Monday, December 2nd, 2013

 

నానేల తల్లి నవ్వింది

జయహే జయహే తెలంగాణా జయజయహే తెలంగాణా అరవైయేళ్ళ కలల పంట నిజమైన ఓ సుందర స్వప్నం పది జిల్లాల పసిడి స్వర్గం బలీయమైన తెలివాహ దుర్గం మొగస్తనీస్ గుర్తించిన నా కోటిలింగాల అమరవీరుల నెత్తుటి ధారల్లో తడిసిన నిత్యనూతన నా జన్మభూమి ఇది అయినా వారి నెప్పటికినీ మరువం ఎందరెందరి పోరాటాలతో పునీతమైన నా జనని సౌభాగ్యాల నా కన్న తల్లి ఘనస్వాగతమమ్మా రాజకీయ పోరాటమైనా, సాంస్కృతిక వీరావేశమైనా విద్యార్థుల బలి దానాలైనా, అన్ని పార్టీల సహకారమైనా మండిన నా తల్లి కొలిమి నేటికినీ చల్లబడింది ఆశలన్నీ అడియాసలుగా కాక ముందే తెలంగాణం మరో రాష్టమై అవతరించనుంది విభజించు, పాలించు అన్న శత్రునినాదం వీగిపోయింది నాలుగు వందల యేళ్ళ నా భాగ్యనగరిపై సిరుల వాన కురిసింది అమ్మతల్లి ఆషాఢ బోనమెత్తింది విజయ గర్వంగా దాశరథి రుద్రగానం వట్టికోటRead More


బహుజన మహిళలకు తావులేని మహిళా కమిషన్

  ప్రభుత్వాలు మహిళల్ని ఏదో ఉద్దరిస్తున్నట్లు కనిపించే దానికి మహిళా కమీషన్స్ వేస్తున్నాయి. అదేంటో యిప్పటి దాకా వేసిన మహిళా కమీషన్స్‌లో దళిత ఆదివాసి, బీసీ మైనారిటీ మహిళలు కనిపించలేదు. వారి దృష్టిలోనే తీసుకుంటే మహళలంటే విద్య, ఉపాధి రంగాల్లో ముందున్న వారేనా? చదువు, ఉపాధి లేక, మానవ గౌరవాలు, మానవ హక్కులు లేక బతకడమె ఒక సమస్యగా వున్న దళిత ఆదివాసి, బీసీ, మైనారిటీ మహిళలంతా ఒక్కటే అయితే ఈ సమూహాల్లోంచి, ఈ కులాల్లోంచి కూడా మహిళా కమీషన్‌లో ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉం డింది. కాని ప్రభుత్వాలకు అన్ని అవకాశాలున్న పాలక కులాల మహి ళలే మహిళలుగా కనిపించి వారి పేరుతో కింది కులాల మహిళలను ప్రాతిపదికగా తీసుకొనక ప్రాతినిథ్యంగా తీసుకొనక అణగారిన మహిళ అన్యాయం చేస్తున్నది. భారతదేశంలో మహిళలు భిన్న కులాల్లో వున్న హైరార్కిని,Read More


ఎక్కడైనా చర్చ…చేసేద్దాం రచ్చ!

ఒక సమైక్య వాదికి ఒక వేర్పాటు వాదికి మధ్య చర్చ. ఒక ఆంధ్రోనికి ఒక తెలంగాణోనికి మధ్య చర్చ. ఈచర్చ స్థలం హైదరాబాదు రేడియోస్టేషన్ ముందు ఉన్న బస్‌స్టాప్. నవంబర్ 1న 11 గంటలకు అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం ముందు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మాకు ఒక దుర్దినమని తెలపడానికి, నల్లరిబ్బన్‌లు ధరించి మౌన ప్రదర్శన చెయ్యడానికి మా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టీ.ఎస్.సి.ఏ) సభ్యులం జమైనాము. గన్‌పార్క్‌లోని స్తూపం ముందుల ప్రదర్శన పిదప ముందు చెప్పిన బస్ షెల్టర్ పక్కన అందరూ వెళ్ళిపోయిన పిదప నలుగురం ఉండిపోయి చర్చిస్తున్నాం. ఇంతలో ఒక పరిచయంలేని వ్యక్తి మా చర్చలోకి దూరినాడు. తన పేరు ఏపీఎన్ స్వామియని, ఒక తెలుగు దినపత్రికకు ఎడిటోరియల్స్ అప్పుడప్పుడు రాస్తుంటా నని చెప్పుకొచ్చాడు. మొన్న అంటే 2011 అక్టోబర్ 30న రాసిందిRead More


కాళోజీ కవిత్వం పాదసూచికల ప్రాధాన్యం

1930 నుంచి ఆయన చివరి శ్వాసవరకు తెలంగాణ ప్రజల ఆరాట పోరాటాలకు అక్షరాకృతి కాళోజి కవిత్వం. నాగొడవలుగానే అయినా, కథలు, వ్యాసాలు, అనేక సభలు, సమావేశాలలో చేసిన ఉపన్యాసాలైనా కాళోజీ సాహిత్యాన్ని కాలక్రమంలో తేదీల వారీగా కూర్చి చదివితే తెలంగాణ సమాజ చలన క్రమం కనిపిస్తుంది. కాళోజీ సాహిత్యాన్ని (భావవ్యక్తీకరణను), కార్యాచరణను వేరువేరుగా చూడ లేం. రెండు ఒకటే. కాళోజీ జనజీవన మమేకత ఎంతటి భావోద్వేగ పూరితమైనదంటే ఏ కవిత అయినా సాహిత్య వ్యక్తీకరణ అయినా వాటి నేపథ్యం గర్తు చేసిన సరే, లేదా ఆ క్షణం తాను స్పందించిన ఏ ఘటన విషయం అయినా తన వారసులునేవారు ఎవరు కలిసినా వారితో చెప్పి కన్నీరు కార్చే కాళోజీ కరుణార్ద్రతను బహుశా ఎవరూ మర్చిపోలేరు. 1977లో అనుకుంటా. ఒకరోజు ఉదయం నడకకు ఉస్మానియా వచ్చిపోతా మా ఇంటికొచ్చిRead More


ప్రాంతీయ అసమానతలతోనే

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం పట్ల ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకో వాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సాంఘీకశా ఉపాధ్యాయు ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాగంపై విద్యాసదస్సు కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ హరిప్రసాద్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిలు ముఖ్యవక్తలుగా హాజరై ప్రసంగించారు. అదనపు జేసీ రాజారాం ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘీక శాం పట్ల అధ్యాపకులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకొని విద్యాబోధన చేయాలన్నారు. నిజాం ప్రభుత్వ కాలంలో మద్రాస్ నుంచి వచ్చిన ఆంధ్రులు చట్టాలలోని లొసుగులను ఆధారంగా చేసుకొని తెలంగాణా ప్రాంతంలో విలువైన భూములను, ఆస్తులను ఆక్రమించార న్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగం విలువలు, హక్కులు అనే అంశాలను గూర్చి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తమకు దక్క వల్సిన ఆస్తులను,Read More


‘మనసున్న మని‘షి’ నిర్నిద్ర గానమిది’

జీవితానుభవాలను, ఆలోచనా తీరాలను, తెలిసిన ప్రపంచాన్ని దాటి ఎవరు ఏమి రాసినా ఆ రచనలో జీవం ఉండదు. ఈ సూత్రం ఎరిగిన కవయిత్రి కొండపల్లి నీహారిణి. తెలిసిన రాగాలలోనే ‘నిర్నిద్ర గానం’ చేసింది. అందుకే ఇందులో జీవకళ ఉంది. ఆర్ధ్రత ఉంది, నిజాయితీ ఉంది. అక్కడక్కడా కొంగు బిగింపూ ఉంది. ఎలాంటి ఆడంబరాలు, అతిశయోక్తులు లేని ఈ కవిత్వం కవ యిత్రి మనోచిత్రాల ఆల్బవ్‌ును తిరగేసినట్లు ఉంటుంది. ఈమెకు స్పందించవలసిన సమయం, సందర్భం స్పష్టం గా తెలుసు. తన మనసు తల్లడిల్లిన ప్రతి చిన్న సంఘటనను కూడా కవిత్వీకరించడం తెలుసు. సంకలనంలో కవయిత్రి తన మాటగా ‘మనస్సాక్షిలో’ రాసిన నాలుగు మాటల్లో ఎంతో పాదర్శకత ఉంది. ‘మనుషులం కదా! స్పందిచ కుండా ఎట్లుండాలి?. ఎట్లుంటాం!’ అని ప్రశ్ని స్తుంది. ఇదే తపన ఈ కవిత్వంలో పదపదంలో అగుపిస్తుంది.Read More