Tuesday, December 2nd, 2014

 

బహుళ అంతస్తుల ప్రాజెక్టు | సుప్రీంకోర్టు కమిటీ సిఫారసులకు వ్యతిరేకం

హుసేన్ సాగర్ పరిసరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మా ణాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సిఫారసులకు మరింత నిర్దిష్టంగా చెప్పా లంటే, 6.1 నుంచి 6.3 వరకు ఉన్న సిఫారసులకు వ్యతిరేకం. కమిటీ సిఫారసులలో వేటికీ తమకు అభ్యంతరం లేదని రాష్ర్ట ప్రభుత్వం 2014 జనవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా మారే దిశలో హైదరాబాద్ వేగంగా పురోగమి స్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, హుసేన్‌సాగర్ పరిసరాల్లో బహుళ అం తస్తుల భవనాల నిర్మాణ ప్రతిపాదనను ఫోరవ్‌ు ఫర్ ఎ బెటర్ హైదరా బాద్ (ఎఫ్‌బీహెచ్), మరికొన్ని ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘హుసేన్ సాగర్ పరిసరాలో బహుళ అంతస్తుల భవనాల ని ర్మాణం గురించి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.Read More


చుక్కా రామయ్య జీవితం ఆదర్శప్రాయం

చుక్కా రామయ్య విద్యావ్యవస్థకు చుక్కాని లాంటి వారని ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని విశాలాంధ్ర ఎడిటర్ కె. శ్రీని వాసరెడ్డి అన్నారు. రామయ్య వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ నారాయణగూడలోని భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారత్ కళా శాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య ను ఘనంగా సత్కరించారు. ఆయన రచించిన ‘సింగపూర్ చదువులు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలువురు ప్రముఖ పాత్రికేయులు, పత్రికా సంపాదకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. నేటి విద్యావిధానం కార్పొరేట్లకు అనుగుణంగా ఉండటం వల్లనే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలనే ఆలోచన నేటి తరానికి లేకుండా పోయిందని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘గణిత మంటేనే చుక్కా రామయ్య అన్నట్లుగా ఆయన గుర్తింపు పొందారు’ అని ప్రెస్ అకాడమీ చైర్మన్Read More


విద్యుత్ సమస్య పరిష్కారాలు

తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్‌సీ) ఆధ్వర్యంలో ప్రతీ వారం నిర్వహించే ‘చర్చ’ కార్యక్రమంలో భాగంగా 146వ చర్చలో ‘తెలం గాణలో విద్యుత్ సమస్యలుపరిష్కార మార్గాలు’ అనే అంశంపై చర్చ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్ లోని చంద్రం భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఆఫ్ తెలంగాణ రాష్ర్ట డివిజనల్ ఇంజనీర్ పి.మోహన్‌రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అడ్వయిజర్ ఇంజినీర్ నీలం జానయ్య, తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.శివాజీ, ప్రొ. లక్ష్మణ్, డా॥ జె.సురేశ్, శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ప్రసంగించారు.కార్యక్రమానికి టీఆర్‌సీ ఛైర్మన్ వేదకుమార్ అధ్యక్షత వహించారు. ఆయా వక్తలు పేర్కొన్న అంశాలు క్లుప్తంగా… వేదకుమార్ … తెలంగాణ వచ్చాక కూడా ఈ టీఆర్‌సీ అవసరమా అనే చర్చ వ చ్చింది. కానీ తెలంగాణ సాధించాక పునఃనిర్మాణం కోసం మనంRead More


తెలంగాణ సంస్కృతిలో… ఇప్పచెట్టు భాగమే!

తెలంగాణ రాష్ర్ట అధికారిక వృక్షంగా జమ్మిచెట్టును తాజాగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో అంతర్భాగమైన ఇప్పచెట్టును అధికారికంగా గుర్తించడమే సముచితం గా ఉంటుందని తెలంగాణ ఆదివాసీల పక్షాన కోరుతున్నాను. స్వరాష్ర్టంలో ఇటీవల తెలంగాణ ప్రజలు, విదేశాల్లో ప్రవాస తెలంగాణీయులు సైతం అత్యంత వైభవంగా పూలపండుగ ‘బతుకమ్మ’ ను జరుపుకున్నారు. బతుకమ్మలో పేర్చుతున్న గుమ్మడి, గునుగు, తంగేడు, తామర, అల్లి, రేల, మోదుగు, బంతి, టేకు, మందార వంటి పూలను స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. ఈ కోవలోంచి తంగేడు పువ్వును ‘అధికారిక పుష్పం’గా గుర్తించడం ఆనందదాయకం. పక్షులు, జంతు జాతులు అంతరించి పోతున్న నేటి తరుణంలో తెలంగాణాలో విజయ దశమి రోజున ప్రజలకు పాలపిట్ట దర్శన భాగ్యం ఒక శుభ సూచకమని భావించే పాలపిట్టను ‘రాష్ర్ట పక్షి’,Read More


బృహతమ్మ బ్రతుకమ్మ బతకమ్మ

2వ అక్టోబరు, 2014 నాడు తొలిసారి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఆద్వర్యంలో తెలంగాణ ప్రాంతమంతా బతుకమ్మ పండుగను కనివిని ఎరుగని రీతిలో, రాజఠీవితో ప్రజలంతా మమేకమై జరుపుకొన్నారు. ఇప్పటివరకు ఈ పండుగ స్త్రీలు పండుగగా, పూలపండుగగా ప్రఖ్యాతి చెందింది. తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను రాష్ర్ట పండుగగా గుర్తిం చడం తెలంగాణ చరిత్రలో మరుపురాని విషయం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా, వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకొని, ప్రపంచానికి ఈ పండగ గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఇప్పుడిదొక బృహత్ పండుగ. ఇప్పటి వరకు బతుకమ్మ పండుగ మూలాలేమిటో వెలుగులోకి రాలేదు. ఈ విషయాన్ని చరిత్రకారులు, సాహీతీవేత్తలు ధ్రువీకరించారు. గత కొన్ని శతాబ్దాలుగా బతుకమ్మపై ఎన్నో జానపద గాథలు, పాటలు తెలంగాణ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నవి. తెలంగాణ ఉద్యమ సంధర్భం గా వినూత్నRead More


ఐ.టి.ఐ. లకు మళ్ళీ ప్రాణం

గత 20 సంవత్సరాలుగా మరుగున పడ్డ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు మళ్ళీ ప్రాణం వచ్చింది. చాలా కాలంగా ఐ.టి.ఐ. అంటే యువతకు నిర్లక్ష్యం ఉండేది. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ ఉద్యోగ నియామక సంస్థలలో ఐ.టి.ఐ. పాసైన వారికి ఉద్యోగాలు రావడంతో ప్రతియేటా ఐ.టి.ఐ. చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఐ.టి.ఐ. లో రెండేళ్ల వ్యవధిలో ఉండే కోర్సులు, ఒక యేడాది వ్యవధిగల కోర్సులున్నాయి. ఎలక్ట్రీషియన్, టర్నర్, మేషనిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్, సివిల్ మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ ఐ.టి. ఇ.ఎస్.ఎం., రేడియో టిలివిజన్‌లు రెండేళ్ళ వ్యవధిగల కోర్సులు. అలాగే డీజిల్ మెకానిక్, వెల్డర్, కోపా, స్టెనోగ్రఫీ, వైర్‌మెన్, న్యాసన్, కటింగ్ సివింగ్, షీట్‌మెటల్ ప్లంబర్, హెల్త్ శానిటరీ ఇన్స్‌పెక్టర్, నీడిల్ వర్క్ మొదలైనRead More


రాచకొండలో ఆదిమానవుల చిత్రలేఖనాలు

తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైందని మరోసారి రుజువైంది. చరిత్ర పూర్వయుగానికి చెందిన.. అంటే రాత కనిపెట్టక ముందు కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆదిమానవులు నివసించేవారనడానికి నిదర్శ నంగా వారు వేసిన ఎరుపు రంగు చిత్రలేఖనాలు, రాతి గోడలపై చెక్కిన రేఖాచిత్రాలు, అర్ధరంధ్రాలు రాచకొండ గుట్టలపైనున్న పెద్ద పెద్ద రాతి గుండ్లు ఏర్పరచిన గుహల్లో కనిపించాయి. కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతానికి రాజ ధానిగా వర్ధిల్లిన రాచకొండ చరిత్ర పైన ఒక పుస్తకం రాయాలని రాచకొండ గుట్టల్లో కన్పించే చారిత్రిక నిర్మాణాలు, ఆధారాలను స్వయంగా చూడాలని నేను 9.11.2014 నాడు రాచకొండ గుట్టల సముదాయంలోని గుఱ్ఱాల గుట్టను ఎక్కి పరిశీలించినప్పుడు అదృష్టవశాత్తు చరిత్ర పూర్వ యుగానికి చెందిన చిత్రలేఖనాలు కన్పిం చాయి. ఇవి తెలంగాణ చారిత్రక వైభవాన్ని మరింత ఇనుమడింప జేస్తాయి. ఇలాంటి చిత్రలేఖనాలు తెలంగాణలో ఇప్పటిRead More


ఆత్మహత్యలను అడ్డుకోవాలి!

రైతుబంధు అవార్డుల ప్రధానోత్సవంలో వక్తలు ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాలి ఆప్కాబ్ ప్రెసిడెంట్ కె.వీరారెడ్డి అభ్యర్థన రైతులు సంఘటితం కావాలి: యం.వేదకుమార్ నెస్ట్ ఫౌండేషన్‌రైతుబంధు అవార్డుల ప్రదానం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆప్కాబ్ ప్రెసిడెంట్ కె.వీరారెడ్డి అన్నారు. నెస్ట్ ఫౌండేషన్, రైతుబంధు వ్యవసాయ మాసపత్రికల ఆధ్వర్యంలో నవంబర్ 27న హైదరాబాద్ బాగ్‌లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.వీరారెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేపట్టా లన్నారు. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం నిజమేన న్నారు. లాభసాటి ధరలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నా రు. యంత్రాల రాకతో పశువులకు మేత కూడా కరువైపోయిందని అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని అధికం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోRead More


బాలల హక్కులు చట్టాలు

తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో 14వ చర్చ కార్య క్రమంలో భాగంగా బాలల హక్కులుచట్టాలు అనే అంశంపై చర్చను హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ‘చంద్రం’ లో నిర్వహించారు. ప్రొ॥ ఫాతిమా అలీఖాన్, ఆర్. వెంకట్‌రెడ్డి (ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్), మురళీ మోహన్ (తెలంగాణ బాలల హక్కుల వేదిక అధ్య క్షులు), ఎండీ రహిమొద్దీన్ (అడ్వకేట్), ఫిలిప్స్ (బాలల హక్కుల వేదిక), టీఆర్‌సీ చైర్మన్ యం. వేదకుమార్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆర్.వెంకట్‌రెడ్డి … కడుపులో ఉన్న బిడ్డ నుండి మొదలు 1 సం॥ బాలబాలికలకు బాలల హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు గౌరవించి అమలు పరిచే ప్రభుత్వాలు ఉంటేనే ప్రజాస్వామికం అని భావించాలి. 2011 లెక్కల ప్రకారం కోటిమందికి పైగా సరిగా చదువులేని వారే మన ప్రాంతంలో ఉన్నారు. 2% మాత్రమే పదోతరగతి చదివినRead More


వెంటాడుతున్న గత ప్రభుత్వాల పాపం అన్నదాతల మరణ మృదంగం ఆగేదెపుడు?

తెలంగాణ పల్లెలో నిత్య విషాదం. ఎక్కడో ఒక చోట అన్నదాతల ఆత్మహత్యలు. చావు కబురు వినిపిస్తుంది. ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది. పగలనకా, రేయనకా నిత్యం ఆరుగాలం కష్టపడి దేశానికి వెన్నుముకలైన రైతన్నలు తమ ప్రాణాలను బలి తీసుకుంటున్న విషాదం. జనం హృదయాలను కదిలిస్తుంది. రైతన్నలవి అరణ్య రోదనలు. వారి చావులు, ఆకలి కేకలు పాలకులకు పట్టడం లేదు. అమరవీరుల త్యాగాలు, అరవై ఏళ్ళ ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణ వచ్చి ఏడు నెలలు కాలంలో ఇప్పటికి సుమారు మూడు వందల మంది అన్నదాతలు ఆత్మ హత్యకు పాల్పడినారు. ఒకవైపు వ్యవసాయం కార్పొరేటయింది. మరోవైపు కరువు కటకాలు. బ్యాంకులో రుణాలు చేసిన అప్పులు తీర్చలేక, పెట్టు బడులు వెళ్లక రైతాంగం నేడు తీవ్ర దుర్బిక్షంలో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ స్వరాష్ర్టంలోనైనా. తమ బతుకులు మరుగు పడుతాయని, ఆకలి చావులు,Read More