Tuesday, December 2nd, 2014

 

సొంత హైకోర్టుతోనే స్వరాష్ర్టం!

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడి ఆరు నెలలు గడిచినా ఆ భావన మాత్రం ప్రజల్లో కలగడం లేదు. అందుకు ప్రధాన కారణాల్లో న్యాయవ్యవస్థ విభజన జరుగకపోవడం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చా కార్యక్రమాన్ని తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్‌సీ) నిర్వహించింది. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ (ఇండియన్ అకడమిక్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్), మంతెని రాజేందర్ రెడ్డి (చైర్మన్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ), వి. రఘునాథ్ (హైకోర్టు న్యాయవాది, కన్వీనర్ ఏపీసీఎల్‌సీ), సరసాని సత్యంరెడ్డి (హైకోర్టు సీనియర్ న్యాయవాది), గండ్ర మోహన్ రావు (హైకోర్టు న్యాయవాది), ముకీద్ (హైకోర్టు న్యాయవాది), టి. శ్రీరంగారావు (హైకోర్టు న్యాయ వాది, కోకన్వీనర్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ) తదితరులు ఇందులో పాల్గొన్నారు. సరసాని సత్యం రెడ్డి అధ్యక్షత న్యాయవాద వృత్తిలో ఉన్న మేము ఈ తరహా సదస్సులోRead More


నచ్చిన వరుడు

‘‘నేను రాసిన ఈ కథ చదువు బావా!’’ రాతప్రతి అందిస్తూ అన్నాను. ‘‘కథ పేరేమిటి మరదలా!’’ బావ కొంటె చూపులు విసురుతూ అన్నాడు. ‘‘కథను ఇంకా ముగించ లేదు బావా! అందుకే కథ పేరు నిర్ణయించలేదు’’ ‘‘ముగింపులేని కథలు చదవడం నాకు ఇష్టం ఉండదు. నేను చదువను’’ ‘‘చదివి ముగింపు ఎలా ఉండాలోచెప్పడానికే చదువుమం టున్నా’’ అన్నాను బతిమిలాడుతున్న కంఠస్వరంతో… ‘‘కథను ఎలా ముగించాలో నిర్ణయించుకోకుండా కథ రాసి ముగింపు ఎలా ఉండాలో చెప్పమంటే నేనెలా చెప్పగలను?’’ ‘‘నువ్వు తెలివి కలవాడివని నేను అనుకుంటున్నాను కనుక ముగింపు చెప్తావని ఆశించాను.’’ ‘‘నీ ముగింపులేని కథ చదివి ముగింపు ఎలా ఉండాలో చెప్పకపోతే నేను తెలివి తక్కువ వాడినని భావిస్తావా!’’ ‘‘అలా భావించను బావా! నా అభ్యర్థనను మన్నించి చదివి నీకు తోచింది చెప్పు’’ ‘‘చెప్పను’’ బావ అలాRead More


కుట్రలను తిప్పికొట్టాలి

న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ప్రత్యేక రాష్ర్టం ఏర్పడినా ఎన్నో చిక్కు ముళ్ళు. ఎన్నో అధికారాలు, హక్కులు మనం పొందలేకపోతున్నాం. వాటిని పొందేందుకు పోరా టాలు చేయాల్సి వస్తోంది. ఈ పోరాటాన్ని ఢిల్లీలో చేసేందుకు మన రాష్ర్టం నుంచి ప్రత్యేక ప్రతినిధులను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. వారి అనుభవాలను పంచుకునేందుకు తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్‌సీ) ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనకు ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఈ చర్చా కార్యక్రమా నికి హాజరయ్యారు. ఆ విశేషాలు క్లుప్తంగా… టి.రామచంద్రుడు (రిటైర్డ్ ఐఏఎస్ అధికారి) మీతో కలసి పోరాటంలో ప్రత్యక్షంగా పాలు పంచుకునే అవకాశం కలుగలేదు. పరోక్షంగా మాత్రం కృషి చేశాను. 2013లో ఏప్రిల్30న రిటైర్ అయిన వెంటనే ఒక్కరోజు మాత్రమే ఒడిషాలో ఉండి మే 2న హైదరాబాద్‌కు వచ్చాను.Read More


వాన నీటిని ఒడిసి పట్టండిలా..

జి.వినయ్‌కుమార్, డా.వై.జి.ప్రసాద్, ఎస్.చంద్రమౌళి, ఎవ్‌ు.శ్యాంప్రసాద్‌రెడ్డి, క్రీడా తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక మన పూర్వీకులు మెట్ట పంటలను వర్షాధారం, వరి పంటలను చెరువు నీటితోను, బావుల నీటితోను పండించుకున్నారు. నాడు పర్యావరణం దెబ్బతినకుండా, వాతావరణ పరిస్థితులు అనుకూలించి సమయాకూలంగా వర్షాలు కురి యడం వలన ఆ నీటితో పంటలను సమృద్దిగా పండించేవారు. కానీ నేడు అభివృద్ధి పడక పర్యావరణం దెబ్బతిని సకాలంలో వర్షాలు కు రవక వర్షాభావ పరిస్థితులు పంటల సాగుకు కష్టమవుతుంది. అకాల వ ర్షాలు, వరదల వల్ల పంటనష్టంతో పాటుగా అధిక నీరు వృధాగా పోతోంది. మన చేనులో కురిసిన ప్రతి వాన బొట్టును వృధా పోకుండా నేలలో ఇంకి పోయేలా చేస్తే మన చేను కిందే భూగర్భ జలాశయాన్ని ఏర్పర చుకోవచ్చు. దీని నుండి పంట సమయంలో కావలిసినంత నీటిని బావుల ద్వారా,Read More


దారి తప్పిన మధ్యాహ్న భోజన పథకం

విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడిపిల్లల మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న భోజన ఏజెన్సీల మధ్య చిచ్చు పెడుతోంది. 2005 సంవత్సరములో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా ఉండటానికి వారికి ఉచిత పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజనర కూడా అందించడానికి ప్రభుత్వ, ఆయా గ్రామాలలోని మహిళా గ్రూపుల్లోని కొన్ని ఒక్కొక్క గ్రూపును ఎంపిక చేసింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలను రొటేషన్ పద్దతిలో అధికారులు ఎంపిక చేస్తారు. అయితే విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రుచిగా, శుచిగా ఉండే విధంగా భోజనాన్ని తయారుచేయాల్సి ఉం డగా అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల అన్నం చారెడు పులుసు, చారెడు పప్పు లాగా మారింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు గ్యాస్ సదుపాయం, వంటగది నిర్మాణానికి నిధులు, వంట సామాగ్రి కొను గోలుకు ఆర్థికRead More


‘ఆసరా’తో పేదలకు భరోసా..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకం నిరుపేదల్లో వెలుగులను నింపుతుంది. వయస్సు మీద పడిన వృద్ధులకు, ఇంటిపెద్ద దిక్కు కోల్పోయి బతుకు పోరాటం చేస్తున్న వితంతువులకు, అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగుల కు, కులవృత్తిపై ఆధారపడి బతుకులీడుస్తున్న గీత, నేత కార్మికులకు ‘బతుకు భరోసా’ ఇచ్చే ‘ఆసరా’ పథకాన్ని తెలంగాణ సర్కార్ ప్రారంభిం చిన విషయం విదితమే! కాలం కర్కశ చక్రాల క్రింద నలిగిన జీవి తాలకు ఆసరాగా నిలుస్తూ.. ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని… సరికొత్తగా అందించడంతో వృద్ధులు, వికలాంగులు, ఎయిడ్స్ బాధితు లు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ ‘ఆసరా’ పథకాన్ని ప్రకటించారు. ‘అనర్హులకు కోత..అర్హులకు చేయూత’ అనే పద్ధతుల్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. పేదRead More


చిందు కళా దీపస్తంభం ఎల్లమ్మ

కళలను కులాల రొంపిలోకి లాగి, నిమ్న కులాలలో వెలు గొందుతున్న కళారూపాలను అణగదొక్కి పెట్టడం మనుషులు చేయవలసిన పనికాదు. సంగీతం, సాహిత్యం, నృత్యం ఏ ఒక్కజాతి, వర్ణం సొత్తు కాదు. తరతరాలుగా వేదాలు, పురాణాలు, మనుధర్మం అంటూ మనుషుల్ని విడదీసి వృత్తి, కులం పేరిట కొందరిని అంటరాని వారిని చేసి, వారిని, వారి కళలనూ అస్పృశ్యం చేశారు. విద్యావికాసం వల్ల సమాజంలో తగిన గౌరవం, ఆదరణ దక్కని కళలను నేటి పరి శోధన ద్వారా వెలుగులోకి తెస్తున్న జాడలు రేపటి గురుజాడలు. ఈ క్రమంలో వచ్చినదే ‘చిందుల ఎల్లమ్మ’ పరిచయ పుస్తకం. గడ్డం మోహన్‌రావు పరిశోధనల ఫలితంగా చిందు యక్షగాన కళాకారిణి గురించి ఎన్నో విషయాలు తెలియవచ్చాయి. అణచివేయబడ్డ చరిత్రకు మూలాలను చారిత్రక సామాజిక సాంస్కృతిక కోణాలలో అన్వేషిస్తూ చిందు కళా చరిత్రను తిరగరాసి, జానపద సాహిత్యంలోRead More


రైతులు సంఘటితం కావాలి

జేఏసీ ఛైర్మన్ కోదండరావ్‌ు సమస్యల పరిష్కారం కోసం రైతులు గ్రామస్థాయి నుంచి సహకార సంఘాలుగా ఏర్పడి ఐక్యంగా పోరాడాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రతి గ్రామంలో రైతులు జేఏసీగా ఏర్పడి రాష్ర్ట జేఏసీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, ఆత్మహత్యలు నివారించాలంటూ తెలంగాణ రైతు సం ఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో కోదండ రావ్‌ు ప్రసంగిస్తూ.. రాష్ర్టంలో సాగునీరు, విద్యుత్ సరిగా లేకపోవడం తో పాటు పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు పెరగడంతో భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ బీర్ కంపెనీ యాజమాని విజయ్‌మాల్యా బ్యాంకులకు రూ.30వేల కోట్లు అప్పుగా ఉన్నారని, ఆయనకు రూ.వేల కోట్లను రద్దు చేశారని,Read More