Friday, September 9th, 2016

 

మహా జలమైత్రి

మేడిగడ్డ, తమ్మిడిహట్టి, చనాఖాకొరాట బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ర్ట ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం తెలం గాణను సస్యశ్యామలం చేసే యత్నంలో ఓ ముందడుగుగా చెప్ప వచ్చు. మహారాష్ర్టతో తెలంగాణ అనుబంధానికి వందల ఏళ్ళ చ రిత్ర ఉంది. ఈ అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసే రీతిలో ఈ ఒప్పందం కుదిరింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడే సఖ్యత కుదురుతుంది. అలా కుదిరే సఖ్యత రెండు రాష్ట్రాలకూ మేలు చేస్తుంది. అవసరం మనదైనప్పుడు అది తీరేందుకు అవసరమైతే కాస్త తగ్గడం లౌక్యం. తెలంగాణ ప్రభుత్వం ఈ విజ్ఞతను ప్రదర్శించినందువల్లే ఒప్పందం కుదిరింది. నిజానికి ఈ ఒప్పందం కొన్ని దశాబ్దాల క్రితమే కుదరా ల్సింది. కారణాలు ఏవైతేనేం, అప్పటి ప్రభుత్వం పంతానికి పోయిన రీతిలో వ్యవహరించడంతో అసలుకే ఎసరు వచ్చింది. అలాంటి స్థితి నుంచి ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు ప్రస్తుత ప్రభుRead More


సిద్ధాంతాలు పద్ధతులు

తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం తెలంగాణ రాష్ర్ట సాకారం కోసం దశాబ్దాలపాటు ఉద్య మించి, త్యాగాలుచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నం. రాష్ర్ట ఆవిర్భావ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ అక్కడే ఆగిపోకుండా అన్ని రంగాల్లో నిర్మాణాత్మక కృషి చేస్తున్నం. ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు ఆ కృషిలో భాగమవుతున్నరు. ఆ కృషిలో భాగంగా ‘‘తెలంగాణ సాహిత్య చరిత్ర’’ నిర్మాణం చేయవలసి ఉంది. ఈ దిశలో ఉద్యమ కాలంలో కొంత కృషి జరి గింది. జరగవలసింది చాలానే ఉన్నది. తెలంగాణ సాహిత్య నిర్మాణం ఎట్లా జరగాలనే దానిని తెలం గాణ రాష్ర్ట ఉద్యమంలో ఏయే శక్తులు పని చే సినవి, ఏయే రాజకీయాలు, తాత్త్వికతలు ప్ర భావాన్ని చూపినవి అనేవి కొంత నిర్ణయిస్తవి. 1969 ఉద్యమం విఫలమైన తరువా త ఎన్నో పరిణామాలు జరిగినవి. మధ్య తరగతి ఒక బలమైన శక్తిగాRead More


తెలుగు వాచకాల విశిష్టత

తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం సింగిడి 1 ఆరు దశాబ్దాల తెలంగాణ స్వప్నం సాకారమై కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన చారిత్రక సందర్భంలో రూపొందించిన కొత్త పాఠ్యాంశాలలో అనేక విశేషాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్థానిక సంస్కృతి, స్వంత భాష పాఠ్యాంశాల్లోకి తీసుకు రావడంలో పాఠ్యపుస్తక అభివృద్ధి కమిటీ చాలామేరకు విజయం సాధించింది. ఆ క్రమంలో 9వ తరగతి పాఠ్య పుస్తకాన్ని సింగిడి-1 శీర్షికతో వెలువరించిన వాచకంలో ఈ కింది 12 పాఠాలు ఉన్నాయి. 1వ పాఠం ధర్మార్జునులు-చేమకూర వేంకటకవి-నైతిక విలు వలు-ప్రాచీన పద్యం 2వ పాఠం నేనెరిగిన బూర్గుల-పి.వి. నరసింహారావు-స్ఫూర్తి- అభినందన వ్యాసం 3వ పాఠం వలసకూలీ- డా॥ ముకురాల రామారెడ్డి-సామాజిక స్పృహ సహానుభూతి-పాట 4వ పాఠం రంగాచార్యతో ముఖాముఖి-సాహిత్య సేవ-ఇంట ర్వ్యూ 5వ పాఠం శతక మధురిమ-శతక కవులు-నైతిక విలువలు-శతకం 6వ పాఠంRead More


చెత్త తగ్గితేనే నగరానికి మేలు

ఎఫ్‌బీహెచ్ ‘టాక్’లో జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.సుధాకర్  నగరంలో నివసించే ప్రతి వ్యక్తి కూడా సగటున రోజుకు అర కిలో చెత్త ఉత్పత్తి చేస్తున్నారని, దీన్ని ఎంత తగ్గించుకుంటే న గరానికి అది అంత మంచి చేస్తుందని జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.సుధాకర్ అన్నారు. 2016 ఆగస్టు 27న శనివారం హిమాయత్‌నగర్‌లోని దక్కన్ అకాడమీ ‘చంద్రం’లో ఫోరవ్‌ు ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జ రిగిన ‘టాక్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫోరవ్‌ు ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ అధ్యక్షులు యం.వేదకుమార్ అధ్యక్షత వహించారు. ‘హైదరాబాద్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఇన్షియేటివ్ టేకెనప్ బై జీహెచ్ ఎంసీ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీస్’ (హైదరా బాద్ ఘనవ్యర్థాల నిర్వహణజీహెచ్‌ఎంసీ తీసుకున్న చర్యలు పౌర సమాజంRead More


పదాలను నినాదాలు చేసిన – పోరాట గద్దెలు ‘గిద్దె రామనర్సయ్య’ పాటలు

అడవి ఆకురాలిన శబ్ధాన్ని పసిగట్టి పాటై ప్రవహించిన రామ సక్కని సంగీతం, అది కణకణ మండే డప్పు సప్పుళ్ళలోంచి ఉబికి వచ్చిన రగం. ఆ పదాలకు సమ్మక్క సారక్కల శౌర్యముంటది. మాదిగ జీవన సౌందర్యంతో పాటు తెలంగాణ పౌరుషం తాండవి స్తుంది. చిర్రా, చిటికెనపుల్లతో పోటీపడి చిందేస్తది. చీకటి కోటల్ని పెకలించే ఆయుధమైతది. అందుకే ఆ అక్షరాలను మనసు పల్లకిలో ఊరేగిద్దాం. రాగరంజితమైన ఆ పదాలను తాకి పరవశిద్దాం. మ ట్టి పరిమళాలను వెదజల్లి తెలంగాణ ఉద్యమంలో పల్లెని, ప్రకృ తిని ఏకంచేసి, పదాలను యుద్ధనినాదాలుగా ప్రతిధ్వనింప చేసిన కవి గాయకుడు గిద్దె రామ నర్సయ్య గురించి మన ‘అలుగెల్లినపాట’ లో… కళలకు పుట్టినిల్లు, కమ్మనైన అమ్మమనసు కు ఆనవాళ్ళు కాకతీయ రాజులేలిన ఓరుగుల్లు. ప్రస్తుతం వరంగల్లుగా పిలువబడుతున్న ఈ జిల్లా విప్లవోద్యమ చైతన్యానికి ప్రతీకగా చెప్పుRead More


పెంబర్తి మెమెంటోలు

జ్ఞాపిక అనగానే గుర్తుకొచ్చేవి పెంబర్తి హస్తకళారూపాలు అంటే అతిశయోక్తి కాదు. వరంగల్ జిల్లా జనగాం మండలానికి చెందిన గ్రామం పెంబర్తి హస్త కళాఖండాలకు దేశవ్యాప్తంగా గొప్ప పేరున్నది. ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు ప్రసిద్ది కాకతీయుల కాలం నుండి పేరొందాయి. పెంబర్తి హస్తకళాకారుల లోహపు రేకుల కళను పెంబర్తి లోహ హస్తకళలుగా వ్యవహరిస్తారు. పెంబర్తి లోహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహల మీద ఉంటాయి. కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది. కాకతీయ శైలిని అనుసరించడం వీరి కళ ప్రత్యేకత. పూర్వకాలం నుంచి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిల యంగా మారింది. పూర్వం కాకతీయుల పాలనలో రాజకుటుంబానికి అవసరమైన పనిముట్లను అందించిన వీరు రాను రాను తమ నైపుణ్యాన్ని పెంచుకొని ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. యాదగిరిRead More


జనజాతరల్లో క్లిక్.. క్లిక్!

ఫోటోగ్రాఫర్ రామ వీరేశ్ బాబు జనజాతరలో కానవచ్చే సందడి మదిపై చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్రను పదిలం చేసే ప్రయత్నమే రామ వీరేశ్ బాబుచే కెమెరాను పట్టించింది. జాతరలోని జనాన్ని కెమెరాలో బంధిస్తే ఆ ఫ్రేవ్‌ు లివింగ్ హెరిటేజ్‌కు నిర్వచనంలా నిలుస్తుంది. ఈ సత్యం తెలిసిన ఫొటోగ్రాఫర్ రామ వీరేశ్‌బాబు. వరంగల్‌లో పుట్టిపెరిగి డిగ్రీ వరకూ అక్కడే చదువుకున్న రామ వీరేశ్ బాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో పోస్టల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన 197లో ఫోటోగ్రఫీపై ఆసక్తితో కెమెరా చేతబట్టారు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్‌పై ఉన్న ఆయన ఆసక్తి పెద్దయ్యేసరికి లెన్స్ వైపు మళ్లింది. డాక్యుమెంటరీల కోసం ఆయన పట్టిన కెమెరా తెలంగాణకు తలమానికమైన మేడారం, ఐనవోలు జాతరలను అన్ని కోణాల్లో స్పశించింది. తపాలా శాఖలో ఉద్యోగం వచ్చినా ఆ హాబీని మాత్రం వీడలేదు. చిన్నప్పటిRead More


ఎం.ఎస్. సుబ్బులక్ష్మి | భారతీయ సంగీత హిమశిఖరం

 పదేళ్ల ఆ అమ్మాయి పాఠశాల ఆవరణలో ఇసుకలో తోటి పిల్లతో ఆడుకుంటోంది. ఇంతలో ఎవరో వచ్చి బట్టలకు చేతులకు అంటుకున్న దుమ్ముదులిపి ఎత్తుకుని తీసుకెళ్ళి వేదిక మీద వీణ వాదన చేస్తున్న తల్లి ప్రక్కన కూర్చోబెట్టారు. ఆ పాపను దగ్గరగా తీసుకున్న తల్లి పాడమని చెప్పింది. ఏవో రెండు పాటలు రాగరంజి తంగా పాడిందాచిన్నారి. పసి వయసులోనే పాప గాన ప్రావీణ్యతకు అక్కడున్న వారంతా సంభ్రమాశ్చర్యాలతో కరతాళధ్వనులు చేసి అభినందించారు. అయిదు దశాబ్దాల తర్వాత… అది ఓ అంతర్జాతీయ సంగీతోత్సవాల వేదిక. ఎందరో విశ్వఖ్యాతిగాంచిన సంగీతజ్ఞుల తో నిండి వుంది. ఆ వేదికపై అప్పుడే ‘‘ఆమె’’ గాత్రకచేరీ ముగిసింది. తన్మయభావనతో అం దరి కళ్ళలోనూ ఓ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వెలుగు కనబడుతోంది. ‘‘ఆమె’’ తదనంతరం మరో సు ప్రసిద్ధ సంగీత సమ్మేళనంగా చెప్పుకొనబడే ‘జు బిన్ మెహతా’Read More


ఆనాటి నా గొడవ

స్వాతంత్య్ర దినోత్సవం శ్రద్ధలేని తద్దినమని అందరూ అను కుంటున్న మాటే.. దేశోద్ధరణం అంతా వేషాలని, మోసాలని అం దరూ అనుకుంటున్నదే.. సత్తా రాగానే కన్నులు నెత్తికెక్కి పోతాయనీ, త్యాగులు సైతం ఘడియలో భోగులైపోతారని ఇప్పుడు అందరూ అనుకుంటున్నదే.. అలా ఎందుకనుకుంటున్నారో మహాకావి కాళోజీ వృద్ధాప్యంలో సైతం సునిశిత పరిశీలనా వైదుష్యం కొరవడకుండా ఎలా వివరిస్తున్నారంటే.. 1947 ఆగస్ట్ 15 నాడొచ్చిన స్వాతంత్య్రం మా కొచ్చిన స్వాతంత్య్రం కాదు. మాకు స్వాతంత్య్రం వచ్చింది 17 సెప్టెంబర్ 194లో నైజాం సరెండర్ అయింతర్వాత, పోలీస్ యాక్షన్ త ర్వాత. కాబట్టి అక్కడ (బ్రిటీష్ ఇండియా) జరిగిన స్వాతంత్య్ర సమరమేదైతే ఉన్నదో అది కాకుండా 193534 నుంచి ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ లాంటి సంస్థల పక్షాన ఆదోళన నడిచింది. అంతే కాదు 1947 ఆగస్ట్ 15 తర్వాత 194 సెప్టెంబర్ వరకూRead More


‘తెలంగాణ తల్లి రూపకర్త’

తోపారపు గంగాధర్ జీవితసాఫల్యపురస్కారం సాధిస్తే ఇక జీవితంలో అంతకు మించింది మరొకటి ఉండదు. తెలంగాణ సమాజంలో అలాంటి ఘనతను సాధిస్తే, తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతే అంతకు మించిన విజయం మరొకటి ఉండదు. అలాంటి ఘనతను సాధించిన కళాకారుడు తోపారపు గంగాధర్. చిత్రకళ, శిల్పం తదితరాల్లో తనదైన ప్రతిభను చాటుకున్న గంగాధర్ ‘తెలంగాణ తల్లి రూపకర్త’గా కేసీఆర్ నుంచి సన్మానం పొందారు. 2007లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ సత్కారాన్ని పొందారు. తెలంగాణ తల్లిని ఆయన చిత్రించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. గంగాధర్ అద్భుత ప్రతిభాపాటవాలకు ‘మెచ్చు’తునకలు ఎన్నో. హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్ వద్ద ఐమాక్స్ చౌరస్తా వద్ద 2009లో నెలకొల్పిన ఇందిరాగాంధీ విగ్రహం ఆయన రూపొందించిందే. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో 2002లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం రూపకర్త కూడాRead More