మహా జలమైత్రి

మహా జలమైత్రిమేడిగడ్డ, తమ్మిడిహట్టి, చనాఖాకొరాట బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ర్ట ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం తెలం గాణను సస్యశ్యామలం చేసే యత్నంలో ఓ ముందడుగుగా చెప్ప వచ్చు. మహారాష్ర్టతో తెలంగాణ అనుబంధానికి వందల ఏళ్ళ చ రిత్ర ఉంది. ఈ అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసే రీతిలో ఈ ఒప్పందం కుదిరింది.
ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడే సఖ్యత కుదురుతుంది. అలా కుదిరే సఖ్యత రెండు రాష్ట్రాలకూ మేలు చేస్తుంది. అవసరం మనదైనప్పుడు అది తీరేందుకు అవసరమైతే కాస్త తగ్గడం లౌక్యం. తెలంగాణ ప్రభుత్వం ఈ విజ్ఞతను ప్రదర్శించినందువల్లే ఒప్పందం కుదిరింది. నిజానికి ఈ ఒప్పందం కొన్ని దశాబ్దాల క్రితమే కుదరా ల్సింది. కారణాలు ఏవైతేనేం, అప్పటి ప్రభుత్వం పంతానికి పోయిన రీతిలో వ్యవహరించడంతో అసలుకే ఎసరు వచ్చింది. అలాంటి స్థితి నుంచి ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు ప్రస్తుత ప్రభు త్వం పట్టువిడుపులతో వ్యవహరించడంతో ఒప్పందం అమల్లోకి వచ్చింది.
మహారాష్ర్టతో కుదిరిన ఈ ఒప్పందం అంతర్రాష్ట వివాదాల్లో చిక్కుకున్న గోదావరి, పెన్‌గంగ, ప్రాణహితలపై ప్రాజెక్టుల ని ర్మాణానికి వీలు కల్పించింది. దీంతోపాటుగా 1975 నుంచి పెం డింగ్‌లో ఉన్న పెన్‌గంగపై నిర్మించే ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చనుంది. ఉమ్మడి రాష్ర్టంలో అనవసర వివాదాలతో తెలంగాణ ప్రాజెక్టులను కాగితాలకే పరిమితం చేశారు. స్వరాష్ర్ట ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం స్నేహపూర్వక ధోరణితో ఆయా వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేసింది. ప్రాజెక్టు ఎత్తు విష యంలో వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ ముందుకు సాగింది. ఈ ఒప్పందంతో తెలంగాణలో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేందుకు మార్గం సుగమమైంది. గోదావరి నదిలో మనకు హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. జల వివాదాల పరిష్కారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు యావత్ దేశానికే మార్గనిర్దేశనం చేశారని చెప్పవచ్చు. రెండున్నరేళ్ళ లో ఈ మూడు ప్రాజెక్టులు పూర్తి కాగలవని అంచనా. లోయర్ పెనుగంగపై చనాకకొరాట బ్యారేజీతో 5.12 టీఎంసీల నీటి నిల్వకు వీలు కలుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా బేల,జైనథ్, ఆదిలా బాద్, థాంమ్సీ మండలాల పరిధిలోని 5 వేల ఎకరాలకు సాగు నీరు, 9 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు దీని వల్ల వీల వుతుంది. ప్రాణహిత ప్రాజెక్టు (తమ్మి డిహట్టి బ్యారేజీ) కింద 1. టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి వీలు కలుగుతుంది. రిజర్వాయర్లలో 14.4 టీఎంసీల నీటి నిల్వ చేసుకో వచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని మండలాల పరిధిలో 1.44 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారే జీ)తో మేడిగడ్డ వద్ద రోజుకు 2 టీఎంసీల చొప్పున 120 రోజుల్లో 240 టీఎంసీల తరలింపునకు వీలు కలుగుతుంది. ఇక్కడ నీటి నిల్వ కోసం నిర్మించే రిజర్వాయర్ల సామర్థ్యం 146.2 టీఎంసీలు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్ల గొండ, రంగారెడ్డిలలో మొత్తం 1,0,000 ఎకరాల కొత్త ఆయ కట్టుకు నీరు అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ మూడు ప్రాజెక్టుల కారణంగా మొత్తం మీద 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
కేంద్రప్రభుత్వం జోక్యం అవసరం లేకుండా ఈ ఒప్పందాలు కుదరడాన్ని ఓ విశేషంగా చెప్పవచ్చు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఘనతను సాధించడం మరో విశేషం. ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నపుడు కూడా సాధించలేని పరిష్కారాన్ని ఇప్పుడు సాధించగలగడం అభినందనీయం. గతంలో సూత్రప్రాయ ఒప్పందాలు జరిగినా అసలైన అవగాహన సాధించింది మాత్రం ఇప్పుడే. ఇదే విధమైన సానుకూల ధోరణితో తెలంగాణ రాష్ర్టం మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
దక్కన్ న్యూస్(Next News) »Leave a Reply

Your email address will not be published. Required fields are marked *