విద్యుత్ సమస్య పరిష్కారాలు

తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్‌సీ) ఆధ్వర్యంలో ప్రతీ వారం నిర్వహించే ‘చర్చ’ కార్యక్రమంలో భాగంగా 146వ చర్చలో ‘తెలం గాణలో విద్యుత్ సమస్యలుపరిష్కార మార్గాలు’ అనే అంశంపై చర్చ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్ లోని చంద్రం భవన్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఆఫ్ తెలంగాణ రాష్ర్ట డివిజనల్ ఇంజనీర్ పి.మోహన్‌రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అడ్వయిజర్ ఇంజినీర్ నీలం జానయ్య, తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.శివాజీ, ప్రొ. లక్ష్మణ్, డా॥ జె.సురేశ్, శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ప్రసంగించారు.కార్యక్రమానికి టీఆర్‌సీ ఛైర్మన్ వేదకుమార్ అధ్యక్షత వహించారు. ఆయా వక్తలు పేర్కొన్న అంశాలు క్లుప్తంగా…
వేదకుమార్ …
తెలంగాణ వచ్చాక కూడా ఈ టీఆర్‌సీ అవసరమా అనే చర్చ వ చ్చింది. కానీ తెలంగాణ సాధించాక పునఃనిర్మాణం కోసం మనం చేయవల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. శాతవాహనుల కాలంలో కోటిలింగాల కేంద్రంగా దక్షిణ భారతదేశానంతటిని పాలించిన ఘనత మన ప్రాంతానికి ఉంది. అలాంటి చారిత్రక ప్రాంతం కోటిలింగాల శ్రీపాద ప్రాజెక్టు వలన ముంపునకు గురవుతుండటంతో టీఆర్‌సీ త రఫున ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం కూడా మన ప్రతిపాదనలు అంగీకరించి ఆ ప్రాంతరక్షణకు కృషి చేస్తానని హామీ ఇచ్చింది. వేరుగా ఉన్న మన ప్రాంతం పటేల్ పోలీసు చర్య తరువాత భారతదేశంలో విలీనం అయింది. తెలంగాణ ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రతి ఒక్కరు దృఢ సంకల్పంతో ముందుకు కది లారు. అలాంటివారి ఆశలు, ఆశయాలు నెరవేరడానికి, ఇలాంటి వేదికలు, చర్చ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. అందు కోసం ఈ వేదిక నిర్విరామంగా కృషి చేస్తుంది.
విభిన్న ప్రాంతాల వారు నివసించడానికి అనువుగా ఉన్నటు వంటి ప్రాంతం మనది. అంతగా రక్షణ కల్పిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఇక తెలంగాణ ప్రజలు తమకు లేకున్నా ఎదుటివారికి ఇచ్చే స్వభావం కలిగినవారు. రాజకీయ కుట్రలో భాగంగా తెలంగాణ ఉమ్మడి రాష్ర్టం నుంచి వేరుపడకుండా కుట్రపన్నారు. కానీ వేరు అ య్యాక కూడా అలాంటి కుట్రలు జరగకూడదు. ఎవరికి ఎలాంటి అన్యాయం జరకుండా ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేసేలా చూడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. సామాజిక కార్యకర్తలుగా కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరం కృషి చేయాల్సిన అవ సరం ఉంది. అనేక ప్రాంతాలు సందర్శించి వారు ఎదుర్కొంటున్న కష్టాల్ని తెలుసుకొని ఆయా అంశాల పైన నిపుణులతో ఈ వేదిక ద్వారా చర్చించి వారికి న్యాయం చేద్దాం.
నీలం జానయ్య…
బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇంకా ఉద్యమంగా పనిచేయ వల్సిన అవసరం ఉంది. విద్యుత్ సమస్య జటిలం చేయటానికి ఆంధ్ర పాలకులు కుట్రలు చేస్తున్నారు. 144 ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ సెక్టార్ తో1909లో హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ప్రారంభమైంది. నిజాం నవాబు కట్టె స్తంభాలు ఏర్పరిచి విద్యుత్ అందించారు. ఎలక్ట్రి సిటీ బోర్డు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా ప్రారంభం అయ్యాక డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌గా విభజించి, డిస్ట్రిబ్యూషన్‌ను కమర్షియల్ ఆర్గనైజేషన్ చేయాలని 4 కంపెనీలుగా చేసి తెలంగాణలో రెండు, ఆంధ్రలో రెండుగా తీసుకొచ్చేంత వరకు కూడా ఆంధ్ర వారి పెత్తనం ఉండేది. మన వనరులు ఉపయోగించుకొని మనకు వాటా ఇవ్వకుండా చట్టాన్ని తమచేతిలోకి తీసుకొని విద్యుత్ సమస్యలు సృష్టిస్తు న్నారు. తెలంగాణలో ప్లాంట్లు లేకుండా, వచ్చిన వాటిని ఆంధ్రకు తరలిస్తూ డిమాండ్‌కు తగ్గ సప్లై లేకుండా ఆంధ్ర అధికారులు పని చేశారు. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్ర పాలకులు చూడ టం లేదు. లక్షల పంపుసెట్లు మన ప్రాంతంలో ఉన్నాయి. వీటితోపాటు పరిశ్రమలకు, గృహ అవసరాలకు ఇవ్వటానికి గల సామర్థ్యం సరి పోవటం లేదు. మనకు కేటాయించిన బొగ్గు కూడా ఇవ్వకుండా సీ మాంధ్ర ప్రభుత్వం జులుం చేస్తోంది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉల్లంఘిస్తున్నారు. రేషియో ప్రకారం ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా వేధిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు అయిన కృష్ణపట్నం ప్లాంటు నుంచి మనకు రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. చైనా నుంచి వచ్చిన బృందం సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి సానుకూలంగా ఉంది. వీరితో నేను ప్లాంట్లు సందర్శించి మాట్లాడాను. వారికి ప్లాంటు ఏర్పాటు చేసేందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నది.
రంగారెడ్డి, హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రూ.3950 కోట్ల సబ్సిడీని చెల్లిస్తున్న ప్రభుత్వం అదే సబ్సిడీని గవర్న మెంటు తరఫున కాకుండా జెన్‌కోకు ఈక్విటీగా చెల్లిస్తే, కావాల్సిన మిగితా సొమ్మును బ్యాంకుల ద్వారా తీసుకొని రెండేళ్ళలో విద్యుత్ ఇవ్వగలం. 34 నెలల్లో సోలార్ విద్యుత్ ఇవ్వటానికి సాధ్యం అవు తుంది. ఆఫ్‌గ్రిడ్ సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తే 10 లక్షల పంపు సెట్ల నుంచి వారు వాడుకున్న విద్యుత్ పోగా మిగిలిన విద్యుత్‌ని గ్రి డ్‌కు అనుసంధానం చేయటం వల్ల మిగితా కరెంట్ గ్రిడ్‌కు వస్తుంది. నాణ్యమైన విద్యుత్‌ని ఇవ్వగలం. సోలార్ పంపుసెట్లు, కెసాసిటర్ల వాడకం పైన ప్రభుత్వం సామాజిక వేదికల ద్వారా ప్రజలకు అవ గాహన కల్పించాలి. ఎన్నెన్ని కెపాసిటర్లు వాడుతున్నారు అనేది తెలుసు కోవటానికి ప్రతి యూనిట్ మీద ఎనర్జీ ఆడిట్ చేసి విద్యుత్ ఆదా చేసుకోగలం. బొగ్గుతో నడిచే 1000 మెగావాట్ల ప్రాజెక్టుల ద్వారా 2000 మెగావాట్లు, లోకల్ ప్లాంట్ల ద్వారా వచ్చే విద్యుత్ ద్వారా మ నం 3,000 మెగావాట్లు సమకూర్చుకుని విద్యుత్ కోతలను తగ్గిం చుకోగలం. సోలార్ ఎనర్జీ కారొే్పకరషన్ ఏర్పాటు చేసి 350 మండ లాలలో ఆ మండలాల వారికి విద్యుత్ సమకూర్చగలం. గ్యాస్ ద్వారా వచ్చే విద్యుత్ ఉపయోగించుకునేందుకు నాయకులు, సామాజిక వేదికలు కలసి పని చేస్తే విద్యుత్ సమస్య పరిష్కరించుకోగలం.
మోహన్‌రెడ్డి ..
తిండి, గుడ్డ, గూడుతో పాటు విద్యుత్ కూడా నాలుగో స్థానంలో ముఖ్య అవసరంగా ఉంది. మన వ్యవసాయం విద్యుత్ ఆధారంగానే చేస్తున్నాం. పట్టణలతో పాటు గ్రామాల్లో కూడా విద్యుత్ అవసరం చాలా ఉంది. నిధులు, వనరులు వాడుకుని మనకు ఆంధ్ర పాలకులు అన్యాయం చేశారు. 1001900 మెగావాట్ల కెపాసిటి ప్రైవేట్ కంపెనీల ద్వారా మనకు ఉంది. కానీ వాటి ద్వారా మనం ఉత్పత్తి చే సుకోలేక పోతున్నాం. బొగ్గు, నీటిద్వారా మాత్రమే మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలం. కేవలం 15% మాత్రమే సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలం. వర్షాకాలంలోనే విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి చేసుకోగలం. బొగ్గు ద్వారా 2250 మెగా వాట్ల విద్యుత్ ఉత్ప త్తి మాత్రమే ఉంది. 2500 మెగావాట్లు విద్యుత్ సెంట్రల్ పవర్ డిస్ట్రి బ్యూషన్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్ ప్లాంట్ల ద్వారా వచ్చే విద్యుత్‌లో తెంగాణకు 53.9% ఆంధ్రప్రదేశ్‌కు 46.11% కేటాయించారు. పి.పి.ఎల ప్రకారం పంచుకోవాలని 12వ షెడ్యూల్‌లో చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నది.
మనకు 000 మెగావాట్ల విద్యుత్ అవసరం. 6000 మెగావాట్లు ఉత్పత్తి చేసుకోగలం. మిగతా 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చే సుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జనరేటింగ్ డిస్టిబ్యూషన్ ద్వారా తక్షణం ఆదుకోవాలి. దేశంలోనే తెలంగాణ 20% విద్యుత్ లోటుతో ఉన్న ప్రాంతం కాబట్టి తెలం గాణకు 500 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయింపేతర విద్యుత్ కింద రబీకి ఇవ్వాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. వచ్చే రబీలో ఆరుతడి పంటలు రైతులు వేసేందుకు ప్రభుత్వం అవగాహన కల్పించడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో, పట్టణాల్లో విద్యుత్ తక్కువ వాడటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేసుకోగలం. కృష్ణపట్నం 1600 మెగావాట్ల కెపాసిటీలో 00 మెగావాట్లు మనకు వస్తుంది. ఈ విద్యుత్ ఇవ్వకుండా ఉండటానికి అడ్డంకులు సృష్టిస్తున్నా రు. వెంటనే దీనిపై సీఓడీ డిక్లేర్ చేసి మన విద్యుత్ మనకు ఇవ్వాలి. నెల్లూరు థర్మల్ నుంచి 1300 మెగావాట్లు వస్తుంది. ఆంధ్ర నుంచి 500 మెగావాట్లు వచ్చేది ఉంది. కాబట్టి మనం కొంతమేరకు ఆదా చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించగలం. విద్యుత్ ఉత్పత్తి కన్నా ఆదాచేయటం ముఖ్య అవసరం.
పంపుసెట్లకు కెపాసిటర్లు చాలా అవసరం. వీటి అన్నింటికి కెపాసిటర్లు బిగించడం ద్వారా 300 మెగావాట్ల విద్యుత్ ఆదా చేయ గలం. గృహాల్లో సీఇఎల్, ఎల్‌ఈడి బల్బులు వాడటం ద్వారా విద్యుత్ ఆదాచేయగలం. బొగ్గుద్వారా వచ్చే వ్యర్థాలు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించాలి. దీనిద్వార పర్యావరణాన్ని రక్షించగలం. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేసి ఎక్కడ ఉత్పత్తి అయిన కరెంట్ అక్కడే ఇవ్వగలం. దీనిద్వారా విద్యుత్ సమస్యను అధిగమించగలం. కాబట్టి ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పట్టణల్లో రూఫ్‌టాప్ ఏర్పరుచుకునేం దుకు ప్రోత్సహించడం ద్వారా 100200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగలం. ఈ రూఫ్‌టాప్ వ్యయం రూ.లక్ష మాత్రమే అవు తుంది. కాబట్టి ప్రభుత్వం వాటిని ప్రోత్సహించాలి. అధిక వినియోగం ఉన్నచోట సోలార్ విద్యుత్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలి. తెలంగాణ వారినే విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా నియమించటం ద్వారా మన ప్రాంతానికి కావాల్సిన అన్ని పనులుచేసుకోగలం కాబట్టి అలాంటి వారిని మనం నియమించుకోవాలి.
గద్దర్ …
విద్యుత్ ఇంజనీర్లుతో సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో భూమినిధుల అవసరం, పాలనపరమైన సమస్య తీరింది. కానీ ఎలక్ట్రిసిటీ పవర్ ప్రధాన సమస్యగా అయింది. ఎప్పుడైనా చర్చల ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయాలి. టీఆర్‌సీ ద్వారా చర్చించాక మనం చేసిన తీర్మానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. సమ స్యను రాజకీయంగా, సామాజికంగా ఆలోచించాలి. అలాంటప్పుడే సమస్య పరిష్కారం కనుక్కోగలం. ఈ వేదిక ద్వారా తీర్మానాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి సమస్య పరిష్కార కోసం నేను ఈ వేదిక దగ్గరకు వచ్చాను. ఒక సైనికునిలా అనేక గ్రామాలు, చెరువులు సందర్శించా ను. శాస్త్రీయంగా ఆలోచించి ప్రజల పాత్ర ఏంటి అనే అంశంపై నిపుణులు తెలియజేయాలి. ఈ సమస్య పరిష్కారానికి చత్తీస్‌గఢ్ ెం మంత్రితో మాట్లాడాను. జీవిత విధానమే విద్యుత్ అయింది. ఇవాళ మన వ్యవసాయం కేవలం బోర్లమీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈ వేదిక ద్వారా రాజకీయనాయకులు, ప్రజలు మేధావులు ఏం చేయాలనే పతిపాదనలు చేసుకొని ఈ సమస్యను పరిష్కరించుకుం దాం. రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు కోసం కేంద్రంపై ఉద్యమాలు చేయాలి. తెలంగాణ రావటమే కాదు. మన వనరులు మనమే వాడుకోవాలి. ఈ చర్చద్వారా రాష్ర్టవ్యాప్తంగా సమగ్రమైన అవగాహన రావాలి. చర్చలు జరగాలి. అందుకు పత్రికలు కృషి చేయాలి. అలాంటి చర్చ ఏర్పాటు చేసిన టిఆర్‌సికి అభినందనలు. ఇక్కడి ప్రతిపాదనలు జాతీయ, అంతర్జాతీయ మీడియాను పిలిచి వివరించాలి. సమగ్రమైన చర్చ జరిపి సమస్య పరిష్కారానికి అందరం కృషి చేయాలి.
శివాజీ …
మిక్స్‌డ్ పవర్ చాలా అవసరం, దీంతో పాటు విద్యుత్ ఆదా, ప్రజల సహకారం విద్యుత్ సమస్య పరిష్కారానికి చాలా అవసరం. అక్టోబర్‌లో విద్యుత్ వినియోగం చాలా ఉంటుంది. ఈనెలలో 10 మిలియన్ యూనిట్లు అవసరం అవుతుంది. కానీ మనం 120 మిలి యన్ యూనిట్లు మాత్రమే సప్లై చేయగలిగాం. ఈ పరిస్థితి ఇంతకు ముందు కూడా ఉంది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తోంది. జనరేషన్‌కు తగ్గట్టుగా మనం వాడు కోవాలి లేదా వాడకానికి తగ్గట్టు మనం జనరేట్ చేయాలి. ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. లోడ్‌కు కావాల్సి సౌకర్యాలు చూసిలేదా వనరులు ఉన్న చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్‌కు 2200 మెగావాట్ల విద్యుత్ అవసరం. రాష్ర్ట విద్యుత్‌లో 26% హైదరా బాదే వాడుకుంటోంది. దీనికి కారణం పరిశ్రమలు, కార్యాలయాలు ఇక్కడ అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఎక్కువ విద్యుత్ ఆదా చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రజల్ల అవగాహన కల్పించాలి. 1900 మెగావాట్ల జనరేషన్ కెపాసిటిలో 500 మెగావాట్ల మాత్రమే తెలంగాణలో ఉంది. మిగితా 1400 మెగావాట్లు విద్యుత్ సీమాంధ్ర చేతిలో ఉంది. మన దగ్గర ఉన్నది 20002500 మెగావాట్ల విద్యుత్ మాత్రమే. వేసవిలో డిమాండ్ పెరిగి గడ్డుకాలం రానుంది. లిబరలై జేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వలన ఎలక్ట్రిసిటీ కమర్షియల్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కొందాం అన్నా కూడా తెలంగాణకు ఒక్క రాష్ర్టం నుంచి కూడా విద్యుత్ కనెక్షన్లు లేవు. ఈ విషయాలు తెలిసిన కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ సమస్య వస్తుందని చెప్పారు. అప్పుడు మనం అతనికి కౌంటర్‌గా మాట్లాడం తప్ప ఈ సాంకేతిక అంశాల్ని పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టు తెలంగాణ అవసరాల ప్రకారం కట్టాలి. దానిద్వారా ఉత్పత్తి అయ్యే 990 మెగావాట్ల విద్యుత్ పూర్తిగా ఖమ్మం జిల్లాలో కేటాయించాలని జీవో ఎంకు నివేదిక ఇచ్చాం. రూ.60,000 కోట్లను తెలంగాణ ఎలక్ట్రిసిటికి ప్రత్యేక పాకేజీగా ఇవ్వా లని మేం కోరాం. రాష్ర్టంలో అందరికీ విద్యుత్ అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ, తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఎలక్ట్రిసిటీ బోర్డులో ఆంధ్రపాలకులు ఉండటం వలన ఆ ప్రతిపాదనలు మనకు దక్కకుండా ఆంధ్ర ప్రాంతానికే తరలించుకుపోయారు. ఈ ప్రతిపాదన కింద కేంద్రం రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే ప్లాంట్లకు సబ్సిడి ఇస్తుంది. దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.15వేల కోట్ల సబ్సిడీ కేంద్రం నుంచి తీసుకోబోతుంది. 23 జిల్లాలకు సంబంధించి విద్యుత్ ఇవ్వటానికి కేటాయించే పత్రాన్ని వారు దాచిపెట్టి మనవాటా అక్రమంగా తీసు కుంటున్నారు. ఇక్కడ విద్యుత్ లేదని ప్రచారం చేయటం ద్వారా మనకు వచ్చే పరిశ్రమలను తరలించుకుపోవాలని కుట్ర పన్నుతున్నా రు. కృష్ణపట్నంలో మనకు 55% వాటా ఉన్నప్పటికీ అక్కడి విద్యుత్ ఇంకా ఇవ్వటం లేదు. దీని నుంచి విద్యుత్ వస్తే రూ.150 కోట్ల మేరకు మనపై భారం పడకుండా ఉండేది. షోలాపూర్ నుంచి రాయ చూర్, కర్నూల్ నుంచి కృష్ణపట్నం, కృష్ణపట్నం శ్రీకాకుళం సెంట్రల్ గవర్నమెంట్ 765 లైనులో 750 మెగావవాట్ల పవర్ వాడుకోవచ్చు. ఆ పవర్ వస్తే మహబూబ్‌నగర్ మొత్తం ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ పక్క నుంచే ఈ లైన్లు ఉన్న మనకు ఎక్కడా కనెక్టివిటి లేదు. దీంతో ఆ విద్యుత్ మనం తీసుకోలేకపోతున్నాం. మనకున్న విద్యుత్ కారిడార్‌ను వారు తరలించుకు పోయారు. అప్పుడు ఒక్క నాయకుడు కూడా దీనిపై మాట్లాడలేదు. జాయింట్ ఎఆర్‌సిని ఏర్పాటు చేయాల్సింది పోయి, ఎఆర్‌సి అధికారిగా ఆంధ్రవ్యక్తిని పెట్టారు. దీ నితో సమన్వయం లేకుండా పోయింది. ట్రాన్స్‌కోకు సీఎండీ, డైరెక్టర్లు లేరు. దీనిద్వారా డైరెక్షన్స్ సరిగా ఉండటం లేదు. కోల్ ఇండియా కింద ఉండటం వలన థర్మల్ విద్యుత్ ఉపయోగించుకోలేకపోతున్నాం. 60,000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం దేశంలో మన రాష్ట్రానికే ఉంది. సోలార్ పవర్‌ను అత్యంత ఆవశ్యకం గా ఉపయోగించుకోవాలి. సోలార్ విద్యుత్‌కు రూ.4,500 కోట్లను ఒక సం॥ ముందుగానే ఇవ్వటం ద్వారా 30% సబ్సిడీలోన్ తెచ్చి 3000 మెగావాట్లు ఉత్పత్తి చేసుకోగలం. దీనికి ప్రభుత్వం ముందుకు రావాలి. 1000 మెగావాట్లు ఉత్పత్తికి గ్యాస్ కేటాయింపులకు సం ప్రదించాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన బొగ్గు ఆంధ్రకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోయింది. అక్కడి అధికారులు మనవారు కాక పోవటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. థర్మల్ యూన్లి ఓరాయిలింగ్ జరగటం లేదు. వీటిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ప్రజలు ఒక్కొక్కరు ఒక్క యూనిట్ విద్యుత్ ఆదా చేసినా రైతు ప్రాణం నిలబడి మనకు కావాల్సిన కూడు అందుతుందనే సామాజిక స్పృహలో పట్టణ ప్రజలు ఆలోచించి విద్యుత్ ఆదా చేయాలి. కరెంట్ అనేది అవసరానికి వాడాలి కానీ లగ్జరీలకు ఉపయోగించుకోకూడదు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణపై ఆదరణ తక్కువగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
డి.పి.రెడ్డి
మేం సోలార్ పవర్‌ప్లాంట్‌పై ప్రజంటేషన్‌ను గోయల్, హరీష్ రావుగారికి చూపించాం. 446 మండలాల్లో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో 25 సం॥ వరకు మనకు విద్యుత్ సమస్య తీరుతుంది. సోలార్ పవర్ అనేది అన్ని విద్యుత్ ఉత్పత్తులకన్నా అత్యంత ఆవశ్యకమైనది. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ పరిశ్రమలు ఆంధ్రకు తరలిపోతున్నాయి. వీటిపై దృష్టి సారించాలి. సోలార్ విద్యుత్ ద్వారా విద్యుత్ వినియోగంతో పాటు విద్యుత్ అమ్మి దాన్ని డబ్బు చేసుకోవచ్చు. దీన్ని ప్రజలకు తెలియజే యాలి. సోలార్ విద్యుత్ ప్లాంట్‌ల పై ఇన్వెస్ట్ చేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం దీనిపై స్పందించి అవకాశాల్ని కల్పించాలి.
సురేష్…
భారతదేశ వ్యవసాయం పూర్తిగా దోపిడికి గురి అవుతోంది. నెహ్రూ హయాంలో కొంతమేరకు ఈ పరిస్థితి మెరుగుపడినప్పటికి 0 దశకం తరువాత మళ్ళీ వెనక్కి వెళుతున్నాం. తెలంగాణ ప్రాం తం ఎత్తులో ఉండడం కారణంగా నీరు అంతా కిందికి పోతుంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి నీరు అందించకుండా నిర్లక్ష్యం చే శాయి. 0వ దశకం తరువాత పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల తర్వాత ఆత్మహత్యలు పెరిగాయి. వ్యవసాయానికి కావాల్సింది ముఖ్యంగా సాగునీరు. కానీ ఈ అంశాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కెట్ చేతిలోకి వ్యవసాయం వెళ్లడంతో వ్యవసాయం లాభసాటిగా లేదు. మన రైతులు తప్పనిసరిగా బోర్లపైన ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్న చెరువులు కూడా ధ్వంసం అయ్యాయి. ఏ రైతు ఉచిత విద్యుత్, రుణమాఫీలు అడగం లేదు. రైతుకు కావాల్సిన మద్ధతు ధర, నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. అలాంటి సమయంలో అతనికి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు అవసరం లేదు. విత్తనోత్పత్తిదారునిగా ఉన్న రైతును వినియోగదారునిగా మార్చుతున్నాం. నీరు భూగర్బజలాల్లో లేక ఒక్కో రైతు 50 బోర్లు వేస్తున్నారు. హైదరాబాద్‌లోని 1100 చెరువుల్లో 500 చెరువులు కనుమరుగైనాయి. వాటి స్థానంలో భవనాలు వెలిసాయి. తెలంగాణ రైతు బతకాలంటే విద్యుత్‌పై రైతు ఆధారపడని పరిస్థితి ఉండాలి. గొలుసుకట్టు చెరువులు చేసి చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెంచి సాగు విస్తీర్ణాన్ని పెంచేం దుకు కృషి చేయాలి. పంట చేతికి వచ్చిన సమయంలో రైతుకు నీరు, కరెంటు లేకపోవడంతో మిత్తికి తీసుకు వచ్చిన అప్పు, ఎండి పోతున్న పంటను చూసి ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. గ్రామ పంచాయితీల్లో చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు పునరుద్ధరించాలి. ఇటీవల ప్రపంచం అంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే దేశాలు నిలదొక్కుకొని నిల బడ్డాయి. దీనికి కారణం వ్యవసాయం. అలాంటి వ్యవసాయాన్ని మనం విస్మరించకూడదు. ప్రైవేటీకరణ వలన రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. ఇవాళ విద్యుత్ ప్లాంట్లు కూడా ప్రైవేట్ రంగంలో ఉండటం వలన విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. శాస్త్రీయంగా, వాస్తవాలకు దగ్గరగా ఆలోచించడం ద్వారా వ్యవసాయాన్ని పెంచి రైతు ఆత్మహత్యలు నిరోధించవచ్చు. వ్యవసాయానికి, విద్యుత్‌కు సంబంధం ఉండకూడదు. చెరువులు, కుంటల ద్వారా వ్యవసాయం చేసేలా రైతును ప్రోత్సహించాలి. ఆరుతడి పంటలు ప్రోత్సహించాలి. చిన్న నీటి వనరులు రక్షించుకోవాలి. దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్ళాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఆర్థిక సహాయం అం దించాలి. అతని అప్పులో సగాన్ని అయిన ప్రభుత్వం తీరిస్తే ఆ కుటుంబం సంక్షోభం నుంచి బయటపడుతుంది. అన్నదాతను రక్షించుకునే సామాజిక బాధ్యత మనందరిది. కాబట్టి రైతును రక్షించు కొని దేశం సుభిక్షంగా ఉండేలా పాటుపడదాం.
ప్రొ॥ లక్ష్మణ్…
మనది వ్యవసాయ ఆధారిత దేశం. పాలకులకు ముందుచూపు లేకపోవటం వలన సంప్రదాయ వ్యవసాయం కనుమరుగైంది. అన్నం పెడుతున్న రైతును అడుక్కునేలా చేస్తున్నాం. దీనికి కారణం రాజకీయా లు, అంతర్జాతీయ మార్కెట్ విధానం. సంప్రదాయ పంటల విధానం మారి మల్టీనేషన్ కంపెనీల కారణంగా విత్తనాలను రైతులు తయారు చేసుకోలేక కల్తీ విత్తనాల కారణంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. ఈ విధ్వంసం ద్వారా మొత్తం మానవ సంబంధాలే విధ్వంసం అయ్యాయి. భూసార పరీక్షలు చేయకుండా విత్తనాలు వేయటం ద్వారా రైతు నష్టపోతున్నాడు. మల్టీనేషన్ కంపెనీలకు భారతదేశ వ్యవసాయం ఒక ప్రయోగశాలగా మారింది. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. వ్యవసాయ శావేత్తలు సంప్రదాయ వ్యవసాయంపై ఆలో చించడం లేదు. కేవలం జీతం తీసుకుంటే చాలు అనే ఆలోచనలో ఉన్నారు. మనిషి పరిణితి చెందేకొద్ది పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాం. పెట్టుబడిదారులకు నీటి వనరులు దోచిపెడుతున్నాం. రైతుకు అవసరమైన నాణ్యమైన కరెంటు ఇస్తేచాలు. ప్రజాప్రతినిధులు ఆ నియోజకవర్గాల్లో ఉండకుండా పట్టణాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. భూసార పరీక్షలు చేసి ఏ విత్తనాలు వాడాలి, ఏ కాలంలో ఏపంటే వేయాలి అనేది సూచించాలి. రైతును రైతుగా చూస్తే రూ.లక్ష రుణ మాఫీ చేయవలసిన అవసరం లేదు.
రాజారాంరెడ్డి (ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్)..
ఏదైనా షాపు వాడు అతని షాపులో వస్తువులు వాడవద్దని చెప్పడు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన మేం కరెంటు వాడద్దని చెప్పడం చాలా దురదృష్టకరం. విద్యుత్ ఆదాచేయటానికి మేం చెప్పే గొంతు సరిపోదు. కాబట్టి ఇలాంటి వేదికలు, గద్దర్ లాంటి కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. కెపాసిటర్లు వాడటం ద్వారా 20% విద్యుత్ ఆదా అవుతుంది. మోటార్‌పై వెయిట్ తగ్గి మోటారు కాల పరిమితి పెరుగుతుంది. దీని ద్వారా రైతుకు, దేశానికీ లాభం.
దేవేశ్‌కుమార్ (ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్)
గవర్నమెంట్ బిల్డింగ్‌లు, విద్యుత్ సంస్థ బిల్డింగ్‌ల పైన సోలార్ ఉపకరణాలు పెట్టారా? కెపాసిటర్‌లు కేవలం రైతులకే ఎందుకు? పట్టణాల్లో మన గృహాలకు అవసరం. మనం కూడా వేస్ట్ చేస్తున్నాం కదా? విద్యుత్ సౌధ, సెక్రటేరియట్, మింట్ కాంపౌండ్, వరంగల్ లోని మా ఆఫీసుపైనా సోలార్ ఉపకరణాలు పెట్టాలి. మీరు చెప్పిన ప్రతీది పాటించాల్సింది ప్రభుత్వం.
సలీం (సివిల్ ఇంజనీరు)
నాగార్జున సాగర్ నీటి వినియోగం 1/3 వంతు కూడా మనం ఉపయోగించుకోవటం లేదు. సాగర్ టన్నెల్ కెపాసిటి వైడింగ్ చేస్తే, చిన్న చెరువులు కాలువలు నింపడం ద్వారా పూర్తిగా వినియోగించు కోగలం.
హరి (సామాజికవేత్త)
20 సం॥లుగా దోపిడికీ గురి అవుతున్నం. మన విద్యుత్ మనకు రావటం లేదు. జరిగిన మోసాన్ని ఎండగట్టాలి. గద్దర్‌లాంటి వారు టిఆర్‌సి వేదిక లాంటివి ఉద్యమంలో ముందుకు వెళ్ళి రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలి. కేంద్రం దగ్గరికి వెళ్ళి జరిగిన అన్యాయాన్ని వివరించాలి. ఎత్తిపోతలు లాంటి ప్రాజెక్టుల రూపకల్ప నకు కమిటి లేకపోతే అది సరియైన మార్గంలో పోదు. దీనికి ఒక కమిటి ఏర్పాటు చేయాలి.
శారదారెడ్డి (కోహిమా ఎనర్జీ)
సోలార్ పవర్ సంబంధించి చాలా బాగా టీఆర్‌సీ ద్వారా తెలు సుకున్నాం. ఇటువంటి కృషి ఇంకా భవిష్యత్‌లో చేయాలి. ఈ విద్యుత్ సమస్య తొందరలో తొలగిపోయేందుకు అధికారులు ప్రజలు కృషి చేయాలని కోరుతున్నాను. ఇలాంటి చర్చలు నిర్వహిస్తున్న టీఆర్‌సీకి అభినందనలు.
గద్దర్..
1996లో డబ్ల్యూటిఓ వచ్చిన తరువాత ప్రపంచం మొత్తం ఆర్థిక సంబంధాల్లోకి నెట్టి వేయబడింది. ఇక్కడి చర్చ అందరిలో అవగాహన కల్పించాలి. తాను ఉత్పత్తి చేసిన పంటకి రైతు ధర కట్టనంత వరకు అతడు బాగుపడలేడు. రైతు పండించిన పంటకు ఎవరో ధరకట్టి అమ్ముతున్నారు.
వలస వాదులు తమ లాభాలకోసం జీవోలు తయారు చేసుకొని మనకు అన్యాయం చేస్తున్నారు. ఇంక మనకు భౌగోళికమైన సామాజిక తెలంగాణ రాలేదు. నేను నా ఊరికి వెళ్లి పుస్తకం రాస్తున్నప్పుడు ఒక అవ్వ పొటో తీసుకుని పుస్తకంలో వేస్తానంటే అప్పుడు ఆమె ఈ పుస్తకం, పాటలతోటి కడుపు నిండుతదా! ముందు మన దగ్గర రెండు చెరువులు నింపు అంది. వెంటనే నేను పుస్తకం రాయటం ఆపేసా. అంత ఆవేదన ప్రజల్లో ఉంది. మన ఆర్థిక విధానం బాగుపడాలంటే గొలుసుకట్టు చెరువులు నిర్మించుకోవాలి. ఈ చర్చ తరువాత మనం ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా అదో పెద్ద డిబేట్‌గా మారుతుంది. ఒక ఊరిని ఎంచుకొని అక్కడి రైతులకు అవగాహన కల్పిద్దాం. ఆత్మహత్య లు చేసుకున్న రైతు కుటుంబం దగ్గరకు వెళ్ళి ఊరు గొడ్డు పోలేదు. మీరు అధైర్యపడకండి మేం బతికి ఉన్నాం మీకోసం అనే ధైర్యాన్ని వాళ్ళకు కల్పిద్దాం. ఉద్యమాలు ద్వారానే తెలంగాణ సాధించాం, ఉద్యమాల ద్వారానే అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్దాం. మంచి నిర్ణ యాలు తీసుకుంటే మీకు మేం అండగా నిలబడతాం అని అందరం ముందుకు వెళాదాం. ఒక్క గోదావరి నీటి ఎత్తిపోతల ద్వారానే లక్షల ఎకరాలకు నీరు అందించగలం. తెలంగాణకు నిలువునా దోపిడి జరిగింది. మనందరం కలిసి చెరువుల పునర్ నిర్మాణం చేసుకుందాం. విద్యుత్ సమస్యను ఎదుర్కోవటానికి అధికారులకు అండగా ముందుకు సాగుదాం. దీనిద్వారా ఇది ఒక మెద్యమంగా మారుతుంది. అప్పుడే తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఈ చర్చ వేదిక నుంచి ఏదైనా ఒక గ్రామంలో రైతుల దగ్గరకు వెళ్ళి వారికి సోలార్ విద్యుత్ కేపాసిర్ల వినియోగాన్ని సంబంధించి అధికారులు కార్యక్రమం నిర్వహిస్తే దీనికి నేను కూడా హాజరవుతాను. ఈ చర్చకు సాధికారికత కల్పిద్దాం.
వేదకుమార్..
సోలార్ విద్యుత్ వాడటానికి మేం కూడా మా సంస్థల్లో సర్వే చే యించాం. త్వరలోనే ఏర్పాటు చేసుకోబోతున్నాం. మన ప్రక్కనే ప్రవహిస్తున్న గోదావరి జలాలు మనం ఉపయోగించుకోలేక పోతు న్నాం. దీనికి కారణం మన ప్రాంతం దక్కన్ పీఠభూమి కాబట్టి. ఆ జలాలు ఎత్తిపోతల ద్వారా ఉపయోగించుకోవాలి. నిజాం పాలన కాలంలోనే హిమయాత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు ఏర్పాటు చేసి తాగు, సాగునీటి అవసరాలకు ఉపయో గించుకున్నాం. చిన్న నీటి పారుదల వ్యవస్థలు మన భూగర్భ జలాలు పెంచుకోవడానికే కాక సాగు నీటికి ఎంతో ఉపకరిస్తాయి.
చెరువులను అనుసంధానం చేస్తే వ్యవసాయం సమృద్ధిగా చేయటానికి వీలుంటుంది. మనది మెట్ట ప్రాంతం కావున ఎత్తిపోతలు ద్వారా నీటిని పారిస్తాం. మన ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా సీమాంధ్ర ప్రాంతం పక్షపాతంతో అడ్డుకుంది. పోలవరం ముంపు మండలాలు తరలించుకుపోవటానికి చేసిన ప్రయ త్నాలను విద్యుత్ పంచుకునే విషయంలో ఎందుకు పాటించడం లేదు? కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ఎటూ తేల్చకుండా నిశబ్ధంగా ఉంటోంది. 30 సం॥ల క్రితమే మనం విద్యుత్ ప్లాంట్లు, ప్రాజెక్టులు కట్టుకునే వాళ్లం. కానీ ఉమ్మడి రాష్ర్టం వలన ఏ పని ముందుకు సాగలేదు. శాతవాహనుల కాలంలో మన ప్రాంతంలో మన భూములకు తగ్గట్టుగా ఆరుతడి పంటలు పండించేవాళ్ళు. నాణ్యమైన విత్తనాలు వాడేవారు. దీంతో మన వ్యవసాయం సమృద్ధిగా ఉండేది.
నేడు నాణ్యమైన విత్తనాలు రైతుకు అందడంలేదు. మన సంప్ర దాయ వ్యవసాయాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. శ్రమజీవికి శ్రమకు తగ్గఫలితం అందినప్పుడే అతనికి న్యాయం జరిగినట్లవుతుది. టీఆర్‌సీ నిర్వహించిన ఈ చర్చకు వచ్చిన మీ అందరి భాగస్వామ్యంతో ప్రతిపాదనలు తయారు చేసి అవి ప్రజల్లోకి తీసుకు వెళ్ళి వారికి అవగాహన కల్పించి ప్రభుత్వానికి సూచనలు చేయటానికి ముందుం టాం. బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేద్దాం.
దక్కన్ న్యూస్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *