సిద్ధాంతాలు పద్ధతులు

తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం

తెలంగాణ రాష్ర్ట సాకారం కోసం దశాబ్దాలపాటు ఉద్య మించి, త్యాగాలుచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నం. రాష్ర్ట ఆవిర్భావ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ అక్కడే ఆగిపోకుండా అన్ని రంగాల్లో నిర్మాణాత్మక కృషి చేస్తున్నం. ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు ఆ కృషిలో భాగమవుతున్నరు.
ఆ కృషిలో భాగంగా ‘‘తెలంగాణ సాహిత్య చరిత్ర’’ నిర్మాణం చేయవలసి ఉంది. ఈ దిశలో ఉద్యమ కాలంలో కొంత కృషి జరి గింది. జరగవలసింది చాలానే ఉన్నది.
తెలంగాణ సాహిత్య నిర్మాణం ఎట్లా జరగాలనే దానిని తెలం గాణ రాష్ర్ట ఉద్యమంలో ఏయే శక్తులు పని చే సినవి, ఏయే రాజకీయాలు, తాత్త్వికతలు ప్ర భావాన్ని చూపినవి అనేవి కొంత నిర్ణయిస్తవి.
1969 ఉద్యమం విఫలమైన తరువా త ఎన్నో పరిణామాలు జరిగినవి. మధ్య తరగతి ఒక బలమైన శక్తిగా అవతరించింది. భూస్వామ్య శక్తులు బలహీనపడి పెట్టుబడీ దారీవర్గం బలోపేతమైనది. నిమ్న వర్గాలు చైతన్యవంతమైన వి. సీమాంధ్ర ఆధిపత్యం అన్ని రంగాలలో విస్త రించి అన్ని వర్గాల ప్రజలు బాధితులయినారు. వీటికి తోడు తాత్త్విక రంగంలో వచ్చిన మా ర్పులు కెటలిస్ట్‌గా పని చేసినవి.
పోస్ట్ కలోనియలిజం యూరప్ వలసా ధిపత్య దృక్కోణాన్ని తిరస్కరించి సొంతదేశం, సొంతనేలపై సొంత సాంస్కృతిక వారసత్వంపై దృష్టి మళ్ళేలా చేసింది. ఁూశీర్ శీశ్రీశీఅఱశ్రీ షతీఱ్‌ఱఅర ఱర ్‌శీ వర్‌పశ్రీఱరష్ట్ర శీతీ తీవష్ట్రపఱశ్రీఱ్‌‌‌వ రవశ్రీ ఱఅర్ వఱ్‌ష్ట్రవతీ ష్ట్రశ్రీశ్రీవఅవ ్‌ష్ట్రవ శీశ్రీశీఅఱశ్రీ ఙవతీరఱశీఅర శీ ష్ట్రఱర్‌శీతీవ… ుష్ట్రవ షతీఱ్‌వతీర రవ ్‌ష్ట్రవఱతీ ఱఅసఱవఅశీర తీవరశీతీవర ్‌శీ ష్ట్రశ్రీశ్రీవఅవ జుతీశీజూఱఅ జూవతీరజూవ్‌ఱఙవరఁ అన్న ు.చీ.ణష్ట్రతీ మాటలు పై అంశాన్ని సూచిస్తు న్నవి.
పశ్చిమదేశాల కేంద్రంగా ప్రాచ్యదేశాలను నిర్వచించడాన్ని, వారి ఆధిక్య భావనను ఎడ్వర్డ్ సయీద్ ‘‘ఓరియంటలిజం’’ తిరస్కరిం చింది.
గ్రావ్‌ుస్కీ, హెర్బర్ట్ మార్క్యూజ్, అడార్నో, లూయీస్ ఆల్తూజర్, ఎరిక్‌ఫ్రావ్‌ు లాంటి నియో మార్క్సిస్టుల ఆలోచనాధార మార్క్సిజం పరిధిలోనే సంప్రదాయ మార్క్సిస్టులకంటే భిన్నమైన కొత్త ఆలోచన లను ముందుకు తెచ్చింది. 190లలో వచ్చిన మనదేశంలోని స బాల్టర్న్ స్టడీస్ బృందం గ్రావ్‌ుస్కీ భావనను స్వీకరించడాన్ని ఇక్కడ గమనించాలి.
అన్ని రకాల ఆధిపత్య కేంద్రాలను (నవవఎశీఅవలను) వ్యతి రేకిస్తూ పోస్ట్ మోడర్నిస్టులు విభిన్నతలను, బహుళత్వాలను నిర్దిష్ట తలను ముందుకు తెచ్చిండ్రు. అఖండత ధ్వం సమైన తరువాత మాత్రమే ఒక నిర్మాణంలోని మిగతా అంశాలు స్వతంత్రతనీ గుర్తింపునీ పొందగలుగుతాయని చెప్పిండ్రు. ప్రాంతీయ మైన విముక్తి ఉద్యమ ఆవశ్యకతలను ముం దుకు తెచ్చిండ్రు. ప్రాంతీయతలు, విభిన్నత లు అంతరిస్తున్నాయని చెప్పి ప్రాంతీయ చరిత్ర ల్ని గురించిన స్పృహను కలిగించిండ్రు. జాతి ఔన్నత్య కేంద్రవాదం (జు్‌ష్ట్రఅశీవఅ్‌తీఱరఎ) మి గతా జాతులు తమకు తాము తమ సంస్కృతి హీనమైనదని, అభివృద్ధి చెందనిదని భావించు కునేట్టు చేసినది కాబట్టి ఆ వాదాన్ని తిరస్కరిం చాలన్నారు.
సబాల్టర్న్ అధ్యయనం ఆధిపత్య, కులీన (జుశ్రీఱ్‌వ) దృక్కోణాన్ని తిరస్కరించి అధీన,
విస్మృత, నిర్లక్షిత (ూపశ్రీ్‌వతీఅర) శ్రేణుల అధ్య యనాన్ని ప్రేరేపించింది.
1969 ఉద్యమాన్ని వ్యతిరేకించిన మార్క్సిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు పైన పేర్కొన్న కొన్ని తాత్త్వికతల పర్యవసానం ఫలితంగా నిర్దిష్ట వాస్తవికతను పరిగణనలోకి తీసుకోవడం మూలంగా మలిదశ ఉద్యమంలో (ూవీ మినహా) క్రియాశీలంగా పని చేసినవి. ఈ చై తన్యం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా తెలంగాణ భావజాల వ్యాప్తి చేసిండ్రు. విప్లవ పార్టీల క్రియాశీలత ఈ దశ ఉద్యమానికి గాఢతను, మిలిటెన్సీని ఇచ్చింది.
పూలే, అంబేడ్కర్‌ల ప్రభావం విస్తృతి చెందడమే కాక లోతు ల్లోకి వెళ్ళింది. అంబేద్కర్ చిన్న రాష్ట్రాల సిద్ధాంతం దళిత బహు జనులు ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనటానికి దోహదం చేసింది.
పోస్ట్ మోడర్నిజం, సబాల్టర్న్ అధ్యయనం, గ్రావ్‌ుస్కీ, బ్లాక్ మూమెంట్, దళిత పాంథర్స్, అంతర్జాతీయ ఫెమినిజం, కాన్షీరాం, మండల్ కమీషన్, మార్క్సిజం కలిగించిన చైతన్యంఫలితంగా స్త్రీవాదం, దళిత వాదం, బహుజనవాదం, మైనారిటీ వాదం ఆదివాసీ వాదం లాంటి అస్తిత్వ ఉద్యమాలు వచ్చినవి. ఇవి తమ అస్తిత్వాన్ని గురించి మాట్లాడుతూనే తెలంగాణ గురించీ పని చేసినవి.
ఇన్ని ప్రభావాలతో, ఇన్ని శక్తులతో తెలంగాణ ఉద్యమం న డిచింది కాబట్టే ఎన్నో వాయిస్‌లు భౌగోళిక తెలంగాణ, ప్రజా స్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, గిరిజన ప్రాధికార ప్రాంతం, సెక్యులర్ తెలంగాణవచ్చినవి.
కాబట్టి ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ఈ అందరి ఆకాంక్ష లు ప్రతిఫలించేలా తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్రల నిర్మాణం చేయవలసి ఉంటుంది.
చరిత్ర రచన ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా చరిత్ర రచనా సిద్ధాం తాలు, దృక్కోణాలు చాలా వచ్చినవి. ఈ సిద్ధాంతాలను, దృక్కోణాలనే వాటి సామం జస్యాన్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణానికి (చరిత్రకు సా హిత్య చరిత్రకు అవిభాజ్య సంబంధముం టుంది గనుక) అనువర్తింపజేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం.
వలసవాద అంతర్గత వలసవాద దృక్కోణం:
భారతదేశ చరిత్రను మొదట రాసిం ది బ్రిటీష్ చరిత్రకారులే. ప్రాచీన భారతదేశం గురించి వచ్చిన మొట్టమొదటి క్రమబద్ధమైన గ్రంథం జువతీశ్రీవ నఱర్‌శీతీవ శీ అసఱ. దీనిని విన్సెంట్.ఏ.స్మిత్ 1904లో ప్రచురించిండు.
స్మిత్ దృక్పథం సామ్రాజ్యవాదానికి అనుకూలమైనది. బ్రిటిష్ పాలనను సమర్థించడానికి ఉపయోగపడింది. స్మిత్ తదితరుల చ రిత్ర గ్రంథాలను ప్రస్తావించి ‘‘బ్రిటీష్ సామ్రాజ్యవాద నిరంకుశత్వాన్ని భారతదేశంలో కొనసాగించటానికి అవి చక్కని ప్రచార సాధనాలుగా ఉపయోగపడ్డాయి’’, ‘‘భారతీయులు తమ దేశాన్ని పరిపాలించుకో లేరని, ఆ సమర్థత వారికి లేదని నిరూపించడం ఈ సాధారణీకరణల సారాంశం’’ అని ప్రసిద్ధ చరిత్రకారుడు రావ్‌ుశరణ్ శర్మ అన్నాడు (ప్రాచీన భారతదేశ చరిత్ర పు.5)
స్మిత్‌తో పాటు, విలియం విల్సన్ హంటర్, జి.బి. మెల్లేసన్, జేవ్‌‌సు.ఎఫ్.స్టీఫెన్స్, హెన్రీమెయిన్, వీలర్, ఆల్ఫ్రెడ్ లియల్, డబ్ల్యు హెచ్ మొరెలాండ్ రచనలను ప్రస్తావించి, వాటి మంచి చెడ్డలను విచారించి మొత్తం వాటి సారాంశాన్ని ఁ్ షర ్‌శీ ర్‌ఱవ ్‌ష్ట్రవ శీఅ్‌ఱఅఅవ శీ దీతీఱ్‌ఱరష్ట్ర తీశ్రీవఁ అని చెప్పినాడు ఇ శ్రీధరన్ అనే రచయిత ( ్‌వఞ్ పశీశీ శీ నఱర్‌శీతీఱశీతీజూష్ట్రవ – ూ-400-425)
తెలంగాణను అంతర్గత వలసగా చేసుకున్న సీమాంధ్రులు సరిగ్గా ఈ విధంగానే వ్యవహరించినారు. ఈ పద్ధతిని తెలంగాణ సాహిత్య విషయంలోనూ అనుసరించినారు వారు. తెలంగాణలో కవులు పూజ్యం, తౌరక్యాంధ్రం లాంటి అభిప్రాయాలు ఆ దృక్కోణం నుంచే వెలువడినవి. దాదాపు 21 తెలుగు సాహిత్య చరిత్ర గ్రం థాలు వస్తే వాటి రచయితలందరూ (ముదిగంటి సుజాతరెడ్డి తప్ప) ఆ ప్రాంతంవారే. ఆ గ్రంథాలలో తెలంగాణ సాహిత్యాన్ని విస్మరిం చడం, వక్రీకరించడం, పోతన, రాజకవి మల్లారెడ్డి, అప్పకవి లాంటి అనేక మంది కవులను తమ ఖాతాలో వేసుకోవడం చేసినారు. ఆ దృక్కోణానికి లోనైన మన సాహిత్య చరిత్ర కారులు సైతం తెలంగాణ కవిరచయితలను తక్కువ చేయడం, విస్మరించడం చేసినారు. సి.నారాయణరెడ్డి తన సిద్ధాంత గ్రంథంలో చరిత్రాత్మకమైన తెలంగాణ అస్తిత్వాన్ని మొ దటిసారిగా ప్రకటించిన గోలకొండ కవుల సంచికను కనీసం ప్రస్తావించకపోవడం అం దుకు ఒక ప్రబలమైన ఉదాహరణ. ఇలాంటి వెన్నో.
కాబట్టి ఈ విస్మరణలను, అవహేళన లను, వక్రీరణలను, నిర్లక్ష్యాన్ని, అజ్ఞానాన్ని తిరస్కరించి తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించాల్సి ఉంటుంది.
జాతీయ (చీ్‌ఱశీఅశ్రీఱర్ నఱర్‌శీతీఱశీ తీజూష్ట్రవ) ఉపజాతీయ దృక్కోణం
బ్రిటీష్ చరిత్రకారులు సామ్రాజ్యవాద, వలసవాద దృక్కోణంలో భారతదేశ చరిత్ర ను వక్రీకరించడాన్ని గమనించి, బాధపడి భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి, స్వపరిపాలనకు భారతీయులకున్న అర్హతను నిరూపించే విధంగా భారతదేశ చరిత్రను పునర్ నిర్మించడానికి కొందరు భారతీయ విద్వాంసులు నడుము బిగించారు. అలాంటి కృషి చేసినవారు వీరు: ఆర్.జి.భండార్కర్ (1371925), రాజ్వాడే, డి.ఆర్.భండార్కర్, హెచ్.సి.రాయ్ చౌదరి (192 1957), ఆర్.సి.మజుందార్ (11990), (చూ. రావ్‌ుశరణ్ శర్మ), రమేశ్ చంద్ర దత్ (141909), కే.పి.జయస్వాల్ (111937), రాధా కుముద్ ముఖర్జీ (101963), జాదూనాథ్ సర్కార్ (170195).
ఇలాంటి చరిత్రకారులు, విద్వాంసులు పాశ్చాత్య గాలులలో కొట్టుకపోకుండా తట్టుకొని నిలబడటానికి, తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి భారతీయులలో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నింపే ప్రయత్నం చేసినారు. జాతీయ స్పృహను, జాతీయ ఐక్యత, జాతీయ ఔన్నత్య స్పృహను కలిగించి విదేశీ ఆధిక్యత నుంచి విముక్తి పొందాలనే స్వేచ్ఛా కాంక్షను రగలించినారు.
అట్లాగే మొదటితర భారత చరిత్రకారులు ఁుశీ సవఱఅవస ్‌ష్ట్రవఱతీ శ్రీ్‌తీవ అస ఱఙఱశ్రీఱఓ్‌ఱశీఅ ఱఅఅర్ ్‌ష్ట్రవ పతీఱ్‌ఱరష్ట్ర ఱఎజూవతీఱశ్రీఱర్ ్‌‌‌ఁ అనే దృక్పథంతో చరిత్ర రచన చేసినారు.
ఁఅసఱఅ అ్‌ఱశీఅశ్రీఱర్ ష్ట్రఱర్‌శీతీఱశీతీజూష్ట్రవ తీశీషఱఅ జూతీ్‌శ్రీవ ఱఅ తీవ్‌ఱశీఅ ్‌శీ ్‌ష్ట్రవ జూతీవ్‌వఅరఱశీఅర జూతీవసఱవర శీ దీతీఱ్‌ఱరష్ట్ర ఱఎజూవతీఱశ్రీఱర్ ష్ట్రఱర్‌శీతీఱశీ తీజూష్ట్రవ శీఅ అసఱఁ అనే మాటలు భారతదేశ జాతీ యవాద చరిత్ర రచనా పద్ధతి ఎలా అభివృద్ధి చెందిందో తెలియజేస్తు న్నవి.
మొత్తంగా వీరు భారతదేశ ఐడెంటిడీని వివిధ రూపాల్లో నిలబెట్టడానికి కృషి చేసినారు (చూ. శ్రీధరన్ పే426429).
ఈ దృక్పథాన్ని గురించి ఇంత సుదీర్ఘంగా చెప్పటానికి కా రణం ఉపజాతీయ దృక్కోణంతో తెలంగాణ సాహిత్య చరిత్ర రచన కు స్వీకరించవలసిన అంశాలు ఇందులో ఉన్నవని తెలుపడానికే.
ఈ రచనా పద్ధతి నుంచి స్వీకరించకూ డని అంశం కూడా ఒకటి ఉంది. ఈ పద్ధతి లో నిష్పాక్షిక హేతువాద దృక్పథంతో చరిత్ర రచన జరిగినప్పటికీ ఇందులో హిందూమత పునరుద్ధరణ పాయ కూడా ఉంది. స్వీకరించ కూడనిది ఇదే.
జాతీయవాద చరిత్ర నిర్మాణక్రమంలో వచ్చిన చరిత్రకారులు అందరూ ఉత్తర భార తం వారే. అందువల్ల దక్షిణ భారత చరిత్రకు తగిన ప్రాధాన్యత లభించలేదు. దక్షిణ భారత అస్తిత్వాన్ని నిలబెట్టుటానికి కె.ఎ.నీలకంఠ శాస్త్రి (1921975), ఎజ్డానీ, షేర్వానీ లాంటి చరిత్రకారులు ‘‘దక్కన్ చరిత్ర’’ రచన ద్వారా కృషి చేసిండ్రు.
1912లో ఆంధ్రరాష్ర్టం కోసం మొదలైన ఆంధ్రోద్యమ నేప థ్యంలో అనంతర కాలంలో ముందుకు తెచ్చిన విశాలాంధ్ర నేప థ్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర రచన మొదలయింది. ఈ చరిత్ర ర చన ఆంధ్రభాషా జాతీయ (ఉపజాతీయ) దృక్కోణంతో జరిగింది. అట్లా వచ్చిన చరిత్రలలో ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందుశేఖరం గార్లు రచించిన ‘‘ఆంధ్రుల చరిత్రసంస్కృతి’’ (1951) మొదటి సంపూర్ణ చరిత్రగా కొందరు భావించిండ్రు. ఈ గ్రంథాన్ని సమీక్షిస్తూ ఆంధ్రప్రభ (1631952) ఈ గ్రంథ రచన ‘‘విశాలాంధ్ర నిర్మాణ వాంఛతో జరిగింది’’ అని అభిప్రాయపడింది. అది నిజం.
విశాలాంధ్ర భావనలో సామ్రాజ్యవాద భావన ఇమిడి ఉం దని అన్న నెహ్రూ మాటలు అందరికి తెలిసిందే. ఇది తెలంగాణను అంతర్గత వలసగా చేసుకోవటానికి దారితీసింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని విస్మరించడం, వక్రీకరించడం, అవహేళన చేయడం అందులో భాగమే. ఇదే పద్ధతిలో తెలుగు సాహిత్యచరిత్రల నిర్మాణం కూడ జరిగింది. దీనిని తిరస్కరించి తెలంగాణ ఉప జాతీయతా దృక్కోణం నుంచి చరిత్ర, సాహిత్య చరిత్రల నిర్మాణం జరగవలసి ఉంది. ఈ పనిని ఈ వ్యాసకర్త ‘‘ముంగిలి’’, తెలంగాణ చరిత్ర’’ రచనల ద్వారా కొంత చేసిండు. సంగిశెట్టి, కె శ్రీనివాస్, ముదిగంటి సుజాతారెడ్డి తదితరులు (దం, షబ్నవీస్, తెలంగాణ సాహిత్య వికాసం, తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్యం జీవిత చిత్రణ, తెలంగాణ నవల) కొంత చేసిండ్రు. ఈ దిశలో ఇంకా సమగ్రమైన కృషి జరుగవలసి ఉంది.
చరిత్ర రచనా శాంలో ఎం.ఎం. భాషవ్‌ు లాంటివారి కృషి వలన క్రమంగా సామాజిక దృక్పథం చోటు చేసుకున్నది. సామాజిక దృక్పథాల్లో మార్క్సిస్ట్ దృక్పథం ఒకటి.
మార్క్సిస్టు దృక్పథం:
మార్క్స్ ప్రతిపాదించిన గతితార్కిక చారిత్రక భౌతికవాద దృక్కోణంతో చరి త్రను అధ్యయనం చేయడాన్ని, రూపొం దించడాన్ని ఇక్కడ మార్క్సిస్టు దృక్పథం అనొచ్చు.
భారత చరిత్ర రచనా శాంలో మార్క్సిస్టు శాఖ పితామహుడు డి.డి. కోశాంబి తన చరిత్రగ్రంథానికి ‘గతితార్కిక భౌతిక వాదం’’ సైద్ధాంతిక పునాది అని చెప్పుకున్నాడు. మార్క్స్ రాసిన ‘‘క్రిటిక్ ఆ ఫ్ పొలిటికల్ ఎకానమీ’’ గ్రంథం నుంచి ఈ సిద్ధాంతాన్ని ఉదహ రించినాడు. అందులోంచి కొన్ని మాటలు.. ‘‘ఉత్పత్తి సంబంధాల సమాహారమే సమాజ ఆర్థిక నిర్మాణంగా ఉంటుంది. ఈ నిజమైన పునాది మీద ఒక చట్టపరమైన రాజకీయపరమైన ఉపరితల ని ర్మాణం అవుతుంది. దానికి సరిపోయినట్టుగానే నిర్దిష్ట, సామాజిక చైతన్య రూపాలు ఉంటాయి. ఈ భౌతిక జీవన సాధనాల ఉత్పత్తి విధానమే మొత్తంగా సామాజిక రాజకీయ, మేధో జీవన క్రమాల్ని నిర్దేశిస్తుంది. మనుషుల ఉనికిని నిర్ణయించేది వారి చైతన్యం కాదు. అందుకు భిన్నంగా వారి సామాజిక అస్తిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. ఆర్థిక పునాదిలో మార్పుతో యావత్తు ఉపరితలం కొద్దో గొప్పో వేగంగా పరివర్తన చెందుతుంది. (భారత చరిత్రడి.డి. కోశాంబిఅను: ఎన్ వేణు గోపాల్ పు. 45, 46).
ఈ ఉపరితలంలో కళలు, మతం, తత్వశాం, న్యాయ శా ం, రాజకీయ వ్యవస్థ భాగంగా ఉంటవి. సాహిత్యం ‘‘కళలు’లో భాగం.
చారిత్రకంగా ఆర్థిక పునాదిలో వచ్చిన మార్పుల కనుగుణంగా ఉపరితంలో మార్పులు జరుగుతవి కాబట్టి ఏ అంశాన్నైనా (అంటే సాహిత్యాన్ని కూడా) చారిత్రక పరిణామ క్రమంలో అంటే ఆర్థిక, రాజకీయ, మత సామాజిక సంబంధాల దృష్ట్యా అధ్యయనం చేయ వలసి ఉంటుంది.
చరిత్ర రచనాశావేత్త ఇ. శ్రీధరన్ మార్కిస్టు చరిత్ర రచనా శాస్త్రాన్ని గురించి చెబుతూ ఇలా అన్నాడు. ఁుష్ట్రవ వరరవఅవ శీ ్‌ష్ట్రవ అవష జూజూతీతీశీష్ట్రవర ఱఅ ్‌ష్ట్రవ ర్‌సవ శీ ్‌ష్ట్రవ తీవశ్రీ్‌ఱశీఅరష్ట్రఱజూ పవ్‌షవవఅ రశీఱశ్రీ అస వశీఅశీఎఱ శీతీఅఱఓ్‌ఱశీఅర అస ఱ్‌ర వవ్ శీఅ ష్ట్రఱర్‌శీతీఱశ్రీ వఙవఅ్‌రఁ (జు.ూతీవవసష్ట్రతీఅ 2014-ూ-469)
మార్క్సిస్ట్ దృక్పథంతో తెలుగులో సాహిత్య చరిత్ర నిర్మాణ ప్రయత్నం చేసిన వారు వెల్చేరు నా రాయణరావు. కె.కె.రంగనాథాచార్యులు.
ఈ దృక్పథాన్ని తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఉపయోగించున్నట్లయితే సాహిత్య పరిణామంలోని విశిష్టతలు తెలియవస్తవి.
ఆధునికానంతర దృక్కోణం:
చరిత్ర రచనాశాం మీద ఆధునికానంతర వాద ప్రభావం కూడా ఉన్నది. సం ప్రదాయిక చరిత్ర రచనా పద్ధతిని వీళ్ళు పూర్తిగా తిరస్కరించినారు. ఏదీ నిశ్చితం కాదని, ప్రతిదాన్నీ ణవశీఅర్‌‌ చే యాలని వీళ్ళు భావించిండ్రు.
చీశీ ఱఅస శీ శీపవ్‌ఱఙవ అశీషశ్రీవసవ శీ ్‌ష్ట్రవ జూర్ ఱర జూశీరరఱపశ్రీవ పవరవ శ్రీశ్రీ అషశీశ్రీవసవ ఱర తీవశ్రీ్‌ఱఙవ అని అన్నారు. ుష్ట్రవతీవ ఱర అశీ శ్రీ్‌ఱఎ్‌వ ష్ట్రఱర్‌శీతీఱశ్రీ తీవశ్రీఱ్‌వఁ అని అన్నారు.
ఒక నిర్దిష్ట ప్రాంతపు చరిత్రను, సంస్కృతిని పరిశీలించడానికి, విశ్లేషించడానికి ఆ నిర్దిష్ట ప్రాంతానికి చెందిన చరిత్రకారులు మా త్రమే పని చేయాలి తప్ప పరాయి ప్రాంతం నుంచి సంస్కృతి నుం చి వచ్చిన చరిత్రకారులు కాదని వీళ్ళు ప్రకటించినారు.
తెలుగు సాహిత్య చరిత్రను డీ కన్స్‌ట్రక్ట్ చేసి తెలంగాణ సా హిత్య చరిత్రను నిర్మించడానికి ఈ దృక్కోణం ఉపయోగపడుతుంది.
సబాల్ట్రన్ దృక్కోణం:
190లలో రంజిత్ గుహ ఆధ్వర్యంలో సబాల్టర్న్ అధ్యయన బృందం ఏర్పడింది. వీరి గురించి శ్రీధరన్ ఇలా అన్నారు. ఁూపశ్రీ్‌వతీఅ ్‌వతీఎ ్‌వ తీశీఎ అ్‌శీఅఱశీ తీఎరఱ ఎఅరతీఱజూ్ షతీఱ్‌ఱఅర, వీవఅర శీ ఱఅవతీఱశీతీ తీఅ షష్ట్రవ్‌ష్ట్రవతీ శీ శ్రీరర, ర్‌వ, వ, వఅసవతీ శీతీ శీఱవ. రపశ్రీ్‌వతీఅ ర్‌సఱవర పతీఱఅ ్‌శీ శ్రీఱష్ట్ ్‌ష్ట్రవ శ్రీశీషవతీ రవ్‌ఱశీఅర శీ ్‌ష్ట్రవ అసఱఅ జూవశీజూశ్రీవ ష్ట్రఱ్‌ష్ట్రవతీ్‌శీ అవశ్రీవ్‌వస పవ నఱర్‌శీతీఱశీతీజూష్ట్రవఁ (ూ-493)
ఈ అధ్యయన బృందం అధ్యయనం గురించి ఇలా అన్నారు. ఁుష్ట్రవ అవవస ్‌శీ ఎవ ్‌ష్ట్రవ రపశ్రీ్‌వతీఅ శ్రీరరవర ుష్ట్రవ రపవ్ శీ ్‌ష్ట్రవఱతీ శీషఅ ష్ట్రఱర్‌శీతీవఁ (శీశ్రీ-) ఁజుశ్రీఱ్‌వ, రపశ్రీ్‌వతీఅ వర్గాల మధ్య అన్ని స్థాయిల్లో ఆధిక్యత లోబడి ఉండడం అనే సంబంధాలే ఉన్న వి. ‘సబాల్టర్న్‌ని చరిత్ర నిర్మాతగా మేం చూడదలచుకున్నాం (శీశ్రీ-).
చరిత్ర రచనలో ఇలాంటివారి పాత్రను (నఱర్‌శీతీవ తీశీఎ పవశ్రీశీష, అఅశ్రీర ష్ట్రఱర్‌శీతీవ, ూవశీజూశ్రీవర నఱర్‌శీతీవ, ూశీర్ ఎశీసవతీఅఱరఎ) చరిత్రకారులు గుర్తించిండ్రు. ప్రముఖ చరిత్రకారుడు వకులాభరణం రామకృష్ణ వీరి గురించి ఇలా అన్నారు.
‘‘చరిత్రను శిష్టవర్గాల వారి ప్రభావం నుంచి, వారి ఆధి పత్యం నుంచి తొలగించాలన్నదే వీరి ప్రయత్నం. తద్వారా శిష్టుల తో ప్రమేయం లేని ప్రజల స్వతంత్రచరిత్రను, రా జకీయాలను వివరించాలన్నది సబాల్టర్న్ లేదా ఉప శ్రేణి చరిత్రకారుల ఆశయం. ఉప శ్రేణుల పాత్ర అవి నిర్వహించిన ఉద్యమాలను వీరు వెలుగులోకి తీసుకురాదల్చారు. ఇంతవరకు చరిత్రలో తొంగి చూడని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చారు. ఇంతవరకు చరిత్రకారులు లేవనెత్తని కొన్ని మౌలిక ప్రశ్నలను వేశారు. (చరిత్ర సంస్కృతి (వ్యాసాలు))
ఈ పద్ధతిని సాహిత్య చరిత్రకు అనువర్తింప జేసుకుంటె విస్మృతికి గురైన తెలంగాణ కవుల గు రించి తెలంగాణలోని అనేక అంశాల గురించేకాక, తెలంగాణ సాహిత్యంలో కూడ విస్మృతికి గురైన కింది శ్రేణుల గురించి కూడా వెలుగు ప్రసరించే అవకాశం ఉంటుంది.
దళిత, బహుజన, మైనార్టీ, మహిళా దృక్కోణం
తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంలో దళిత, బహుజన, మైనార్టీ, మహిళా రచయితలకు, కవులకు తగిన ప్రాధాన్యత నివ్వా లె. వారి రచనల్ని వెలుగులోకి తేవాలె. ఈ దృక్కోణంలో సాహిత్య చరిత్ర నిర్మాణం చేసినట్లయితే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తయి.
(రెండో భాగం వచ్చే సంచికలో)
డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
మొబైల్: 956 2572
మెయిల్: అతీవఅతీవససవ.రఅఱతీవససవఏఎఱశ్రీ.శీఎ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *