మానవీయ విలువల ‘పునాది’గా తెలంగాణను పునఃనిర్మిద్దాం!!

ప్రపంచ యువనికపై తెలంగాణ పదమెప్పుడూ ప్రత్యేకతను సంత రించుకుంటూనే ఉంటుంది. తెలంగాణ అన్న పదం నేడు కేవలం భౌగోళి కార్ధమే కాదు. ఒక ప్రాంతీయ సమూహపు ఉమ్మడి అస్థితత్వంగా రూపు దిద్దుకుంది. పోరాటాల పురిటిగడ్డగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ప్రపంచ చరిత్రలో అనేక సందర్భాలలో, అనేకానేక మౌళిక అంశాలపై స్పందిం చింది, గొంతెత్తి నినదించింది. మానవీయ విలువలకు, మరో ప్రపంచ నిర్మాణానికి ఈ నేల తండ్లాడుతోంది. నేటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ధిక్కారస్వరంగా నిలబడే ఉం ది. ‘‘పాల నవ పల్లవ కోమలమైన కావ్యకన్యకను, నృపతులకంకిత మిచ్చి, అప్పుడుపు కూడు భుజియించుట కంటే సత్కవుల్ హాలికులైననే మి?’’ అన్న పోతన వారసత్వాన్ని కొనసాగిస్తూ, పాల్కురికి, బండారు అచ్చమాంబల అడుగు జాడల్లో సాగిపోతుంది. అధర్మం అయితే అయిన వారినైనా ఎదిరించిన బందగీ, షోయబుల్లా ఖాన్‌ల నుండి కాళోజి, జయశంకర్ సార్‌ల వరకు అందరూ ఈ నేల ఔన్నత్యాన్ని అందిపుచ్చు కున్న వారే. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల సాధనలో అసువులు బాసిన నాటి 369 మంది ప్రత్యేక తెలంగాణ విద్యార్థి అమరులు ఆ పరంపర వారసులే.
స్వాతంత్య్రోద్యమ సమయంలో బనారస్ యూనివర్సిటీ నిర్వహిం చిన పాత్ర విశ్వవిద్యాలయాలకు గల ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. ఆ వరుసలోనే మరో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా 191లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. 1930లలో వందేమాతరం ఉద్యమానికి, 194651లో భూస్వామ్య, రాచరికాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి పోరాట రూపంగా జరిగిన తలెంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, ముల్కీ ఉద్యమానికీ అలాగే 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట పోరాటానికి సైతం మేధోపరమైన మద్దతుతో పాటు ప్రత్యక్ష నాయకత్వాన్నీ అందించినది. నేటి మలిదశ ఉద్యమంలో కూడా భిన్న రూపాలలో, విభిన్న మార్గాలలో అంతర్గత, బహిర్గత పోరాటాలకు వేదికగా నిలబడింది.
అటువంటి అవగాహనా వారసత్వాన్ని కొనసాగిస్తూ, సమకాలీన సమాజపు చలన సూత్రాలను అర్థం చేసుకుని, దానిని సామాజిక అభి వృద్ధికి ఉపయోగపడేలా భావజాల రంగంలో ఆరోగ్యవంతమైన చర్చకు, అర్థవంతమైన పరిష్కారాలను అన్వేషించే మేధోపరమైన కృషి నేడు అత్యంత ఆవశ్యక విషయం. ఇప్పటికే పలువేదికలు, సంస్థలు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఇంకా కొంత అంతరం మిగిలే ఉన్నది. అటువంటి అంతరాన్ని కొంతవరకైనా పూడ్చే తగ్గించేందుకు విద్యార్థి లోకం ముందుకు నడవాలనే సదుద్దేశమే ఈ సంస్థ ఆవిర్భావానికి పునాది. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను అర్థం చేసుకోవడం. భవిష్యత్ పౌరులైన విద్యార్థులలో నైతిక, మానవీయ విలువలను పెంపొందించడం, సామాజిక అభివృద్ధిలో విద్యార్తుల క్రియాశీల పాత్ర పెరిగేలా ప్రోత్సహించడం, లింగ వివక్ష, అంతరాలు లేని సమాజ నిర్మా ణం కొరకు ప్రజలతో సజీవ సంబంధాలను కలిగి ఉండటం లాంటి లక్ష్యాలతో ఈ సంస్థ పని చేయదలచింది.
