి. ప్రభుత్వ పాఠశాల్లో మార్పు రావాలంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి. దీంతో ఆ పరిస్థితి వారికి అర్థం అవుతుంది. మన విద్యావ్యవస్థలో మనలో ముందుగా మార్పు రావాలి. అప్పుడే సామాజిక స్పృహతో విద్యావంతులంతా మెలగాలి. బాలల హక్కులు కాపాడాలి. కేజీ పీజీ కాకుండా 112వ తరగగతి వరకు నిర్బంధ విద్య అమలు పరిచి దాని పటిష్టగా చేయాలి. బాలల హక్కులు కాపాడాలని వీరికి విద్య అందాలని కృషిచేస్తున్న ఎం.వి. ఫౌండేషన్‌కు అభినందనలు. రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ గీతదాటామని పోలీసులు ఫైన్ వసూలు చేస్తారు. కానీ అదే సిగ్నల్ దగ్గర రూపాయి, రెండు రూపాయిల కోసం అడుక్కుంటున్న బాలలు ఈ వ్యవస్థకు కానరావటలేదు. ఈ పరిస్థితి మారి అందరూ సామాజిక కోణంలో ఆలోచించి బాలల హక్కులకు కృషి చేయాలి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు అనేకం నడుస్తున్నాయి. దీని గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకున్న నాథుడులేడు. కనీసం చదువుకున్న తల్లిదండ్రుల్లో కూడా బాలల హక్కుల పట్ల, వారి అభిప్రాయాల పట్ల కనీస అవగాహన ఉండటం లేదు.
మల్లీశ్వరి (జామై ఉస్మానియా టీచర్)
ప్రభుత్వ పాఠశాలల్లో పేదవారి పిల్లలు ఉంటారు అనే భావనతో వాటిని చిన్నచూపు చూస్తున్నారు. ప్రజల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఏహ్యమైన భావన ఏర్పడింది. పిల్లల్లో ఆడ, మగ అనే భావనతో వారిని చూడకూడదు. పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు గొడవలు పడటం వలన ఆ ప్రభావం పిల్లలపై పడి వారు తప్పుదారి పడుతున్నా రు. అధికారులు స్వచ్ఛమైన మనస్సుతో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. సామాన్యు లుగా మన సహకారం అందించాలి. రోజుకు 20 మంది పిల్లలు పారిపోయి పట్టణానికి రాకుండా ఎందుకు చేయలేకపోతున్నాం? వారికి వారి ప్రాంతంలో ఎందుకు చదువు చెప్పలేకపోతున్నాం? ఇది అందరం ఆలోచించాలి. ప్రభుత్వం ఏర్పడింది కాని కార్య నిర్వాహక వర్గం ఇంకా ఏర్పడలేదు. ఇదిత్వరలో ఏర్పడాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం.
అంబేద్కర్ (ఓ.యు. రీసెర్చ్ స్కాలర్)
గ్రామీణ ప్రాంతాల్లో బాలబాలికల్లో వివక్ష చూపుతున్నారు. బాలురను ప్రైవేట్ పాఠశాలల్లోకి పంపిస్తే బాలికలను ప్రభుత్వ పాఠశాలల్లోకి పంపిస్తున్నారు. నల్గొండ జిల్ల జాజిరెడ్డి పల్లిలో 67 తరగతుల్లో బాలికలు పత్తి ఏరటానికి వెళ్తున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు అందరూ పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల పిల్లలు ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు? ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ సహకారం చాలా ఉంది. నల్గొండ జిల్లా జాజిరెడ్డి పల్లి మండలంలో మోడల్ స్కూలు ఇంకా ఏర్పాటు కాలేదు. విద్యాశాఖమంత్రి జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా? ఈ వేదిక ద్వారా మాట్లాడిన విషయాలు ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం అవగాహనకు వచ్చి న్యాయాన్ని చేస్తుందని భావిస్తున్నాను.
మురళీ:…
ప్రభుత్వానికి బాలల హక్కులపై, విద్యాంస్థలకు సంబంధించిన వాటిపై సూచనలు, సహకారాలు ఇవ్వటానికి సిద్దంగా ఉన్నాం. పిల్లల విషయంలో ప్రభుత్వం ఆలోచించాని కోరుతున్నాం.
రహిమొద్దీన్:..
రోడ్లమీద ఆడుకుంటున్న పిల్లలకు సంబంధించిన అంశం మా దృష్టికి వచ్చింది. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం. స్కూల్‌లో జరిగే దాడులు, బాలకలపై దాడులపై ఏరియా పోలీసులు చర్యలు తీసు కోవాలని ప్రభుత్వం సూచించింది. రక్షణ కోసం పోలీసులు ముందుకు రావాలని చెప్పింది ప్రభుత్వం. సామాజిక వేత్తలు ప్రజలు అందరు కమిషన్ దృష్టికి మీ ప్రాంతంలోని ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల వివరాలు సమస్యలు, బాలల హక్కులపైన సంబంధించినవి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటాం.
అందరు కలిస్తేనే బాలల హక్కులు విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురాగలం కాబట్టి అందరూ భాగస్వాములు అయి ముందుకు సాగాలి. ప్రతి రాజకీయ పార్టీలోనూ అన్ని కులాలకు వర్గాలకు ఉన్నట్లుగానే బాలల కోసం పనిచేస్తే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై ఆ పార్టీలు ఆలోచించాలి. దీనిద్వారా వాళ్ళ ద్వారా మనందరం కలిసి పనిచేయగలం. ప్రతి స్కూళ్లో 10 తరగతి పిల్లలను ఒక గ్రూప్‌గా చేసి ఈ వ్యవస్థపై వారి ప్రాంతంపై వారికి తెలియజేస్తే మంచి ఫలితం వస్తుంది. ప్రశ్నించే తత్వాన్ని పిల్లలకు చిన్ననాటి నుంచే అలవరచాలి.
దక్కన్ న్యూస్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *