Monday, December 2nd, 2013

 

ఎన్నికల బరిలోకి ఆవ్‌ు ఆద్మీ

ఆవ్‌ు ఆద్మీ పార్టీ …పేరుకు తగ్గట్టుగా సగటు మనిషి రాజకీయ పక్షం. 2012 నవంబర్ 26న ప్రారంభమైంది. దీని పుట్టుక వెనుక కూడా పెద్ద కథనే ఉంది. ఇదీనేపథ్యం…. సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే జనల్ లోక్ పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించాలని కోరుతూ 2011 నుంచి కూడా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పేరిట పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమం పట్ల ఆక ర్షితమైంది. సాధారణ ప్రజానీకం కూడా దీనికి భారీస్థాయిలో మద్దతు తెలిపారు. ఇదే సందర్భంగా ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మలిచే ప్రయత్నాలు జరిగాయి. అన్నా హజారే దీన్ని వ్యతిరేకించారు. ఉద్యమ వైఫల్యం నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాల్సిన అవసరం ఉందని ఆయన సహచరులు కొందరు భావించారు. ఇండియా అగైనెస్ట్ కరప్షన్ సంస్థ నిర్వహించిన సర్వేలోRead More


హైదరాబాద్ రెవెన్యూ రభస

తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు నిర్ణయాన్ని అమలు కాకుండా చేయడంలో భాగంగా పలు అనవసర వివాదాలను రేకెత్తిస్తున్నారు. అలాంటి వాటిలో ఒటి హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎలా పంచుకోవాలనే అంశం. ఈ నేపథ్యంలో ఈ రభస పూర్వాపరాలను, పరిష్కారాలను వివరిస్తున్నారు తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రతినిధి తడకమళ్ళ వివేక్ రాష్ర్ట ప్రస్తుత సంక్షోభానికి తెర వేస్తూ కేంద్ర క్యాబినెట్ తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడి నప్పటికీ, హైదరాబాద్ అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. దాని స్థాయి, అది అందించే ఆదాయం ప్రాధాన్యం పై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ హోదాపై ఊహా గానాలకు తెర వేస్తూ, రెండు లేక మూడు ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి షిండే తెలిపారు. అందులో ఒకటి ఢిల్లీRead More


ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ

ఇప్పటికే ప్రజల సాహిత్యం ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా వచ్చిం దని, ఆ సాహిత్యానికి తయారవుతున్న వారసునిగా రాజేశంను చూడా లని ప్రసిద్ధ నవలా రచయిత అల్లం రాజయ్య అన్నారు. మంచిర్యాల లోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మంటపంలో ప్రముఖ కవి, విమర్శ కుడు తోకల రాజేశం రచించిన సాహిత్య వ్యాసాల సంకలనం ‘‘పాతాళ గరిగె’’ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సాంస్కృతిక వారసత్వానికి తోకల రాజేశం దగ్గరవుతున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెరవే జిల్లా (తూర్పు) అధ్యక్షుడు తోటపల్లి భూమన్న అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి పాల్గొన్నారు. సిధారెడ్డి మాట్లా డుతూ రాజేశం చదవుకు దూరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి తెలంగాణ గడ్డమీద ఈనాడు ఒక విమర్శకునిగా నిలబడటం చాలా గర్వించదగినRead More


కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి

అటు ఉత్తర భారతదేశం నుంచి, ఇటు దక్షిణ భారతదేశం నుంచి హైదరాబాద్ నగరానికి భిన్న జాతులు, కులాల వారు వలస వచ్చారు. కుతుబ్‌షాహీల కాలంలో మొదలైన వలసలు అసఫ్‌జాహీల కాలం నాటికి ఊపందుకున్నాయి. మొదటి అసఫ్ జా కాలంలో ఎన్నో వందల కుటుంబాలు నగర బాట పట్టాయి. వచ్చిన వారిలో సమర్థులైన హిందువులను ఉన్నతోద్యోగాల్లో నియమించారు తొలి నిజాం ప్రభువులు. నైజాం కుటుంబీకులతో సమానమైన ెదాను వారు అనుభవించారు. ఆ మాటకొస్తే చివరి కుతుబ్‌షా పాలనలో అక్కన్న మాదన్నలు ప్రధాన మంత్రి, సైన్యాధక్ష్య పదువులను పొందారు. అలాగే అసఫ్‌జాహీల పాలనలో మహరాజా చందూలాల్, సర్ కిషన్ పెర్షాద్‌లు ప్రధానమంత్రులుగా చాలా కాలం కొనసాగిన సంగతి కూడా తెలిసిందే. వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకొని మైత్రీభావంతో కొనసాగిన ఘనత నగర సంస్కృతిలో భాగమే. కలసి మెలసి ఉంటూRead More


ఇక సాగనివ్వం

వక్రీకరణలు, వంచనలు కుట్రపూరిత పునాదులపై ఆవిర్భవంచిన సమైక్యాంధ్రలో గత 6 దశాబ్దాల నుండి తెలంగాణ అన్ని రంగాలలో నిలువుదోపిడికి గురైంది. ఈ దోపిడికి వ్యతిరేకంగా కొనసాగించిన విద్యార్థుల ఉద్య మాలు, 1000మందికి పైగ జరిగిన నఅమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతున్న తరుణంలో సీమాంధ్ర పెట్టుబడి దారుల కుట్రలు మళ్ళీ మొదలైనాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని, అధికారాన్ని వదలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అడ్గఓలుగా వంచన పూరిత కుట్రలకు పాల్పడుతుండ్రు. సీమాంధ్రుల నక్కజిత్తుల ఎత్తులు సురువుచేసిండ్రు. మొదట్లో హైదరాబాద్‌ను యూటి చేయాలంటు సీమాంధ్రులు మోసపూరిత కుట్రలకు సిద్ధపడగా హైదరాబాద్‌ను యూటిచేస్తే యుద్ధ మే అంటు ఉస్మానియా విద్యార్థి గర్జన సప్పుళ్ళకు దిమ్మదిరిగింది. రాయలతెలంగాణ అంటు రాక్షసానందం పొందుతున్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాచలం తెలంగాణా సొత్తయినప్పటికీ, చరిత్ర వక్రీకరణలకు సీమాంధ్ర నేతలు కుట్రపూరితంగాRead More


ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’

ఈ మధ్య 5 రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా ఒపీనియన్ పోల్స్‌పేర విపరీతమైన చర్చను లేవనె త్తాయి. ఈ మీడియాకు దేశంలో ఉన్న ముఖ్య సమస్యలు ఏమి పట్టక పోయినా, 5 రాష్ట్రాల ఎన్నికల పేరిట, దేశ రాజకీయాలను శాసించే దిశగా పనిచేస్తోంది. రాబోయే 2014 పార్లమెంట్ ఎన్నికలకు, ఇవి ఒక అంచనాగా కూడా పనికి వస్తాయన్నది వాటి అభిప్రాయం. మీడియా కచ్చితంగా సామాజిక కోణంలో ఆలోచించాలి. ప్రతీ పౌరుడికి ఉన్న హక్కులు, స్వేచ్ఛ మీడియాకు కూడా వర్తిస్తాయి. పౌరులకు సరైన సమాచారం, వాస్తవాలు చెప్పవలసిన అవసరం మీడియాకు ఉంది. అలాంటి కోణం లోనే వచ్చిన ఒపీనియన్ పోల్స్ నిర్వహణ లేదా వాటి ప్రచారంలను నిషేధించాలని జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీఎస్పీలు ప్రకటించాయి. ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు. అదేRead More


మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!

అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష, పోరాటం, ఒక వేదన. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి జూలై 30వ తేదీన పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటిస్తూ.. పది సంవత్సరాలు ఉమ్మడిరాజధానిగా ప్రకటించారు. దానినే యూపీఏ కోర్ కమిటీ ఆమోదంతో సెప్టెంబర్ 3వ తేదిన క్యాబినెట్ నోట్ ఆమోదం చేశారు. ఇక్కడి సీమాంధ్రులతో కలసిమెలసి తెలంగాణ రాష్ర్టం సిద్ధించిన సంతోషంలో మేం ఉంటే మా ఆకాంక్షను అడ్డుకుంటాం అని యుద్ధాలకు ఆహ్వానిస్తున్న ఈ పరిస్థితులలో తెలంగాణ వాళ్లను బానిసలుగా చూస్తున్న వాళ్లతో శత్రువులుగా ప్రవర్తిస్తున్న సీమాంధ్ర పెట్టుబడి రాజకీయ నాయకులతో మేం ఉండలేం. తొందరగా రాజధానిని నిర్మించుకొని వెళ్ళి పొమ్మనాలి. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్‌ను ఆంధ్రులకు అప్పజెప్పడమే అనే వాదన మొదలైంది. ఆ సందర్భంలో వచ్చిన క్యాబినెట్ నోట్Read More


ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ

పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పవేశపెట్టాలని భద్రాచలం, మునగాల, హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలన్న ఏకైక డిమాండ్‌తో ముంబైలో తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక ఆధ్వర్యాన గొరేగావ్ ఆజాద్ మైదాన్‌లో నవంబర్ 30న వేలాది జనం మధ్య భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా టిజేఏసి ఛైర్మన్ ప్రొ॥ కోదండరాం, టిఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రముఖ మేధావి, రచయిత, సంపాదకుడు ఎన్.వేణుగోపాల్, ప్రముఖ మహిళా నాయకు రాలు సంధ్య, కళాకారుడు, రచయిత, విద్యార్థి జేఏసీ నాయకుడు దరువు ఎల్లన్న, అ.భా.తెరవే అధ్యక్షులు నలిమెల భాస్కర్, దళిత సంఘర్ష సమితి రాష్ర్ట అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, కరీంనగర్ సాహితీ సోపతి తెరవే నాయకులు నగునూరు శేఖర్, గాజోజు నాగభూషణం, బూర వెంకటేశ్వర్లు, కందుకూరి అంజయ్యతో బాటు కరీంనగర్ పద్మకళా బృందంRead More


‘‘అంకమరాజు’’ కోలాటం

అధ్బుత కథాగేయ రచయిత బలిజె వీరన్న రచించిన ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతాన్ని జనగామగా పిలిచేవారు. గోదావరి చంబల్ లోయ ప్రాంతాన్ని గోండురాజులు పాలించారు. గోండ్యానా ప్రాంతంగా పిలిచే ఈ ప్రాంతం గురించి మేజర్ లూసీస్మిత్ తను రచించిన ‘‘గెజిటీర్ ఆఫ్ ఇండియా’’, ఆంధ్ర ప్రదేశ్ పుస్తకంలో (పే.నెం.23) గోండురాజులు క్రీ.శ. 70 ఉండి క్రీ.శ.1750 వరకు పాలించినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గెజిట్ ఆధారంగా క్రీ.శ.1240 నుండి 1751 వరకు ఇరవై మంది రాజులు గోండ్యానా ప్రాంతాన్ని పాలించినట్లు పొందు పర్చినారు. గోండు జాతి వారి ప్రస్థావన ఐతరేయ బ్రాహ్మణంలో తెలియ వస్తుంది. ఆంధ్రజాతితో పాటు పులిందులు ఉన్నారు. వీరినే గోండు లుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఉండే బస్తర్, మహారాష్ర్టతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూరు, ఆసిఫాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ, చెన్నూర్ తదితరాలు గోండ్యానా రాజ్యంలో అంతర్భాగంగా ఉండేవి.Read More


తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య

తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఒక సాధారణ కుటుంబంలో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి గ్రామంలో పుట్టినాడు. అప్పట్లో అక్కడి ప్రజలు విసునూర్ దేశ్‌ముఖ్‌లు, నిజాం నవాబు కాళ్లకింద నలిగి పోయారు. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్య వాదంలో భాగమైపోయినా హైదరాబాద్ రాష్ర్టం మాత్రం నిజాం పాలనలోనే ఉండింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది తమ ప్రాణాలు త్యాగాలు చేశారు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం అంటూ ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వన మె ్వల సాయుధ పోరాటం ప్రారంభమయింది. రజాకార్లు, విసునూర్ దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీల దోపిడీలు అంతులేకుడా పెరిగిపోయి నాయి. స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. గ్రామాలకు గ్రామాలకు తగులబెట్టినారు. నిజాం సిబ్బంది దాడులకు, రజాకార్లRead More