నూటికి ఎనిమిది మందికి మాత్రమే విశ్వవిద్యాలయాల్లో చదువుకో గలిగే అవకాశం ఉన్న సమాజం మనది. మనకు లభించిన ఈ అపూర్వ అవకాశం వెనుక మన తల్లిదండ్రుల రెక్కల కష్టంతో పాటుగా అశేష తెలంగాణ శ్రమ జీవుల త్యాగం ఉన్నది. తలాపున కృష్ణ గోదావరులు పారుతున్నా, సాగునీరు లేని కారణంగా లక్షలాది పంట భూములు బంజరు బీళ్ళుగా మారినయి. ప్రజల కనీస హక్కు అయిన రక్షిత మంచి నీరు లేక ఫ్లోరైడ్ నీటితో నల్లగొండ నరకయాతన అనుభవిస్తున్నది. చేద్దామన్నా పనికొదరకక పాలమూరు, దేశాలకు దేశాలు దాటిపోతుంది. చేనేత కార్మికులు, రైతులు పురుగు మందులకు, ఉరితాళ్ళకు బలవుతు న్నారు. గోదావరి పొడుగూత ఓపెన్‌కాస్టుల పేరిట ప్రజలకు బొందల గడ్డలు తవ్వుతున్నారు. మైదాన ప్రాంతాలలో సెజ్‌లు, రియల్ ఎస్టేట్ల, షెడ్యూల్డ్ ప్రాంతాలలో టైగర్ జోన్‌లు, మైనింగ్ ప్రాజెక్టులతో, లక్షలాది మంది పేద ప్రజానీకం, ముఖ్యంగా దళితులు, ఆదివాసులు నిర్వాసితులు అవుతున్నారు. అభివృద్ధిపేరిట నేడు తెలంగాణలో విధ్వంసం రాజ్యమేలు తున్నది. ఇందుకు దేశంలో కొనసాగుతున్న నూతన ఆర్థిక విధానాలతో పాటు, తెలంగాణను పీల్చి పిప్పిచేయాలనే దురాశాపరులైన సీమాంధ్ర పాలకవర్గాల విధానాలే ప్రధాన కారణం.
మిత్రులారా! ఆరు దశాబ్దాల అలుపెరుగని తెలంగాణ పోరాటం నేడు అంతిమ దశకు చేరుకుంది. ప్రత్యేక తెలంగాణరాష్ర్ట ఏర్పాటు అనివార్యం. అందుకే రేపటి తెలంగాణలో విద్యా, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి విధానాలు, రాజ్యాంగబద్ధమైన పాలన, సంపద, వనరుల సమాన పంపిణీ, సామాజిక న్యాయం లాంటి అనేక అంశాలు ఎలా ఉండాలో ముందే చర్చించుకోవాలసి ఉన్నది. అందుకు తగిన విధంగా మనం తయారు కావలసి ఉన్నది. వివక్ష అసమానతలు లేని సమాజ నిర్మాణం కొరకు పునాదులు వేసే బృహత్తర కార్యక్రమంలో కలిసి రావల్సిందిగా విద్యార్థి లోకాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
లక్ష్యాలు: సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై సైద్ధాం తిక అవగాహన. తెలంగాణ ప్రాంత భాష, చరిత్ర, సంస్కృతి, పరి రక్షణ. విద్యారంగ సమస్యలు, శాస్త్రీయ విద్యాబోధన ఆవశ్యకతల సమగ్ర చర్చ. వనరుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాల చర్చ, రూపకల్పన. సామాజిక బాధ్యత, మానవీయ విలువలతో కూడిన మరో తెలంగాణ పునఃనిర్మాణానికి పునాదులు.
విశ్వవిద్యాలయాల సామాజిక బాధ్యతను గుర్తిద్దాం!


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *