మన వనరులను మనమే కాపాడుకుందాం

తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమి పల్లపు ప్రాంతం. ఒర్రెలు, వాగులు, మిట్టెలు, ఇసుక, బొగ్గు, ఇనుము నిక్షేపాలతో పాటు అటవీ ప్రాంతం, గ్రానైట్, నది ప్రవాహాలతో కలిసి ప్రకృతి సహజ వనరుగా ప్రసిద్ది గాంచింది.
తెలంగాణ ప్రాంతం నిజాంల కాలం మొదలుకుని వలసవాదుల పాలనలో దోపిడికి గురి అవుతూ వచ్చింది. ఇక్కడి వనరులను దోచుకు పోయారు. తరతరాలుగా దోచుకుపోతున్న దోపిడిదారులపై ఎన్నో విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు కొట్లాడి, పోరాడి తమ ప్రాంతాన్ని వనరులను కాపాడుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా మా నీళ్ళు, మా బొగ్గు, మా వనరులు మాకు కావాలంటూ ప్రత్యేక తెలంగాణ రా ష్ర్టం ఏర్పాటు తప్ప వేరే మార్గం లేదంటూ ఉద్యమం కూడా జరిగింది.
ఎవ్వరు అధికారంలోకి వ చ్చినా ఏమీ చేయరు అనేది నిత్య సత్యం. రాజకీయ పార్టీలతో, ప్రభు త్వాలతో ప్రజలు ఎప్పుడు మోసపో తూనే వున్నారు. ఇప్పటి కైనా ప్రజలు నడిచేదారి ఎటువైపో ఆలోచించ వలసిన అవసరముంది.
అందుకే.. పోట్లపల్లి ఎల్లమ్మ గుట్టను కాపాడుకుందాం..!
ఎన్నో యేండ్ల పోరాటం, ఎంతోమంది ఆకలి చావులు, చితి మంటలు, ఎంతో మంది తల్లుల ఆర్తనాదాలతో ప్రత్యేక తెలంగాణ రా ష్ర్టం ఏర్పడింది. ప్రజలు ఉత్సవాలు జరుపుకున్నారు. ఆనందపడ్డారు. బంగారు తెలంగాణ సాధించుకుందామని కలలు గంటున్న తరుణంలో ఎదురవుతున్న వనరుల విధ్వంసాన్ని అంతా కలసి అడ్డుకుందాం.
కరీంనగర్ జిల్లాకు 40 కి.మీ. దూరంలో హుస్నాబాద్ సమీపంలో పోట్లపల్లి గ్రామం ఉంది. పోట్లపల్లి వేములవాడను మైమరిపించేలా భక్తుల సందడితో ఊరేగుతుంటుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు, ఆనవాళ్లు ఉన్నాయి. పోట్లపల్లిలో స్వయంభూ రాజేశ్వరాలయం, రామాలయం, మల్లికార్జునస్వామి ఆలయం, పురాతన గుడి ఉన్నాయి. పోట్లపల్లి గ్రామ పరిధిలోని దేవేంద్రనగర్ కాలనీలో పోట్లపల్లి ఎల్లమ్మ గుట్ట చారిత్రాత్మక ఆధారాలతో మనముందు కన బడుతుంది. గుట్టకింద భాగంలో చుట్టుప్రక్కల ఆదిమవాసులు ఆవాసం ఏర్పర్చుకున్నట్లు బృహత్ శిలాయుగం నాటి 40కి పైగా సమాధులు న్నాయి. ఇంకా శిలాశాసనాలు, నిలువెత్తు నాగ విగ్రహాలు, ఆదివాసుల హక్కుల కోసం కాకతీయులపై కదం తొక్కిన సమ్మక్క సారక్కల గద్దె లున్నాయి. రెండు సం॥రాల కొకసారి ఇక్కడి ప్రజలు సమ్మక్క జాతరను జరుపుకుంటారు. మొక్కులను తీర్చుకోవడానికి పోచమ్మతల్లి ఆలయ ముంది. పెద్ద గుండుకు ఎల్లమ్మ రూపాన్ని చెక్కినారు. ఇక్కడనే ఎల్లమ్మ జాతర సాగుతుంది. ఇంకా వినాయక విగ్రహం, గుట్టపైన హనుమాన్ విగ్రహం… వీటికి వేల యేండ్లనాటి చరిత్ర ఉందని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఈ గుట్ట నానుకుని ఎక్కడ తవ్వకాలు జరిపినా పురాతన పెం కులు, ఆదిమవాసుల పరికరాలు, చారిత్రిక పురాతత్వ ఆధారాలు బయ ల్పడుతాయి. ఇక్కడి ప్రజలు ఈ ప్రాంతాన్ని చారిత్రక ప్రాధాన్య ప్రాం తంగా గుర్తెరిగి ఇక్కడి ఆలయాల్లో తమ ఇష్టదైవాలను కొలుస్తారు.
ఈ గుట్టపైన అడవి జంతువులు, ఎలుగుబంట్లు, కోతులు, కొండెంగలు, నక్కలు, తోడేళ్ళు, కుందేళ్లు, ఏనుగులు, అడవి పందులు, నెమళ్ళు, ఎన్నో వేల పశుపక్షాదులు కలవు. ఈ గుట్ట చుట్టుపక్కల ఎన్నో వనమూలికలున్నాయి. వేల సంఖ్యలో చెట్లతో తాటి వనం ఉంది. సీతాఫలా లు అమ్ముకుని జీవనం గడిపే కుటుం బాలున్నాయి. గొర్లను నమ్ముకుని గొర్ల కాపరులు వారి జీవితం ఎల్లబోసు కుంటున్నారు. ఈ గుట్టనానుకుని రైతులు వ్యవసాయం చేసుకుని జీవి స్తున్నారు. ఎన్నో చెట్టుచేమలున్నాయి. వాగులు, వంక లు, మిట్టెలు, లోతట్టు మడుగు లు, ఎన్నో సెలయేర్లు సాగుతూ చెరువు కుంటలను నింపుతూ భూములు సాగు చేసుకోవడానికి ఉపయోగప డుతున్నాయి.
ఈ గుట్టకు అతి సమీపంలో చెరువులు, కుంటలు కలవు, పోట్లపల్లి వాగు ప్రవహిస్తూ మానేరు డ్యాంలో కలుస్తుంది.
ఇంత పెద్ద చారిత్రక నేపథ్యం కల్గిఉన్న పోట్లపల్లి ఎల్లమ్మ గుట్ట గ్రానైట్ మాఫియాల కంటబడింది. పెకిలించాలని చూస్తుంది. విదేశాలకు తరలించాలని చూస్తుంది. గ్రానైట్ మాఫియాల దరఖాస్తు మేరకు అధికార యంత్రాంగం వాటితో కుమ్మకై గుట్టవద్దకు వచ్చి పరిశీలన చేస్తుండగా ప్రజల కంటపడింది. ప్రజలు ఏకమై వచ్చి మా అనుమతి లేకుండా గ్రానైట్‌కు క్వారీకి అనుమతులు ఇవ్వవద్దని అధికారులకు మొర పెట్టుకున్నారు. ఈ వనరులు అంతమైతే తమకు బతుకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికార యంత్రాంగం వెనుదిరిగి లాభం లేదని వెళ్ళిపోయింది. అప్పటి నుండి ప్రజా సంఘాలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. అలాగే సర్వాయి పాపన్న గుట్టలను పరిరక్షించుకుందామని ప్రజలు ఉద్యమిస్తుంటే, స్థానిక యంత్రాంగం గ్రానైట్ మాఫియాతో కలిసి వనరులను నాశనం చేయడానికి పూనుకుంటోంది.
ఇలాంటి చోటున క్వారీకి (గ్రానైట్‌కు) అనుమతిస్తే పర్యావరణం దెబ్బతినడంతోపాటు, చారిత్రక ఆనవాళ్ళను కోల్పో తాం. పర్యావరణాన్ని, చారిత్రక ప్రదేశాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుని చారిత్ర కమైన ఎల్లమ్మగుట్ట వద్ద గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దంటూ ప్రజలతో పాటుగా ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
గ్రానైట్ పేరుతో చారిత్రక ప్రదేశాల విధ్వంసం జరుగు తోందని తెలంగాణ సహజ వనరుల సంరక్షణ సంఘాల జేఏసీ ఆందో ళన చేపట్టింది.పోట్లపల్లి, దేవేంద్రనగర్ ఎల్లమ్మ గుట్టను సందర్శించింది.
ఈ ఆందోళనలో పాల్గొన్న సంఘాలు, ప్రతినిధులు:
ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు, తెలంగాణ భూమి రక్షణ సంఘం కన్వీనర్ ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత, జీవవైవిధ్య యాజమాన్య కమిటీ ఛైర్మన్ మండల జంపయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్, దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మార్వాడి సుదర్శన్, సర్వాయి పాపన్న గుట్టల సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వీరగోని పెంటయ్య, తెలంగాణ ప్రజాప్రంట్ రాష్ర్ట ఉపాధ్యక్షులు తోటపల్లి జగన్ మోహన్‌రావు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుర్రాల రవీందర్, తెలంగాణ రచయితల వేదిక రాష్ర్ట కార్యదర్శి నాగ భూషణం, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదన కుమారస్వామి, పర్యావరణ రక్షణ సమితి ప్రతినిధులు వేణుగోపాల్‌రావు, లక్ష్మణ్, మురళీ, చంటి, మహేశ్, పోట్లపల్లి, దేవేంద్రనగర్ గ్రామాల సంఘం నాయకులు మల్లయ్యగౌడ్ తదితరులు
మండల జంపయ్య« (Previous News)Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *