Monday, December 2nd, 2013

 

సంక్షోభంలో గౌడకులస్తులు | ఉద్యమిస్తేనే పురోగతి

  కల్లు గీత వృత్తి ఎంతో క్రమశిక్షణ గల వృత్తి. కల్లుగీత పనివారు ఎంతో దీక్షతో పనిచేస్తుంటారు. మోకు భుజాన వేసుకోని, కాళ్ళకు గుత్తి తొడిగి, కత్తి వెనక్కిజెక్కి యుద్దానికి వెళ్తున్న వీరునివోలె, ఊపిరి బిగియబట్టి చుక్కలోతు పెరిగిన తాటిగెలలోని కల్లు ఊటను ముంతలోకి తీసి ప్రజలకు అందిస్తుంటారు. నేటి సమాజంలో అన్ని కులవృత్తుల కంటే అతి ప్రమాదకరమైనది కల్లుగీత వృత్తి. పొద్దున లేచిన నుండి పొద్దుమూకే దాక ఒక్కో చెట్టును 3 సార్లు ఎక్కుతూ, దిగుతూ దిన దిన గండమోలె నూేకరళ్ళ ఆయుస్సుగా కాలం ఎల్లదీస్తు న్నారు. నిరంతరం మృత్యువుతో పోరాడుతూ జీవనం కొనసాగిస్తు న్నారు. పండుగైనా పబ్బమైనా,పెండ్లైనా, చావైనా, బ్రతుకైనా ఒక్క పూట తాటి, ఈత చెట్లు ఎక్కకుండా ఉండలేని పరిస్థితితో కూడు కున్నది ఈ కల్లుగీత వృత్తి. . కల్లుగీత వృత్తి నేడుRead More


భద్రాచలం టు భాగ్యనగర్ వయా మునగాల!

‘పోలవరం హఠావో.. భద్రాచలం బచావో’ అన్న నినాదంతో తెలంగాణ ప్రజాఫ్రంట్, ఇతర ప్రజాసంఘాల సారథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముందు చేపట్టిన ధర్నాలో పాల్గొనటానికి తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఛైర్మన్ వేదకుమార్ నేతృత్వంలో నేను, జూలూరి గౌరీశంకర్, తెలంగాణ కవిగాయకుడు అంబటి వెంకన్న తదితరులం బయలు దేరాం. ఖమ్మంలో ‘‘తెలంగాణ దేవుడు భద్రాద్రిరాముడు’’ పేరిట దేవుడిని కాపాడుకోవాలన్న ‘భక్తి’యుత ఆందోళన వెనుక పోలవరం ముంపు ప్రజల ఆకాంక్షల్ని, భద్రాచలం నుండి భాగ్యనగరం దాకా మధ్యలో మునగాల పట్ల సీమాంధ్రనాయకులకు ఎందుకింత ప్రేమో అర్థం చేసుకోవడానికి మా పర్యటన దోహదపడింది. ఈ ఆందోళన నేపథ్యంలోనే సుమారు 35 ముంపు గ్రామాలను సీమాంధ్రకు ఇవ్వక తప్పదేమోనన్న అనుమానం కలుగుతోంది. ఒక వైపు హైదరాబాద్‌ను ‘యూటీ’ చేయడానికి సీమాంధ్ర నేతలు తెస్తున్న ఒత్తిడి, మరొక వైపు రాయలతెలంగాణ ప్రతిపాదనలు… వీటన్నింటి మధ్య ఇకRead More


మాకొద్దీ రాక్షస ప్రేమ…

తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదనే రాక్షస పట్టుదల బహుముఖాలుగా విజృంభిస్తున్నది. యాసిడ్ దాడుల మనస్తత్వం రాజ కీయమై విస్తరిస్తున్నది. ఆదరించిన ప్రాంతం, అందివచ్చిందికదా అని సొంతం చేసుకునే సంస్కృతి వేయి పడగలై విషం చిమ్ముతున్నది. అది శకుని కుట్రల రూపం దాల్చి హైదరాబాద్‌ను కబళింపజేస్తున్నది. మనది కాని ప్రాంతాన్ని పరిచయం చేసుకోవడం మానవ సహజం. ‘‘అటు చూస్తే చార్మినారు, ఇటుచూస్తే జుమా మసీదు, క్యా భాయ్ అని అంటాడొకడు, ఏమోయని అంటాడొకడు’’ అని పాడుకుంటూ, ఇక్కడి చారిత్రక వారసత్వ సంపదను, జీవనవిధానాన్ని అక్కడి ప్రజలకు తెలియజేశాడొక సినిమా నటుడు. ఆనాడు అమాయకంగా, ఆనందం గా ఈ పాటను ఇక్కడివారు పాడుకున్నారు. కానీ పాట రూపంలో పెట్టుబడి వచ్చి చేరిందనే విషయం వెనకబడ్డ మనం గ్రహించలేక పోయాం. అలా వారి చేతిలో పావులమయ్యాం. అనధికారికంగా వారు హైదరాబాద్ అంబాసిడర్‌లయ్యారు.Read More


బహుభాషల భాస్కర్ | తెలంగాణ సిగలో బంతిపూవు

పద్నాలుగు బారతీయ భాషలు తెల్సినవారు బహుశా తెలుగు నేల మీద నలిమెల భాస్కర్ తప్ప ఇంకెవరూ లేరు కావచ్చు. తమిళం, కన్న డం, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, పంజాబీ, తెలుగు, సంస్కృ తం, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, ఓరియా, మరాఠి భాషలు ఆయన కు కొట్టిన పిండి. ఈ పద్నాలుగు భాషల నుంచి కథలను తెలుగు లోకి అనువదించారు. మన సాహిత్యాన్ని ఆ భాషలకు అనువదిస్తున్నారు. అయితె ఈ భాషలు వచ్చుడు అనువదిచ్చుడు ఒకెత్తు ‘తెలంగాణ డిక్ష నరీ’ రూపొందించుడు మరొక ఎత్తు. తెలంగాణ భాషనే అసలు సిసలైన తెలుగని ఆంధ్ర భాష వేరు వేరని బల్లగుద్ది మరీ చెప్పుతున్నారు భాస్కర్. ఆంధ్రప్రదేశ్ అనే బద్మాశ్ కలయిక తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడికి గురై తమ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వం కోల్పో యింది. అందులోRead More


మానవాళికి పెనుముప్పు

కాలుష్యం – సమస్యలు భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువులను పంచ భూతా లంటారు. ఇవి కన్నెర్ర చేస్తే మానవుని మనుగడ ప్రశ్నార్ధకరంగా మారనుంది. కాలుష్యం నేడు మానవాళికి పెనుముప్పుగా మారింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి క్రమ క్రమంగా తప్పుకుంటున్నాయి. 2013లో భారతదేశ జనాభా వంద కోట్లను దాటింది. దినదినంగా జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెద్ద పెట్టున పెరిగిపోయినాయి. దీంతో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు పెరిగినాయి. వాతావరణ మార్పుల మూలంగా మానవాళికి కాకుండా మెత్తం భూమి మీదున్న జీవరాశులు కనుమరుగవుతున్నాయి. అడవులు నరకడం, కాలుష్యం సమస్యలు, కొండలు, గుట్టలు తవ్వుతున్నారు. హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి. హైదరాబాద్, బెంగుళూర్, కోయంబత్తూర్, ముంబయి, చెన్నై వంటి మహానగరాలలో కాలుష్యం బారిన పడి ఎంతో మంది మృత్యు వాత పడుతున్నారు. జీవనదులు,Read More


అసలు నిజాలు

1. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనం స్వచ్ఛందంగా జరిగింది ఇది చరిత్రను వక్రీకరించడమే. కుట్రపూరితంగా రెండు ప్రాం తాలను కలిపి అది స్వచ్ఛందం అని ప్రచారం చేయడం సరికాదు. ఈ వాదన సీమాంధ్ర నేతల అజ్ఞానానికి నిదర్శనం. 1953లో మద్రాస్ రాష్ర్టం నుంచి వేరుపడి ఆంధ్రరాష్ట్రం ఏర్ప డింది. ఏర్పడిన నాటి నుంచి ఆంధ్రరాష్ట్రం రాజధాని సమస్యతో, నిధుల కొరతతో సతమతమైంది. గుంటూరులో హైకోర్టుతో, కర్నూ లు రాజధానిగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం గందరగోళంగా ఉండేది. తమ సమస్యలన్నింటికి పరిష్కారం విశాలాంధ్ర ఏర్పాటులోనే ఉందని ఆంధ్రరాష్ట్ర నాయకులు భావించారు. తెలంగాణను కలుపుకోవటానికి ఉబలాడపడ్డారు. వారి ఆరాటం ఎట్లా ఉండేదో ఆనాటి పత్రికలు చూసి తెలుసుకోవచ్చు. ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకుని విశాలాంధ్ర ఉద్యమం లేవదీశారు. 1. రాజధాని సమస్యఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తగిన రాజధాని లేక ఇబ్బందులుRead More


విదేశీ కంపెనీల గుప్పిట్లో భారతదేశం

ఇన్నాళ్ళూ మౌనమునిలా ఉన్న ప్రధాని మన్మోహన్ నింగ్ ఒక్కసారిగా జూలు విదిల్చిన నింహమే అయ్యారు. తమ ప్రభుత్వం కూలిపోయినా సరే …సంస్కరణల పథంలోనుంచి వైదొలగబోమన్నారు. ఆయన ఆ స్థాయిలో ఆ మాట అన్నారంటే విదేశీ ఒత్తిళ్ళు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. విదేశీ ‘చిల్లర’ బెదిరింపులకే ప్రభుత్వం ఇంతగా భయపడి పేదల నడ్డి విరిేన్త ఎలా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ భారతదేశం నేడు అత్యంత దీన పరిన్థితిలో ఉన్నది. స్వతంత్రభారత దేశంలో మునుపెన్నడూ లేని విధంగా దేశ ప్రజల పరిన్థితి అంధకారం లోకి నెట్టబడింది. 1947 సం॥ లో శతాబ్దాల వలస పాలనుండి విముక్తి పొందిన తరుణంలో నాటి ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుండి నేటి సోనియాగాంధీ అధ్యక్షతన గల యు.పి.ఎ ప్రభుత్వాని కి నాయకత్వం వహిస్తున్న నేటిRead More


తాత్విక రచనలతో

ఔన్నత్వాన్ని చాటిన సిద్ధ్దప్ప వరకవి దక్షిణ భారతానికి చెందిన వరకవులలో కవి, యోగవంద్యులు సిద్దప్పవరకవి తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నత స్థానంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఇతని పద్యాలు ప్రజల నాలుకలపై నాట్యం చేస్తాయి. సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినా, తరాలెన్నో పుట్టి గిట్టుతున్నా, కాలము భూతకాలంలో కలిసిపోయినా కాని ప్రజల మనోఫలకాలపై రూపు దిద్దుకున్న సిద్దప్పవరకవి అనే మహనీయుని రూపం ఎన్నటికీ చెరిగిపోదు. కులమత భేదాలు, సాంఘిక మూఢ నమ్మకాలు, మానవ నైతిక విలువలు కనుమరుగవుతున్న దశలో కలాన్ని ఆయుధంగా ఎంచుకొని సాహిత్య యుద్ధం ప్రకటించి సిద్దప్ప వరకవి ప్రజాహితం కోసం తాత్విక సాహిత్యం సృజించి బోధించిన ఘనుడు. ఆధునిక నాగరికత శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి మూలం కుమ్మరి చక్రం రసాయనశాస్త్రానికి మూలం బంకమన్ను. చక్రమే యాంత్రిక యుగాన్ని నడిపిస్తుంది. మానవ విలువలను, శ్రమ, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిRead More


మానవీయ విలువల ‘పునాది’గా తెలంగాణను పునఃనిర్మిద్దాం!!

ప్రపంచ యువనికపై తెలంగాణ పదమెప్పుడూ ప్రత్యేకతను సంత రించుకుంటూనే ఉంటుంది. తెలంగాణ అన్న పదం నేడు కేవలం భౌగోళి కార్ధమే కాదు. ఒక ప్రాంతీయ సమూహపు ఉమ్మడి అస్థితత్వంగా రూపు దిద్దుకుంది. పోరాటాల పురిటిగడ్డగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ప్రపంచ చరిత్రలో అనేక సందర్భాలలో, అనేకానేక మౌళిక అంశాలపై స్పందిం చింది, గొంతెత్తి నినదించింది. మానవీయ విలువలకు, మరో ప్రపంచ నిర్మాణానికి ఈ నేల తండ్లాడుతోంది. నేటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ధిక్కారస్వరంగా నిలబడే ఉం ది. ‘‘పాల నవ పల్లవ కోమలమైన కావ్యకన్యకను, నృపతులకంకిత మిచ్చి, అప్పుడుపు కూడు భుజియించుట కంటే సత్కవుల్ హాలికులైననే మి?’’ అన్న పోతన వారసత్వాన్ని కొనసాగిస్తూ, పాల్కురికి, బండారు అచ్చమాంబల అడుగు జాడల్లో సాగిపోతుంది. అధర్మం అయితే అయిన వారినైనా ఎదిరించిన బందగీ, షోయబుల్లా ఖాన్‌లRead More


నా మూసీ నది

ఒకనాడు సుందర అందమైన మహానది మన మూసినది. వికారాబాద్ అనంతగిరి కొండ గుండెల్లో పురుడు పోసుకొని నిరం తర ప్రవాహ జలాలతో వందల కిలోమీటర్లు ప్రయాణిస్తు గ్రామ గ్రామాన్ని తాకుతూ, కాలువలు, చెరువులు, కుంటలను నింపుకుంటూ విరామమంటూ ఎరగని పరమ పావని నా తల్లి నిత్య పుష్కరిణి నా మూసిమ తల్లి. మూసి అంటెనే అదో ఆనందం. కల్మషం, కాలుష్య విషం లే కుండా, శంఖంలో తీర్థంలా పవిత్రంగా వుండేది. పసిపాపల మన స్సుల లాంటి తన నీటి అలలపై తామెర పువ్వుల నవ్వులలో వయ్యా రాల సొగసుల మలుపులలో లోలోన మురుస్తూ తళతళ ముత్యాల్లా మెరుస్తూ పర్యాటకులని మైమరిపించేది నా మూసి. మూసి అంటే ముత్యాల నగరానికి రతనాల పసిడినగ వంటిది. మూసి అంటె తెలంగాణలో ఓ జీవనది. ఓ పుష్కరిణి మూసి. నిజాం నిలువెత్తుRead More