సొంత హైకోర్టుతోనే స్వరాష్ర్టం!

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడి ఆరు నెలలు గడిచినా ఆ భావన మాత్రం ప్రజల్లో కలగడం లేదు. అందుకు ప్రధాన కారణాల్లో న్యాయవ్యవస్థ విభజన జరుగకపోవడం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చా కార్యక్రమాన్ని తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్‌సీ) నిర్వహించింది. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ (ఇండియన్ అకడమిక్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్), మంతెని రాజేందర్ రెడ్డి (చైర్మన్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ), వి. రఘునాథ్ (హైకోర్టు న్యాయవాది, కన్వీనర్ ఏపీసీఎల్‌సీ), సరసాని సత్యంరెడ్డి (హైకోర్టు సీనియర్ న్యాయవాది), గండ్ర మోహన్ రావు (హైకోర్టు న్యాయవాది), ముకీద్ (హైకోర్టు న్యాయవాది), టి. శ్రీరంగారావు (హైకోర్టు న్యాయ వాది, కోకన్వీనర్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ) తదితరులు ఇందులో పాల్గొన్నారు.
సరసాని సత్యం రెడ్డి అధ్యక్షత
న్యాయవాద వృత్తిలో ఉన్న మేము ఈ తరహా సదస్సులో పాల్గొనే అవకాశాలు రావడం తక్కువ. ఇప్పుడు ఈ అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వేదకుమార్ ఎన్నో ఏళ్ళ నుంచి తెలం గాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అంతేగాకుండా మేధో పరంగా భావజాలవ్యాప్తిలో ఎంతో కృషి చేస్తున్నారు. అది అభినందనీ యం. కేసీఆర్ రాజకీయంగా కృషి చేస్తే, టీఆర్‌సీ భావజాలవ్యాప్తి పరంగా కృషి చేసింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఎందుకు కా వాలి? మరి మనకు ప్రత్యేక రాష్ర్టం ఎందుకు కావాల్సి వచ్చింది. దా నికి ప్రత్యేక కారణాలు అవసరం లేదు. ప్రత్యేక రాష్ర్టం ఎందుకు కా వాల్సి వచ్చిందో అందుకోసమే ప్రత్యేక హైకోర్టు కావాలి. అందుకు ప్రత్యేకించి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యేక రా ష్ర్టం కోసం పోరాడి సాధించుకున్నాం. అలాగే హైకోర్టు కూడా. ప్రతీ రాష్ట్రానికీ హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోనే ఉంది. అంటే తెలం గాణ రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు ఉండాలి. సీమాంధ్ర నాయకుల ఒత్తిళ్ళ వల్ల కొంచెం వెసలుబాటు కల్పించారు. మరి ఉమ్మడి హైకోర్టు ఎన్ని రోజులు ఉండాలి? ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకూ ఉమ్మడి హైకోర్టు కొనసాగుతుందని అందులో ఉంది. నిర్దిష్ట కాలాన్ని పేర్కొనలేదు. ఆంధ్రప్రదేశ్ కోసం ఇరవై ఏళ్ళ వరకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడకపోతే పరిస్థితి ఏమిటి? మరి అలాంటి దాన్ని మనం ఆమోదించగలమా? ప్రత్యేక హైకోర్టు కావాలనేందుకు మనం 101 కారణాలు చెప్పవచ్చు. ఉమ్మడి హైకోర్టు ఉండేందుకు ఒక్క కారణం వారు చెప్పలేరు. న్యాయమూర్తుల విభజన కష్టం..భవనాలు, వసతులు కష్టం… జిల్లా, మున్సిఫ్ కోర్టుల విభజన ఉంది…ఇలా ఎన్నో సాకులు చెప్పవచ్చు. అవేవీ పరిష్కరించుకోవడం కష్టం కాదు. అందుకే కేసీఆర్ ఓ బ్రహ్మాస్త్రం వేశారు. హైకోర్టు ప్రస్తుత భవనాన్ని మీరే ఉంచుకోండి… మేము వేరే భవనానికి మారిపోతాం..అని అన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌ను పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఎంత అవసరమో అంతకు పది రెట్లుగా ప్రత్యేక హైకోర్టు అవసరం ఉంది.
టి.శ్రీ రంగారావు…
తెలంగాణ రిసోర్స్ సెంటర్ తరఫున ఇన్ని చర్చలు నిర్వహించడం గొప్ప విషయం. హైకోర్టు విభజన ఎందుకు జరగడం లేదనే ప్రశ్న సమాజంలో ఉంది. ప్రతి ఒక్కరి మదిలో ఉంది. తెలంగాణ ఉద్యమం లో న్యాయవాదులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు. వారు ఎందుకు పాల్గొన్నారు? న్యాయవ్యవస్థలో మనకు ఎంతో అన్యాయం జరుగుతోం ది. న్యాయమూర్తుల, ఉద్యోగుల నియామకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి దాన్ని ఎవరు ప్రశ్నించాలి. మేము ప్రశ్నిం చాం. అందుకే హైకోర్టును కేంద్రంగా చేసుకొని భారీస్థాయిలో ఉద్య మించాం. ఆ రోజున సరసాని గారు నిరాహార దీక్ష చేపట్టడం, దాన్ని అవకాశంగా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాం. ఆ రోజున హైకోర్టు లో ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరికీ తెలుసు. మరి ఈ రోజుకు కూడా హైకోర్టు విభజన ఎందుకు జరగడం లేదు అంటే అంతా ఆలోచించాలి…ఈ విషయంలో పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ర్టం ఏర్పడిన తరువాత, రాష్ట్రాన్ని పరిపూర్ణ రాష్ర్టంగా ఎప్పుడు భావిస్తామం టే, శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడూ పరిపూర్ణం గా ఉండాలి. మరి రాష్ర్టం ఏర్పడిన తరువాత శాసన వ్యవస్థ మాత్రమే ఉంది. అధికార వ్యవస్థ కొంతమేరకే విభజించబడింది. న్యాయవ్యవస్థ లో విభజన ఇంకా జరుగలేదు. శాసన వ్యవస్థ విభజనతో మాత్రమే తెలంగాణకు న్యాయం జరుగదు. విభజన సంపూర్ణంగా జరగకపో వడం వల్ల అధికార వ్యవస్థలో అన్యాయాలు చోటు చేసుకుంటున్నా యి. కార్మిక శాఖ విభాగంలో నిధులు తరలించేందుకు జరిగిన యత్నా లు తెలిసినవే. మన నిధులను ఆంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రలు జరుగుతున్నాయి. నిధులను వాళ్ళ ట్రెజరీకి తరలించుకుపోతున్నారు. అధికార వ్యవస్థ, న్యాయవ్యవస్థ పూర్తిగా విభజన జరగనంత వరకు తెలంగాణకు న్యాయం జరుగదు. ఈ రోజున న్యాయమూర్తుల నియా మకంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణకు 42 శాతం వాటా దక్కాల్సి ఉండగా దక్కలేదు కాబట్టి ఆ రోజున ఉద్యమం చేశాం. ఈ రోజున కూడా అదే అన్యాయాలు కొనసాగుతున్నా యి. న్యాయవాదుల జేఏసీ ఎంతో చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. తక్షణం హైకోర్టు విభజన జరగాలి. అలా జరిగే వరకూ మనకు న్యాయం జరిగే అవకాశం లేదు. రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో వాటికి వ్యతిరేకంగా నిర్ణ యాలు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఒక్కరూ లేరు.
ముకీద్..
న్యాయవ్యవస్థపై నమ్మకం పోయిందంటే అది కష్టమైన విషయం. న్యాయ వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం ఉండాలి. అది సడలిపోకూడదు. ఈ హైకోర్టు మా ప్రాంతానికి చెందింది కాదు అని ప్రజలు భావిస్తు న్నారు. ఆ న్యాయస్థానంలో ఆ ప్రాంతానికి చెందిన వారున్నారు …అక్కడి వారినే ఎంచుకుంటే మంచిదేమో అని కూడా కొందరు క్ల యింట్లు భావిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. మాకు సరైన తీర్పులు వస్తాయో రావో అని ఆందోళన చెందుతు న్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే సమాజం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ వైఫల్యం చెందితే మిగితా అన్ని వ్యవ స్థలూ కుప్పకూలినట్లే. ఈ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతే అది ఆందోళన చెందాల్సిన అంశం. తక్షణం న్యాయవ్యవస్థను విభజిం చుకోవాలి.
రాజేందర్ రెడ్డి
వేదకుమార్ గారికి అభినందనలు. చక్కటి అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు విభజన విషయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి కూడా మమ్మల్ని అప్రమత్తం చేశారు. అయినా కూడా ఇలాంటి బిల్లు వచ్చింది. వెంటనే మేము రాష్ర్ట హై కోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిశాం. మరెందరికో వినతిపత్రాలు అందించాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిశాం. సీఎం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఈ అంశం ముందుకెళ్ళడం లేదు. ఉద్యమంలో పాల్గొని రాష్ర్టం సాధించినా, హైకోర్టు సాధించుకోలేకపోయామన్న బాధ ఉంది. హైకోర్టు గురించి అడగాల్సిన అవసరమే లేదు. అది రాజ్యాంగ పరమైన బాధ్యత. ప్రతీ రాష్ట్రానికీ ఒక హైకోర్టు ఉండాలి. అలా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మొత్తం వ్యవహారం నడపాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నేడు పరిస్థితి ఎలా ఉందంటే, క్లయిం టు ఒక ప్రాంతానికి, న్యాయమూర్తి ఒక ప్రాంతానికి చెందిన వారైతే, తీర్పు సంగతి ఎలా ఉన్నా, ముందుగానే అనుమానాలు తలెత్తుతున్నా యి. ఒక జిల్లా కోర్టులో 90 శాతం న్యాయమూర్తులు ఆ ప్రాంతానికి చెందిన వారే. అక్కడ కక్షసాధింపు చర్యలు చోటు చేసుకుంటున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టు విభజన కోసం పోరాటం చేయక తప్పదు. రాష్ర్ట ప్రభుత్వం ఇప్పుడు స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తోంది. మైనారిటీ సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్…ఇలా ఎన్నో. అవి ముందుకు వెళ్ళాలంటే ఈ ప్రాంత సమస్యల పై అవగాహన ఉన్న వారే న్యాయమూర్తులుగా ఉండాలి. వేరే వారు మరో విధంగా భావించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి హైకోర్టు విభజన పూర్తయితే, న్యాయవ్యవస్థ పరంగా మేము పలు సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు న్యాయవాద వృత్తిలో సంపన్నవర్గాలకు చెందిన వారే ఉండే వారు. ఇప్పుడు సాధారణ కుటుంబాలకు చెందిన వారు సైతం న్యాయవాదులుగా వస్తున్నారు. వారికి వృత్తిలో రక్షణ, ఎదుగుదల ఉండాలంటే మనకు ప్రత్యేక హైకోర్టు ఉండాలి. హైకోర్టు విభజన పూర్తయితే ఇక్కడి న్యాయవాదుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకునేందుకు కూడా వీలవుతుంది.
మాడభూషి శ్రీధర్
హైకోర్టు పేరులోనే తగాదా వచ్చింది. అసలు ఇప్పుడు హైకోర్టు పేరు ఏమిటి? దాని పేరు హైకోర్టు ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. పేరు నుంచి మొద లుకొని తగాదా తలెత్తుతోంది. ఇక హైకోర్టు చరిత్ర విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్ర చదువుకుందామా …హైదరాబాద్ హైకోర్టు చరిత్ర చదువుకుందామా… వికీపీడియాలోకి వెళ్ళి చూస్తే… ఆంధ్రప్రదేశ్ హై కోర్టు 1956లో ప్రారంభమైందని ఉంటుంది. అంగీ కరిస్తారా..హైదరాబాద్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మారిన రోజు 1956 నవంబరా లేకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడింది 1956 నవంబరా… మరిప్పుడు తెలంగాణ హైకోర్టు ఉందా? లేదు. తెలంగాణకు హైదరాబాద్ హైకోర్టు ఉంది. పేరును బట్టి చూస్తే.. 1917లో హైకోర్టు భవన నిర్మాణం మొదలైంది. 1919లో ముగిసింది. 1920లో ప్రారంభమైంది. 1946లో రజతోత్సవాలు జరిగాయి. ఆరుగురు న్యాయమూర్తులతో మొదలైంది. ఆ తరువాత 12 అయింది …అలా పెరుగుతూ వచ్చింది. ఇక రాష్ర్ట విభజన గురించి ఆలోచిద్దాం. ఏది విభజిస్తే రాష్ర్టం అవుతుంది? సరిహద్దులు విభజించి జిల్లాలు ఏర్పాటు చేస్తేనే విభజనా ? లేక పాలక వ్యవస్థను ఏర్పాటు చేస్తే విభ జనా? లేక శాసనవ్యవస్థను ఏర్పాటు చేస్తే విభజనా? లేక పరిపాలనాధి కారులను ఇరు రాష్ట్రాలకు పంచిపెడితే విభజనా ? లేక న్యాయస్థానాల ను, న్యాయమూర్తులను, న్యాయవాదులను కూడా పంచినప్పుడు విభజ నా? ఏది విభజన? మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు … స్వరాజ్యం మాత్రం రాలేదన్నారు. అది 100 శాతం నిజం. మరికొందరు స్వ రాజ్యం వచ్చింది కానీ స్వాతంత్య్రం మాత్రం రాలేదన్నారు. కాళోజీ ఏమనే వారంటే…స్వాతంత్య్రం ఏం మారిందిరా…జెండా ఒక్కటే మారింది. దండ (జెండాకర్ర) కూడా అదే ఉంది అనేవారు. నెహ్రూ గురించి చెప్పే వారంటే… ఆల్ అసెట్స్ టు ఇందిర..ఆల్ యాక్షన్స్ టు ఇండియా అనే వారు. రిపబ్లిక్ డేకు అంత ప్రాధాన్యం ఎందుకు? ఆ రోజు నుంచే మన పాలన మొదలైంది. స్వరాజ్యం వచ్చింది… సురాజ్యం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం…పరిపాలక, కార్యనిర్వా హక, న్యాయవ్యవస్థల విభజన జరిగితే తప్ప ప్రత్యేక రాష్ర్టం ఏర్పడినట్లు కాదు… అందుకే తెలంగాణ రాష్ర్టం ఏర్పడినట్లా కాదా? జూన్ 2కు ముందు ప్రాదేశిక విభజన జరిగింది. ఆ తరువాత ఎన్నికలు జరిగాయి. అది ప్రజాస్వామ్య ప్రాతినిథ్య ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ. ఆ తరువాత ఇద్దరు సీఎంలు వచ్చారు. కార్యనిర్వాహక వర్గ విభజన జరిగింది. శాసన సభ విభజన కూడా జరిగింది. పాలక వ్యవస్థ విభ జన జరిగిందా? అధికారుల విభజన ఇంకా పూర్తి కాలేదు. పరిపాలన పరంగా కూడా విభజన సమగ్రంగా పూర్తి కాలేదు. అంతకన్నా ప్రధా నమైన, అత్యంత కీలకమైన విభజన న్యాయవ్యవస్థకు సంబంధించింది. అది జరిగే వరకూ విభజన పూర్తికానట్లే. అది ఎందుకు విభజన కావాలి… న్యాయవ్యవస్థ ఉమ్మడి ఉంటే ఏమవుతుంది..సుప్రీం కోర్టు ఒక్కటే ఉంది కదా…ప్రతీ రాష్ట్రానికీ ఒక హైకోర్టు ఉండాలి. నిజమే. అదే సమయంలో రాజ్యాంగంలో పలు వెసలుబాట్లు ఉన్నాయి. రాజ్యాంగంలో 231 ఆర్టికల్ దీన్నే చెబుతోంది. దాని ప్రకారం ఒకటి లేదా అంతకు మించిన రాష్ట్రాలకు ఒకటే హైకోర్టు ఉండవచ్చు. దానికి తోడు విభజన చట్టంలోనే ఒక క్లాజు పెట్టారు. ఉమ్మడి హైకోర్టు అని. దానికి కాలపరిమితి లేదు. ఉమ్మడి రాజధానికి కాల పరిమితి పదేళ్ళు. మరి హైకోర్టుకు ఆ విధమైన కాలపరిమితి లేదు. అప్పట్లో వ్యూహాత్మకంగా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాష్ర్టం ఏర్పడడం ముఖ్యమని భావించారు. ప్రత్యేక హైకోర్టు ఎందుకు? న్యాయవాదుల కోసమో, న్యాయమూర్తుల కోసమో కాదు. ఇది న్యాయార్థుల విషయం. తెలంగాణలో హైకోర్టు ఉంది. దాన్ని చేరుకోవడం సులభం. అది దగ్గరే. నిజానికి 214 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హైకోర్టు కావాలని అడగాల్సింది ఆంధ్రప్రదేశ్ వారు. తమ ప్రాంతంలో తమకు హైకోర్టు కావాలని వారు అడగాలి. వారు అలా అడగడం లేదు. అదే సమ యంలో హైకోర్టు మన వద్ద ఉన్నా మనమే ప్రత్యేక హైకోర్టు కావాలని అడుగుతున్నాం. ఎంత విచిత్రం. ప్రజలకు చేరువలో పాలనను దృష్టి లో ఉంచుకొని హైకోర్టు తమకు చేరవలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరాలి. ఒక రాష్ర్టం రాజధాని మరో రాష్ర్టంలో ఉందని చెప్పుకోవడం, ఒక రాష్ర్ట ముఖ్యమంత్రి ఎప్పుడూ పక్క రాష్ర్టంలో ఉన్నారంటే, మా న్యాయమూర్తి మరో రాష్ర్ట రాజధానిలో ఉంటారంటే వినడానికి ఎలా ఉంటుంది? నేడు ఏపీ ఉద్యోగులు ప్రధాన కార్యాల యాలను ఆంధ్ర ప్రాంతానికి తరలించాలని, హైదరాబాద్‌లో ఉంటే సేవలు అందించలేకపోతున్నామని అంటున్నారు. అది అభినంద నీయం. ఉమ్మడి హైకోర్టు కొనసాగినంత కాలం రెండు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు కొన్ని అంశాలపై గొంతు విప్పలేకపోతున్నారు. తెలంగాణ జ్యుడీషియల్ ఆఫీసర్లకు అధికారికంగా ఒక సంఘం లేదు. అలా సంఘం పెట్టుకుని మాట్లాడే అవకాశం, ధైర్యం, విశ్వాసం, నైతిక బలం, నా రాష్ర్టంలో నేను ఉన్నాను అనే భరోసా, బలం ఇవ్వలేకపోతున్నాం. మరి మనం ఏం సాధించినట్లు ? ఇవాళ తెలంగాణ న్యాయమూర్తులు తెలంగాణ గురించి మాట్లాడితే, తమ ఏసీఆర్‌లు, ప్రమోషన్లు, పోస్టింగ్‌లు ఏమైపోతాయే మోనని ఆందోళన చెందే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ర్టంలో ఉంది. ఇక గణాంకాల విషయానికి వస్తే, అవి అందరికీ బాగా తెలుసు. వారి సంఖ్య 20 శాతం కూడా ఉండదు. న్యాయ వ్యవస్థ విభజన జరిగిన తరువాత తెలంగాణలో ఏర్పడే సమస్య ఏమిటంటే… తెలంగాణ న్యాయాధికారుల సంఖ్య తక్కువగా ఉంది. తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన న్యాయాధికారులు పని చేయాల్సి ఉంటుంది. లేకుంటే తగిన సంఖ్యలో న్యాయాధికారులు లేక తెలంగాణలో కోర్టులు మూసివేయాల్సి ఉంటుంది. ఇదీ పరిస్థితి. కనీసం తెలంగాణ కోర్టులలో తెలంగాణ న్యాయాధికారులను నియమించుకునే పరిస్థితి ఉందా..అందుకు ఏ ర్పాట్లు చేసుకుంటున్నామా ..అలాంటి అవకాశం ఉందా…లాంటి వాటి గురించి ఆలోచించాలి. ప్రజలు, నాయకులు, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. హైకోర్టు విభజన జరిగిన తరువాత కూడా కనీసం మూడేళ్ళ పాటు ఇదే విధమైన పరిస్థితి ఉండగలదని అనుకుంటున్నా ను. అదే సమయంలో ఇక్కడ పని చేసే ఆంధ్ర న్యాయాధికారులకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వారెంత నిష్పాక్షికంగా తీర్పు ఇస్తారని భావించినప్పటికీ, ఆ తీర్పు గనుక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే పరిస్థితి ఏమిటి? ఇంకో ఆసక్తిదాయక అంశం కూడా ఉంది. 1920లోనే హైదరాబాద్ హైకోరు ఏర్పడి పని చేస్తోంది. మద్రాసు రాష్ర్టం నుంచి ఆంధ్ర రాష్ర్టం విడిపోయి, తెలంగాణతో విలీనం అయిన సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడింది. ఈ సందర్భంలో ఆంధ్రా న్యాయమూర్తులు ఒక లిటిగేషన్ లేవెనెత్తారు. హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు తిరిగి ప్రమాణం చేయాల్సిందిగా సూచిం చారు. దాని వెనుక ఉన్న కుట్ర గురించి తెలియని హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు తిరిగి ప్రమాణం చేశారు. ఆంధ్రా హైకోర్టు న్యాయమూర్తులు తమ పాత సీనియారిటీని పొందగా, హైదరా బాద్ హైకోర్టు న్యాయమూర్తులు జూనియర్లుగా మారారు. దీంతో న్యాయ వ్యవస్థలో తెలంగాణకు అన్యాయం జరగడం మొదలైంది. ఆనాటి ప్రభావం ఇప్పుడూ అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రాంతం వారే సీనియర్ న్యాయమూర్తులు అయ్యారు. ప్రధాన న్యాయమూర్తులు అ య్యారు. సెలెక్షన్ కమిటీల్లో వారే ఉన్నారు. నియామకాలు వారే చే పట్టారు. …ఇలా ఆ అన్యాయం కొన సాగుతూనే వచ్చింది. ఆంధ్రప్రదే శ్ న్యాయవ్యవస్థ పుట్టుక సందర్భంలోనే మనకు పెద్ద అన్యాయం జరిగింది. దీన్ని బయట చెప్పుకునే, చర్చించే అవకాశం కూడా లేకుం డా పోయింది. సమానత, సమాన ప్రాతినిథ్యం అంశాలు ఇక్కడ ఏమయ్యాయి? ఇది అసమానత. సమానత్వం సాధించడమే రాజ్యాం గం లక్ష్యం. మరి ఆ లక్ష్యం ఇక్కడేమైంది. అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య సమానత్వం ఏర్పడాలి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. హైకోర్టు మినహాయిస్తే, కింది స్థాయి కోర్టుల్లో తెలుగు భాషను వినియోగించాలి. స్వరాష్ర్టం, స్వభాష, స్వన్యాయవ్యవస్థ ఉండాలి. ఇది ప్రజల అవసరం. దీనికి రాజకీయ సంకల్పం ఉండాలి. డబ్బు సమస్య కాదు. న్యాయవ్యవస్థ విభజన పూర్తి కానిదే తెలంగాణ రాష్ర్టం రానట్లే. తెలంగాణ హైకోర్టు ఉండాలి. తెలంగాణ న్యాయమూర్తులు, తెలంగాణ న్యాయవాదులు ఉండాలి. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. త్వరగా మీ హైకోర్టును మీ ప్రజల కోసం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోరుతున్నాను. న్యాయ వ్యవస్థ అనేది పాలనావ్యవస్థలో భాగమే. అది అభివృద్ధికి సంబంధించి కార్యకలాపం కూడా. ఒక వివాదం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. మనం ఇప్పటికే మానసికంగా విభజితమ య్యాం. కోర్టుల్లో తెలంగాణ న్యాయవాదుల సంఘాలు ఏర్పాటయ్యా యి. ఇలా ఎన్నో కారణాలు…అందుకే ఆంధ్రా వారికి, తెలంగాణ వారికి సొంత హైకోర్టులు ఉండాలి. చిన్న రాష్ర్టమైనా, పెద్ద రాష్ర్టమైనా దానికంటూ ఒక సొంత హైకోర్టు ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలకు ఒకే హైకోర్టు, పంజాబ్‌హర్యానాలకు ఒకే హైకోర్టు ఉండడం సబబు కాదు. వాటికీ వేర్వేరుగా హైకోర్టు ఉండాలి. సుప్రీం కోర్టుకు దేశంలోని నాలుగు దిక్కుల్లో నాలుగు బెంచ్‌లు ఉండాలి. ప్రజలకు అందుబాటు లో న్యాయస్థానం ఉండాలి. ప్రజలకు దగ్గర్లో లేకుంటే న్యాయం జరగనట్లే.
సత్యం రెడ్డి
చిన్న చిన్న రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నాయి. మేఘాలయలో పెం డింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 100 మించదు. అలాగే త్రిపుర, మణిపూర్…ఇలా ఎన్నో రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య దాదాపుగా 11 లక్షల దాకా ఉంటుంది. ఇందులో తెలంగాణకు సంబంధించిన కేసులు ఆరేడు లక్షల దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అవసరం. ఈ విషయంలో కేంద్రం వివక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. భౌగోళికంగా, జనాభాపరంగా మనది పెద్ద రాష్ర్టం. ప్రత్యేక హైకోర్టు ఎందుకు ఇవ్వడం లేదు. ఇటీవలి కాలంలో మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఏర్పాటు సమయంలోనే వాటికి హైకోర్టులు కూడా వచ్చాయి. మరి మనకెందుకు రావడం లేదు.
గండ్ర మోహన్ రావు
మనం పోరాడింది సంపూర్ణ తెలంగాణ రాష్ర్టం కోసం. ప్రత్యేక హైకోర్టుతోనే అది సాధ్యం. న్యాయవ్యవస్థ విభజన సమయంలో అప్రమత్తంగా ఉండాల్సి. తెలంగాణ ప్రాంత ప్రజల బాధలు తెలిసిన వారే ఇక్కడ న్యాయమూర్తులుగా ఉండాల్సిన అవసరం ఉంది. చట్టాలకు ఏ విధమైన వ్యాఖ్యానం చేయవచ్చు. ఇక్కడి న్యాయమూర్తులు ఉంటే, ఇక్కడి ప్రజలకు అనుగుణమైన వ్యాఖ్యానాలతో తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేయాలి.
దక్కన్ న్యూస్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *