వరంగల్ ఉప ఎన్నికలో ‘తెలంగాణవాదం’

ఓరుగల్లు పోరులో టీఆర్‌ఎస్ మరోసారి ఘనవిజయం సాధించిం ది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని భ్రమించిన వి పక్షాలకు ఈ ఉప ఎన్నిక ఫలితం షాక్ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ అభ్య ర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఒక దశలో ఈ ఎన్నికను కేసీఆర్ పాల నపై రెఫరెండం అంటూ రంకెలు వేసిన వారికి ఒక్కసారిగా నోట మా ట పడిపోయింది. నెగెటివ్ ప్రచారం ఒక్కటే తమను గెలిపిం చలే దన్న వాస్తవం విపక్షాలకు తెలిసివచ్చింది. తెలంగాణ ఇచ్చామని చెప్పు కునే కాంగ్రెస్‌ను ఓటర్లు రెండోస్థానానికే పరిమితం చేసి, తెలంగాణ సాధన లో కీలకపాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు. అదే వి ధంగా సీమాంధ్ర పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీని ప్రజలు మూ డోస్థానంతో సరిపెట్టారు.
వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలను చూస్తే టీఆర్‌ఎస్ 6.15 లక్షల ఓట్లు పొంది గెలిచింది. కాంగ్రెస్ 1.56 లక్షల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ మద్దతు ఉన్న బీజేపీ 1.3 లక్షల ఓట్లు పొం ది మూడో స్థానంలో నిలిచింది. ఏదైనా కొత్త ప్రభుత్వ ఏర్పడిన తరు వాత మొదటి ఆరు నెలల కాలాన్ని ‘హనీమూన్’గా అభివర్ణిస్తుంటారు. ఆ కాలంలో ప్రభుత్వ తప్పి దాలను ప్రజలు పెద్దగా పట్టించు కోరు. ఆ తరువాత మాత్రం ఆ ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి, అది అ నుసరించే ధోరణులను బట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంటుంది. టీఆర్‌ఎస్ విషయానికి వస్తే, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచిపో యింది. ఈ కాలంలో ఏ ప్రభుత్వంపైనైనా అంతో ఇంతో ప్రభుత్వ వ్య తిరేకత ఉంటుంది. అలాంటి ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఓట్లుగా మూటగట్టుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయంటే దాని అర్థం ఏ మిటి? ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏదైనా ఉన్నా దాన్ని మించిన రీతి లో తెలంగాణవాదం తన ప్రభావాన్ని కనబర్చింది. తెచ్చుకున్న అరువు అభ్యర్థి కాంగ్రెస్‌కు భారమైపోయారు. ఆ బరువును ఓటర్లు దించివేశా రు. ఇక బీజేపీ విషయానికి వస్తే, సీమాంధ్ర పార్టీతో ఆ పార్టీ పొత్తు సీ మాంధ్రలో మాత్రమే చెల్లుతుందన్న విషయాన్ని ఓటర్లు స్పష్టం చేశారు. తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు స్థానం ఉండబోదని చాటిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కనబరుస్తున్న సవతి తల్లి ప్రేమను ఎం డగట్టారు. కేసీఆర్ అసభ్య భాషను మాట్లాడుతారని విమర్శించే విపక్ష నాయకులు ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఉపయోగించిన భాష ఓటర్ల ను నొప్పించింది. ఈ కారణంగా కూడా ఎంతో మంది టీఆర్‌ఎస్ వైపు మళ్ళారు. విపక్షాలు తమ ఓటమికి అనేక కారణాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాలు ఆగిపోతాయని సామాన్య ప్రజలు, పనులు చేయిం చుకునే అవకాశం పోతుందని ద్వితీయ శ్రేణి నాయకులు భయపడి ఓట్లు వేశారని అంటున్నాయి. ఈ రెండు అంశాలు మాత్రమే అటు వి పక్షాలకు డిపాజిట్లు సైతం రాకుండా చేసి టీఆర్‌ఎస్‌కు ఈ విధమైన అత్యధిక మెజార్టీని కట్టబెట్టాయంటే నమ్మడం కష్టం. వాటిని మించిన అంశాలేవో ఈ ఉప ఎన్నికల్లో తమ ప్రభావాన్ని కనబర్చాయన్నది స్పష్ట మవుతోంది. విపక్షాల అభ్యర్థులు స్థానికులు కాకపోవడం, అసభ్య భా షలో కేసీఆర్‌పై విమర్శలు, సీమాంధ్ర పార్టీలనే ముద్ర లాంటి అంశా లెన్నో విపక్షాల ఓటమికి కారణాలుగా నిలిచాయి.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడి కేవలం ఏడాదిన్నర మాత్రమే అయింద ని, తెలంగాణ వాదాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలంటే ఈ గడ్డపై నుంచి సీమాంధ్రపార్టీలు వెళ్ళిపోయేంత వరకు ఇంటిపార్టీని గద్దెపై ఉంచాలని పలువురు తెలంగాణవాదులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌అం టే ప్రత్యేక అభిమానం లేకపోయినప్పటికీ, కేవలం తెలంగాణవాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా నిలుస్తు న్న వారు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు.
కడియం శ్రీహరి పేరిట ఉన్న రికార్డును అధిగమించి టీఆర్‌ఎస్ అ భ్యర్థి పసునూరి దయాకర్ 4 లక్షల పైచిలుకు మెజారిటీ సాధించడం విశేషం. త్వరలో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలోనూ ఇదే విధమైన ఫలితం పునరావృతం కాగల దని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
మురళి


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *