మరోసారి గ్రంథాలయ ఉద్యమం

తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే చర్చా కార్యక్రమంలో భాగంగా 164వ చర్చగా ‘తెలంగాణలో పౌర గ్రంథాలయాలురెండో గ్రంథాలయ ఉద్యమ ఆవశ్యకత’ అనే అంశం పై చర్చాకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వర రావు, తెలంగాణ రచయితల వేది క అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, బి.ఎస్ రాములు, రి టైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఓయూ), స్టేట్ సెంట్రల్ లైబ్రరీ చీఫ్ లైబ్రేరియన్ శ్రీనివాసరావు తదితరులు ప్రధాన వక్తలుగా హాజరయ్యారు. లైబ్రరీల స్థాపనకు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం, ప్రజల భాగస్వామ్యం పెంచడం, లైబ్రరీ సెస్ సద్వి నియోగం అయ్యేలా చూడడం లాంటి అంశాలు ఈ సందర్భంగా చర్చ కు వచ్చాయి. సుధాకర్ గౌడ్ (బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ పూర్వ అధిపతి) ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. టీఆర్‌సీ చైర్మన్ ఎం. వేద కుమార్, పి.వి.రాజేశ్వరరావు,టి.గోపాలరావు, సిహెచ్.నారాయణ, బాలరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లైబ్రరీల కన్నా వైన్ దుకాణాలే అధికం:
బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ పూర్వ అధిపతి సుధాకర్ గౌడ్
మిషన్ కాకతీయ అంటున్నాం.. చెరువులను మళ్ళీ పునరుద్ధరిం చాలని, తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలని. ఇప్పుడు అంతా గొలుసుకట్టు చెరువుల గురించి మాట్లాడుతున్నారు. అదే విధం గా 1940 ప్రాంతంలో వచ్చిన తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రం థాలయ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మిషన్ కాకతీయ తర హాలో మిషన్ లైబ్రరీస్ వంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉం ది. ఇన్నేళ్ళుగా ఈ రంగానికి జరిగిన అన్యాయాన్ని పక్కన బెడితే, ఇ ప్పుడు ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి, ఈ అన్యాయాన్ని సరిది ద్దుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఎంతో మంది ఈ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. సుమారుగా 60 ఏళ్ళుగా తెలంగాణ తన అస్తిత్వ ఉనికి కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఒకప్పుడు ముస్లిం పా లకులతో, ఆ తరువాత ఆంధ్ర పాలకవర్గాలతో. ఇప్పుడు తెలంగాణ వ చ్చింది కాబట్టి ఈ లైబ్రరీలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. 1920 ప్రాంతాల్లో ఈ ఉద్యమానికి పునాది పడింది. ఆ తరువాత పదేళ్ళలో సంఘటితమైంది. తెలంగాణలో నల్గొండ, వరం గల్, ఖమ్మంలో ఇది బాగా చోటు చేసుకుంది. 19500 మధ్య కా లంలో బాగా విస్తరణ చోటు చేసుకుంది. 1950లలో హైదరాబాద్ స్టే ట్ పబ్లిక్ లైబ్రరీలకు బాగా పేరొందింది. సంబంధిత చట్టం తీసుకు వచ్చిన రాష్ట్రాల్లో రెండవదిగా నిలిచింది. తెలంగాణలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, వరంగల్, నిజామాబాద్‌లలో రెండు రీజ నల్ లైబ్రరీలు, తొమ్మిది జిల్లా లైబ్రరీ, 562 బ్రాంచ్ లైబ్రరీలు, 165 విలేజ్ లైబ్రరీలు ఉన్నాయి. జనాభా దృష్ట్యా చూస్తే ఇవెంతో తక్కువ. వీ టి కంటే కూడా వైన్ దుకాణాల సంఖ్యనే అధికం. నేడు రాష్ర్టంలో మూడు వేల దుకాణాలు, రెండు వేల బార్ల వరకూ ఉన్నాయి. ఈ నేప థ్యంలో రాష్ర్టంలో లైబ్రరీల విస్తరణకు బాగా కృషి చేయాల్సిన అవస రం ఉంది. సిటీ మొత్తానికి 65 లైబ్రరీలు ఉన్నాయి. వీటిల్లో మౌలిక వసతులు అధ్వాన్నం. ఇంటర్నెట్ అనేది తక్షణ రెఫరెన్స్ కోసమే. పుస్త కాలు చదవడం ద్వారా మాత్రమే విజ్ఞానం పెంచుకోవచ్చు. చట్టం ప్ర కారం, ఆస్తి పన్నులో ప్రతి రూపాయికి పైసలు లైబ్రరీ సెస్‌గా ఇవ్వా లి. 2003 నుంచి 2013 నుంచి ఎంత ప్రాపర్టీ టాక్స్ కలెక్ట్ చేశారు, ఎంత సెస్ చెల్లించారు అని ఎంసిహెచ్‌ను అడిగితే, 2006 నుంచి 2013 వరకు సమాచారం అందిస్తామన్నారు. ఆ లెక్కల ప్రకారం రూ. 330 కోట్లు సెస్‌గా రావాల్సి ఉంది. చెల్లించింది రూ.3 కోట్లు మాత్ర మే. అంటే ఇంకా రూ.300 కోట్లు లైబ్రరీ శాఖకు రావాల్సి ఉంది. ఆ మొత్తం వస్తే ఎంతో చక్కగా పలు లైబ్రరీలను నిర్వహించుకోవచ్చు. వ రంగల్, కరీంనగర్‌లాంటి వాటిల్లో సెస్ కింద ఏటా రూ.20 లక్షల వ రకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మొత్తం సరిగా వసూలు చేసి సద్వి నియోగం చేసుకోవాలి. స్థానిక సంస్థల పాలక వర్గాల నుంచి ఈ మొ త్తాలను రాబట్టాల్సి ఉంది.
నీవి రెండు… నావి రెండు! :
ప్రముఖ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వరరావు
ఒక మంచి విషయాన్ని చర్చకు తీసుకున్నారు. ఇటీవలి కాలంలో పౌర గ్రంథాలయాల గురించి మాట్లాడేవారే కానరావడంలేదు. ఇంటకె ర్నెట్ మహిమ కావచ్చు. కానీ, నాడూ, నేడూ వాటి విలువ వాటికి ఉం ది. ఇప్పుడు ఉంది. ఇక ముందూ ఉంటుంది. ఉపయోగించుకోవడం చేతగావాలే గానీ… ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా, జాతికైనా దాన్ని మిం చిన సంపద లేదు. తెలంగాణలో గ్రంథాలయోద్యమం హైదరాబాద్ వి మోచనలో భాగంగా వచ్చింది. అప్పట్లో హైదరాబాద్‌లో స్టేట్‌లో పత్రి క నడపాలన్నా, ముద్రణ సంస్థ పెట్టుకోవాలన్నా పలు రకాల ఆంక్షలు ఉండేవి. అనుమతులు వచ్చేవి కావు. అలాంటి పరిస్థితుల్లో చైతన్యవం తులైన తెలంగాణ ప్రజలు నిజాం పాలన నుంచి విముక్తి పొందారు. ఆ తరువాత ప్రత్యేక రాష్ర్టం కూడా సాధించుకున్నారు. తెలంగాణ పున ర్‌నిర్మాణ కార్యక్రమంలో గ్రంథాలయ సముద్ధరణను కూడా భాగం చే యాలి. అలా భాగం కావాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. నేడు అంతా కూడా తమకు కావాల్సిన సమాచారం కోసం ఇంటర్నెట్‌పై ఆ ధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల గురించి మాట్లాడే వారే కరువయ్యారు. తెలంగాణ ఉద్యమం ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. నేడు మొదటి సారిగా రూ.300 కోట్ల సెస్ ఏమైపోయిందని ప్రశ్నించే వారు కనిపిస్తున్నారు. ప్రభుత్వం ప్రభుత్వమే.. ప్రజలు ప్రజ లే. ప్రజలు తమకు కావాల్సిన వాటిని అడగాలి. డిమాండ్ చేయాలి. వాటిని సాధించుకునేందుకు పోరాటం చేయాలి. ఆయా మొత్తాలను రాబట్టాలి. గ్రంథాలయాలకు పుస్తకాలు సేకరించే దగ్గరి నుంచి ఇతర త్రాగా అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని సంస్కరిం చాల్సిన అవసరం ఉంది.
నేను ఒక పత్రికకు సంపాదకుడిగా ఉన్న సమయంలో నన్ను గ్రం థాలయ సెలెక్షన్ కమిటీ మెంబర్‌గా నియమించారు. ఒకసారి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏయే పుస్తకాలను కొనాలన్న అంశం చర్చకు వచ్చింది. ఒక సభ్యుడు ‘నావి రెండు’ అన్నారు. పెద్ద స్కాలర్ ఆయన. మరో సభ్యుడు ‘నావి రెండు’ అన్నారు. ఆయన కూడా ప్రము ఖుడే. ఇలా ఇద్దరు, ముగ్గురు చెప్పారు. ఈ సమావేశానికి గ్రంథాల య శాఖ మంత్రి కూడా వచ్చారు. ఆమె ఈ ఎంపిక తీరు ఆశ్చర్యపో యారు. ఎంపిక ఇలా జరుగుతుందని ముందుగా నాకెందుకు చెప్ప లే దు… నేనూ ఓ రెండు రాసుకొచ్చి చెబుతుంటి…అన్నారు. ఈ విధంగా పుస్తకాల ఎంపిక జరిగితే ఇక గ్రంథాలయాలు ఎప్పుడు బాగుపడుతా యి. వెంటనే నేను మీటింగ్ నుంచి బయపడి, ఆఫీస్‌కు వెళ్ళి రాజీనా మా లేఖ పంపించాను. కమిటీ ఉన్నది పంచుకునేందుకా… అన్ని చో ట్లా ఇదే పరిస్థితి ఉంది.
పైరవీలు చేసుకొని జిల్లా, రాష్ర్టస్థాయిల్లో చైర్మన్‌లు అవుతున్నారు. అసలు వారేం చేస్తున్నారు? ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. రాజ కీయ నాయకులకు ఈ పదవులు ఇవ్వవద్దు. ఇది చాలా పెద్ద తప్పు. అణా గ్రంథమాల, విజ్ఞాన చంద్రిక గ్రంథమాల లాంటివి అప్పట్లో ఎం తో సేవ చేశాయి. గ్రంథాలయ ఉద్యమం అప్పట్లో ఉద్యమం తరహా లోనే జరిగింది. కొమర్రాజు లక్ష్మణ రావు పంతులు, కోదాడ నారాయ ణ రావు లాంటి వారెందరో ఇందులో పని చేశారు. తేనెటీగ పువ్వు పు వ్వు నుంచి మకరందం సేకరించినట్లు వారు లైబ్రరీలు ఏర్పాటు చేసి ఎన్నో పుస్తకాలు సమకూర్చారు. అప్పట్లో కృష్ణదేవరాయాంధ్రా భాషా నిలయంలో సమావేశాలు జరుపుకునే వాళ్ళం. ఎంతో గొప్ప గ్రంథాల యమది. భారతి సంచికలు అక్కడ ఉన్నాయి. నేను ప్రెస్ అకాడమీ చై ర్మన్‌గా ఉన్నప్పుడు వాటిని డిజిటలైజ్ చేయించాను. మన పత్రికలకు, గ్రంథాలకు ఘన చరిత్ర ఉంది. దాన్ని కాపాడుకోవాలి. అందుకు ప్ర శ్నించే తత్వం కావాలి. ఇప్పుడు డిమాండ్ చేద్దాం. నేనూ గొంతు కలు పుతాను. నేడు టెక్నాలజీ మన లైబ్రరీ వ్యవస్థను ఎంతో ప్రభావితం చే సింది. ఉదాహరణకు ఒకప్పుడు లాయర్ల వద్ద, జడ్జీల వద్ద ఎన్నో పుస్త కాలు ఉండేవి. ఇప్పుడలా కాదు.. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే చా లు. పనయిపోతోంది. న్యాయవాది ఇంటర్నెట్ చూసి కోట్ చేస్తాడు. న్యాయమూర్తి కూడా ఇంటర్నెట్‌లో చూసి రెఫర్ చేస్తాడు. ఇప్పుడు డిజి టలైజ్ అవసరం అధికమైపోయింది. ఎన్నో పత్రికల ప్రతులు, గ్రంథా లు కనుమరుగై పోతున్నాయి. ఇటీవలి వరకూ, హనుమకొండలో రాజ రాజనరేంద్ర భాషా నిలయం దీన స్థితిలో ఉంది. ఒక ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం, రెండో తరగతి పుస్తకం మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొంత పునరుద్ధరించారు. రెండేళ్ళ క్రితం ఒక వెయ్యి పుస్తకాలు దానికి ఇచ్చా ను. గ్రంథాలయాలను నిర్మించుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకో వాలి. గ్రంథాలయాల్లో టెక్నాలజీని భాగం చేయాలి. తెలంగాణ అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో డిజిటలైజ్డ్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. జ నాభాకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలి. నేను మీజావ్‌ు అనే పత్రిక ప్రతుల కోసం వెతికాను. స్టేట్ లైబ్రరీలో ఒక కాపీ దొరికింది. అదెంత ముఖ్యమైంది అంటే.. హైదరాబాద్ స్టేట్ స్వతంత్రంగా ఉం టుందని నిజాం చేసిన ప్రకటన అందులో ఉంది. దాన్ని లామినేట్ చే యించాను. అదిప్పుడు ప్రెస్ అకాడమీలో ఉంది. తెలంగాణలో వచ్చిన రాజకీయ చైతన్యం ప్రత్యేకరాష్ర్ట ఏర్పాటుతో చల్లబడకూడదు. లైబ్రరీల బాగు కోసం డిమాండ్ చేయాలి. ప్రజల్లో చైతన్యం రావాలంటే లైబ్రరీ లు కావాలి. తమ హక్కుల్ని తాము సాధించుకోవాలనుకుంటే లైబ్రరీలు తోడ్పడుతాయి. ఇక్కడి నుంచి పబ్లిష్ అయ్యే పత్రికలన్నీ వాటిలో ఉం చాలి. లైబ్రరీలో ఉంచే పుస్తకాల విషయంలో కూడా జాగ్రత్త వహించా లి. నావి రెండు..నీవి రెండు అనే ధోరణి ఉండకూడదు. తెలంగాణ సంపన్న రాష్ర్టమైనా….ప్రజల వద్ద డబ్బుల్లేవు. ఇలాంటి పరిస్థితిలో లై బ్రరీలు ఎంతో ముఖ్యం. ప్రజలకు ఉపయోగపడే పుస్తకాలు ఉంచాలి. వారి విజ్ఞానాన్ని పెంచాలి. ఎన్ని లైబ్రరీలు ఉన్నాయి, ఏ దశలో ఉన్నా యి లాంటివి గమనించాలి.
గ్రాంట్‌లను సద్వినియోగం చేసుకోవాలి : ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు
ఒకప్పుడు పౌర గ్రంథాలయాలు ఎన్నో ఉద్యమాలకు ఎంతో తోడ్ప డ్డాయి. స్థానిక సంస్థలు సెస్ జమ చేయడం లేదు. ఇప్పుడు దీన్ని ఎవ రూ పట్టించుకోవడం లేదు. రాజా రామమోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండే షన్ మ్యాచింగ్ గ్రాంట్ లాంటివి ఇస్తుంది. సెస్ పూర్తిగా వసూలైతే అ లాంటి నిధులను పొందే అవకాశం లభిస్తుంది. పుస్తకాలు కొనేందుకు, భవన నిర్మాణాలకు, ఫర్నీచర్ కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. అందుకు కొన్ని నిబంధనలుంటాయి. సెస్ రానందువల్ల లైబ్రరీలు ఏవీ కొనలేని పరిస్థితి నెలకొంది. కొనుగోళ్ళలో గతంలో కొన్ని పొరపాట్లు జరిగేవి. ఒకే పుస్తకం మొదటి ఎడిషన్, రెండో ఎడిషన్, మూడో ఎడిష న్ … కూడా ఒకే సారి కొనేవారు. కొన్ని సార్లు ప్రచురణకర్తలు నవ లల పేర్లు మార్చి అదే నవలను తిరిగి ముద్రించే వారు. వాటిని కూడా కొన్న దాఖలాలు ఉన్నాయి. ఈ విభాగంలో సిబ్బంది సరిగా లేరు. ఒకే లైబ్రేరియన్ రెండు, మూడు లైబ్రరీలు చూస్తుంటారు. కొన్ని చోట్ల వాచ్ మన్‌లే అన్నీ చూస్తుంటారు. ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమవు తోంది. యూనివర్సిటీ లైబ్రరీల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ ఖాళీలను భర్తీ చేయడం లేదు. దేశంలో నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరీస్ కింద కొం త సాయం చేద్దామనుకున్నా అవీ అందుబాటులోకి రావడం లేదు. వివి ధ సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం ఉంది. నాయకులు ఈ విషయం పట్టించుకోవాలి. ఈ రోజున పోరాటం చేయకపోతే ఎంతో నష్టపోతాం. కొత్త లైబ్రరీలు ఏర్పాటు చేయడం లేదు. సిబ్బందిని నియ మించడం లేదు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్ కూడా పార్ట్‌టైవ్‌ు డైరెక్టరే. అం తా దీన్ని పనిష్‌మెంట్ కింద భావిస్తున్నారే తప్ప ఆసక్తితో పని చేస్తున్న దాఖలాలు లేవు. ప్రతీ రెండు, మూడేళ్లలో విజ్ఞానం రెట్టింపు అవుతోం ది. దాన్ని ప్రజలకు అందించాలంటే లైబ్రరీలు కావాలి. స్థానిక సమా చారం కూడా లైబ్రరీల్లో అందుబాటులో ఉండాలి. వివిధ డేటాబేస్‌లను లైబ్రరీల్లో ఉంచాలి. ప్రచురణ అయ్యే ప్రతీ పుస్తకం కొన్ని కాపీలు లై బ్రరీ విభాగానికి అందేలా చూడాలి. లైబ్రరీ నిర్వహణలో టెక్నాలజీని వినియోగించుకోవాలి. పబ్లిక్ లైబ్రరీల్లో టాయ్‌లెట్లు ఉండడం లేదు. టెక్స్ట్‌బుక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. నిధులు అందించేందుకు ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముందుకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. దాన్ని ఎవ రూ పట్టించుకోవడం లేదు.
సీడీల రూపంలో భద్రపరిచినంత మాత్రాన లాభం లేదు. వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలి. డిజిటలైజ్ చేసింది ఎందుకు? అం దరికీ అందుబాటులోకి తేవాలనే కదా.. డిజిటలైజ్ చేయడంలో, వా టిని అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవా లి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని ఈ విభాగంలోకి తీసుకురా వాలి. యూకేలో అన్ని పబ్లిక్ లైబ్రరీలలో కూడా అన్ని జర్నల్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
తెలంగాణ సాధించిన తరువాత … మరెన్నో విస్మరిస్తున్నాం:
ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు
ఈ చర్చా కార్యక్రమంలో రెండవ గ్రంథాలయ ఉద్యమం ఆవశ్యక త అనే అంశం నన్ను ఆకర్షించింది. తెలంగాణ పునరుజ్జీవన కాలం అంటే 193040 అనుకుంటే, ఒక చరిత్రను సృష్టించింది ఒక రై తాంగ చైతన్యాన్ని పెంపొందించింది, రాజకీయ విజ్ఞానానికి అది తోడ్ప డింది. ఒక తరానికి ముందు కాలంలో గ్రంథాలయోద్యమం ఎంతో కీ లక పాత్ర వహించింది. మార్క్జిజం ప్రాచుర్యానికి కూడా తోడ్పడింది. స్వాతంత్య్రోమానికీ ఇది తోడ్పడింది. ఇప్పుడు మనం గ్రంథాలయాల ను కాపాడుకోవాలి. ముందుగా ఉన్న వాటిని పరిరక్షించుకోవాలి. కొ త్తగా వాటిని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ బాగా వ చ్చింది కాబట్టి ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో అలోచించాలి. అప్ప ట్లో గ్రంథాలయోద్యమం కోసం జీవితాలను ధారపోసిన వారు ఉన్నా రు. గత 40,50 ఏళ్ళుగా సీమాంధ్ర పాలకుల చిన్న చూపు వల్ల కూడా మన లైబ్రరీలు దెబ్బ తిన్నాయి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం లాంటి వాటిని ప్రభుత్వాలు తీసుకున్నాయి తప్పితే బాగు చేయలేదు. గ్రంథాలయాల సెస్ ఎక్కడికి పోతున్నదో చర్చించాం. ఈ సెస్‌ను ఎ క్కడ, ఎలా వినియోగిస్తున్నారో చూడాలి. మధ్యతరగతి నగరవాసులెం దరికో ఇంటర్నెట్ ఇంట్లో ఉంటుంది కాబట్టి మనకు లైబ్రరీల అవసరం లేకపోవచ్చు కానీ, పురాతన గ్రంథాలు, రాతప్రతుల్లో ఎంతో విజ్ఞానం ఉంది. తాళపత్రాలు, రాతప్రతులు, రాగిరేకులు, శాసనాలు.. ఇవన్నీ ైబ్రరీలకు సంబంధించిన అంశాలే. వీటన్నింటినీ డిజిటలైజ్ చేయించా లి. పారిశ్రామికవేత్తల సమస్యలు తీర్చేందుకు ఒక సెల్ ఉంటుంది గా నీ ఇంత ముఖ్యమైన అంశాన్ని పాలకవర్గాలు పట్టించుకోవడం లేదు. చెబితే నవ్వుకుంటారు… అందుకే ఇక ఎవరూ ఈ అంశాన్ని లేవనెత్త డం లేదు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో మూడు వేల మంది విద్యార్థులు ఆ రుబయట కూర్చొని పోటీ పరీక్షలకు చదువుకుంటూ ఉంటారు. అంటే గ్రంథాలయాల అవసరం మరింత పెరిగింది. కళాశాల లైబ్రరీల్లో ఆ పుస్తకాలు ఉండవు. పౌర గ్రంథాలయాల్లోనూ ఉండవు. కొన్ని లైబ్రరీల్లో విద్యార్థులకు ఇలా చదువుకునేందుకు ప్రవేశం ఉండదు. కొన్న పుస్తకా లను బైండ్ చేయించేందుకు డబ్బులు ఉండడం లేదు. చెద పురుగులు పట్టి నాశనమవుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. దీనిగురించి మాట్లా డే వాళ్ళు నవ్వులపాలవుతున్నారు. కొత్త రాష్ట్రానికి ఇది తగదు. వెంటనే ఈ విషయంపై దృష్టి సారించాలి. పత్రికలన్నింటినీ డిజటలైజ్ చేసి ప్రె స్ అకాడమీలో పెడుతున్నారు కానీ వాటిని ప్ర జలకు అందుబాటులోకి తెచ్చేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మంచి పత్రికలు, మన పత్రికలు డిజిటలైజ్ చేయలేకపోయారు. ప్రపంచంలో ఎక్కడా లే ని మంచి పుస్తకాలు స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాయి. ఇప్పుడు అదెం తో దుస్థితిలో ఉంది. తెలంగాణ కోసం ఉద్యమించి, దాన్ని సాధించిన తరువాత ఇక వీటిని పట్టించుకోవడం లేదు.
లైబ్రరీలకు శాశ్వత భవనాలు అవసరం: బి.ఎస్.రాములు
నేను చిన్నప్పుడు జగిత్యాలలో శాఖా గ్రంథాలయానికి వెళ్ళి ఎన్నో పుస్తకాలు చదివాను. చాలా ప్రాంతాల్లో లైబ్రరీల్లో పుస్తకాలను పాఠకు లకు అందుబాటులో ఉంచడం లేదు. ఇప్పుడు చదవాలనే ఆసక్తి తగ్గి పోయింది. జగిత్యాల లైబ్రరీకి సొంత భవనం లేదు. ఈ విషయమై సి నారెతో మాట్లాడితే ఆయన రూ.20 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేకపోయింది. రాజరాజ నరేంద్ర భాషానిల యానికి వెళ్ళి చూసినప్పుడు దాని దుస్థితి బాధ కలిగించింది. దాని భ వనం పిల్లర్ల స్థాయిలో ఆగిపోయింది. సమన్వయం కొరవడింది. లైబ్ర రీలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టేందుకు అంతా ముందుకు రావాలి. ప్రజల దగ్గరకు పుస్త కాలను తీసుకెళ్ళాలి. ఈ విషయంలో రచయితలు అహంకారాన్ని వదులుకో వాలి. తెలంగాణ రచయితల పుస్తకానే… తెలంగాణ ప్రచురణ సం స్థలు ప్రచురించిన వాటినే ఇక్కడి లైబ్రరీలు కొనాలి.. ఇలాంటి నిబం ధనలు పెట్టుకోవాలి. ఇక్కడ ఏడాదికోసారే పుస్తకాలు కొంటారు. అమె రికా లాంటి చోట్ల నెలకోసారి కొంటుంటారు. కొనుగోళ్ళలో అవినీతి ఉండకుండా చూడాలి.
ఏ వ్యవస్థకైనా పునరుజ్జీవం ముఖ్యం :
శ్రీనివాస్‌రావు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ చీఫ్ లైబ్రేరియన్
ఏ వ్యవస్థకైనా పునరుజ్జీవం అవసరం. ప్రతీ వ్యవస్థలోనూ సమస్య లు ఉంటాయి. ఈ ఉద్యమంలో మీతో కలసి పని చేస్తాం. స్టేట్ సెం ట్రల్ లైబ్రరీలో 25,000 దాకా అరుదైన పుస్తకాలను స్కాన్ చేసి సీడీల రూపంలో భద్రపరిచాం.
ప్రెస్ అకాడమీ సౌజన్యంతో 1960కి ముందు ఉన్న తెలుగు, ఇం గ్లీష్, ఉర్దూ పత్రికలను కూడా సీడీల రూపంలో ప్రజలకు అందు బాటులోకి తెచ్చాం. నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్‌కు కొన్ని ప్రతిపాద నలు చేశాం. ఆ నిధులు వస్తే మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం.(Next News) »Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *