బృహతమ్మ బ్రతుకమ్మ బతకమ్మ

2వ అక్టోబరు, 2014 నాడు తొలిసారి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఆద్వర్యంలో తెలంగాణ ప్రాంతమంతా బతుకమ్మ పండుగను కనివిని ఎరుగని రీతిలో, రాజఠీవితో ప్రజలంతా మమేకమై జరుపుకొన్నారు. ఇప్పటివరకు ఈ పండుగ స్త్రీలు పండుగగా, పూలపండుగగా ప్రఖ్యాతి చెందింది. తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను రాష్ర్ట పండుగగా గుర్తిం చడం తెలంగాణ చరిత్రలో మరుపురాని విషయం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా, వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకొని, ప్రపంచానికి ఈ పండగ గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఇప్పుడిదొక బృహత్ పండుగ.
ఇప్పటి వరకు బతుకమ్మ పండుగ మూలాలేమిటో వెలుగులోకి రాలేదు. ఈ విషయాన్ని చరిత్రకారులు, సాహీతీవేత్తలు ధ్రువీకరించారు. గత కొన్ని శతాబ్దాలుగా బతుకమ్మపై ఎన్నో జానపద గాథలు, పాటలు తెలంగాణ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నవి. తెలంగాణ ఉద్యమ సంధర్భం గా వినూత్న పద్దతుల్లో మరెన్నో పాటలు, జానపద గేయాలచే ప్రజల ముందు తేవడం జరిగింది.
కొందరు సాహితీవేత్తలు, ఈపండుగలో జైనమత అడుగుజాడల ను, కాకతీయులతోనున్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాని అవన్ని ప్రజామోదం పొందలేదని చెప్పవచ్చు. కాకతీయ ప్రభువులు కొంతకాలం సమస్తాంధ్రదేశాన్ని పాలించినా, ఈ పండుగ ఒక తెలంగాణ ప్రాంతానికే పరిమితం అవ్వడం అర్ధంగాని విషయం. ఈ పరిశోధన వ్యాసంలో బతుకమ్మ పండుగ మూలాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది.
అసలు మూలాలను కనుక్కోవాలంటే, వేయిఏండ్ల పూర్వం రాజ్య మేలిన పశ్చిమ చాళుక్యుల, చోళుల చరిత్రలను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
పశ్చిమచాళుక్యులు :
క్రీ.శ. 973లో రాష్ర్టకూటుల సామంతుడైన రెండవ తైలపుడు, రాష్ర్టకూటరాజైన రెండవ కరుక్కున్ని ఓడించి పశ్చిమ చాళుక్య రాజ్యస్థాప కుడయ్యాడు. అతని రాజధాని మాన్యకటకము (మానిఖేడ్). ఇప్పటి కర్ణాటక రాష్ర్టంలోని ఉత్తర ప్రాంతం, ఈనాటి తెలంగాణ ప్రాంతం ఆతని రాజ్యంలో నుండేవి. దక్షిణంలో తుంగభద్ర నది సరిహద్దు. తుంగభద్రకు దక్షిణప్రాంతమంతా చోళరాజ్యం. రెండవ తైలపుడు క్రీ.శ. 997లో మరణించగా, అతని పెద్దకుమారుడైన సత్యాశ్రయుడు రాజ్యాధి కారాన్ని చేపట్టాడు. ఈతని పరిపాలనాకాలంలో క్రీ.శ.10031004 ప్రాంతంలో, ఈనాటి బీజాపూర్ జిల్లాలోని దోనూరు వద్ద సత్యాశ్రయునికి, చాళుక్యరాజైన రాజరాజచోళుని సైన్యానికి మధ్య గొప్ప యుద్దం జరిగింది. రాజరాజచోళుని సైన్యానికి యువరాజైన రాజోంద్ర చోళుడు ఆధిపత్యం వహించాడు.
చోళులు:
రాజరాజ చోళుని పరిపాలనా కాలం క్రీ.శ. 951014. రాజరాజచోళుని పూర్వీకుల వంశవృక్షం క్రింది విధంగా ఉంది.
విజయాలయ చోళుడు (క్రీ.శ.471)
మొదటి ఆదిత్యచోళుడు (క్రీ.శ.71907)
మొదటిపరాంతక చోళుడు(క్రీ.శ.907950)
గంఢరాదిత్యచోళుడు (క్రీ.శ.950957)
అరింజయ చోళుడు (క్రీ.శ.956957)
2వ పరాంతక సుందరచోళుడు (క్రీ.శ.957970)
ఉత్తమ చోళుడు (క్రీ.శ.97095)
మొదటి రాజరాజచోళుడు (క్రీ.శ.951014)
ఉత్తమచోళుడు, మొదటిరాజరాజచోళుడు, రెండవ పరాంతకచోళుని కుమారులు, చోళుల వంశవృక్షంలో ప్రథమంగా ‘రాజరాజ’ అనే పదాలు, మొదటి రాజరాజ చోళుని పేరులో కన్పించడం గమనించాల్సిన విషయం. ఈ పరిశోధనలో ఈ ‘రాజరాజ’ పదాలను మూలాలుగా గుర్తించడం జరిగింది.
రెండవ పరాంతక సుందరచోళుని (క్రీ.శ.957970) పరిపాలన కాలంలో చోళుల రాజ్యం చాలా చిన్నది. ఈతని కాలంలో చోళరాజ్యంపై రాష్ర్టకూటుల దండయాత్రలలో, చోళరాజ్యం చాలా దెబ్బతింది. ఆ సమయంలో ఈనాటి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు పరిపాలించేవారు. రెండవపరాంతక సుందర చోళుని పరిపాలనా కాలంలో వేములవాడ రాజ్యాన్ని వ్యాగరాజు (క్రీ.శ. 955965) పరిపాలించేవాడు. వేములవాడలో అప్పటికే రాజేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ది చెందింది. తెలంగాణా ప్రజల్లో ఇష్టదైవమై పేరు ప్రఖ్యాతి చెందింది. చాలా మహిమలు గల్ల దేవునిగా పూజింప బడ్డాడు. రెండవ అరికేసరి (క్రీ.శ.930955)చే వేయించబడ్డ దాన శాసనంలో ఈ దేవాలయ ప్రసక్తి ఉంది. అట్టి దాన శాసనంలో పేర్కొన బడ్డ సాక్షులలో, రాజేశ్వర దేవాలయ స్థానపతి గూడా ఉన్నాడు. (.=. చీూ.170 శీ 1966) కావున ఇబ్బందుల్లోనున్న రెండవ పరాంతక సుందరచోళుడు వేములవాడ రాజేశ్వరదేవుని భక్తుడై యుండాలి. కావున తన మూడవకొడుకు పేరు రాజరాజచోళుడని నామకరణం చేసి యుండవచ్చు. రారాజచోళుడు క్రీ.శ.947లో జన్మించాడు. రెండవ పరాంతక సుందరచోళుని రాజ్యంపై రాష్ర్టకూటులు దండయాత్రలు కొనసాగించినా, రాష్ర్టకూట సామంతులైన వేములవాడ చాళుక్యులతో మంచి సంబంధాలు ఉండి ఉండవచ్చు. కావున వేములవాడ రాజేశ్వరున్ని ఎటువంటి నిరోధం లేకుండా, దర్శంచే అవకాశం రెండవ పరాంతక చోళుడు పొందియుండాలి.
రాజరాజ్వేరదేవాలయ పూర్వపరాలు:
రెండవ నర్సింహుడు (క్రీ.శ.915930) వేములవాడ చాళుక్యరాజ్యాని పరిపాలించాడు. ఈతనికి ‘రాజాదిత్య’ అనే బిరుదుకలదు. ఈయన రాష్ర్ట కూటరాజైన జగత్తుంగుని కుమార్తె ఐన జాకవ్వెను వివాహ మాడాడు. ఈతని కుమారుడే రెండవ అరికేసరి. మొదటి రాజరాజేశ్వరా దేేవాలయము రెండవ నర్సింహుడుచే నిర్మించబడి, అతని బిరుదైన ‘రాజాదిత్య’ పేరుతో రాజేశ్వర దేవాలయంగా పిలువబడింది.
వేములవాడలోనున్న మరొక ముఖ్యదేవాలయం బడ్డెగేశ్వరాలయం (బీమన్నగుడి) దీన్ని బడ్డెగ నిర్మించాడు. విక్రమార్జున విజయం ప్రకారము బడ్డెగుడు, రెండవనర్సిహుని తాత. బడ్డెగుని కుమారుని పేరు రెండవ దుగ్దమల్లడు. పర్బని తామ్రపత్ర శాసనాల ప్రకారం కూడా బడ్డెగ, రెండవ నర్సిహునితాత.బడ్డెగుని కుమారుని పేరు రెండవయుద్ధమల్లుడు. రెండు శాసనాల ప్రకారం బద్దెగుడు, రెండవ నర్సింహుని తాతయే. ఈ బీమన్న గుడి ఇప్పటికి నిర్మాణంరీత్యా దృఢమైన నిర్మాణం. ఇందులో ఎత్తైన నల్లరాతి శివలింగం కలదు.
ఈ దేవాలయ నిర్మాణం తర్వాత నిర్మించబడిన రాజేశ్వర దేవాలయం దీని మాదిరిగానే గొప్ప శివలింగం గల దేవాలయమై ఉం టుంది.
ప్రస్తుతం వేములవాడలోనున్న దేవాలయనిర్మాణానికి, దాదాపు క్రీ.శ. 50 95 సంవత్సరాల మధ్య నిర్మింపబడ్డిన బీమన్నగుడితో ఏలాంటి పోలికలు కనబడవు. ఇప్పుడున్న వేములవాడ రాజేశ్వరాలయం పశ్చిమచాళుక్యుల సామంతుడైన రాజాదిత్యునిచే నిర్మింపబడింది. ఈ విషయం క్రీ.శ. 103 డిశంబరు 25న వేములవాడలో కళ్యాణి చాళుక్యరాజైన ఆరవ విక్రమాదిత్యుని (క్రీ.శ. 10761126)చే వేయబడిన శాసనం ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం, రాజేంద్రచోళునిచే ధ్వంసం చేయబడ్డ స్థలంలోనే నిర్మింపబడి యుండవచ్చును. ఈ రాజా దిత్యుడు, చోళరాజైన రాజేంద్రచోళుని కాలంలోపశ్చిమచాళుక్యుల పక్షేన చోళదేశముపై జరిగిన దండయాత్రలో పాల్గొన్నాడు. ఈతని బిరుదాల్లో చోళ కటక సురకర, ‘కాంచిపుర ప్రభల బల పన్నగ వైనతేయ’ అనేవి కలవు.
ఇప్పుడున్న రాజరాజేశ్వరాలయం, రెండవ నర్సింహుడు నిర్మించిన దేవాలయం కాదని స్పష్టంగా అర్థమవుచున్నది. అయితే, రెండవ నర్సిం హుని పరిపాలనా కాలంలో నిర్మించిన దేవాలయమెక్కడ? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈప్రశ్నకు వచ్చే జవాబులోనే బతుకమ్మ మూలాలను వెతికే ప్రయత్నం ఈ పరిశోధనలో జరిగింది.
చాళుక్య చోళులయుద్దం :
ఈ యుద్దం క్రీ.శ. 10031004లో కర్ణాటకలో దోనూరు ప్రాం తంలో పశ్చిమచాళుక్య సత్రాశ్రయునికి, రాజేంద్రచోళునికి మధ్య జరిగిన గొప్ప యుద్దం. ఇది రాజరాజచోళుని (క్రీ.శ.951014) పరిపాలనా కాలంలో, యువరాజైన రాజేంద్రచోళుని సైన్యాధిపత్యంలో చాళుక్య దేశంపై జరిగిన దండయాత్ర.
చాళుక్య సత్యాశ్రయుని వొట్టూరు (దార్వాడ్) శాసనం (క్రీ.శ. 1007) ద్వారా రాజేంద్రచోళుడు 9,00,000 సైన్యంతో బీజాపూర్ జిల్లాలోని దోనూరు వరకు దండయాత్రచేసి, చాళుక్య రాజ్యాన్ని దోపిడి చేసి, స్త్రీలను, పిల్లలను, బ్రాహ్మణులను నిర్ధాక్షిణ్యంగా హత్యచేసి, యువ తులను మానభంగాలుచేసి, జాతిని విజాతిగా చేసాడని తెలియు చున్నది. ఈ దండయాత్ర గురించి, అందులో జరిగిన నేరాలను గురించి చోళుల శాసనాల్లో గూడా పేర్కొనడం జరిగింది. ఈచారిత్రక సంఘటన్ని తిరువలనాడు రాగిరేకుల శాసనాల్లో, సంస్కృత శ్లోకాల రూపాల్లో నిక్షిప్తం చేయబడ్డాయి. ఈ దండయాత్రల్లో పశ్చిమ చాళుక్యుల రాజధాని ఐన మాన్యకేటాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. తూర్పున నున్న కొల్లిపాక (నే టి కొలనుపాక)ను, దాని దుర్గాన్ని చోళులకు మద్దతుగా దండెత్తిన వేంగీ చాళుక్యులు (ఈనాటి ఆంధ్రప్రాంతం పరిపాలించిన తూర్పు చాళుక్యులు) సర్వనాశనం చేసారు. బహుశ చోళసైన్యాలు వేములవాడ ప్రాంతం వరకు దండెత్తియుండవచ్చును. వేములవాడ రాజరాజేశ్వరు (బృహదీ శ్వరు)ని మహత్యాన్ని ఎరిగిన రాజేంద్రచోళుడు, లింగరూపంలో నున్న రాజేశ్వరున్ని, దేవాలయ విధ్వంసానంతరం కంచినగరానికి తర లించి, తన విజయానికి జ్ఞాపికగా తన తండ్రియగు రాజరాజచోళునికి బహుక రించినట్లు అర్ధమవుచున్నది. ఆ లింగానికి (బృహదీశ్వరునికి) తంజా వూరులో క్రీ.శ.1006లో దేవాలయ నిర్మాణం ప్రారంభించి, క్రీ.శ. 1010లో లింగప్రతిష్టాపన, గోపుర కలశాభిషేకాలు నిర్వహించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుచున్నది. రాజరాజచోళుడు, బృహదేశ్వరునికి కృతజ్ఞాతా పూర్వకంగా బంగారు కమలాలను సమర్పించాడట. ఈ బృ హదీశ్వరాలయాన్ని, చాళుక్యదేశంపై జరిగిన దండయాత్రలో దోచుకున్న ధనంతో నిర్మించామని తమిళ శాసనాలల్లో, చోళరాజులు ప్రకటించుకు న్నారు. వేములవాడ బీమన్నగుడిలో నున్న శివలింగం, బృహదీశ్వరాల యంలో శివలింగాల పోలిక ఒక మాదిరిగా ఉంటుంది. ఇప్పుడీ దేవా లయం దక్షిణ భారతదేశంలో ఎత్తైన విమానం గల దేవాలయం. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
రాజరాజచోళుడు, చోళరాజవంశంలో ప్రముఖుడు, ఈతనికెన్నో బిరుదాలు కలవు. అందులో ఒకటి ‘తెలింగకుల కాలుడు’. అంటే తెలం గాణకు యమధర్మరాజన్నమాట. దోనూరు యుద్దంలో చోళసైన్యాలతే జరపబడ్డ విధ్వంసకాండను తలుచుకుంటే, నిజంగా రాజరాజచోళుడు యమధర్మరాజును మరిపిస్తాడు. చేసిన నేరాలను గర్వంగా శాసనాల్లో నిక్షిప్తపరచిన చోళరాజుల ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
మొదటి రాజాధిరాజచోళుడు :
ఈతడు మొదటిరాజేంద్రచోళుని (క్రీ.శ.10121044) మొదటి కుమారుడు. రాజేంద్రచోళుని మరణానికి కొన్ని సంవత్సరాల ముందు పశ్చిమ చాళుక్యుల రాజధాని ఐన మాన్యభేటంపై మొదటి రాజాధి రాజచోళుడు దండయాత్ర చేశాడు. పశ్చిమచాళుక్యులు చోళరాజ్యం లోకి జరిపిన చొరబాటే దీనికి కారణం. చాళుక్య రెండవ జయసింహుడు (క్రీ.శ.1042106) ఇప్పటి కర్ణాటకలోని చోళప్రాంతాలైన నులం బావడి, గంగవాడి ప్రాంతాలలో అక్రమంగా చొరబడి వ్యవసాయదారుల నుండి బలవంతంగా పన్నులు వసూలు చేయడం జరిగింది. చోళుల సరిహద్దు స్థలాలపై దండెత్తారు. దానికి జవాబుగా చోళసైన్యాలు మొదటి రాజాధిరాజచోళుని ఆధ్వర్యంలో చాళుక్యుల కొగలి, కదంబాలి ప్రాంతా లపై దండయాత్రను సాగించారు. రాజధాని ఐన మాన్యకేతంపై కూడా దండెత్తి, రెండవ జయసింహున్ని తీవ్రంగా గాయపరచడమేగాక అతని భార్యను గూడా స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈనాటి చిత్రదుర్గ ప్రాం తంలో అనేక చాళుక్యదండనాయకులు, మహాసామంతులు ప్రాణాలను కోల్పోయారు. ఈ యుద్ధాన్ని చరిత్రకారులు గొప్ప యుద్ధంగా అభివర్ణిం చారు.
మొదటి రాజాధిరాజ చోళుడు, తన యుద్ధ కౌశల్యాన్ని, ఈ యుద్దం లో సాధించిన ఘన విజయం ద్వారా తండ్రికి తెలియజేశాడు. తన తండ్రిని సంతోషపెట్టుటకై, మొదటి రాజాధిరాజు (విజయ రాజేంద్రుడు) చాళుక్యరాజం నుండి రెండు నిలువెత్తు ద్వారపాలకుల విగ్రహాలను తమ రాజధాని ఐన గంగైకొండ చోడపురానికి తరలించి, తన తండ్రికి బహుమతిగా సమర్పించాడు. ఇప్పటికి ఒక ద్వారపాలకుని విగ్రహం, మూడవ కులోత్తుంగునిచే తిరుభవనంలో నిర్మించబడిన ‘శరభేశ్వర’ దేవాలయంలో ఉంది. మరొక విగ్రహం తంజావూరు బృహదేశ్వరాల యం లోని ప్రదర్శనశాలలో ఉంది.
ఈ సంఘటను బట్టె, వేయిసంవత్సరాలుగా నిక్షిప్తంగానున్న ఒక చారిత్రక సత్యానికి రూపకల్పన చేయవచ్చు. మొదటి రాజాధిరాజచోళుడు, తన తండ్రి ఐన రాజేంద్రచోళునికిచ్చిన ద్వారపాలకుల బహుమతి వెనుక అంతకు పూర్వం తన తండ్రి ఐన రాజేంద్రచోళుడు తన తాత ఐన రాజరాజచోళునికి బహుమతిగా అర్పించిన వేములవాడ రాజ రాజేశ్వరుని (బృహదేశ్వరుని) ఉదంతం స్ఫూర్తి అయిఉంటుంది.
చోళులు ద్రావిడ సంప్రదాయాలను పాటిస్తారు. రామయణంలో ప్రముఖ పాత్ర వహించిన రావణాసురుడు తాను ఎక్కడికి వెళ్ళినా శివ లింగాన్ని వెంటబెట్టుకొని అతనికి నిత్యకార్యక్రమాలను అవిఘ్నంగా జరు పుటే ప్రధానం. వేములవాడనుండి దౌర్జన్యంగా శివలింగాన్ని, తంజా వూరుకు తరలించడం, అక్కడ ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించడం చోళులకు గర్వకారణమైన విషయమైయుండాలి. కాని అదే తెలంగాణ ప్రజలకు బాధాకరమైన విషయమై, నిరసనగా సృష్టికి కారణభూతమైన శక్తి రూపాన్ని బృహతమ్మ (బతుకమ్మ)గా పూజించారు.
బృహత్ :
బతుకమ్మను బృహతమ్మ రూపాంతరంగా భావిస్తూ, తంజావూరు బృహదేశ్వరాలయానికి, బతుకమ్మకు గల సంబంధాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో, బృహత్ పద వినియోగం గురించి కొంత లోతుగా ఆలోచించడం జరిగింది.
భారత ప్రాచీన గాథలకు గాక ప్రపంచంలోని అనేక కథలకు, కావ్యాలకు, నాటకాలకు మూలమైంది ‘బృహత్కథ’ అనే సంస్కృత గ్రంథం. దీని పైశాచీనామం ‘వడ్డకహా’ దీని రచయిత గుణాఢ్యుడు. బృహత్కథ మొదట్లో క్రీ.శ. 2వ శతాబ్దంలో ‘పెరుంగదై’ పేరుతో తమిళంలోకి అనువదింపబడింది. రామాయణ, భారతాదులతో సమాన ప్రతిపత్తి గల బృహత్కథ, వాటి మాదిరిగా ప్రజల నాలుకల మీద ఉండేది. అనేక మంది కవులకు వారి కావ్య వస్తువుకు ప్రేరేపితంగా ఉండేది. పురాతన మైన ‘బృహదారణ్య ఉపనిషత్తు’ పేరులో గూడా బృహత్ పదవినియోగం కనిపిస్తుంది. కావున వెయ్యేండ్ల క్రితం ‘బృహత్’ అనే పదం బృహతమ్మ (గొప్ప అమ్మ) అనే పేరులో ఉపయోగించడం ఆనాటి ప్రజల్లో మామూలు విషయంగా భావించవచ్చు.
బృహతమ్మ ఉద్యమం :
రాజేంద్రచోళునిచే వేములవాడ బృహత్ శివలింగాన్ని తంజావూరు కు తరలించిన తర్వాత తెలంగాణ ప్రజలు తమ ఆక్రోశాన్ని ఒక ఉద్యమంగా మార్చి చోళ రాజులకు తమ నిరసనను తెలిపే ప్రయత్నమే బ్రతుకమ్మ సృష్టికి దారితీసింది. తెలంగాణ నుండి శివలింగాకారమైన శివుడు వెల్లిపోయిన తర్వాత ఇక్కడున్న పార్వతిని ఊరడించే ప్రయత్నంలో ఆమెను పూలతో (సృష్టి) మేరుపర్వంతంలా బతుకమ్మను పేర్చి, దానిపై పసుపు గౌరమ్మను రూపొందించి, దసరా సందర్బంగా తొమ్మిది రోజులు ఆటలతో పాటలతో ఆమెకు జరిగిన అన్యాయాన్ని వివిధ విధాలుగా ఆలపిస్తూ, ఆమెను పదేపదే తలస్తూ, చివరగా తిరిగి రమ్మంటూ నీళ్ళలో వదలడం ఒక పండుగగా మారింది.
భారత చరిత్రలో బహుశా మొదటిసారి, ఒక అకృత్యానికి అన్యా యానికి అహింసాపూర్వక సత్యాగ్రహాలతో నిరసనను తెలిపే ఏకైక ప్రక్రి యే బతుకమ్మ. భారతదేశంలో వెయ్యేళ్ళ పూర్వం అహింసాయుతమైన సత్యాగ్రహానికి పునాదివేసిన ఘనత బతుకమ్మ పండుగకే దక్కుతుంది.
తర్వాతి కాలంలో, కాకతీయ ప్రతాపరుద్రుని పరిపాలనలో రాజు లపై, రాణులపై జరిగిన దండయాత్రకు వ్యతిరేకంగా సారక్క, సమ్మక్క, పగిడిగిద్ద రాజులకు మద్దతుగా తెలంగాణా ప్రజలు, వారిని దేవతలుగా భావించి మరొక పద్దతి సత్యాగ్రహాన్ని వెలిబుచ్చుతూ రెండు సంవత్సరాల కొకసారి లక్షల సంఖ్యలో కాకులు చొర్రని కీకారణ్యంలో ఏకీకృతమై దాదాపు ఏడువందల సంవత్సరాల తర్వాత గూడా తమ ఆగ్రహాన్ని ఒక తీర్థం రూపంలో వెలిబుచ్చడం మరొక తెలంగాణ వెయ్యేండ్ల చరిత్రలో మరుపురాని సంఘటన. బతుకమ్మ ఉత్సవమే, ఈ సమ్మక్క సారక్క జాతరకు మూలాధారంగా భావించవచ్చు.
బతుకమ్మ పాట :
బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పాటలు పాడు తారు. అందులో ఒక ప్రాచీన పాటలో చోళులను ప్రస్తుతించడం కనిపి స్తుంది. చోళ దేశపు రాజైన ధర్మాంగుడు నూరునోములు నోమి నూరు మందిని పొందాడట. ఆ పాట లోని ప్రథమభాగం ఇలా ఉంటుంది. శ్రీలక్ష్మిదేవియు ఉయ్యాలో సృష్టి బతుకమ్మాయే ఉయ్యాలో
పుట్టినా రీతిజెప్పె ఉయ్యాలో భట్టు నరసింహకవి ఉయ్యాలో
ధరచోళదేశము ఉయ్యాలో ధర్మాంగుడనరాజు ఉయ్యాలో
ఆరాజు భార్యయు ఉయ్యాలో అది సత్యవతియండ్రు ఉయ్యాలో
నూరునోములునోమి ఉయ్యాలో నూరుమందిని గాంచె ఉయ్యాలో
వారు శూరులయ్యి ఉయ్యాలో వైరులచే మృతురైరి ఉయ్యాలో
తలిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగనీశోకమున ఉయ్యాలో
ధనధాన్యములు బాసి ఉయ్యాలోదాయాదులను బాసి ఉయ్యాలో
వనితతోనారాజు ఉయ్యాలో వనమందు నివసించె ఉయ్యాలో
కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనతపంబొనరింప ఉయ్యాలో
ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికెవరమడుగమనె ఉయ్యాలో
వినుతించి వేడుచు ఉయ్యాలో వెలదితనగర్బమున ఉయ్యాలో
పట్టుమని వేడగా ఉయ్యాలో పుబోణిమదిమెచ్చి ఉయ్యాలో
సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో
అంతలోమునూలూను ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో
(ఇంకావుంది)
ఈపాటలో కన్పించిన చోళదేశము, నూరునోములు సృష్టి బతు కమ్మాయే, అనే పదాలు బతుకమ్మ ఉద్యమానికి దగ్గరగా ఉన్నవి. వేముల వాడ బృహదీశ్వరున్ని తరలించింది చోళరాజు. రాజరాజచోళుని తండ్రి రెండవ పరాంతకచోళుడు, బహుశా రాజేశ్వర నోమును నోచి, దేవుని అనుగ్రహంతో పొందిన కుమారునికి దేవుని పేరున ‘రాజరాజ’ అని నామకరణం చేసియుండాలి. మరొకచోట పుబోణి పదం బతుకమ్మకు ప్రతిరూపంగా కన్పిస్తుంది. బహుశ బతుకమ్మ ఉద్యమ తీవ్రతను గ్రహిం చిన చోళరాజులు, నర్సింహకవిలాంటి కవులచే వారి కనుగుణంగా తెలంగాణా ప్రజల ఉక్రోషాన్ని మరిపించే విధంగా ఉయ్యాలపాటలను రాయించి, ప్రజల మధ్య వ్యాప్తి చెందించినట్లుగా చెప్పవచ్చు. ఇన్నేండ్లుగా, బతుకమ్మపాటలో చోళుల కథ బతికియుండడం మరొక కవిశేషం. దీన్ని సాహిత్యపరమైన రుజువుగా భావించవచ్చు.
కందూరుచోడులు :
మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ జరుపుకొనకబోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. దీనికి కారణమేమంటే, ఈ ప్రాంతాలు, తంజావూరు మరియు గంగైకొండ చోళపురంను రాజధానిగా చేసుకొని పరిపాలనా చేసిన చోళులకు సంబంధీకులైన కందూరు చోడులుగా పిలువబడే తెలుగు చోళులచే ఈ ప్రాంతాలు పరిపాలించబడడం.
కందూరుచోడులు, కందూరు పురమును రాజధానిగా చేసుకొని కందూరు నాడు 300ను పరిపాలించారు ఈకందూరునాడు300లో ఈనాటి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ పూర్వ తాలుకాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట పూర్వ తాలు కాలు ఉండేవి. కందూరునాడు ప్రారంభం గురించి క్రీ.శ.1033, 103లో మల్లేశ్వరంలో వేయబడ్డ శాసనాల్లో తొలిసారిగా గుర్తించడం జరిగింది. ఇందులో మహామండలేశ్వరుడైన కందూరు ఆనెమరసుడు, మొదటి జగదేకమల్లుని (రెండవ జయసింహుని)కి సామంతుడుగా పేర్కొనబడింది. (ూ, ూూ :50,52,వీష్ట్రపశీశీప అతీ) తర్వాత అతని కుమారుడు పరిపాలించాడు. ఈసామంతరాజుల మూలాలెక్కడివో తెలియడంలేదు. కందూరు మల్లికార్జున చోడునిచే వేయబడ్డ, క్రీ.శ.1097 నాటి బల్లాలశాసనంలో ఈ వంశస్తుల వంశవృక్షాన్నివ్వడం జరిగింది. (ూ,చీశ్రీశీఅస ఙశీశ్రీ. !! అశీ.11:3542) ఈ శాసనం, వంశ ప్రశస్తితో మొదలై కరికాల చోళునిచే వంశవృక్షం ప్రారంభింపబడుతుంది. చాళుక్య ఆరవ విక్రమాదిత్యున్ని సంతోషపెట్టడంద్వారా కందూరునాడు పొంది నట్లు, ఆనాటి నుండి వీరు కందూరు చోడులుగా పిలువబడ్డట్టు ఈ శాసనంలో పేర్కొనబడింది.
ఈ కందూరుచోడులు, తప్పనిసరిగా చోళరాజ్యాన్ని పరిపాలించిన చోళరాజుల సంతతివారై యుండవలయును. కావుననే, వీరు చాళుక్యుల సామంతులుగా వ్యవహరించినా, తమ ఏలుబడిలోనున్న మహ బూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని ప్రాంతాల్లో, తమ పూర్వీకులైన చోళులకు వ్యతిరేకంగా జరుపబడే బతుకమ్మ ఉత్సవాలను నిరోధించి యుం డాలి. కావుననే ఇప్పటికి ఆ ప్రాంతాల్లో బతుకమ్మ పండగను జరుపుకోక పోవడం ఆచరణలో ఉందని చెప్పవచ్చు.
చరిత్ర పునరావృత్తం
క్రీ.శ.2004 నుండి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రపాలకులచే జరుపబడ్డ దోపిడీలను, అరాచకత్యాలను పరిశీలిస్తే, వీటిలో క్రీ.శ. 1004లో చోళరాజులచే గావింపబడ్డ దోపిడీల దురాక్రమణల ప్రతి రూపాలు కన్పిస్తాయి. ఈ దోపిడీలు, అన్యాయాలు దాదాపు క్రీ.శ. 20 14 వరకు కొనసాగుతూనె ఉన్నాయి.
రాజేంద్రచోళుడు వేములవాడ బృహదీశ్వరుని తంజావురుకు తరలించిన తర్వాత మరొకసారి పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావంలో ప్రముఖ పాత్రపోషించాయి.
రాజేంద్రచోళుడు, క్రీ.శ.1004లో వేములవాడ బృహదీశ్వరుని దేవాలయాన్ని విధ్వంసం చేస్తే, క్రీ.శ.2004నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో శిథిలావస్థలో నున్న వేల దేవాలయాలు గుప్తనిధు ల అన్వేషణలో నాశనం చేయబడ్బాయి. ఇది వేయి సంవత్సరాల తర్వాత పునరావృత్తమైన చారిత్రక సంఘటన.
విశ్వవిద్యాలయాలనుండి డాక్టరేట్‌లు పొందిన చరిత్రకారులకు ఈ పరిశోధనలోని రుజువులు తృస్తి పరచపోవచ్చును కాని కొన్ని శతాబ్దాలుగా చరిత్రలో చోటు చేసుకున్న ‘బతుకమ్మ’కు మూలాలు కనుక్కో వలసిన ఆవశ్యకతను వారు గ్రహించాలి. కావున అందుబాటులో చరిత్రకు కొన్ని ఊహలను జతపరిచి, వచ్చే యువ చరిత్రకారులకు ఒక రజూతీఱఅ పశీతీసను తయారుచేయడం జరిగింది. ఈసందర్భంగా, ప్రముఖరచయిత, సంస్కృత పండితుడు, చరిత్రకారుడైన డా॥ సంగనభట్ల నరసయ్య అభిప్రాయం ఈ పరిశోధన పరిపూర్ణతకు దోహదకారి కాలదని భావిస్తున్నాను.
‘‘చరిత్రలో ఏ అంశం సంపూర్ణ నిర్థారితం కానీ, సత్యం కానీ కాకపోవచ్చు. తగినన్ని ఆధారాలు దొరకనప్పుడు కొంత కొంత ఊహ ఉంటుంది. ఊహకు ఓఆధారం వుంటుంది. ఆధారం మీద ఓ ఊహ ఉంటుంది. ’’
కావున వేయ్యేండ్లనాటి బృహతమ్మనే నేటి బతుకమ్మ. ఈ బతు కమ్మనే తెలంగాణ ఉద్యమానికి ప్రాణంపోసి బ్రతికించింది. తెలంగాణ ప్రజలకు ఆరాధ్యదైవంగా కలకాలం నిలిచిపోయింది.
ఈ పరిశోధన ఆధారంగా మరికొందరికి మరిన్ని బలమైన ఆలో చనలు రావచ్చు. వస్తే ఈ పరిశోధన ఆశయం ఫలించినట్లే.
ఆధారాలు:
1) చీ. వఅ్ =ఎఅవవ, ుష్ట్రవ ష్ట్రశ్రీవర శీ శ్రీ() జుఎశ్రీ ఙస, ుష్ట్రవ తీష్ట్రవశీశ్రీశీఱశ్రీ ణవజూ్ +శీఙ్. శీ .ూ., 1953
2) పి.వి. పరబ్రహ్మశాస్త్రి, కాకతీయులు, ఎమెస్కో, 2012
3) ఔఱఱజూవసఱ, =వఅసతీ ష్ట్రశీశ్రీ – , ూ్ 11, 2013
4) ూ.. ూతీపతీష్ట్రఎ ూర్‌తీవ, అరతీఱజూ్‌ఱశీఅర శీ అసష్ట్రతీ ూతీసవరష్ట్ర – ఖతీఱఎఅతీ ణఱర్‌తీఱ్, +శీఙ్. శీ .ూ. నవసవతీపస 1974.
5) ఖ.. చీఱశ్రీఅ్ ూర్‌తీఱ, ుష్ట్రవ ష్ట్రశీశ్రీర, అఱఙవతీరఱ్‌వ శీ వీసతీర, 2000
6) డా॥ సంగనభట్ల నర్సయ్య, తెలివాహ గోదారవి, ఆనంద వర్ధన ప్రచురణలు, ధర్మపురి, 2010
7) డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ముంగిలి, తెలంగాణ ప్రచురణలు, 2009
) చీ. ూఱపప, ూ్‌‌‌వ అస ూశీఱవ్‌వ ఱఅ అసష్ట్రతీ అసవతీ ్‌ష్ట్రవ ఖశ్రీవఅ ష్ట్రశ్రీవర (973 ణ-1162ణ)
ఆవాల బుచ్చిరెడ్డి, సెల్: 949320719


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *