Friday, September 9th, 2016

 

ఉద్యోగుల రక్షణ చట్టం తేవాలి

ఉద్యోగుల రక్షణ చట్టం తేవాలి విద్యుత్తు ఉద్యోగులపై దాడులను జరగకుండా ‘విద్యుత్తు ఉద్యోగుల రక్షణ చట్టం’ తేవాలని టీఈఈఏ ఛైర్మన్ శివాజీ డిమాండ్ చేశారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ట్రాన్స్‌కో అండ్ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. రాత్రనక పగలనకా విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్తు ఇంజినీర్లపై ఇటీవల దాడులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గుజరాత్ రాష్ర్టంలో దళితుల హత్యాకాండను నిరసిస్తూ తెలంగాణ ఆది ధరవ్‌ు సమాజ్, వాల్మీకీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ఆది ధరవ్‌ు సమాజ్ అధ్యక్షులు రాజుసింగ్, పలు వాల్మీకీ సంఘాల నేతలు సమయ్‌సింగ్, వీరవ్‌ుజీ రావ్‌ురథ్, భూపాల్ వాల్మీకన్, రాజువీర్ తదితరులు మాట్లాడుతూ.. గుజరాత్‌లో దళితులపై మతోన్మాదుల దురాగతాలు పెచ్చు మీరు తున్నాయని,Read More


తృప్తి

ఒకరోజు ఒకబెస్తవాడు చేపలుపట్టేందుకు దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్ళాడు. చెరువులో వలవేసి చాలాసేపు కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఒక చిన్న చేప వలలో చిక్కింది. వలలో ఉన్న చేప బెస్తవాడితో ‘‘ఓయీ, బెస్తవాడా! నన్ను వదిలెయ్యి’’ అంది. ‘‘ఎందుకు’’? అని బెస్తవాడు ప్రశ్నించాడు. ‘‘నన్ను చూశావుకదా ఎంత చిన్నగా ఉన్నానో, నేను నీకు కొద్దిగానే ఉపయోగపడతాను’’ అంది చేప. ‘‘అయితే నిన్ను ఒదిలెయ్యాలా?’’ అన్నాడు బెస్తవాడు. ‘‘అవును. నన్ను ఇప్పుడు నీటిలోకి ఒదిలిపెట్టావ నుకో, నేను చెరువులో పెరిగి పెద్దదాన్నవుతాను. అ ప్పుడు నీకు చాలా ఉపయోగడపతాను’’ అంది తెలి విగా. బెస్తవాడు చేప తెలివికి చిన్నగా నవ్వుతూ. ‘‘నేను అంత తెలివి తక్కువ వాణ్ణికాను. చెరువు లో ఉండే పెద్దచేప కన్నా వలలో ఉన్న చిన్నచేపే విలు వైనది. లేనిదానికొరకు ఆశపడటం కంటె ఉన్నదానితో తృప్తి పడటమేRead More


బొమ్మలమ్మగుట్ట శాసనం!

తెలంగాణా భాషా, సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో తొలి నాళ్ళ నుండే కరీంనగర్ జిల్లా ప్రముఖ స్థానం వహిస్తోంది. దేశ ప్రధానిగా అత్యున్నత పదవిలో పనిచేసిన పి.వి.నర్సింహారావు ఈ జిల్లావాడే. ఆయన గొప్ప రచయితగా ప్రసిద్ధి చెందాడు. అలాగే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సినారే, డా.జె.బాపురెడ్డి, నృత్య కళాకారుడు కళాకృష్ణ వంటి వారు ఈ జిల్లా సాహిత్య, సాంస్కృతిక చరిత్రకు జీవం పోసినవారే. తెలుగు భాషకు ప్రాచీన భాషా ెదా రావడానికి, మద్రాస్ హైకోర్టులో వేసిన వాజ్యంలో కరీంనగర్ జిల్లా కురిక్యాలకు చెందిన క్రీ.శ.945 వే ములవాడ చాళుక్యుల కాలం నాటి బొమ్మలమ్మగుట్ట శాసనంతోపాటు, కోటిలింగాల తొలిశాతవాహనుల కా లపు నాణాలు, శాసనాలు, ధూళికట్ట బౌద్ధ స్థూపం, ఇక్కడి పలకల్లో లభిం చిన ఆధారాలు ముఖ్యభూమికను పోషించాయి. డా.వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 200Read More


రైతుస్థాయిలో

తక్కువ ఖర్చుతో చీడపీడల నివారణ భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఈ నేప థ్యంలో అధిక దిగుబడులు సాధించే ప్రయత్నంలో విచక్షణారహి తంగా పురుగుమందులను వాడటం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. పంటలకు అయ్యే ఖర్చు ఎక్కువై రైతుల ఆత్మ హత్యలకు దారి తీస్తాయి. అందువల్ల మన పొలం దగ్గరే జీవ సంబంధిత రసాయనాలు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గిం చడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుతాం. ఆవుపేడ, మూత్ర కషాయం: శ్రీ మొదటగా 5 కిలోల ఆవుపేడ, 5 లీటర్ల ఆవు మూత్రం మిశ్రమాన్ని 5 లీటర్ల నీటిలో కలిపి నాలుగు రోజుల వరకు మూత పెట్టి ఒక బకెట్‌లో అలగే ఉంచాలి శ్రీ ఆ తర్వాత దానిని వడపోసి 100 గ్రా. లైవ్‌ు పౌడరును క లపాలి శ్రీ పై మిశ్రమానికిRead More


చెక్కబొమ్మలాట

ఒక కథను మానవ పాత్రలతో ప్రదర్శించడం మొదటి ఆలోచన అయితే కథను మానవ పాత్రలతోనే కాకుండా మానవులు చేసిన బొమ్మలతో కథను ప్రదర్శించడం అనే ఆలోచన మానవుడి అభివ ద్ధిచెందిన సాంకేతికతకు కళా తష్ణకు సంకేతంగా చెప్పదగిన పరిణామం. ఇలాంటి కళారూపాలు తోలుబొమ్మలాట చెక్క బొమ్మ లాట కళారూపాలు. జానపద కళా ప్రదర్శనలో మనిషి సాధించిన ప్రగతికి ఇవి మచ్చులు. తెలుగు వారికి ఈ రెండు కళాప్రదర్శన సంప్రదాయలు ఉన్నాయి. తెలుగునాట తోలు బొమ్మలాటలు చెక్క బొమ్మలాటలు కనీసం 12 వ శతాబ్దినుండి ఉన్నాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లభించాయి. చెక్కబొమ్మలాట విషయానికి వస్తే దీని కళాకారులు అందరూ తెలుగువారు. తెలుగునాట దళిత కులా ల ఉపకులాలలో ఒకరైన వారు. వీరిని బుడిగజంగాలు అనిఅంటారు. కాని బుడిగ జంగాలు అందరికీ వత్తి లేదు. అందుకే వీరిని బొమ్మలోళ్ళుRead More


హైదరాబాద్ ఫైర్‌బ్రాండ్ సుమిత్రబాయి

హైదరాబాద్‌పై పోలీసు చర్యకు పూర్వం ఎందరో మహిళలు రాజకీయ రంగంలో పనిచేశారు. వీరందరికీ స్ఫూర్తి సరోజిని నా యుడు. సంగెం క్ష్మిబాయి, సదాలక్ష్మి, జె.ఈశ్వరిబాయి, రాజమణీ దేవి, మంకమ్మ, మాసూమా బేగం లాంటి దళిత, బహుజన మహిళలు అటు రాజకీయాల్లోనూ, ఇటు సేవా రంగంలోనూ తమ దైన ప్రతిభను ప్రదర్శించారు. అట్లాంటి వారిలో ఫైర్ బ్రాండ్ దళిత మహిళ నేతగా సుమిత్రాబాయి ప్రసిద్ధి. పేదలు, దళితుల పక్షాన ప్రజా పోరాటాలు చేసిన మహిళ. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యేగా 1955లో ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని నారాయణగూడాలో 191 అక్టోబరు తొమ్మిదిన జన్మించిన ఈమె మొదట 193లో తన 20వ యేట చిక్కడపల్లిలో ఆర్యయువజన పాఠశాల స్థాపనతో ప్రజాజీవితంలోకి అడుగు పెట్టారు. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఆదిహిందూ పాఠశాలలో మాదిగలకు ప్రవేశం కల్పించకుండా, వివక్ష చూపడంపై ఆమె ఆనాడే ఆయన్ని నిలదీసింది.Read More


మన జుబేదాబేగం

భారతీయ తొలిటాకీ ఆలం ఆరా నాయిక భారతీయ సినిమా చరిత్ర తొలినాళ్లను పరిశీలించినపుడు హైదరాబాద్ స్టేట్ ప్రాంతమంతా కూడా బొంబాయి రీజియన్ ప రిధిలో ఉండింది. పైగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉన్న సైనికాధికారులకు బొంబాయి, కలకత్తాలతో సంబంధాలు ఉండేవి. అందుకే, తొలి మూవీ కెమెరా కలకత్తా నుండి హైదరాబాద్‌కు 1910లో వచ్చింది. హిందీ, ఉర్దూలకు ఉన్న భాషా సన్నిహితం వల్ల, మహారాష్ట్ర సంస్కృతిక ప్రభావం వల్ల బొంబాయి సినిమా రంగం హైదరాబాద్‌ను ఆకర్షించింది. ఫలితంగా మూకీల కాలం లోనే 1927లో హైదరాబాద్ పాత నగరంలోని నాగులచింతకు చెందిన రావ్‌ుప్యారీ అనే నర్తకి బొంబాయి వెళ్ళి మూకీ చిత్రాల్లో నటించిన విషయం దా దాపుగా ఎవరికీ తెలియదు. ఆ తర్వాతనే 1929లో మన పైడి జయరాజు బొం బాయి వెళ్ళాడు. ఇక 1931లో మాట్లాడే సినిమాలు వచ్చిన తర్వాతRead More